always vj logo
What is Digital Marketing in telugu

What is Digital Marketing in Telugu ?

Spread the love

What is Digital Marketing in Telugu | డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి

What is Digital Marketing in Telugu ? డిజిటల్ మార్కెటింగ్… ఇప్పుడు ప్రతి రంగాన్ని తనతో కలుపుకుపోతున్న రంగం. డిజిటల్ మార్కెటింగ్ వల్ల మన దేశంలో సుమారుగా 20 లక్షల ఉద్యోగాలు 2020 కల్ల వస్తాయని ఒక అంచనా. మరి అంతగా ఈ రంగంలో ఏం ఉంది?

What is Digital Marketing in telugu

డిజిటల్ మార్కెటింగ్ ద్వారా బిజినెస్ రంగంలో మార్కెటింగ్ రూపు రేఖలు కూడా మారిపోతున్నాయి. అసలు ట్రెడిషనల్ మార్కెటింగ్ కి, డిజిటల్ మార్కెటింగ్ ని తేడా ఏంటి? ఉదాహరణకి ఒక్కప్పుడు మార్కెటింగ్ అంటే ఇంటింటికి వెళ్లి మన ప్రోడక్ట్ ని ప్రమోట్ చేసేవాళ్ళం. తరువాత పాంఫ్లెట్స్, పోస్టర్స్ వేయిన్చేవాళ్ళు. క్రమంగా రేడియో ads వచ్చాయి.

తరువాత టీవీ రేడియో స్తానాన్ని ఆక్రమించింది. ఇక్కడ అన్నింటి ప్రయోజనం ఒక్కటే. ఒక product కస్టమర్ కి చేరటం, కస్టమర్ కి మన ప్రోడక్ట్ గురించి తెలియటం. అయితే ఇవి ఎంత మందికి చేరాయి, ఎంతమంది వీటిని చూసారు అనేది తెలిసేది కాదు.

బ్లాగ్గింగ్ అంటే ఏమిటి? What is Blogging in Telugu?

ఇప్పుడు కాలం మారింది. అబ్దుల్ కలాంగారు చెప్పినట్టు టెక్నాలజీ అంటే కేవలం ఫ్యాక్టరీలలోనో, లేదా కెమికల్స్ కలపడం వంటి వాటిల్లో మాత్రమే పరిమితం కాకూడదు అని. ఇప్పుడు సరిగ్గా టెక్నాలజీ వ్యాపార పోకడలనే మార్చేస్తుంది.

మన దేశంలో ఇంటర్నెట్ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చిన తరువాత దేశ ముఖ చిత్రం మారింది. ఒక్కొకటిగా అన్ని సేవలు డిజిటల్ అయ్యాయి. అలాగే స్మార్ట్ ఫోన్స్ వాడె వినియోగదారులు కూడా పెరిగారు.

సరిగ్గా ఈ మార్పులన్నీ కలిపి డిజిటల్ మార్కెటింగ్ కి అదనపు బలాన్ని సమకూర్చాయి. డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక మహా సముద్రం. ఇందులో అనేక రకాల మాడ్యుల్స్ ఉన్నాయి. అయితే అన్ని అందరికి ఉపయోగపడవు. కానీ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మనం ఒక advertisement కనుక ఇస్తే అది ఎంత మందికి రీచ్ అయ్యింది, ఎంతమంది దానికి కనెక్ట్ అయ్యారు, ఏ ఏ వయసుల వాళ్లు చూసారు, ఆడవాళ్ళు చూసారా? మగవాళ్ళు చూసారా?

ఇలాంటి ఎన్నో వివరాలని, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మనం విశ్లేషించవచ్చు. మనం ఈ విశ్లేషణ ద్వారా తరువాత మళ్ళి ప్లానింగ్ చేసుకోవచ్చు. ఇప్పటికి టీవీ advertisement రంగం ఆదాయాన్ని కొల్లగొడుతున్న డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కి కూడా మంచి డిమాండ్ ఉంది. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, ఢిల్లీ వంటి నగరాల్లో ఈ కోర్స్ యాభై వేల రూపాయల నుండి లక్ష యాభై వేల వరకూ ఛార్జ్ చేస్తున్నారు.

How to Write Blog Posts ? బ్లాగ్ పోస్ట్స్ ఎలా రాయాలి?

పట్టణాలలో ఇన్స్టిట్యూట్  రేంజ్ ని బట్టి ఇరవై ఐదు వేల వరకూ ఛార్జ్ చేస్తూ ఉన్నారు. డిజిటల్ మార్కేటర్స్ కి కూడా అదే విధంగా డిమాండ్ ఉంది. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ పూర్తీ చేసిన వెంటనే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలు మంచి మంచి ప్యాకేజ్స్ ఆఫర్ చేస్తున్నాయి.

