always vj logo
digital marketing campaigns in telugu

2020 లోఎలాంటి డిజిటల్ మార్కెటింగ్ కాంపెయిన్స్ రన్ చేయాలి?

Spread the love

How Small Businesses Run Digital Marketing campaigns in Telugu

క్రొతగా ఒక బిజినెస్ ని స్టార్ట్ చేస్తే మన మైండ్ లో ఉండే ఒకే ఒక్క ఆలోచన, బిజినెస్ ని త్వరగా ఇంక్రిస్ చేయాలి అని. అలా మీ బిజినెస్ ఇంక్రిస్ అవ్వాలి అంటే, మీ ప్రొడక్ట్స్ / సర్వీసెస్ లేదా మీ బ్రాండ్ జనాల్లోకి వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే మీకు ఎఫెక్టివ్ గా డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అవసరం.

Digital Marketing Campaigns in Telugu

అయితే ఇక్కడ ఇంకో డౌట్ వస్తుంది, ఏ మార్కెటింగ్ స్ట్రాటజీ ని యూస్ చేయాలి అని. నేనిచ్చే ఆన్సర్ ఏంటి అంటే మీ బిజినెస్ గోల్స్ కి, మీ బిజినెస్ కి సెట్ అయ్యే స్ట్రాటజీ ని యూస్ చేయాలి. ఎందుకంటే అన్ని స్ట్రాటజీస్, అన్ని బిజినెస్ లకి వర్కౌట్ కావు కదా!

డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ లేని స్మాల్ బిజినెస్ కెప్టెన్ లేని షిప్ లాంటిది.  ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే 2021 కల్లా ఆన్లైన్ ద్వార్ 2 బిలియన్ల మంది ప్రొడక్ట్స్ / సర్వీసెస్ ని పర్చేస్ చేతారు అని ఒక సర్వే. 2 బిలియన్లు అంటే అక్షరాల 200 కోట్లు.

ఈ అనలిటిక్స్ ప్రక్కన పెడితే ఆన్లైన్ లో ఉండే లార్జ్ ఆడియన్స్ కి కనెక్ట్ కావాలి అంటే మీరు మీ బిజినెస్ ని డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీతో ప్రోమోట్ చేయాలి. కరెక్ట్ స్ట్రాటజీని కనుక యూస్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్స్ పొందవచ్చు, అవి లీడ్స్ కావచ్చు, సేల్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు.

బహుశా మీరు ఇప్పటికే డిజిటల్ మార్కెటింగ్ యాడ్ కాంపెయిన్స్ రన్ చేస్తూ ఉండవచ్చు. అయితే నేను చెప్పేది ఏంటి అంటే మీ అడ్వర్టైసింగ్ లేదా ప్రమోషన్ కాంపెయిన్స్ మీ గోల్స్ కి రిలేటెడ్ గా ఉండాలి.

ఉదాహరణకి మీరు ఆన్లైన్ ద్వారా సేల్స్ చేయాలి అనుకుంటే ఫాలోయర్స్ ని ఇంక్రిస్ చేయాలి అనుకునే కాంపెయిన్స్ రన్ చేయకూడదు. అంతే కదా!

మరి మీరు ఎలాంటి స్ట్రాటజీస్ యూస్ చేయాలి? మీకు అర్థం కావట్లేదా? ఈ బ్లాగ్ లో నాలుగు రకాల యాడ్ కాంపెయిన్స్ గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత మీరే నిర్ణయం తీసుకోవచ్చు.

#1 Digital Marketing Campaigns in Telugu |  ఈమెయిల్ కాంపెయిన్స్

ఈమెయిల్ మార్కెటింగ్ కాంపెయిన్స్ అన్నింటి కన్నా ఎక్కువ రిటర్న్ అఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇస్తాయి. మీకు కనుక వెబ్ సైట్ ఉంటె అందులో అప్టిన్ ఫారంస్ ద్వారా మనం పోటెన్షియాల్ కస్టమర్స్ ని పొందవచ్చు.

ప్రొడక్ట్స్ / సర్వీసెస్ గురించి అప్డేట్స్ కోసం న్యూస్లెటర్స్ (newsletter) ఈమెయిల్స్ యూస్ చేసుకోవచ్చు. జనరల్ గా ఈ సైన్అప్ ఫారంస్ ని మన వెబ్ సైట్ డిజైన్ చేసేవారి ద్వారా చేయించుకోవచ్చు.

మరి బిజినెస్ వెబ్ సైట్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి ? మరి వాళ్ళు ఎలా ఈమెయిల్ మార్కెటింగ్ కాంపెయిన్స్ ఎలా చేయాలి? అని మీకు డౌట్ రావచ్చు. ఒకవేళ మీకు వెబ్ సైట్ లేకపోతే కనీసం ఫేస్బుక్ పేజి అయిన ఉండాలి.

మీ దగ్గర ఆల్రెడీ ఈమెయిల్ లిస్టు కనుక ఉంటె, ఆ లిస్టుని మీ ఫేస్బుక్ పేజితో లింక్ చేసి మార్కెటింగ్ కాంపెయిన్ స్టార్ట్ చేయవచ్చు.

ఈమెయిలు మార్కెటింగ్ టూల్స్ ని యూస్ చేసుకుని డ్రిప్ సీక్వెన్స్ కాంపెయిన్స్ క్రియేట్ చేయవచ్చు. ఇవి కొంచెం టెక్నికల్ గా ఉంటుంది.

డ్రిప్ సీక్వెన్స్ కాంపెయిన్స్ ఆల్రెడీ మీరు రన్ చేస్తుంటే మరింత ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది. డ్రిప్ సీక్వెన్స్ మార్కెటింగ్ అంటే ఆటోమేటిక్ గా ఈమెయిల్స్ యూసర్ యొక్క ఎంగేజ్మెంట్ ని బేస్ చేసుకుని డెలివర్ అవుతాయి.

ఉదాహరణకి అమెజాన్ లేదా ఫ్లిప్కర్ట్ లో ఎవరైనా ఒక ప్రొడక్ట్ ని కార్ట్ లో యాడ్ చేసి పర్చేస్ చేస్తే అతనికి ఆర్డర్ కన్ఫర్మేషన్ ఈమెయిలు వెళ్తుంది. అదే కార్ట్ లో యాడ్ చేసి పర్చేస్ చేయకపోతే, ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయండి అని మెయిల్ వస్తుంది.

ఇలాంటి ఈమెయిల్స్ డ్రిప్ సీక్వెన్స్ కాంపెయిన్స్ ద్వారా వస్తాయి. న్యూస్ లెటర్ బేస్డ్ ఈమెయిల్ మార్కెటింగ్ కాంపెయిన్ లేదా డ్రిప్ సీక్వెన్స్ కాంపెయిన్, ఈ రెండింటిలో ఏది చూసే చేసుకోవాలి అంటే అది మీ బిజినెస్ ని బట్టి ఉంటుంది.

#2 Digital Marketing Campaigns in Telugu | PPC (పే-పర్-క్లిక్)

PPC యాడ్స్ అనేవి మంచి డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ, కాకపోతే కొంచెం ఖర్చుతో కూడుకున్నవి. గూగుల్ లో సెర్చ్ చేసిన కీవర్డ్స్ బేస్ చేసుకొని మీ బిజినెస్ వెబ్ సైట్ ని సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజిలోటాప్ లో చూపించటానికి PPC యాడ్స్ యూస్ చేస్తాం.

మీ బిజినెస్ కి సంబంధించిన కీవర్డ్స్, ఏవైతే బాగా పాపులర్ వి ఉన్నాయో, మిగిలిన బిజినెస్ లు కూడా అవే కీవర్డ్స్ కోసం పోటీపడితే మీరు ఇంకొంచెం ఎక్కువ స్పెండ్ చేయటానికి రెడీగా ఉండాలి.

ఈ కాంపిటీషన్ ని అవాయిడ్ చేసి PPC ని ఎఫెక్టివ్ గా యూస్ చేయాలి అంటే మీరు లాంగ్ టైల్ కీవర్డ్స్ పై ఫోకస్ చేయాలి. లాంగ్ టైల్ కీవర్డ్స్ మనకి ఎక్కువ ఆప్షన్స్, మన బడ్జెట్ లో తక్కువ ప్రైస్ కి ఎక్కువ క్లిక్కులు వచ్చే అవకాశం ఉంది.

యాడ్ ఫార్మాట్స్ విషయానికి వస్తే, వీడియో యాడ్స్ ద్వారా మనం ఎక్కుఅవ బెనిఫిట్ పొందవచ్చు. IAB (Interactive Advertising Bureau) వాళ్ళు రీసెంట్ గా ఒక సర్వే ద్వారా వీడియో యాడ్స్ పై స్పెండ్ చేసే అమౌంట్ ప్రతి సంవత్సరం పెరుగుతుంది.

2019 సంవత్సరంలో వీడియో యాడ్స్ పై 25%  స్పెండ్ చేయడం జరిగింది. అంతే కాకుండా వరల్డ్ వైడ్ గా 86% మార్కేటర్స్ వాళ్ళ PPC కాంపెయిన్స్ కోసం వీడియో యాడ్స్ ని యూస్ చేస్తున్నారు అంటే వీడియో యాడ్స్ ఎంత ఎఫెక్టివ్ గా పని చేస్తాయో అర్థం చేసుకోవచ్చు.

#3 Digital Marketing Campaigns in Telugu | కంటెంట్ మార్కెటింగ్

మీ బుజినెస్ సేల్స్ పేజి కి ట్రాఫిక్ తీసుకురావాలన్న యూసర్ ఎంగేజ్మెంట్ జరగాలన్న కంటెంట్ మార్కెటింగ్ తిరుగులేని ఆయుధం. కంటెంట్ మార్కెటింగ్ లో కంటెంట్ ఏ ఫార్మాట్ లో అయిన ఉండవచ్చు.

బ్లాగ్ పోస్ట్స్ కావచ్చు, ఇమేజ్స్ కావచ్చు, వీడియోస్, పోడ్కాస్ట్ లు, ఇన్ఫోగ్రాఫిక్స్ ఇలా ఏవైనా… మీ కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అంటే అది కీవర్డ్స్ ద్వారానే జరుగుతుంది.

అయితే కీవర్డ్స్ యూస్ చేయమన్నాం కదా అని కంటెంట్ తక్కువ, కీవర్డ్స్ ఎక్కువ యూస్ చేయకూడదు. కంటెంట్ క్వాలిటీ అనేది లాస్ అవ్వకుండా చూడాలి.

కంటెంట్ మార్కెటింగ్ లో ప్రైమరీగా మన బ్లాగ్ పోస్ట్స్ మన బ్లాగ్ / వెబ్ సైట్ కి ట్రాఫిక్ ని తీసుకువస్తాయి. కాబట్టి మనం మన బ్లాగ్ పోస్ట్స్ లో క్వాలిటీ లాంగ్ టైల్ కీవర్డ్స్ యూస్ చేయాలి. అలా చేయడం ద్వారా మన బ్లాగ్ కి మరింత ట్రాఫిక్ ఇంకా లీడ్స్ వస్తాయి.

అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే అలాంటి కీవర్డ్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని. మనం అందుకోసం మనకి నాలెడ్జ్ ఉంటె మిరే ఓన్ గా క్రియేట్ చేయవచ్చు. లేదా కీవర్డ్స్ రీసెర్చ్ టూల్స్ యూస్ చేసుకోవచ్చు.

#4 Digital Marketing Campaigns in Telugu | సోషల్ మీడియా

మనందరికీ సోషల్ మీడియా పవర్ ఏంటో తెలుసు ! సోషల్ మీడియా లో మంచి ఉంది, చెడు ఉంది. అయితే సోషల్ మీడియా ని మన బిజినెస్ కి ఎలా యూస్ చేయాలో తెలుసుకుంటే మంచిది.

సోషల్ మీడియా ద్వారా మన బిజినెస్ ని ఇన్క్రీస్ చేసుకోవాలి అంటే మనం ఇన్వెస్ట్ చేయటానికి సిద్ధంగా ఉండాలి. అంటే మనీతో పాటు టైం కూడా. అదే విధంగా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫారం మీ బిజినెస్ కి హెల్ప్ అవుతుందో కూడా మీరు తెలుసుకోవాలి.

మీరు ఫేస్బుక్ యూస్ చేయాలనుకుంటున్నారా? tiktok యూస్ చేయాలనుకుంటున్నారా? లేదా యూట్యూబ్ యూస్ చేయాలని అనుకుంటున్నారా?

నా సలహా ఏంటి అంటే మీరు మీ టైం ని స్పెండ్ చేసి మీ టార్గెటెడ్ ఆడియన్స్ ఎక్కువగా ఏ ప్లాట్ఫారం లో ఉన్నారో రీసెర్చ్ చేయండి. మీరు ఏ ప్లాట్ఫారం చూస్ చేసుకున్నా, అది ఆర్గానిక్ మార్కెటింగ్ కావచ్చు, పైడ్ మార్కెటింగ్ కావచ్చు, సోషల్ మీడియా లో మీ బిజినెస్ గోల్స్ కి హెల్ప్ అవ్వని ప్లాట్ఫారంస్ చూసే చేసుకోవద్దు.

ఈ నాలుగు రకాల యాడ్ కాంపెయిన్స్ రన్ చేయవచ్చు. మీ బిజినెస్ గోల్స్ కి రిలేటెడ్ గా ఉండే యాడ్ కాంపెయిన్స్ రన్ చేయాలో డిసైడ్ చేసుకోవచ్చు. ఈ యాడ్ కాంపెయిన్స్ రన్ చేయడం వలన కలిగే బెనిఫిట్స్ గురించి నెక్స్ట్ బ్లాగ్ పోస్ట్ లో తెలుసుకుందాం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *