2020 లో బెస్ట్ డొమైన్ రిజిస్ట్రార్స్ తెలుగులో
సాదారణంగా మనం ఒక ప్రోడక్ట్ కానీ, సర్వీస్ తీసుకోవాలి అంటే అనేక రకాలుగా ఆలోచిస్తాము. ఆ ప్రోడక్ట్ / సర్వీస్ ప్రైస్ ఎలా ఉంది, ఆ ప్రోడక్ట్ / సర్వీస్ ఎలా పని చేస్తుంది, మనకి ఎలా ఉపయోగపడుతుంది అని ఇలా మన మైండ్ లో అనేక రకాల డౌట్స్ దొర్లుతూ ఉంటాయి.
ఇంటర్నెట్ అందుబాటులోకి రాక ముందు మనం ఆ ప్రోడక్ట్ / సర్వీస్ కొన్న వారినో, లేదా దాని గురించి తెలిసిన వారినో కనుక్కొని తీసుకోవాలా వద్ద అని ఆలోచించే వాళ్ళం. అవునా?
అదే ఇంటర్నెట్ బాగా అందుబాటులోకి వచ్చిన తరువాత ఏ ప్రోడక్ట్ ఎలా ఉంది, ఏ సర్వీస్ ఎలా ఉంది అని మనం తెలుసుకుని ఒక అభిప్రాయానికి వస్తున్నాం.
అదే విధంగా మీరు ఒక వెబ్ సైట్ క్రియేట్ చేయాలన్న, ఒక బ్లాగ్ స్టార్ట్ చేయాలన్న, ఒక ఆన్లైన్ స్టోర్ క్రియేట్ చేయలన్నా మీకు ఒక డొమైన్ కావాలి.
అటువంటి డొమైన్ గురించి చాలా చాలా తక్కువ మందికి తెలుసు. మరి మీ బిజినెస్ ని ఆన్లైన్ చేయటానికి అత్యంత ప్రధానమైన డొమైన్ గురించి, డొమైన్ రిజిస్ట్రేషన్ కంపెనీల గురించి తెలుగులో ఈ రోజు మనం ఈ పోస్ట్ ద్వారా తెల్సుకుందాం.
డొమైన్ అంటే ఏంటి?
మనకి ఏదైనా ఒక పార్సెల్ ఇంటికి రావాలి అంటే అడ్రస్ ఎంత అవసరమో అదే విధంగా ఇంటర్నెట్ లో మన కస్టమర్స్ లేదా రీడర్స్ మనల్ని చేరుకోవటానికి ఒక అడ్రస్ కావాలి. డొమైన్ అంటే మన వెబ్ సైట్ లేదా బ్లాగ్ లేదా ఆన్లైన్ స్టోర్ ని మన కస్టమర్స్ ఆన్లైన్ లో రీచ్ అవ్వాలి అవ్వటానికి కావాల్సిన ఒక అడ్రస్.
డొమైన్ ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?
ఒక డొమైన్ ని మనం డొమైన్ రిజిస్ట్రార్ ల నుండి రిజిస్టర్ చేసుకుంటాం. GoDaddy మనకి తెలుసు కదా! టీవీలో ధోని కూడా ప్రమోట్ చేస్తుంటారు. GoDaddy, Namecheap, Bigrock వంటి అనేక డొమైన్ రిజిస్టర్ లు ఉన్నాయి.
అంతే కాకుండా మనకి డొమైన్ తో పాటుగా హోస్టింగ్ కూడా కావాలి, కొన్ని హోస్టింగ్ ప్రొవైడర్స్ కూడా డొమైన్ రిజిస్ట్రేషన్ సర్వీసులు అందిస్తున్నాయి.
ఈ డొమైన్స్ ని ఒకసారి రిజిస్టర్ చేసుకున్న తరువాత ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలి. ఇవి ఆయా డొమైన్ రిజిస్టర్ ల ని బట్టి రెన్యువల్ ప్రైస్ మారుతుంది.
డొమైన్ ఎక్స్టెన్షన్స్:
డొమైన్స్ లో మనకి అనేక రకాల డొమైన్ ఎక్స్టెన్షన్స్ అందుబాటులో ఉన్నాయి. .com, .in, .net, .org, .us, .uk, .io, .online ఇలా రకరకాల ఎక్స్టెన్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని మన అవసరాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటాం.
.com డొమైన్ మనం బిజినెస్ పర్పుస్ ఉపయోగిస్తాము. అదే విధంగా మనం కంట్రీ వైజ్ గా టార్గెట్ చేయాలి అనుకుంటే .in, .us, .uk. ఇలాంటి ఎక్స్టెన్షన్లు తీసుకుంటాం. ఏదైనా ఒక ఆర్గనైజేషన్ కోసం అయితే .org తీసుకుంటాం. నెట్వర్క్ రిలేటెడ్ కంపెనీస్ కోసం అయితే .net ఎక్స్టెన్షన్స్ తీసుకోవాలి. ఇవి అన్ని కూడా టాప్ లెవల్ డొమైన్స్. వీటికి SEO లో మంచి ప్రేఫెరేన్సు ఉంటుంది.
టాప్ డొమైన్ రిజిస్ట్రార్స్
ఈ పోస్ట్ లో మనం టాప్ డొమైన్ రిజిస్ట్రార్స్ గురించి తెలుసుకుందాం. ఈ బ్లాగ్ పోస్ట్ లో ఇప్పుడు 7 డొమైన్ రిజిస్ట్రేషన్ సర్వీస్‌ల గురించి తెలుసుకుందాం.
Top Domain Registrars in Telugu
Top Domain Registrars in Telugu | GoDaddy

ముందుగా డొమైన్స్ అంటే గుర్తుకు వచ్చేది GoDaddy. వీళ్ళు అంతగా పబ్లిసిటీ చేస్తుంటారు. ఈ GoDaddy కి M.S.Dhoni బ్రాండ్ అంబాసిడర్.
మనం టీవీలోను, యూట్యూబ్ లోను విరి యాడ్స్ చూస్తుంటాము. చిన్న చిన్న బిజినెస్‌లని ఆన్లైన్ చేయటం కోసం అనేక రకాల ఆఫర్స్ వీళ్ళు ఇవ్వటం చూస్తూ ఉంటాం.
Godaddy డొమైన్స్ ఫస్ట్ ఇయర్ రిజిస్ట్రేషన్ ప్రైస్ చాలా చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఈ ప్రైస్ కి తీసుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా 2 ఇయర్స్ ప్యాకేజ్ తీసుకోవాలి. అంటే ఒక సంవత్సరం రిజిస్ట్రేషన్, మరో సంవత్సరం రెన్యువల్.
అలా కాకుండా డొమైన్ ఒక్క సంవత్సరానికే తీసుకోవాలి అంటే మీకు వాళ్ళు చెప్పిన ప్రైస్ కంటే ఎక్కువగానే పడుతుంది.
GoDadday లో ఒక డొమైన్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అని క్రింది వీడియోలో డీటెయిల్ గా ఉంది. ఆ వీడియో చుడండి.
GoDaddy డొమైన్ రిజిస్టర్ చేసుకోవటానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Top Domain Registrars in Telugu | Namecheap

GoDaddy కన్నా బాగా పాపులర్ అయిన డొమైన్ రిజిస్ట్రార్ Namecheap, కానీ మనకి లోకల్ లో వీళ్ళు పబ్లిసిటీ చేయరు. కాబట్టి మనకి GoDaddy నే బాగా తెలుసు. Namecheap డొమైన్ రిజిస్ట్రేషన్స్ కి బాగా పాపులర్. అంతే కాకుండా తక్కువ ప్రైస్ లో మంచి క్వాలిటీ సపోర్ట్ విల్లు ప్రోవైడ్ చేస్తున్నారు.
మీరు బిజినెస్ పర్పస్ డొమైన్ రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటే మీకు namecheap పర్ఫెక్ట్. ఎందుకంటె డొమైన్ రిజిస్ట్రేషన్ నుండి మన సైట్ లైవ్ చేసుకోవటం వరకూ అన్ని చాలా చాలా ఈజీగా ఉంటాయి.
Namecheap లో మనకి ఫ్రీగా Whois గార్డ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. దీనిని ఏ డొమైన్ రిజిస్ట్రార్ కూడా ఫ్రీ గా ఇవ్వరు, దాదాపుగా 60 వరకూ ప్రతి నెలకి ఛార్జ్ చేస్తారు. దీని వలన మనకి మన బిజీ టైం లో అనవసరమైన ఫోన్ కాల్స్ రాకుండా ఉంటాయి.
Namecheap లో ఒక డొమైన్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అని క్రింది వీడియోలో డీటెయిల్ గా ఉంది. ఆ వీడియో చుడండి.
Namecheap డొమైన్ రిజిస్టర్ చేసుకోవటానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Top Domain Registrars in Telugu | BigRock

Godaddy, Namecheap లా కన్నా ముందు నుండి నేను ఈ BigRock ని యూస్ చేస్తున్నాను. BigRock కూడా ఒక మంచి సర్వీస్ ప్రొవైడర్. అందులోనూ ఇది కంప్లీట్ ఇండియన్ కంపెనీ.
GoDaddy లో లాగేనే ఇందులో కూడా మనకి 2 ఇయర్స్ కి కలిపి డొమైన్ తీసుకుంటే మంచి ప్రైస్ కి మనకి లభిస్తుంది. అయితే BigRock లో మనకి యూసర్ ఇంటర్ఫేస్, డాష్‌బోర్డు చాలా బాగుంటాయి.
అంతే కాకుండా మనకి ఒక ఈమెయిలు అడ్రస్ కూడా వీళ్ళు డొమైన్ తో పాటుగా ఫ్రీగా ఇస్తారు.
సాదారణంగా GoDaddy లో ఈమెయిలు ఐడి కి కూడా అమౌంట్ ఛార్జ్ చేస్తారు.
ప్రో టాప్: మీరు కనుక వెబ్ హోస్టింగ్ తీసుకుంటే మీరు వెబ్ హోస్టింగ్ లో ఈమెయిలు ఐడిస్ క్రియేట్ చేసుకోవచ్చు.
BigRock డొమైన్ రిజిస్టర్ చేసుకోవటానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Top Domain Registrars in Telugu | SiteGround

సాధారణంగా SiteGround ఒక వెబ్ హోస్టింగ్ కంపెనీ. కానీ వీళ్ళు వాళ్ళ వెబ్ హోస్టింగ్ ప్యాకేజ్స్ తో పాటుగా ఫ్రీ డొమైన్ ఇస్తారు. కాబట్టి SiteGround కూడా ఒక మంచి డొమైన్ రిజిస్ట్రార్. SiteGround ప్రధానంగా వెబ్ హోస్టింగ్ సర్వీస్ ప్రొవైడర్ కాబట్టి మరిన్ని వివరాలు మీరు హోస్టింగ్ బ్లాగ్ పోస్ట్ లో తెలుసుకోవచ్చు.
Siteground డొమైన్ రిజిస్టర్ చేసుకోవటానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Top Domain Registrars in Telugu | BlueHost

BlueHost కూడా ఒక వెబ్ హోస్టింగ్ సర్వీస్ ప్రొవైడర్. SiteGround లాగే వీళ్ళు కూడా హోస్టింగ్ ప్యాకేజ్ తో పాటుగా డొమైన్ కూడా ఫ్రీగా ప్రోవైడ్ చేస్తున్నారు. ఒకప్పుడు BlueHost మంచి సర్వీస్ ప్రొవైడర్.
కానీ ఇప్పుడు ఇంకా మంచి సర్వీసెస్ వచ్చేసరికి BlueHost కి బాగా కాంపిటిషన్ పెరిగిపోయింది.
BlueHost డొమైన్ రిజిస్టర్ చేసుకోవటానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Top Domain Registrars in Telugu | Hostinger

Hostinger కూడా ప్రధానంగా ఒక హోస్టింగ్ ప్రొవైడర్. వీళ్ళు తమ దగ్గర హోస్టింగ్ ప్యాకేజ్స్(సెలెక్టెడ్ ప్యాకేజ్) తీసుకున్న వారికీ ఫ్రీగా డొమైన్ అందిస్తారు.
అంతే కాకుండా విడిగా కూడా మనకి GoDaddy, BigRock, Namecheap లాగా డొమైన్స్ కూడా రిజిస్ట్రేషన్స్ చేస్తారు. వీరి సపోర్ట్ కూడా బాగుంటుంది.
Hostinger డొమైన్ రిజిస్టర్ చేసుకోవటానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Top Domain Registrars in Telugu | Hostgator

Hostgator దాదాపుగా hostinger లా ఉంటుంది. కానీ Hostgator ఇంకా పాపులర్ కంపెనీ. వీళ్ళు కూడా డొమైన్స్, హోస్టింగ్, ఇలా రకరకాల సర్వీసెస్ అందిస్తున్నారు. Hostinger లో లాగానే వీళ్ళు కూడా కొన్ని ప్రత్యక హోస్టింగ్ ప్యాకేజ్ లతో ఫ్రీ డొమైన్స్ ఇస్తారు. విడిగా కూడా మనకి కావాల్సిన డొమైన్స్ మనం తీసుకోవచ్చు.
Hostgator డొమైన్ రిజిస్టర్ చేసుకోవటానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి అండి టాప్ డొమైన్ రిజిస్ట్రార్స్. ఇవే కాదు డొమైన్ రిజిస్ట్రేషన్ కంపెనీస్ చాలా ఉన్నాయి. ఇంకా కొన్ని డొమైన్ రిజిస్ట్రేషన్ కంపెనీస్ ని మళ్ళి నేను అప్డేట్ చేస్తాను. అదే విధంగా ప్రతి సర్వీస్ ప్రొవైడర్ గురించి కూడా డీటెయిల్ బ్లాగ్ పోస్ట్ కూడా రాస్తాను.
వీటిల్లో మీరు ఏ డొమైన్ సర్వీస్ యూస్ చేస్తున్నారు? నేను చెప్పిన వాటిల్లో బెస్ట్ ఏది అని మీరు అనుకుంటున్నారు? నాకు తెలుసుకోవాలని ఉంది, కామెంట్స్ లో చెప్పండి.
మీకు ఈ పోస్ట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కి ఫేస్బుక్ గ్రూప్స్ లో, WhatsApp lo షేర్ చేయండి, ఎందుకంటె Sharing is Caring కదా! మీ నుండి మాకు కావాల్సిన ప్రోత్సాహం అదే!
- Website Design Formula for Small Businesses - October 27, 2021
- Digital Marketers Meetup in Hyderabad in 2021 - September 1, 2021
- How to Write Viral Blog Posts in Telugu - August 12, 2021