always vj logo

About Us

Spread the love

హాయ్! ముందుగా ఈ బ్లాగ్ కి వచ్చినందుకు స్వాగతం. నేను విజయ కుమార్. నాకు కూడా త్వరగా డబ్బు సంపాదించాలి, బాగా సెటిల్ అవ్వాలి అని అనిపించేది. అప్పట్లో నేను ఇంటర్నెట్ లో ఆన్లైన్ ద్వారా ఎలా మనీ ఎర్న్ చేయాలి అని సెర్చ్ చేసినప్పుడు నాకు కనిపించిన మార్గం బ్లాగ్గింగ్. అయితే అప్పట్లో నాకు ఉన్న ఆత్రం వల్ల పూర్తిగా బ్లాగింగ్ గురించి ఏమి తెలుసుకోకుండా, వెంటనే అఫిలియేట్ మార్కెటింగ్ కూడా చేసేవాడిని. ఈ ప్రాసెస్ లో చాలా తప్పులు చేశాను. నేను 2014 నుండి బ్లాగ్గింగ్ చేస్తున్నాను. అప్పట్లో నాకు ఉన్న ప్రాబ్లం నాకు ఇంగ్గ్లిష్ అంతగా అర్థం అయ్యేది కాదు. కానీ మోస్ట్ అఫ్ ది బ్లాగ్స్ ఇంగ్లీష్ లోనే ఉండేవి.
నాకు ఎలా అర్థం అయితే అలా బ్లాగ్గింగ్ స్టార్ట్ చేశాను. వేరే న్యూస్ బ్లాగ్స్ నుండి కంటెంట్ కాపీ చేసి, దాన్ని న బ్లాగ్ లో పేస్ట్ చేసి, అందులో మళ్ళి అమెజాన్ అఫిలియేట్ లింక్స్ కూడా పోస్ట్ చేసేవాడిని. సరే అంత వరకూ బాగానే ఉంది. కానీ నేను ఫెయిల్ అయ్యాను. కొంతకాలం అలాగ చేసిన తరువాత బ్లాగ్గింగ్ వల్ల ఉపయోగం లేదు అని వదిలేసాను.
తరువాత నిదానంగా వెబ్ డిజైనింగ్ నేర్చుకున్నాను. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వెబ్ డిజైనర్ గా పని చేశాను. ఆ టైం లో నే నేను అంతకు ముందు నేర్చుకున్న బ్లాగ్గింగ్ ప్రాసెస్ అది కను అని తెలుసుకున్నాను. నిదానంగా కొన్ని బ్లాగ్స్ స్టార్ట్ చేశాను. బ్లాగ్గింగ్ అంటే ఏంటి అని తెలుసుకున్నాను.
ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని ఓన్ గా నా క్లైంట్స్ కి సర్వీస్ చేస్తూ ఎర్న్ చేసున్నాను. ఇప్పుడు బ్లాగ్గింగ్ కి సంబంధించిన ప్రాముఖ్యత బాగా తెలుసు. నాకు తెలిసిన విషయాలు మీకు తెలియచేయాలని ఈ బ్లాగ్ స్టార్ట్ చేయటం జరిగింది. ఇందులో నా అనుభవాలు, నా క్లైంట్స్ అనుభవాలు, కూడా ఇందులో అందించడం జరుగుతుంది. ఎందుకంటె మనం ఒక తప్పు నుండి ఒక విషయం నేర్చుకోవచ్చు. అదే విధంగా ఇతరుల తప్పుల నుండి కూడా మనం ఎన్నో నేర్చుకోవచ్చు.

నా గురించి ఇంకా వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చూడండి. రీసెంట్ గా డిజిటల్ జాన్ గారి ఛానల్ లో ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది, మీరు చూడకపోతే ఒకసారి ఈ వీడియో చూడండి
మరిన్ని విషయాల తెలుసుకోవాలి అనుకుంటే నా బ్లాగ్ కి సబ్స్క్రయిబ్ చేసుకోండి. ప్రతీ రోజు ఒక టాపిక్ తో మీ ముందుకి వస్తాం.