బ్లాగ్ పోస్ట్స్ లో ఎన్ని వర్డ్స్ వ్రాయాలి?

Spread the love

How many words write in blog post in Telugu

మీకు బ్లాగింగ్ గురించి నిజంగా ప్యాషన్ ఉండి ఉంటె ఈ ప్రశ్న అనేకసార్లు మీకు మీరు వేసుకునే ఉంటారు. నా బ్లాగ్ పోస్ట్స్ మరి చిన్నవిగా ఉన్నాయా? మరి లాంగ్ ఉంటె రీడర్స్ చివరి దాకా చదువుతారో లేదో ? అయితే కొన్నిసార్లు మిమ్మల్ని మీరు “ టాపిక్ పైన కదా అది డిపెండ్ అయ్యేది” అని సర్ది చెప్పుకుని ఉండి ఉంటారు.

మరి బ్లాగ్ పోస్ట్స్ వర్డ్ కౌంట్ గురించి అంతగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈరోజు మనం కొన్ని నిజాలు తెలుసుకుందాం. ఎన్ని వర్డ్స్ ఉంటె బ్లాగ్ పోస్ట్స్ బాగుంటాయి అని, వేర్వేరు వర్డ్ కౌంట్ ఉన్న బ్లాగ్ పోస్ట్స్ కొన్నింటిని కంపేర్ చేస్తూ Hubspot ఒక సర్వే కండక్ట్ చేసింది.

SEO ప్రకారం | How many words write in blog post in Telugu

How many words write in blog post in Telugu

గూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్స్ లో మంచి పొజిషన్ లో ఉండాలి అని ప్రతి బ్లాగర్ కి ఖచ్చితంగా ఒక గోల్ ఉంటుంది. మీకు ఒక్క విషయం చెప్పాలి, గూగుల్ కనీసం ౩౦౦ వర్డ్స్ కన్నా తక్కువ ఉంటె అంత మంచి రిజల్ట్స్ ఇవ్వలేదు. అంటే గూగుల్ లెక్క ప్రకారం ౩౦౦ వర్డ్స్ కన్నా తక్కువ ఉన్న బ్లాగ్ పోస్ట్స్ లో కావలసినంత ఇన్ఫర్మేషన్ ప్రోవైడ్ చేయలేవు అని అనుకుంటుందేమో!

మరి అలాంటి దానిని గూగుల్ తన యూసర్స్ కి అందించలేదు కదా. మీకు తెలుసు కదా! గూగుల్ ఎప్పుడూ తన యూసర్స్ కి మంచి యూసర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, ఇంకా బెటర్ సర్వీస్ అవ్వాలి అని అనుకుంటుంది అని. కాబట్టి గూగుల్ తక్కువ వర్డ్ కౌంట్ ఉన్న బ్లాగ్స్ రాంక్ చేయదు.

పోయిన సంవత్సరం అందరి అంచనాలని తలక్రిందులు చేస్తూ రీడర్స్ లాంగ్ బ్లాగ్ పోస్ట్స్ కూడా తెగ చదివేసారు. సహజంగా వాళ్ళు ఇన్వాల్వ్ అయితే అంతే కదా, లేదా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కావాలన్నా అంటే చేస్తారు. Hubspot సర్వే ప్రకారం సక్సెస్ఫుల్ బ్లాగ్స్ లో 2100 నుండి 2400 వరకూ వర్డ్స్ ఉన్న బ్లాగ్ పోస్ట్స్ SEO పాయింట్ అఫ్ వ్యూ  ప్రకారం బాగా పాపులర్ అయ్యాయి.

ఏ రెండు బ్లాగ్ పోస్ట్స్ ఒకేలా ఉండవు

How many words write in blog post in Telugu

సహజంగా మన సినిమాల్లో ఇలాంటి డైలాగ్ ఒకటి మనకి బాగా తెలుసు, అది ఏంటంటే ఏ ఇద్దరి ఫింగర్ ప్రింట్స్ ఒకేలా ఉండవు అని. అదే విధంగా ఏ ఇద్దరి బ్లాగ్ పోస్ట్స్ ఒకేలా ఉండవు (కాపీ పేస్టు చేస్తే తప్ప ) అన్ని బ్లాగ్ పోస్ట్స్ మనం పైన చెప్పుకున్నట్లు 2000 వర్డ్స్ పైన రాయాలి అంటే కష్టం అని మీరు అనుకుంటున్నారా? అవును నేను కూడా మీతో ఏకీభవిస్తున్నాను. లాస్ట్ ఇయర్ 50 బెస్ట్ బ్లాగ్స్ లో 16 బ్లాగ్స్ లో 1500 వర్డ్స్ కన్నా తక్కువ ఉన్న బ్లాగ్స్ పోస్ట్స్ కూడా చాలానే ఉన్నాయి.

Suggested Post : How  to Write 1500+ words Blogs in Telugu

మీకు తెలియంది ఏముంది అందుకు చాలా కారణాలు ఉన్నాయి అని, ఆ టాపిక్ కావచ్చు, మీ ఆడియన్స్ కావచ్చు, మీ బ్లాగ్ పోస్ట్ యొక్క ఐడియా ఏంటి (ట్రావెల్ బ్లాగ్, లీడ్ జనరేషన్ పోస్ట్, అఫిలియేట్ మార్కెటింగ్ పోస్ట్ ) ఇలాంటివి.

ఒకవేళ మీకు ఒక బ్లాగ్ పోస్ట్ లో యావరేజ్ గా ఎన్ని వర్డ్స్ ఉండాలి అని డౌట్ ఉంటె, నా సమాధానం 1000 వర్డ్స్ ఉంటె మంచిది లేదా కనీసం 600 వర్డ్స్. ఒకవేళ మీకు డౌట్ రావచ్చు, అన్నిసార్లు మనం ఈ కౌంట్ మైంటైన్ చేయటం కష్టం కదా! మరి ఏం చేయాలి అని?

అయితే ఒకసారి ఈ వీడియో చూడండి.

ఎలా డిసైడ్ అవ్వాలి?

How many words write in blog post in Telugu

ఎన్ని వర్డ్స్ తో బ్లాగ్ పోస్ట్ వ్రాయాలి అని నేను ఎలా డిసైడ్ అవ్వాలి అని మీకు సందేహం రావచ్చు. నేను మీకు ఒక్కటే చెప్తాను, మీరు వ్రాయటం స్టార్ట్ చేశాక, ఎటువంటి ఆటంకం లేకుండా ఎంతవరకూ ఆ టాపిక్ కి అవసరమో అంతవరకూ వ్రాయండి. ఇన్ని వర్డ్స్ వ్రాయాలి, అన్ని వర్డ్స్ వ్రాయాలి అని మీరు వర్డ్ కౌంట్ పైన దృష్టి పెట్టకండి.

ఎందుకంటె మీ బ్లాగ్ కి వచ్చే రీడర్ మీ బ్లాగ్ పోస్ట్ ఎంత పొడవు ఉంది అని చూడదు. అందులో యెంత ఇన్ఫర్మేషన్ తనకి హెల్ప్ అవుతుంది అని ఆలోచిస్తాడు. ఒకవేళ తనకి అవసరం అనుకుంటే 5000 పదాలతో రాసిన చివరి వరకూ చదువుతాడు. అవసరం లేకపోతే 500 వర్డ్స్ తో రాసినా చివరి వరకూ చదవడు.

Suggested Blog : How to Earn Money with Blogging?

కాబట్టి బేసిక్ SEO రిక్వైర్మెంట్స్ ఫిల్ చేసుకుంటూ మీరు ఎంచుకున్న టాపిక్ కి ఎంతవరకూ కంటెంట్ అవసరమో అంత కంటెంట్ వ్రాయండి. ఎందుకంటె ఈ నంబర్స్ మారిపోతూ ఉంటాయి. మీ రీడర్స్ కి ఏం కావాలో దాని గురించి ఆలోచించండి.

ఈ బ్లాగ్ పోస్ట్ మీకు ఒక బ్లాగ్ పోస్ట్స్ లో ఎన్ని వర్డ్స్ యూస్ చేయాలి అని ఒక ఐడియా ఇచ్చింది అని అనుకుంటున్నాను. మరి మీరు ఏమనుకుంటున్నారు? మీరు లాంగ్ ఫార్మ్ కంటెంట్ వ్రాస్తున్నారా? షార్ట్ ఫార్మ్ కంటెంట్ వ్రాస్తున్నారా?

ఏ కంటెంట్ వ్రాస్తే మీకు బెటర్ రిజల్ట్స్ వస్తున్నాయి అని కామెంట్ ద్వారా తెలియచేయండి. మీరు మీ అభిప్రాయాలను తెలియచేస్తే ఈ బ్లాగ్ పోస్ట్ అప్డేట్ లో మరింత మందికి ఉపయోగపడే విధంగా కంటెంట్ ని అప్డేట్ చేస్తాను.

Leave a Comment