Small Businesses Owner’s Social Media Myths in Telugu
ఒక బిజినెస్ ఓనర్ గా, మీ సోషల్ మీడియా ఎఫర్ట్స్ ద్వారా పాజిటివ్ రిజల్ట్స్ రావాలని అనుకోవడంలో తప్పు లేదు. అలా మీరు మీ కాంపెయిన్స్ నుండి పాజిటివ్ రిజల్ట్స్ పొందాలి అంటే మీరు సోషల్ మీడియా మార్కెటింగ్ ని సరైన కళ్ళజోడు పెట్టుకొని చూడాలి.
ఈ మాట నేను ఎందుకు అంటున్నాను అంటే సోషల్ మీడియా మార్కెటింగ్ గురించి ఉన్న మిత్స్ లేదా అపోహలు / అవాస్తవాల గురించి తెలుసుకోవాలి.
వీటిని మీరు అధిగమిస్తే మీ బిజినెస్ ని సోషల్ మీడియా ద్వారా ఇంక్రీస్ చేసుకోవచ్చు. సోషల్ మీడియా గురించినటు వంటి సోషల్ మీడియా మిత్స్ గురించి ఈ బ్లాగ్ లో మనం తెలుసుకుందాం.
#1 Social Media Myths in Telugu | సోషల్ మీడియా రాత్రికి రాత్రి మీ బ్రాండ్ ని పాపులర్ చేస్తుంది
చాలా మంది సోషల్ మీడియా మార్కేటర్స్ వాళ్ళు సోషల్ మీడియా లో షేర్ చేసిన కంటెంట్ వైరల్ కావాలి అని, ఎక్కువ లైక్స్, షేర్స్ రావాలి అని ఫోకస్ చేస్తూ ఉంటారు. వాళ్ళ లక్ష్యం, రాత్రికి రాతి పాపులర్ అవ్వాలి?
చాలా తక్కువ టైం లో వాళ్ళ బ్రాండ్ గురించి చాలా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. ఖచ్చితంగా ఇది ఒక మిస్టేక్.
సోషల్ మీడియా ద్వారా రాత్రికి రాత్రి పాపులర్ అయిన వాళ్ళు ఉన్నారు. 2019 లో 2 సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ అయ్యారు. వాళ్ళలో ఒకరు టాలీవుడ్ సింగర్ బేబీ. ఈవిడ సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ అయ్యింది.
తనకున్న ప్రాబ్లం కూడా సోషల్ మీడియా ద్వారా సాల్వ్ చేసుకుంది. ఇక రెండవ వ్యక్తీ రాను మొండాల్. ఈవిడ ఒక రాత్రి చేసిన ప్రయాణం ఈవిడ జీవితం మార్చింది.
ఒక రోజు రాత్రి ట్రైన్ లో వెళ్తూ లతా మంగేష్కర్ గారి ఒక పాట పాడుతూ ఉండగా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు.
ఈవిడ టాలెంట్ కి చాలా మంది ఇంప్రెస్స్ అయ్యి ఆ వీడియో ని వైరల్ చేసారు. ఆ వీడియోతో బాలీవుడ్ స్టార్ హిమేష్ రేష్మియా ఆవిడ గురించి తెలుసుకుని తను మ్యూజిక్ డైరెక్ట్ చేస్తున్న మూవీ లో 2 పాటలు పడే అవకాశం ఇచ్చారు.
ఈ విధంగా అవ్వాలి అని అందరు అనుకుంటారు. నిజానికి ఇలాంటివి బిజినెస్ ఫీల్డ్‌లో జరగడం అయ్యే పని కాదు.
సోషల్ మీడియా బ్రాండింగ్ ద్వారా కొన్ని వారాల్లో మీకు వందల్లో, వేలల్లో ఫాలోయర్స్ రారు. ఒక వేళ అలా వచ్చిన అది మీకు ఉపయోగపడదు.
మీరు రాంగ్ పీపుల్ తో ఇంటరాక్ట్ అవుతున్నారు అని అర్థం. ఇది మీ బ్రాండింగ్ పై ప్రభావం చూపించే అవకాశం ఉంది.
#2 Social Media Myths in Telugu | ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫారంలో ఉండటం ముఖ్యం
సోషల్ మీడియా బ్రాండింగ్ సక్సెస్ కావాలి అంటే మరు ఫోకస్ చేయాలి. మీరు రాంగ్ డైరెక్షణ్ లో ఫోకస్ చేసినట్లు అయితే తప్పుడు సంకేతాలు పంపిన వారు అవుతారు. ఒకవేళ మీరు స్పెండ్ చేయటానికి టైం లేకపోతే హైర్ చేసుకోండి.
మీరు ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫారంలో ఉండాలి అని అనుకోవడం కూడా తప్పే. ఎందుకంటె ప్రతీ ప్లాట్ఫారంస్ యునిక్ యూసర్స్ ఉంటారు.
ఉదాహరణకి యూట్యూబ్ లో వీడియోస్, పింట్రెస్ట్ లో ఇమేజ్స్, ఫేస్బుక్ లో ఇమేజ్స్, వీడియోస్ whatsapp మెసేజెస్ కోసం యూస్ చేస్తూ ఉంటారు.
మీరు సోషల్ మీడియా ద్వారా మీ బిజినెస్ ని ఇంక్రీస్ చేయాలి అనుకుంటే మీరు మనీ తో పాటుగా టైం కూడా స్పెండ్ చేయాలి.
మీ బిజినెస్ రిలేటెడ్ గా ఉండే సోషల్ మీడియా ప్లాట్ఫారంస్ ఏంటో రీసెర్చ్ చేయాలి. కాబట్టి మీరు ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫారం లో ఉండాల్సిన అవసరం లేదు.
#3 Social Media Myths in Telugu | సోషల్ మీడియా బ్రాండింగ్ కోసం వేలల్లో ఫాలోయర్స్ కావాలి
సోషల్ మీడియా లో ఎక్కువ మంది ఫాలోయర్స్ ఉండటం వల్ల ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది. మీకు సోషల్ మీడియా బ్రాండింగ్ లో ఫాలోయర్స్ అవసరమా? సీరియస్లీ కాదు.
మీ టార్గెట్ మీ ప్రొడక్ట్స్ / సర్వీసెస్ పై ఇంట్రెస్ట్ ఉన్న ఫాలోయర్స్ తో ఇంటరాక్ట్ అవ్వగలిగితే చాలు. ఆటోమేటిక్ గా మీ బిజినెస్ గ్రో అవుతుంది.
మీ బ్రాండ్ ఫాలోయర్స్ కౌంట్ పైన కాకుండా మీతో ఇంటరాక్ట్ అయ్యి మిమ్మల్ని నమ్మే ఫాలోయర్స్ ని బిల్డ్ చేసుకోవాలి. ఉదాహరణకి మీకు రెండు ఫేస్బుక్ పేజెస్ ఉన్నాయి అనుకుందాం.
A అనే పేజి లో మీకు రెండు లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. B అనే ఫేస్బుక్ పేజి లో రెండు వేల మంది ఫాలోయర్స్ ఉన్నారు.
మీరు ఒక ప్రొడక్ట్ గురించి రెండు పేజెస్ లో పోస్ట్ చేసారు. A పేజి నుండి మీకు ఒక 20 సేల్స్ జరిగాయి అనుకుందాం. B పేజి నుండి ఒక 10 సేల్స్ జరిగాయి అనుకుందాం. మీకు మంచి ఫాలోయర్స్ ఏ పేజి లో ఉన్నారో మీకు అర్థం అయ్యిందా?
నిజానికి మీకు B అనే పేజిలోనే మంచి ఫాలోయర్స్ ఉన్నారు. కాబట్టి మీకు ఫాలోయర్స్ కౌంట్ కన్నా ఆక్టివ్, ఇంటరెస్ట్ ఉన్న ఫాలోయర్స్ ముఖ్యం.
మీరు అలాంటి క్వాలిటీ ఫాలోయర్స్ ని పొందాలి అంటే మీరు వాళ్ళకి వేల్యూబుల్ కంటెంట్ ని ప్రోవైడ్ చేయాలి.
మీ కంటెంట్ నిజంగా వాళ్ళకి యూస్ అయితే వాళ్ళు మిమ్మల్ని లాంగ్ రన్ లో ఫాలో అవుతారు. కాబట్టి సోషల్ మీడియా బ్రాండింగ్ కోసం మీకు వేలల్లో ఫాలోయర్స్ ఉండాల్సిన అవసరం లేదు.
#4 Social Media Myths in Telugu | సోషల్ మీడియా బ్రాండింగ్ ఒక్కసారి సెట్ చేసి మర్చిపోవచ్చు
మీరు సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆక్టివ్ గా ఉండాలి. సోషల్ మీడియా ప్లాట్ఫారంస్ ఎప్పటికప్పుడు అల్గోరిథంస్ అప్డేట్ చేస్తూ ఉంటాయి.
కాబట్టి మీరు కూడా అప్డేటెడ్ గా ఉండాలి. మిమ్మల్ని ఒక బ్రాండ్ గా చూడాలి అంటే మీరు రెగ్యులర్ గా మీ ఫాలోయర్స్ తో ఇంటరాక్ట్ అవ్వాలి.
వాళ్ళు మీ పోస్ట్స్ కి చేసే కామెంట్ కి రిప్లై ఇవ్వండి. దీని ద్వారా మీరు వాళ్ళకి వేల్యూ ఇస్తునందుకు వారు సంతోషిస్తారు.
మీ బ్రాండ్ పై మంచి అభిప్రాయం కలుగుతుంది. మీరు నిరంతరం మీ బ్రాండింగ్ ని నిలుపుకోవాలి.
మీరు ఈ మిత్స్ ని కనుక నమ్ముతున్నట్లయితే ఇప్పుడే ఈ నమ్మకాల నుండి బయట పడండి. మీకు ఇంకా ఏమన్నా అపోహలు ఉంటె కామెంట్ చేయండి. నేను సాల్వ్(క్లియర్) చేయటానికి ప్రయత్నిస్తాము.
- Website Design Formula for Small Businesses - October 27, 2021
- Digital Marketers Meetup in Hyderabad in 2021 - September 1, 2021
- How to Write Viral Blog Posts in Telugu - August 12, 2021