Digital Marketing Tips in Telugu for Beginners
డిజిటల్ మార్కెటింగ్ గురించి నేను ఫ్రీక్వెంట్ గా వీడియోస్ చేస్తున్నాను, బ్లాగ్స్ రాస్తున్నాను. చాలా మంది నన్ను సోషల్ మీడియా లో అప్రోచ్ అవుతున్నారు. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనుకునేవారికి, స్టూడెంట్స్ కి, బిజినెస్ ఓనర్స్ కి కూడా కొన్ని డిజిటల్ మార్కెటింగ్ టిప్స్ గురించి చెప్పాలి అని ఈ బ్లాగ్ పోస్ట్ రాస్తున్నాను. ఈ బ్లాగ్ పోస్ట్ లో 6 టిప్స్ డిజిటల్ మార్కెటింగ్ చెప్పబోతున్నాను.
#1 Digital Marketing Tips in Telugu | సోషల్ మీడియా ప్రేసెన్స్
సోషల్ మీడియా ప్రేసెంస్ స్ట్రాంగ్ గా ఉండాలి. సోషల్ మీడియా పవర్ఫుల్ మీడియం. సోషల్ మీడియా లో మీ కంటెంట్ కన్స్యూం చేసేలా చేయాలి. సోషల్ మీడియా లో ఫాలోయర్స్ ని ఇంక్రీస్ చేయగలిగితే మీ కంటెంట్, మీ ఎఫర్ట్స్ వర్క్ అవుతాయి. అలా వర్కౌట్ అవ్వాలి అంటే మీరు మీ యూసర్స్ కి యూస్ఫుల్ కంటెంట్ ఇవ్వాలి. సోషల్ మీడియా ద్వారా మీరు నిదానంగా డిజిటల్ మార్కెటింగ్ కాంపెయిన్స్ స్టార్ట్ చేయవచ్చు.
ఫేస్బుక్, ఇన్స్టగ్రామ్ లలో రోజుకి 100 రూపాయలతో స్టార్ట్ చేయవచ్చు. గూగుల్ లేదా యూట్యూబ్ లలో కూడా రోజుకి 100 రూపాయలతో స్టార్ట్ చేయవచ్చు. ట్విట్టర్ లో 10 డాలర్స్ తో స్టార్ట్ చేయవచ్చు. అదే ఇప్పుడు బాగా పాపులర్ అవుతున్న tiktok లో 2000/- నుండి మార్కెటింగ్ కాంపెయిన్స్ స్టార్ట్ చేయవచ్చు.
#2 Digital Marketing Tips in Telugu | ప్రక్క స్ట్రాటజీ
మీరు ఎలాంటి కాంపెయిన్ క్రియేట్ చేసిన ఆ కాంపెయిన్ ద్వారా మీకు బెనిఫిట్ అవ్వాలి. అంటే మీరు కాంపెయిన్ తో పాటుగా ఒక స్ట్రాంగ్ స్ట్రాటజీని కూడా క్రియేట్ చేయాలి. స్ట్రాటజీ లేని కాంపెయిన్ పెద్దగా మీకు ఉపయోగపడదు. మీకు క్లియర్ విజన్ ఉండాలి.
ఉదాహరణకి చెప్పాలి అంటే మీకు ఒక ప్రొడక్ట్ ని లాంచ్ చేస్తున్నారు. మీరు ముందుగా మీ ప్రొడక్ట్ ద్వారా సాల్వ్ అయ్యే ప్రాబ్లంస్ గురించి ప్రమోట్ చేయాలి. ఈ ప్రాబ్లంస్ ఫేస్ చేస్తున్నవారు మీరు ఏమన్నా సొల్యూషన్ చూపగలరా అని వెతుకుతూ ఉంటారు. అప్పుడు మీరు మీ ప్రొడక్ట్ ని వాళ్ళ ప్రాబ్లంస్ కి సొల్యూషన్ గా చూపవచ్చు. ముందు మీరు మీ ప్రొడక్ట్స్ కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ప్రోవైడ్ చేయాలి.
ఇది ఒక ప్రాసెస్. అంటే ముందు మీరు ప్రాబ్లం గురించి, తరువాత సొల్యూషన్ గురించి, ప్రొడక్ట్ గురించి, ప్రమోట్ చేయాలి. దీనిని ఒక స్ట్రాటజీగా చెప్పుకోవచ్చు. ఇలా మీరు మంచి స్ట్రాటజీస్ క్రియేట్ చేసుకోవాలి. మీ స్ట్రాటజీస్ మీకు పాజిటివ్ / నెగిటివ్ రిజల్ట్స్ ని అందిస్తాయి.
#3 Digital Marketing Tips in Telugu | సూటిగా, సుత్తి లేకుండా చెప్పు
ఇది బాగా పాపులర్ అయిన ఒక కూల్ డ్రింక్ యాడ్ డైలాగు. మీ ఫాలోయర్స్ మీరు చెప్పే విషయాలను వింటుంటారు. మీ కంటెంట్ ద్వారా, ఇమేజ్స్ ద్వారా, వీడియోస్ ద్వారా కాబట్టి మీరు ఏం చెప్పాలనుకున్నారో దాన్ని క్లియర్ గా చెప్పండి. దాని వాళ్ళ మీ పైన మా ఫాలోయర్స్ కి ఉన్న ఇంప్రెషన్ మారవచ్చు. కాబట్టి మీరు ఏం చెప్పాలనుకున్నారో సూటిగా, సుత్తి లేకుండా చెప్పండి.
#4 Digital Marketing Tips in Telugu | ఫాలోయర్ కమ్యూనిటీ బిల్డ్ చేసుకోండి
ఏ బుసినెస్ కి అయినా, ఏ బ్రాండ్ కి అయినా ఫాలోయర్స్ ఏ ప్రాణం. వల్లే మన బ్రాండ్, బుఇస్నేస్స్ గ్రో అవ్వటానికి ఉపయోగపడుతుంది. మన బ్రాండ్ ఎక్కువ మందికి రీచ్ అవ్వటానికి మన ఫాలోయర్స్ హెల్ప్ చేస్తారు.
#5 Digital Marketing Tips in Telugu | మీ ఫాలోయర్స్ కి అందుబాటులో ఉండండి
సోషల్ మీడియా లో మీతో ఎంగేజ్ అయ్యే ఫాలోయర్స్ కి అవైలబుల్ లో ఉండండి. వాళ్ళ కామెంట్స్ కి రిప్లై ఇవ్వండి. జెన్యూన్ గా వాళ్ళకి రిప్లై ఇవ్వండి. మీ కంటెంట్ / ప్రొడక్ట్స్ వాళ్ళకి ఉపయోగపడవు అనుకుంటే ఉన్న విషయం చెప్పండి. ఎందుకంటె వాళ్ళకి మీ మిద మంచి ఇంప్రెషన్ ఉంటుంది. ఈ ఇంప్రెషన్ మీకు ఫ్యూచర్ లో హెల్ప్ అవుతుంది.
#6 Digital Marketing Tips in Telugu | మీ వర్క్ ని ఎనాలిసిస్ చేయండి
మీరు చేసే వర్క్ ని ఎనాలిసిస్ చేయండి. మీ వర్క్ అంటే కంటెంట్ ప్రిపరేషన్, ప్రెసెంటేషన్, మార్కెటింగ్ కాంపెయిన్స్ కి మీకు లభించే రిజల్ట్స్ / రెస్పాన్స్ ని బట్టి మీ వర్క్ ఎలా ఉంది. ఇంకా బెటర్ చేసుకోవాలా? ఇప్పుడున్న సిట్యువేషన్ కంటిన్యూ చేయల? అని ఎనలైస్ చేయవచ్చు.
ఈ 6 టిప్స్ మీకు డిజిటల్ మార్కెటింగ్ లో బెటర్ రిజల్ట్స్ పొందటానికి ఉపయోగపడతాయి. మీరు ఈ టిప్స్ యూస్ చేయండి. మీకు ఈ టిప్స్ ఎలా ఉపయోగపడ్డాయో మాకు కామెంట్స్ లో తెలియచేయండి. మీ దగ్గర ఇంకేమన్నా టిప్స్ ఉంటె మాకు తెలియచేయండి.
Latest posts by dasaradhi (see all)
- Website Design Formula for Small Businesses - October 27, 2021
- Digital Marketers Meetup in Hyderabad in 2021 - September 1, 2021
- How to Write Viral Blog Posts in Telugu - August 12, 2021