ఒక Digital Marketing Strategy ఎలా క్రియేట్ చేయాలి?
స్ట్రాటజీ… ప్రతీ బిజినెస్ కి అవసరం. బిజినెస్ సక్సెస్ లో స్ట్రాటజీస్ కూడా కీరోల్ ప్లే చేస్తాయి. అదే విధంగా డిజిటల్ మార్కెటింగ్ లో కూడా స్ట్రాటజీస్ కీరోల్ ప్లే చేస్తాయి. స్ట్రాటజీ లేకుండా రన్ చేసే కాంపెయిన్స్, ఎఫర్ట్స్ బూడిదలో పోసిన పన్నిరవుతాయి. మరి అంత ఇంపార్టెన్స్ ఉన్న స్ట్రాటజీస్ ఎలా క్రియేట్ చేయాలి? ఈ బ్లాగ్ పోస్ట్ లో ఒక డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీని ఎలా క్రియేట్ చేయాలి అని తెలుసుకుందాం.
#1Digital Marketing Strategy మీ బిజినెస్ గురించి తెలుసుకోండి
ఇందుకోసం మిమ్మల్ని మీరు కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి.
- మీ ప్రొడక్ట్స్ లేదా సర్వీసెస్ ఎవరి కోసం?
- ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళ కోసం ?
- ఏ ఏ జెండర్స్ వాళ్ళ కోసం ?
- ఏ లాంగ్వేజ్ వాళ్ళ కోసం ?
- ఏ లొకేషన్ వాళ్ళ కోసం ?
ఇలా మీరు వేసుకునే ప్రశ్నల ద్వారా మీకు, మీ బిజినెస్, ఆడియన్స్ గురించి బాగా తెలిస్తే ఒక సక్సెస్ఫుల్ స్ట్రాటజీని క్రియేట్ చేయవచ్చు.
#2 Digital Marketing Strategy కరెక్ట్ ప్లాట్ఫారంస్ లో మార్కెటింగ్ చేయటం
మీ ఆడియన్స్ ఏ ప్లాట్ఫారం లో ఉంటారు, ఆ ప్లాట్ఫారంస్ ని యూస్ చేయాలి. ఆ ప్లాట్ఫారంస్ లో మార్కెటింగ్ కాంపెయిన్స్ రన్ చేస్తే మీకు బెనిఫిట్ అవుతుంది. అలాంటి ప్లాట్ఫారంస్ చూస్ చేసుకోవాలి. ఉదాహరణకి సోషల్ మీడియా మార్కెటింగ్ లేదా గూగుల్ మార్కెటింగ్ ఇలాంటివి.
#3 Digital Marketing Strategy ఉపయోగపడే కంటెంట్ షేర్ చేయటం
మీరు మీ ప్రొడక్ట్స్ లేదా సర్వీసెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయడి. వీటిని ఆర్టికల్స్ గా, వీడియోస్ గా, ఇమేజ్స్, ఇన్ఫోగ్రాఫిక్స్ గా షేర్ చేయండి. దీని ద్వారా మీ కంటెంట్ మీకు ఫాలోయర్స్ ని, యూసర్స్ ని తీసుకువస్తాయి. ఈ ఫాలోయర్స్ ని, యూసర్స్ ని కస్టమర్స్ / క్లైంట్స్ గా మరే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వేల్యూబుల్ ఇన్ఫర్మేషన్ ప్రోవైడ్ చేయండి.
#4 Digital Marketing Strategy ఇంతకు ముందు స్ట్రాటజీస్ ని అనలైజ్ చేయటం
మీరు డిజిటల్ మార్కెటింగ్ కాంపెయిన్స్ లో అనేక రకాల స్ట్రాటజీస్ యూస్ చేసి ఉంటారు. వాటిమ్మో మీకు మంచి రిజల్ట్స్ తీసుకువచ్చిన స్ట్రాటజీస్ ని అనలైజ్ చేయండి. మంచి రిజల్ట్స్ రాని స్ట్రాటజీస్ ఎందుకు ఫెయిల్ అయ్యయో ఆలోచించండి. ఇలా చేయడం వలన మీకు మీరు చేసిన తప్పులు తెలుస్తాయి. దాని వలన ఇంతకూ ముందు మీరు చేసిన మిస్టేక్స్ చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది.
#5 Digital Marketing Strategy ఫ్లెక్సిబుల్ స్ట్రాటజీస్
ఎప్పుడు కూడా ఒక్క మార్కెటింగ్ స్ట్రాటజీనే యూస్ చేయకూడదు. అన్నిసార్లు అది వర్కౌట్ అవ్వదు. కాబట్టి మీరు రకరకాల స్ట్రాటజీస్ టెస్ట్ చేస్తూ ఉండాలి. అందుకోసం మీరు ఫ్లెక్సిబుల్ స్ట్రాటజీస్ ని ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటె ఒకే స్ట్రాటజీ అన్ని సార్లు వర్కౌట్ అవ్వదు కాబట్టి.
వీటిని బేస్ చేసుకుని మీరు డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ క్రియేట్ చేయండి. స్ట్రాటజీ లేని మార్కెటింగ్ ఎఫర్ట్స్ చుక్కాని లేని నవ లాంటిది. ఈ విధంగా మీరు మంచి మంచి స్ట్రాటజీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. కేవలం డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ మాత్రమే కాకుండా, బిజినెస్ స్ట్రాటజీస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ బ్లాగ్ పై ఎలాంటి డౌట్స్ ఉన్నా అసలు ఆలోచించకుండా కామెంట్ చేయండి.
Follow us on
Latest posts by dasaradhi (see all)
- Website Design Formula for Small Businesses - October 27, 2021
- Digital Marketers Meetup in Hyderabad in 2021 - September 1, 2021
- How to Write Viral Blog Posts in Telugu - August 12, 2021