అంతటి ఆర్ధిక స్తోమత లేని వాళ్ళ కోసం కొన్ని డిజిటల్ మార్కెటింగ్ బ్లాగ్ లు ఫ్రీ కోర్సులు (బేసిక్) అందిస్తున్నాయి. తెలుగు లో మీకు డిజిటల్ మార్కెటింగ్ పై అవగాహనా కల్పించటానికి ఈ బ్లాగ్  ని డిజైన్ చేయడం జరిగింది.

ఈ సిరీస్ లో మేము దాదాపుగా డిజిటల్ మార్కెటింగ్ లో ప్రతీ టాపిక్ గురించి విహంగ వీక్షణం (overview) గా చెప్పడం జరుగుతుంది. ప్రతీ టాపిక్ గురించి విడివిడిగా కోర్స్ లను తరువాత లాంచ్ చేయడం జరుగుతుంది.  మీరు మా బ్లాగ్స్, కోర్సెస్  ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయటం ద్వారా మాకు సపోర్ట్ చేసిన వారవుతారు. మళ్ళి మరొక పోస్ట్ తో మీ ముందుకు వస్తాం.

What is Digital Marketing in Telugu | డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి?

Digital Marketing …. Ippudu prati ranganni tanatho kalupukupothunna rangam. Digital Marketing rangamlo mana country lo approximate ga 20 lakhs jobs 2020 kalla vastayani oka anchana. Mari anthaga ee rangamlo yem undi?

What is Digital Marketing in Telugu

Digital Marketing dwara business rangam lo marketing roopu rekhalu maripotunnayi. Asalu Traditional Marketing ki, Digital Marketing ki teda yenti? For Example okkappudu marketing ante prati intiki velli mana product ni promote chese vallam. Taruvata Pamphlets, posters print cheyinche vallu.

Kramamga radio ads vachayi. Aa taruvata TV Ads radio place ni occupy chesayi. Ikkada anninti prayojanam okkate. Oka product customer ki cheratam, customer ki mana product gurinchi teliyatam. Ayithe ici yentha mandiki cherayi, yentha mandi veetini chusaru anedi telisedi kadu.

Ippudu Kalam mariondi, Abdul Kalam garu cheppinattu technology ante kevalam factories lone, leda chemicals kalapadam vanti vatillo matrame parimitham kakoodadu ani. Ippudu sarigga technology business trends ne marchi vestundi. Mana India lo internet rangam lo tremendous changes vachina taruvata mana desha mukha chitram marindi.

Okkokatiga anni services digital ayayi. Alage smart phones use chese vallu kooda perigaru.  Sarigga ee marpulanni kalipi digital marketing ki additional strength avutunnayi. Digital Marketing oka maha samudram. Indulo aneka rakala modules unnayi. Ayithe anni andariki unayogapadavu.

Kani digital marketing dwara manam oka advertisement kanuka iste adi yentha mandiki reach ayyindi? yentha mandi daniki connect ayyaru? yeye ages vallu chusaru? ladies chusara? gents chusara? Illanti yenno details digital marketing dwara manam analyze cheyavachu. Manam ee analysis dwara taruvata malli planning chesukovachu.

Ippatiki TV Advertisement field income kollagudutunna digital marketing course ki kooda manchi dimand undi. Hyderabad, Chennai, Bangalore, Delhi vandi cities lo ee course fifty thousand nundi one lakh fifty thousand varakoo charge chestunnaru. Towns lo institutes range ni batti twenty five thousand varakoo charge chestunnaru.

Digital Marketers ki kooda ade vidhamga demand undi. Digital marketing course complete chesina ventane digital marketing agencies manchi packages offer chestunnayi. Antha amount effort cheyaleni valla kosam konni digital marketing blogs free course (basics) provide chestunnayi.

Telugu lo miku digital marketing pai oka idea kalpionchataniki ee blog design cheyatam jarigindi. Ee series lo dadapuga digital marketing lo prati topic gurinchi Ariel view ga cheppadam jarugutundi.

Prati topic gurinchi vidividiga courses launch cheyadam jarugutundi. Miru ma blogs, courses ni mi friends ki share cheyatam dwara maku support chesina varu avutaru. Malli maro post tho mi munduku malli vastam.

 

5 thoughts on “What is Digital Marketing in Telugu ?”

  1. very nice blogs!!! i have to learning for lot of information for this sites…Sharing for wonderful information. Thanks for sharing this valuable information to our vision. You have posted a trust worthy blog keep sharing

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *