always vj logo
07 Who can start blogging

బ్లాగ్గింగ్ ఎవరు చేయవచ్చు? Who can start blogging?

Spread the love

Who Can Start Blogging

రవి 10th క్లాసు అయిపోయాక రెగ్యులర్ గా ఉండే ఇంటర్మీడియట్ లేదా పాలిటెక్నిక్ వంటివి ఏమి తీసుకోకుండా, 10th తరువాత ఉండే హోటల్ మేనేజ్మెంట్ తీసుకున్నాడు. కోర్సు కాల వ్యవధి (duration) 2 సంవత్సరాలు.
అప్పటికి తన వయస్సు 15 సంవత్సరాలు. కోర్స్ పూర్తయింది. తనకి కుకింగ్ అంటే ఇష్టం కాబట్టి అందుకు అనుగుణంగా అనేక రకాల డిషెస్ చేయటం నేర్చుకున్నాడు. తనకి ఉన్న టాలెంట్ తో ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేయాలి అన్నది అతని ఆలోచన.

07 Who can start blogging
అదే విషయాన్నీ తన తండ్రికి చెప్పాడు రవి. అయితే అప్పటికి తన వయస్సు 17 సంవత్సరాలే. రవి తండ్రి “నీది ఇప్పుడు చదువుకునే వయస్సు, వ్యాపారం చేసే వయస్సు కాదు. కాబట్టి ముందు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చెయ్” అని చెప్పారు.
రవి తన తండ్రి మాట విని ఒక గ్రాడ్యుయేట్ కోర్స్ లో జాయిన్ అయ్యాడు. అయితే తనలో వున్నా బిజినెస్ చెయ్యాలి అనే కోరిక తనని అసలు నిలువనీయడం లేదు.
ఒకరోజు రవి వాళ్ళింటికి వాళ్ళ మామయ్య వచ్చారు. అప్పుడు మాటల మధ్యలో రవి తన సమస్య గురించి చెప్పాడు. అప్పుడు రవి మామయ్య నువ్వు బ్లాగ్గింగ్ ఎందుకు చేయకూడదు? అని అడిగాడు.
రవి మామయ్య రవికి బ్లాగ్గింగ్ గురించి చెప్పి, ఇలా చేయటం వలన నీ కోరిక తీరుతుంది, నీ గ్రాడ్యుయేషన్ కూడా ఇబ్బంది లేకుండా కంప్లేట్ అవుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు.
తరువాత ఇంటర్నెట్ లో బ్లాగ్గింగ్ గురించి మరింత సమాచారం తెలుసుకుని రవి తనకిచ్చిన పాకెట్ మనీ తో ఒక బ్లాగ్ స్టార్ట్ చేసాడు. కాలేజీ అయ్యాక ఇంటికి వచ్చి రవి ప్రతీ రోజు ఒక డిష్ ని తయారు చేసి పోస్ట్ చేసేవాడు.
ఆ పోస్టుని తన ఫేస్బుక్ లో షేర్ చేసేవాడు. ఇలా ఒక ఆరు నెలలు తిరిగేసరికి రవి బ్లాగ్ కి వేలల్లో విసిటర్స్ వచ్చేవారు. రవి నిదానంగా తన బ్లాగ్ లో యాడ్స్ ద్వారా మనీ ఎర్న్ చేయడం మొదలుపెట్టాడు.
అలా తన గ్రాడ్యుయేషన్ కంప్లేట్ అయ్యేసరికి రవి బ్లాగ్గింగ్ లో బాగా మనీ ఎర్న్ చేస్తూ ఉండేవాడు. తన సంపాదించుకున్న డబ్బుతో రవి వల్ల నాన్న సహాయంతో ఒక చిన్న రెస్టారెంట్ ని స్టార్ట్ చేసి, దానిని తన బ్లాగ్ ద్వారా ప్రమోట్ చేసేవాడు.
అప్పటికి బ్లాగ్ ద్వారా ఫాలో అవుతూ ఉండేవారు తను చేసే డిషెస్ స్వయంగా ఆస్వాదించడానికి రెస్టారెంట్ కి వచ్చేవారు. అలా రవి తన రెస్టారెంట్ ని నిదానంగా డెవలప్ చేయడం మొదలుపెట్టాడు. అలాగే బ్లాగ్గింగ్ ని కూడా కంటిన్యూ చేస్తున్నాడు.
ఈ సక్సెస్ స్టొరీ చెప్పటానికి కారణం, బ్లాగ్గింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఎవరెవరు చెయ్యచ్చు? అనే ప్రశ్నలకి సమాధానంగా చెప్పబడింది. ఇదే కాదు, ఇలాంటి ఎన్నో సక్సెస్ స్టోరీస్ వ్రాయటానికి బ్లాగ్గింగ్ రంగం ఉపయోగపడుతుంది.

బ్లాగ్గింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి?

     బ్లాగ్గింగ్ ఇప్పుడైనా స్టార్ట్ చెయ్యవచ్చు, ఎప్పుడైనా స్టార్ట్ చెయ్యవచ్చు. బ్లాగ్గింగ్ స్టార్ట్ చేయటానికి ఫలానా వయస్సు వుండాలి, ఫలానా రోజు మంచిది అని ఏమి ఉండవు.
బ్లాగ్గింగ్ చేయాలి అనే ఆలోచన వచ్చిన వెంటనే మొదలుపెట్టవచ్చు. లేదా మంచి ఆలోచన గురించి రీసెర్చ్ చేసి మొదలుపెట్టవచ్చు. బ్లాగ్గింగ్ చేయాలి అనే ఆలోచన, కొంత డబ్బు సమకూర్చుకుని సింపుల్ గా బ్లాగ్గింగ్ చెయ్యవచ్చు.

బ్లాగ్గింగ్ ఎవరెవరు చేయవచ్చు?

ఆడ, మగ, చిన్న, పెద్ద, స్టూడెంట్, ఎంప్లాయ్, బిజినెస్ మాన్ ఇలా ఎవరైనా బ్లాగ్గింగ్ చేయవచ్చు.  మనం పైన చెప్పుకున్న రవి ఒక స్టూడెంట్. మన దేశంలో మొట్టమొదటి బ్లాగ్గింగ్ మొదలుపెట్టిన అమిత్ అగర్వాల్ గారు ఒక ఐ.టి. ఎంప్లాయ్. ఇది అయన బ్లాగ్ లింక్ https://www.labnol.org/. అమితాబ్ బచ్చన్ గారు కూడా బ్లాగ్గింగ్ చేస్తారు అని మీకు తెలుసా? ఇది http://srbachchan.tumblr.com అయన బ్లాగ్ లింక్.
 అంతెందుకూ మనదరం ప్రతీ రోజు బ్లాగ్గింగ్ చేస్తున్నాం. నమ్మడం లేదా? ఫేస్బుక్ లో మీరు పోస్టులు, ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు కదా! ఇది కూడా బ్లాగ్గింగ్ యే. ట్విట్టర్ లో ట్వీట్స్ చేస్తున్నారా? ట్విట్టర్ మైక్రో బ్లాగ్గింగ్ ప్లాట్ఫారం అని మీకు తెలుసా?
కాకపోతే ఇప్పుడు మీరు వాళ్ళ వెబ్ సైట్ / యప్స్ ఉపయోగిస్తున్నారు. ప్రొఫెషనల్ బ్లాగ్గింగ్ లో మీరే ఒక వెబ్ సైట్ క్రియేట్ చేసి బ్లాగ్గింగ్ చేస్తారు, అంతే తేడా!
బ్లాగ్గింగ్ ద్వారా మనల్ని ఒక బ్రాండ్ గా తీర్చిదిద్దుకోవచ్చు. మన లాగా ఆలోచించే ఒక కమ్యూనిటీని పొందవచ్చు. ఏమో బ్లాగ్గింగ్ ఒక బిజినెస్ ని కూడా ఏర్పాటు చేయవచ్చు.
కాబట్టి బ్లాగ్గింగ్ చేయటం వలన మనకి అనేక ఉపయోగాలు ఉన్నాయి. అయితే మనం ఒక మెంటార్ ని తోడుగా ఉంచుకుంటే వాళ్లు మనకి ఎదురయ్యే సమస్యలకి పరిష్కార మార్గాలని సూచిస్తారు. విలువైన మన సమయాన్ని కూడా రక్షిస్తారు.

TENGLISH

Who can start blogging in telugu

Ravi 10th class ayayka regular ga unde intermediate leda polytechnic vantivi yemi tidukokunda, 10th taruvatha unde Hotel Management tisukunnadu. Course duration 2 years.
Appatiki tana age 15 years. course complete ayyindi. Tanaki cooking ante ishtam kabatti anduku anugunamga aneka rakala dishes cheyatam nerchukunnadu. Tanaki unna talent tho oka restaurent start cheyali annadi atani
aalochana.
Ade vishayanni tana father ki cheppadu Ravi. Ayithe appatiki tana age 17 years matrame. Ravi father “nidi ippudu chaduvukune age, business chese age kadu. Kabatti mundu graduation complete chey” ani chepparu.
 Ravi tana father mata vini oka graduate course lo join ayyadu. Ayithe tanalo unna business cheyali ane korika tanani asalu niluvaniyadam ledu.
Oka roju Ravi vallaintiki valla mamaya vacharu. Appudu matala madhyalo Ravi tana samasya gurinchi cheppadu. Appudu Ravi Mamaya nuvvu blogging yenduku cheyakoodadu? anii adigadu.
Ravi mamaya Raviki blogging gurinchi cheppi, ila cheyatam valana nii korika tirutundi, ni graduation ki kooda ibbandi lekunda complete avutundi ani cheppi velli poyadu.
Taruvata internet lo blogging gurinchi marintha samacharam telusukuni Ravi tanakichina pocket money tho oka blog start chesadu. College ayyaka intiki vachi Ravi prati roju oka dish ni tayaru chesi post chesevadu.
Aa postuni facebook lo share chesevadu. Ila oka six months tirigesariki Ravi blog ki visitors thousands lo vachevaru. Ravi nidanamga tana blog lo ads dwara money earn cheyatam modalupettadu.
Ala tana graduation complete ayyesariki Ravi blogging lo baga money earn chestoo undevadu. Tanu earn chesina money tho Ravi valla father help tho oka chinna restaurent ni start chesim danini tana blog dwara promote chesevadu.
 Appatiki blog dwara follow avutooo undevaru, tanu chese dishes swayamga taste cheyataniki restaurant ki vachevaru. Ala Ravi tana restaurant ni nidanamga develop cheyadam modalupettadu. Alage blogging ni kooda continue chestunnadu.
Ee success story cheppataniki karanam, Blogging yeppudu start cheyali? Yeverevaru cheyavachu? ane prashnalaki samadhanamga cheppabadindi. Ide kadu, Ilanti yenno success stories rayataniki blogging rangam upayogapadutundi.

Blogging Yeppudu Start Cheyali?

     Blogging Ippudu ayina start cheyavachu, yeppudu ayina start cheyavachu. Blogging start cheyataniki particular age undali, phalana roju manchidi ani yemi undavu.
Blogging cheyali ane aalochana vachina ventane modalupettavachu.  Leda manchi aalochana gurinchi research chesi modalupettavachu. Blogging cheyali ane aalochana, kontha dabbu samakoorchukuni simple ga blogging cheyavachu.

Who can Start Blogging?

Aada, maga, chinna, pedda, students, employees, business man ila yevaraina blogging cheyavachu. Manam paina cheppukunna Ravi oka student.
Mana Desham lo mottamodata blogging modalupettina Amit Agarwal garu oka I.T. Employee. Amthab Bathan Garu kooda blogging chestaru ani miku telusa? idi http://srbachchan.tumblr.comayana blog link.
Anthendukoo manam andaram prati roju blogging chestunnam. Nammadam leda? facebook lo miru postulu, photo lu post chestunnaru kada! Idi kooda blogging ye. Twitter lo tweets chestunnara? Twitter micro-blogging platform ani miku telusa? Kakapothe ippudu miru valla website / apps use chestunnaru. Preffessional blogging lo mire oka website create chesi blogging chestaru, anthe difference!
Blogging dwara manalni oka brand ga tirchididdukovachu. Mana laga aalochinche oka community ni pondavachu. Yemo blogging oka business ni kooda yerpatu cheyavachu.
Kabatti blogging cheyatam valana manaki aneka upayogalu unnayi. Ayithe manam oka mentar ni toduga unchukunte vallu manaki yedurayye samasyalaki parishkara margalani soochistaru. Viluva ayina mana time ni  kooda save chestaru.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *