How to Research Keywords using UberSuggest in Telugu
ఒక బ్లాగ్ పోస్ట్ రాయాలన్న, ఒక యాడ్ ని టార్గెట్ చేయాలన్న కీవర్డ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అటువంటి కీవర్డ్స్ లో మనకి పనికివచ్చేది ఏది, మనకి ఏది అనవసరం అని మనం తెలుసుకోవటం ఎలా?
కీవర్డ్స్ లో ఏది బెస్ట్, ఏ కీవర్డ్ ని మనం ర్యాంక్ చేయటానికి ఎంత టైం పడుతుంది, అసలు ర్యాంక్ అవుతుందా లేదా అనేవి మనం కీవర్డ్స్ రీసెర్చ్ చేయగలిగితే అర్థం అవుతుంది.
కీవర్డ్స్ అంటే ఏంటి?
సెర్చ్ ఇంజిన్స్ లో మనకి కావాల్సిన వాటి కోసం సెర్చ్ చేయటం కోసం ఉపయోగించే పదాలు ఏవైతో ఉన్నాయి వాటినే కీవర్డ్స్ అంటారు. వీటి గురించి మనం ఇంతకూ ముందు తెలుసుకున్నాం.
Click here to Know what is Keywords in Telugu
ఈ రోజు మనం కీవర్డ్స్ రీసెర్చ్ ఎలా చేయలి అని తెలుసుకుందాం.
కీవర్డ్స్ రీసెర్చ్ ఎలా చేయాలి?
కీవర్డ్స్ రీసెర్చ్ చేయటానికి మనకి అనేక రకాల టూల్స్ అందుబాటులో ఉన్నాయి. ahrefs, SEMRush, UberSuggest, Keywords Everywhere, Google Keyword Planner ఇలా ఇంకా ఎన్నో టూల్స్ ఉన్నాయి.
వీటిల్లో కొన్ని పెయిడ్ టూల్స్ ఉన్నాయి, కొన్ని ఫ్రీ టూల్స్ కూడా ఉన్నాయి. SEMRush, ahrefs లు బాగా పాపులర్ టూల్స్, కానీ చాలా చాలా ఎక్స్పెన్సివ్. బిగినర్స్ లేదా సింగల్ యూసర్స్ భరించలేరు. కానీ వీటివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
అదే విధంగా Ubersuggest కూడా మనం కొన్ని లిమిటేషన్స్ తో యూస్ చేసుకోవచ్చు. కానీ ubersuggest ప్రీమియం వెర్షన్ యూస్ చేయాలి అనుకుంటే మనం 10 డాలర్స్ పే చేస్తే చాలు. లేదు అనకుంటే ఫ్రీ వెర్షన్ సరిపోతుంది.
ఇక గూగుల్ కీవర్డ్ ప్లానర్ పూర్తిగా ఫ్రీ. ఇంకా ఎన్నో టూల్స్ ఉన్నాయి. వాటిని అవకాశం మేర ఉపయోగించుకోవచ్చు. ఇవి బాగా పాపులర్ టూల్స్.
UberSuggest ద్వారా కీవర్డ్స్ రీసెర్చ్ చేయటం ఎలా?
ఈ రోజు మనం Ubersuggest ని ఉపయోగించుకుని కీవర్డ్స్ ని ఎలా రీసెర్చ్ చేయాలో తెలుసుకుందాం.
Ubersuggest అంటే ఏంటి?
UberSuggest అనేది మొదట కేవలం కీవర్డ్స్ సజెషన్ టూల్ మాత్రమే. Ubersuggest.io గా ఉండేది. ఈ టూల్ బాగా పాపులర్. అయితే ఈ టూల్ ని ఆన్లైన్ మార్కెటింగ్ దిగ్గజం Neil Patel 1,20,000 డాలర్లతో 2017 లో Ubersuggest ని కొన్నారు.
ఆ తరువాత Ubersuggest లో అనేక మార్పులు చేసారు. SEMRush లా ఉండే విధంగా ఎన్నో మార్పులు చేసి ఫ్రీగా అందరికి యూస్ చేయమని చెప్పారు.
దాంతో Ubersuggest మరింత బాగా పాపులర్ అయ్యింది. ఆ తరువాత అంటే 2020లో UberSuggest ప్రీమియం వెర్షన్ ని లాంచ్ చేసారు. నెలకి 10 డాలర్లు తో SEMRush ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఈ టూల్ ని యూస్ చేసేలా ప్రోత్సహించారు.
UberSuggest లో ఏమేం చేయవచ్చు?
Ubersuggest లో మనం కీవర్డ్స్ రీసెర్చ్ తో పాటుగా కంటెంట్ ఐడియాస్, వెబ్ సైట్ ఆడిట్, బ్యాక్ లింక్స్, ఒక వెబ్ సైట్ ర్యాంక్ అయిన కీవర్డ్స్, వెబ్ సైట్ లో టాప్ పేజెస్ ని ఎనలైజ్ చేయవచ్చు. కంపిటిటర్ ఎనాలిసిస్ చేయటానికి బాగా హెల్ప్ అవుతుంది.
UberSuggest ద్వారా కీవర్డ్స్ రీసెర్చ్ చేయటం ఎలా?
గూగుల్ లో ubersuggest అని టైపు చేస్తే మనకి ఈ విధంగా రిజల్ట్స్ వస్తాయి.
ఇందులో నుండి మీరు మొదటి లింక్ పైన క్లిక్ చేస్తే Ubersuggest టూల్ పేజి లోకి వెళ్ళవచ్చు.
ఇందులో మనకి ఒక సెర్చ్ బార్ కనిపిస్తుంది కదా! ఇక్కడ మనం ఒక డొమైన్ నేమ్ కానీ లేదా మనం కీవర్డ్స్ రీసెర్చ్ చేయాలి అనుకుంటున్న కీవర్డ్ ని ఎంటర్ చేయాలి. ఆ పక్కనే మీకు కంట్రీ నేమ్ కనిపిస్తుంది కదా!
అక్కడ మీరు ఆ పర్టికులర్ కీవర్డ్ ని ఏ కంట్రీలో ర్యాంక్ చేయాలి అనుకుంటున్నారో ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను blogging అని ఇస్తున్నాను. కంట్రీ ఇండియా సెలెక్ట్ చేసుకుంటున్నాను.
సెర్చ్ బటన్ పై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా రిజల్ట్స్ వస్తాయి.
మీకు blogging అనే కీవర్డ్ కి సంబందించిన ఓవర్ వ్యూ ఇలా కనిపిస్తుంది.
Search Volume
ఇందులో మనకి మొదట కనిపించేది సెర్చ్ వాల్యూం. ఇది ఆ కీవర్డ్ ని గడచిన 12 నెలల్లో ఎంత మంది సెర్చ్ చేసారు అని చూపిస్తుంది. ఇక్కడ మనకి blogging అనే కీవర్డ్ పది లక్షల మంది సెర్చ్ చేసారు అని చూపిస్తుంది.
SEO Difficulty
SEO Difficulty అనేది ఈ కీవర్డ్ ని మనం సెర్చ్ ఇంజిన్ లో ర్యాంక్ చేయటానికి ఉన్న అవకాశం. 63 % కష్టం అని అర్థం.
Paid difficulty
ఈ Paid difficulty అనేది మనం ఈ కీవర్డ్ ని పైడ్ ప్రమోషన్ చేయాలి అనుకుంటే ర్యాంక్ అవ్వటానికి ఉన్న అవకాశం. 6% అని ఉంది అంటే ఈజీగా మనం ట్రై చేయవచ్చు అని అర్థం.
Cost Per Click (CPC)
ఈ కాస్ట్ పేర క్లిక్ అనేది మనం పైడ్ యాడ్స్ రన్ చేస్తే ఒక్కో క్లిక్ కి అయ్యే కాస్ట్ (సుమారుగా). ఒక్కో క్లిక్ కి 25.81 రూపాయలు అవుతుంది అని.
కొంచెం కిందకి కనుక స్క్రోల్ చేస్తే మీకు ఈ విధంగా ఒక గ్రాఫ్ కనిపిస్తుంది.
ఇందులో లాస్ట్ 12 నెలల్లో ఈ కీవర్డ్ గురించి జరిగిన సెర్చ్ లు నెల వారిగా ఉంటాయి. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, మనం రాయాలి అనుకున్న టాపిక్ గురించి రీడర్స్ సెర్చ్ చేస్తున్నారా? లేదా? అని. మనకి ఇందులో మొబైల్ లో ఎంత మంది సెర్చ్ చేస్తున్నారు? డెస్క్టాపులో ఎంత మంది సెర్చ్ చేస్తున్నారు అని కూడా తెలుస్తుంది.
ఆ గ్రాఫ్ క్రిందే మనం రెండు బార్ గ్రాఫ్ కనిపిస్తాయి.
పైన కనిపించే మొదటి బార్ లో ఉన్నది టోటల్ సెర్చ్స్ లో SEO ద్వారా అంటే ఆర్గానిక్ గా వచ్చిన క్లిక్స్ ఎన్ని? పెయిడ్ ప్రమోషన్స్ ద్వారా వచ్చిన క్లిక్స్ ఎన్ని? సెర్చ్ చేసి క్లిక్ చేయకుండా ఉన్న సెర్చ్స్ ఎన్ని అని తెలుసుకోవచ్చు.
తరువాత కనిపించే బార్ గ్రాఫ్ లో సెర్చ్ చేసే వారి ఏజ్ గ్రూప్ ఉంటాయి.
వీటి ప్రకారం ఏయే ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఈ కీవర్డ్ గురించి సెర్చ్ చేస్తున్నారు అని మనం తెలుసుకోవచ్చు. అందుకు తగ్గట్లుగా మనం మన కంటెంట్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఇప్పుడు ఆ బార్ గ్రాఫ్స్ కింద మనకి కావాల్సిన డీటెయిల్స్ ఉంటాయి.
Keyword Ideas అని కనిపిస్తుంది కదా! ఇది మనకి కీవర్డ్స్ రీసెర్చ్ లో చాలా చాలా ఇంపార్టెంట్.
ఇందులో మనకి కీవర్డ్, దాన్ని ట్రెండ్, సెర్చ్ వాల్యూం, CPC, పెయిడ్ డిఫికల్టి, SEO డిఫికల్టి వంటివి చూపిస్తుంది.
ఇందులో మొదటిది ఆ కీవర్డ్ యొక్క ట్రెండ్ ని తెలియచేస్తుంది. అక్కడ గ్రాఫ్ లో మనకి కనిపించే దాన్ని బట్టి ఆ కీవర్డ్ ట్రెండింగ్ లో ఉందా లేదా అని తెలుస్తుంది. ఆ స్పైక్స్ పైకి ఉంటె ఆ కీవర్డ్ ట్రెండింగ్ లో ఉన్నట్లు.
తరువాత ఉన్న వాల్యూం ఆ కీవర్డ్ యొక్క సెర్చ్ కౌంట్. ఎంత మంది సెర్చ్ చేస్తున్నారు అని.
CPC ఆ కీవర్డ్ యొక్క కాస్ట్ ఒక్కో క్లిక్ కి. ఇది మనకి పెయిడ్ ప్రమోషన్స్ చేయాలి అనుకుంటే హెల్ప్ అవుతుంది.
PD అనేది పెయిడ్ డిఫికల్టి. అంటే మనం సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ చేస్తే ర్యాంక్ అవ్వటానికి గల అవకాశం.
SD అనేది SEO డిఫికల్టి. అంటే ఈ కీవర్డ్ ని ఆర్గానిక్ గా మనం ర్యాంక్ చేయటానికి ఉన్న అవకాశం. ఇలా మనకి కొన్ని రిజల్ట్స్ మాత్రమే కనిపిస్తాయి.
అలాగే మనకి ఈ కనిపించేవి అన్ని కూడా కీవర్డ్ సజెషన్స్. పక్కనే మీకు మరిన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా ! Related, Questions, Prepositions, Comparisions అని ఇవి కూడా కీవర్డ్స్ రిలేటెడ్ టాపిక్స్. మీరు వాటి పైన క్లిక్ చేస్తే ఆ క్యాటగిరీలో ఉన్న కీవర్డ్స్, వాటి డీటెయిల్స్ మీకు కనిపిస్తాయి.
ఇక మీకు కింద కనుక చుస్తే View All Keyword Ideas అని ఒక బటన్ ఉంది కదా! దాని పిన క్లిక్ చేస్తే మీకు మరిన్ని కీవర్డ్స్ డీటెయిల్స్ వస్తాయి.
ఆ బటన్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి కనిపిస్తుంది.
మీకు లెఫ్ట్ సైడ్ కనిపించేవి కీవర్డ్ ఐడియాస్, రైట్ సైడ్ కనిపించేవి blogging అనే కీవర్డ్ కి ర్యాంక్ అయిన టాప్ 10 బ్లాగ్ పేజెస్.
మీకు ఇందులో మరిన్ని కీవర్డ్స్ ఐడియాస్ కనిపిస్తాయి. మీరు కనుక వీటిని కాపీ చేసుకోవాలి అనుకున్న, డౌన్లోడ్ చేసుకోవాలి అనుకున్న మీరు గూగుల్ ఎకౌంటు తో లాగిన్ అవ్వాలి.
ఇక్కడ సైన్ ఇన్ విత్ గూగుల్ బటన్ పై క్లిక్ చేస్తే మీకు లాగిన్ పేజి వస్తుంది. ఒక వేళ మీరు జిమెయిల్ లో లాగిన్ అయి ఉంటె ఇలా కనిపిస్తుంది.
మీ ఎకౌంటు సెలెక్ట్ చేసుకోండి.
మీకు మళ్ళి డాష్బోర్డు లో కి రిడైరెక్ట్ అవుతుంది.
మీకు ఆ పైన మీకు అవైల్బుల్ లో ఉన్న కీవర్డ్స్ నెంబర్ కూడా కనిపిస్తుంది.
ఇంకా కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే అప్గ్రేడ్ అయితేని మిగితావి కనిపిస్తాయి అని చూపిస్తుంది. మనకి అవసరం అనుకుంటే అప్గ్రేడ్ అవ్వండి, లేదు అనుకుంటే లైట్ తీసుకోండి.
ఇప్పుడు ఈ కీవర్డ్స్ లిస్టు ని నేను డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అందుకోసం నేను Export to CSV బటన్ పై క్లిక్ చేయండి.
అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది. మీకు ప్రీమియం వెర్షన్ కావాలి అనుకుంటే 7 డేస్ ఫ్రీగా యూస్ చేయవచ్చు అని చూపిస్తుంది. నో థాంక్స్ బటన్ పై క్లిక్ చేయండి. నేను ఫైల్ ని డౌన్లోడ్ చేస్తున్నాను.
ఇప్పుడు డౌన్లోడ్ అయిన ఫైల్ ని ఎక్సెల్ లో ఓపెన్ చేయండి.
ఇందులో మనకి కీవర్డ్, దాని సెర్చ్ వాల్యూం, CPC, పెయిడ్ డిఫికల్టి, సెర్చ్ డిఫికల్టి లాంటివి కనిపిస్తాయి. ఈ విధంగా మనం కీవర్డ్స్ రీసెర్చ్ చేయవచ్చు.
మీరు చేసిన కీవర్డ్స్ రీసెర్చ్ బేస్ చేసుకుని కంటెంట్ క్రియేట్ చేస్తే మీ బ్లాగ్ పోస్ట్స్ త్వరగా ర్యాంక్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. అవకాశం ఉన్నంత వరకూ లాంగ్ టైల్ కీవర్డ్స్ పైన ఫోకస్ చేయండి.
మీరు ఫ్రీగా కీవర్డ్స్ రీసెర్చ్ చేయాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ లో Ubersuggest తో కీవర్డ్స్ రీసెర్చ్ ఎలా చేయాలి అని ఒక వీడియో స్టెప్-బై-స్టెప్ చెప్పటం జరిగింది. ఆ వీడియో చుడండి, మీకు కీవర్డ్స్ రీసెర్చ్ గురించి ఒక ఐడియా వస్తుంది.
Click Here to Know Keywords Research In Telugu
ఈ విధంగా మీరు ఫ్రీగా కీవర్డ్స్ రీసెర్చ్ చేయవచ్చు.
మీకు ఈ కీవర్డ్స్ రీసెర్చ్ గురించి ఏమన్నా డౌట్స్ ఉంటె కామెంట్ చేయండి. మీరు కీవర్డ్స్ రీసెర్చ్ కోసం ఏ టూల్స్ యూస్ చేస్తున్నారు? కామెంట్స్ లో చెప్పండి,
ఈ బ్లాగ్ పోస్ట్ ని ఫేస్బుక్, WhatsApp లో షేర్ చేయండి. ఎందుకంటె Sharing is Caring కదా!
- Website Design Formula for Small Businesses - October 27, 2021
- Digital Marketers Meetup in Hyderabad in 2021 - September 1, 2021
- How to Write Viral Blog Posts in Telugu - August 12, 2021