always vj logo
Website Designing Tips for Small Businesses

Website Design Formula for Small Businesses

Spread the love

Website Designing Tips for Small Businesses

దాదాపుగా అన్ని వెబ్ సైట్స్ వాళ్ళ వెబ్సైటు ని ఈజీగా కనిపెట్టాలి, ఈజీగా రీడర్స్ ఒక పేజి నుండి తనకి కావాల్సిన పేజికి వెళ్ళాలి, ఈజీగా యూస్ చేసుకునే విధంగా ఉండాలి, సులభంగా విజిటర్స్ నుండి పే చేసే కస్టమర్స్ గా కావాలి అని అనుకుంటారు.

ఇవన్ని కూడా ఒక మంచి వెబ్ సైట్ ఎలా ఉండాలి అనే సిగ్నల్స్ మనకి ఇస్తాయి, అంతేకాదు ఇలా ఉన్న వెబ్ సైట్స్ నిజంగా బిజినెస్లకి వరం.

ఒకవేళ మీ వెబ్సైటు నుండి ఏ కస్టమర్ అయిన ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా బయటకి వెళ్ళిపోయాడు అంటే మీ వెబ్సైటు అంత గొప్పగా ఏమి లేనట్లే.

ఒక మంచి వెబ్ సైట్, సాదారణ వెబ్సైటు అని మనం ఎలా నిర్వచించగలం? దాని యొక్క ఫీచర్స్ ని బట్టి, అదే విధంగా ఆ వెబ్సైటు ఎలా పని చేస్తుంది అనే దానిని బట్టి.

ఒకవేళ మీకు నా బిజినెస్ కి మంచి వెబ్సైటు ఉందా? లేదా? లేకపోతే ఒక మంచి వెబ్సైటు నా బిజినెస్ కోసం ఎలా క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారా?

ఈరోజు ఈ బ్లాగ్ పోస్ట్ ద్వారా నేను మీకు మంచి వెబ్సైటు ని సింపుల్ 3 స్టెప్స్ వెబ్సైటు డిజైన్ ఫార్ముల ఎలా ఇంప్లిమెంట్ చేసి ఏ విధంగా క్రియేట్ చేయాలో తెలియచేస్తాను.

3 సింపుల్ టిప్స్

స్టెప్ 1: మీ వెబ్సైటు క్రియేట్ చేసే వెబ్సైటు బిల్డర్ ని తెలివిగా సెలెక్ట్ చేసుకోవటం

స్టెప్ 2: మీ వెబ్సైటు కి కావాల్సిన రీసెర్చ్ చేసి ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకోవటం

స్టెప్ 3: మీ వెబ్సైటు ఎలా పని చేస్తుందో ట్రాక్ చేయటం.

ఈ 3 స్టెప్స్ ని ఫాలో అవుతూ మీరు ఒక వెబ్సైటు డిజైన్ చేసుకోగలిగిన లేదా చేయించుకోగలిగిన మీ బిజినెస్ కి మంచి రిజల్ట్స్ వస్తాయి.

ఇక బ్లాగ్ విషయానికి వద్దాం!

3 స్టెప్ వెబ్సైటు డిజైన్ ఫార్ముల ద్వారా ఒక పవర్ఫుల్ వెబ్సైటు క్రియేట్ చేద్దాం.

Step-1 for Creating Website Designing Strategy for Small Businesses
Step-1 for Creating Website Designing Strategy for Small Businesses

స్టెప్ 1) : మీ వెబ్సైటు క్రియేట్ చేసే వెబ్సైటు బిల్డర్ ని తెలివిగా సెలెక్ట్ చేసుకోవటం

ఈ మొదటి స్టెప్ ఏమి అంత ఆసక్తికరమైనది కాదు కానీ మీ వెబ్సైటు ఎలా ఉండాలి అని డిసైడ్ చేయగలిగేది, అంతే కాకుండా ఎటువంటి ఫీచర్స్ ఉండాలి అని, అదే విధంగా విజిటర్స్ నుండి కస్టమర్స్ గా ఎలా కన్వర్ట్ చేయగలిగేది.

కాబట్టి మన వెబ్సైటు డిజైన్ ఫార్ముల ఇక్కడి నుండే స్టార్ట్ అవుతుంది.

ఇప్పుడు మీరు తీసుకునే స్టెప్ చాలా ముఖ్యమైనది, ఎందుకంటె మీ వెబ్ సైట్ కి మంచి ఫౌండేషన్ ఉండటం చాలా అవసరం. లేదంటే తర్వాత మీరు మళ్ళి మళ్ళి డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇంకా మీ టైం కూడా వృధా చేయించాల్సి వస్తుంది.

సాదారణంగా ఒక వెబ్సైటు బిల్డ్ చేసే సాఫ్ట్వేర్ ని మనం కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టం అని పిలుస్తాము. ఇవి మనం యూస్ చేసుకోవడానికి సులభంగా ఉంటాయి.

ఈరోజు దాదాపుగా అన్ని వెబ్సైటు బిల్డర్స్ ఈజీగా యూస్ చేసుకునే విధంగా, అదే విధంగా ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా మీ వెబ్సైటు ని మీరే మైంటైన్ చేసుకోవటానికి సులభంగా ఉండేలా ఉన్నాయి.

కొన్ని పాపులర్ వెబ్సైటు బిల్డర్స్

Wix

WordPress

Squarespace

Weebly

Shopify

Drupal

Magento

ఈ ఏడింటిలో మేము మీకు 2 మాత్రమే రికమెండ్ చేస్తాం. అవి రెండూ కూడా బాగా పాపులర్ అయిన కంపెనీలు. అంతే కాకుండా బిగినర్స్ కి బాగా హెల్ప్ అయ్యేవిధంగా ఇవి ఉంటాయి.

ఒకవేళ మీరు సర్వీస్ బేస్డ్ బిజినెస్ కనుక రన్ చేస్తుంటే మీరు WordPress యూస్ చేయండి.

అదే మీరు e-కామర్స్ బిజినెస్ లో ఉంటె Shopify యూస్ చేయండి.

ఈ రెండింటిని రెఫెర్ చేయటానికి మెయిన్ రీసన్, ఇవి రెండూ సింపుల్ మరియు పవర్ఫుల్.

మీరు Wix, Weebly, Squarespce లు సింపుల్ గా మీరు సైన్ అప్ అయ్యి ఒక బేసిక్ వెబ్సైటు ని అతి తక్కువ ప్రైస్ లో రన్ చేయటానికి హెల్ప్ అవుతాయి అని అర్థం చేసుకోండి.

ఒకవేళ మీ బిజినెస్ గ్రో అవుతూ ఉంటె మీ బిజినెస్ కి సంబంధించిన వర్క్స్, ఇంటిగ్రేషన్, వెబ్సైటు యొక్క అవసరాలు కూడా పెరుగుతాయి.

అటువంటప్పుడు Wix, Weebly & Squarespace లాంటివి మీరు మ్యానేజ్ చేయటం చాలా కష్టం అవుతుంది.

అదే విధంగా మీరు Drupal & Magento ప్లాట్ఫారంస్ యూస్ చేద్దాం అనుకుంటే అందుకు మీకు హై లెవెల్ టెక్నికల్ స్కిల్ల్స్ అంటే HTML & CSS లాంటివి అవసరం అవుతాయి.

అందుకే నేను మిమ్మల్ని ఇటివంటి ఇబ్బందులకి గురి చేసే వాటిని రిఫర్ చేయటంలేదు.

Best Platforms to Create Business Websites
Best Platforms to Create Business Websites

సర్వీస్ బేస్డ్ బిజినెస్ లకి వర్డుప్రెస్సు ని, e-కామర్స్ బిజినెస్ లకి Shopify  స్ట్రాంగ్ గా రికమెండ్ చేయటానికి 3 ప్రధానమైన కారణాలు ఉన్నాయి.

  1. వర్డుప్రెస్సులో 50,000 ప్లగిన్స్, అదే విధంగా Shopify లో 4,200 యప్స్ మీ బిజినెస్ వెబ్సైటు యొక్క ఫంక్షనాలిటి ఇంకా ఇంప్రూవ్ చేయటానికి హెల్ప్ అవుతాయి. మీరు ఏం చేయాలి అనుకుటే వీటి సహాయంతో మీరు వాటిని చేయగలరు.
  2. వర్డుప్రెస్సు & Shopify సైట్స్ రెండూ కూడా గూగుల్ సెర్చ్ ఇంజిన్స్ లో హై ర్యాంకింగ్స్ కలిగినవి. అంతే కాకుండా ఇవి బలంగా SEO చేయటానికి కావాల్సిన టూల్స్ కూడా అందిస్తున్నాయి.
  3. వర్డుప్రెస్సు & Shopify ల ద్వారా మనకి మంచి సపోర్ట్ లభిస్తుంది ఇంకా ఎటువంటివి కావాలన్నా మనకి అవి అందులోనే అందుబాటులో ఉంటాయి.

ఇప్పుడు, మీరు ఒక వెబ్సైటు బిల్డర్ ని సెలెక్ట్ చేసుకున్న తరువాత (అది వర్డుప్రెస్సు లేదా Shopify కావచ్చు) మీరు మీ వెబ్సైటు డిజైన్ చేయాలి లేదా చేయించుకోవాలి.

Suggest to Read: వర్డుప్రెస్సు ద్వారా ఒక బ్లాగ్ ని క్రియేట్ చేయటం ఎలా?

Step-2 for Creating Website Designing Strategy for Small Businesses
Step-2 for Creating Website Designing Strategy for Small Businesses

స్టెప్ 2) మీ వెబ్సైటు కి కావాల్సిన ఒక డిజైన్ రీసెర్చ్ చేసి సెలెక్ట్ చేసుకోవటం

మనం మన ఓన్ ఐడియాలజి, మన ఫీలింగ్స్ ఇలాంటివి మనం వెబ్సైటు డిజైన్ లో కూడా ఉండేలా మనం చూస్తాం. కానీ అవి మనకి ఎటువంటి ప్రయోజనం చేకూర్చలేవు అనేది చేదు నిజం.

ఇందుకోసం మేము మీకు కొన్ని ప్రూవ్ అయిన వెబ్సైటు డిజైన్ టిప్స్ చెప్తాను.

మీ వెబ్సైటు డిజైన్ లో మనుషులు కనిపించే విధంగా ఫోటోలు యూస్ చేయండి.

ఒక ఫేమస్ కేసు స్టడీ వెబ్సైటు లో ఫేసెస్, టెస్ట్మొనియల్స్ యూస్ చేసిన తరువాత  47% కన్వేర్శన్స్ పెరిగాయి అని.

అయితే ఇక్కడ మనం యూస్ చేసే ఇమేజస్ మీరు ఎవరిని అయితే టార్గెట్ చేస్తుంటే అటువంటి వారివి యూస్ చేయాలి.

అంటే మీరు బిజినెస్ ఓనర్స్ ని టార్గెట్ చేస్తుంటే రియల్ బిజినెస్ ఓనర్స్ ఇమేజస్ యూస్ చేయాలి. ఒకవేళ మీరు మదర్స్ ని టార్గెట్ చేయాలి అనుకుంటే అప్పుడు మీరు అసలైన మదర్స్ ఇమేజ్స్ యూస్ చేయాలి.

ఇక్కడ విజిటర్స్ తమలాంటి వాళ్ళని చూసినప్పుడు త్వరగా మనతో కనెక్ట్ అవుతారు. అంతే కాకుండా మనల్ని త్వరగా నమ్మటం సులభం అవుతుంది.

స్లయిడర్స్ ని యూస్ చేయకండి.

మీరు 8 స్లయిడ్స్ ని మీ వెబ్ సైట్ యొక్క హోం పేజి లో యాడ్ చేయాలి అనుకుంటున్నారా, ఎందుకంటె అంత ఇన్ఫర్మేషన్ మీ రీడర్స్ కి అందించాలి, వాటి ద్వారా ప్రమోషన్ జరుగుతుంది అనుకుంటున్నారా?

వినటానికి ఇది బాగుంది కానీ ఇది వర్కౌట్ కాదు.

ఎందుకంటె రొటేటింగ్ స్లయిడర్స్ లో మీ రీడర్స్ మహా చుస్తే ఒక్క స్లయిడ్ మాత్రమే చూస్తారు. అందుకే స్లయిడర్స్ యూస్ చేయకండి అంటున్నాం.

Notre Dame University అధ్యయనం ప్రకారం స్లయిడర్స్ యూస్ చేయటం వలన వచ్చే క్లిక్ త్రు రేట్ (CTR) దాదాపు 1-3% మాత్రమే. అది కూడా 60%-80% వరకు మొత్తం ఒక్క ఫస్ట్ స్లయిడ్ నుండి మాత్రమే వస్తున్నాయి.

ఇదే విషయాన్ని మరిన్ని స్టడీస్ బలపరుస్తున్నాయి.

దాని బదులుగా :

ఒక స్టాటిక్ ఇమేజ్ యూస్ చేసి అందులో మీ ఇంపార్టెంట్ అయిన హెడ్ లైన్ ఇంకా కాల్ టూ యాక్షన్ బటన్ యూస్ చేయండి లేదా

స్లయిడర్ ని హోం పేజి నుండి తిసేవేసి వాటిని పేజిస్ లో యాడ్ చేయండి.

ట్రస్ట్ సిగ్నల్స్ యాడ్ చేయండి.

అర్థం కాలేదు కదా! ట్రస్ట్ సిగ్నల్స్ మన వెబ్సైటు లో ఉంచడం వలన మన కస్టమర్స్ మన నుండి పర్చేస్ చేయటంలో హెల్ప్ అయ్యేవి.

ఒక అనాలిసిస్ ప్రకారం ఒక అమెజాన్ పేజి 43% సేల్స్ ఇంక్రీస్ అవ్వటంలో ఈ ట్రస్ట్ సిగ్నల్స్ అంటే రివ్యూస్ హెల్ప్ అయ్యాయి. అంతే కాకుండా విజిటర్స్ యొక్క గోల్స్ అదే విధంగా పెయిన్ పాయింట్స్ కూడా అక్కడ తెలియచేయటం జరుగుతుంది.

సాదారణంగా మనం మన వెబ్సైటు లో ఉంచగలిగే ట్రస్ట్ సిగ్నల్స్

  1. టెస్ట్మొనియల్స్ & రివ్యూస్
  2. థర్డ్ పార్టీ బ్యాడ్జేస్, సర్టిఫికేషన్స్
  3. స్టాటిస్టిక్స్
  4. కస్టమర్ లేదా కస్టమర్ లోగోస్
  5. పబ్లికేషన్ లోగోస్
  6. FAQs
  7. ఇన్ఫర్మేషన్ ఈజీగా అందుబాటులో ఉండేలా చూసుకోండి.

Hubspot, ఒక సర్వే ప్రకారం ఒక వెబ్సైటులో ముఖ్యమైనది వెబ్సైటు లో దొరికే ఇన్ఫర్మేషన్ అని, వెబ్సైట్ యొక్క డిజైన్ కాదు అని తెలిపింది.

ఒక్కసారి ఆలోచించండి.

మీ బ్లాగ్ లేదా వెబ్సైటు కి వచ్చే విజిటర్స్ యొక్క డౌట్స్ మనం క్లారిఫయ్ చేయగలగాలి, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వగలగాలి. అయితే ఆ ఇన్ఫర్మేషన్ మనం వాళ్ళు సులభంగా పొందే విధంగా ఇవ్వగలగాలి.

లేదు అంటే మన కస్టమర్స్ మన వెబ్సైటు నుండి బయటకి వెళ్ళిపోతారు.

ఒకవేళ మీ కస్టమర్స్ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ సులభంగా పొందలేకపోతే వాళ్ళు కన్వేర్ట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

Step-3 for Creating Website Designing Strategy for Small Businesses 3
Step-3 for Creating Website Designing Strategy for Small Businesses

స్టెప్ 3: మీ వెబ్సైటు ఎలా పని చేస్తుందో ట్రాక్ చేయటం.

మీ వెబ్సైటు డిజైన్ లో చివరి స్టెప్ మీ వెబ్సైటు ఎలా పెర్ఫాం చేస్తుందో ట్రాక్ చేయటం.

మీకు ఆల్రెడీ ఇంతకూ ముందు చెప్పను, మీ వెబ్సైటు నుండి మీకు బిజినెస్ రావాలి అంటే మీకు మీ వెబ్సైటు కి సంబంధించిన డేటా పైన మీకు అవగాహనా ఉండాలి.

మరి మనం మన వెబ్సైటు యొక్క పెర్ఫార్మెన్స్ ఎనలైజ్ చేసేముందు మనం వాటిని రికార్డు చేయటం మొదలుపెట్టాలి.

మీరు మీ యొక్క వెబ్సైటు ని ట్రాక్ చేయటం ద్వారా మీరు తరువాత మార్కెటింగ్ లో ఏం చేయాలి అనేవి ప్లాన్ చేసుకోవటానికి ఉపయోగపడుతుంది.

అంతే కాకుండా మీకు మీ ఆడియన్స్ ఎవరు అనే విషయం బాగా తెలుస్తుంది, వాళ్ళకి ఎలాంటి కంటెంట్ అందించాలి అని కూడా మీకే అర్థం అవుతుంది.

మీ వెబ్సైటు ఎక్కడ వెనుకబడుతుంది అనేవి కూడా ట్రాక్ చేయటం వల్లనే తెలుస్తుంది. దాని ద్వార ఎటువంటి టూల్స్ మనం యూస్ చేసి మన వెబ్సైటు యొక్క పెర్ఫార్మన్స్ పెంచడానికి కూడా అవకాశం ఉంటుంది.

మీ వెబ్సైటు యొక్క పెర్ఫార్మెన్స్ తెలుసుకోవటానికి మనం కొన్ని టూల్స్ యూస్ చేయవచ్చు.

గూగుల్ అనలిటిక్స్

గూగుల్ అనలిటిక్స్ అనేది గూగుల్ మనకి ఫ్రీ అఫ్ కాస్ట్ ఇచ్చే అద్భుతమైన టూల్ అన్నమాట. ఈ టూల్ యూస్ చేసుకని మనం మన వెబ్సైటు యొక్క పెర్ఫార్మన్స్, మన కస్టమర్స్ మైండ్ సెట్ ఇలాంటివి ట్రాక్ చేయవచ్చు.

ఈ టూల్ చాలా బాగా పనిచేస్తుంది, ఇంకా పవర్ ఫుల్ టూల్ కూడా. అంతే కాకుండా చిన్న చిన్న బిజినెస్ ఓనర్స్ ఈ టూల్ ని చాలా ఈజీగా యూస్ చేసుకోవచ్చు.

గూగుల్ అనలిటిక్స్ తో ఏమేమి చేయవచ్చు?

  • ఏయే వెబ్ పేజెస్ బాగా పనిచేస్తున్నాయి, ఏవి సరిగ్గా పెర్ఫాం చెయ్యట్లేదు అని తెలుసుకోవచ్చు.
  • ఏయే ప్రొడక్ట్స్ మన వెబ్సైటు నుండి, అదే విధంగా ఏయే పేజెస్ ద్వారా కన్వేర్ట్ అవుతున్నారు అని  తెలుసుకోవచ్చు.
  • ఏ డివైస్ నుండి మన బ్లాగ్ నుండి కన్వర్షన్స్ జరుగుతున్నాయి అని తెలుసుకుని వాటి పై మరింత ఫోకస్ చేయాలి.
  • అంతే కాకుండా మన వెబ్సైటు కి వచ్చే విజిటర్స్ యొక్క డెమోగ్రాఫిక్స్ ఏంటి, ఇంటరెస్ట్స్ ఏంటి అనేవి తెలుసుకోవచ్చు.

ఒకవేళ మీరు కనుక ఇంకా మీ వెబ్సైటు కి గూగుల్ అనలిటిక్స్ యూస్ చేయకపోతే ఇప్పుడే గూగుల్ అనలిటిక్స్ ని యూస్ చేయండి. ఎలా యూస్ చేయాలో తెలియకపోతే మా గూగుల్ అనలిటిక్స్ స్టెప్ బై స్టెప్ బ్లాగ్ పోస్ట్ ఫాలో అవ్వండి.

Conclusion

ఇదంతా చదివిన తరువాత మీకు వెబ్సైటు డిజైన్ గురించి ఒక ఐడియా వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఈసారి మీరు వెబ్సైటు డిజైన్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఈ స్టెప్స్ యూస్ చేయండి.

ఇవన్ని కూడా ఆల్రెడీ యూస్ చేసి ప్రూవ్ అయిన స్టెప్స్, కాబట్టి వీటిని యూస్ చేయటం ద్వారా మంచి రిజల్ట్స్ అయితే పొందగలరు.

ఒక చిన్న బిజినెస్ కి కన్వర్షన్స్ అనేవి చాలా చాలా ముఖ్యం అని నాకు తెలుసు. ఒకవేళ మీరు మీ బిజినెస్ కి వెబ్సైటు చేయించుకోవాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి, మేము మీ బిజినెస్ కోసం మంచి వెబ్సైటు చేసి ఇవ్వగలం. మీరు మీ బిజినెస్ ని ఇంకా అప్డేట్ చేయాలి, గ్రో చేయాలి అనుకుంటే ఇంకా ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవాలి.

ఇక్కడ నేను మీకోసం కొన్ని బ్లాగ్ పోస్ట్స్ లింక్స్ ఇస్తాను, వాటిని చదవండి, మీకు మరింత నాలెడ్జ్ వస్తుంది.

చిన్న చిన్న బిజినెస్లకి వెబ్ సైట్ ఉండటం వాళ్ళ కలిగే లాభాలు

వెబ్ సైట్స్ ఎలా డిజైన్ చేస్తారు?

ఈ బ్లాగ్ పోస్ట్ ఎలా ఉంది? మీరు ఈ బ్లాగ్ పోస్ట్ ద్వారా ఏమైనా తెలుసుకున్నారా? ఒకవేళ మీరు తెలుసుకుంటే ఏం తెలుసుకున్నారో కామెంట్స్ లో తెలియచేయండి. ఈ బ్లాగ్ పోస్ట్ ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, ఎందుకంటె షేరింగ్ ఇస్ కేరింగ్ కదా!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *