always vj logo
How to find blog post ideas for blogging in Telugu

How to Find Blog Post Ideas for Blogging in Telugu

Spread the love

How to Find Blog Post Ideas in Telugu

ఒక బ్లాగ్ కోసం కంటెంట్ క్రియేట్ చేయటం అనేది సాధారణంగా కొంచెం కష్టమైన విషయం. ఒక బ్లాగర్ గా నాకు ఆ పెయిన్ తెలుసు. ఎంతో మంది బ్లాగర్స్ బ్లాగింగ్ వదిలివేయటానికి ఇది కూడా ఒక రీసన్. అయితే కొన్ని కొన్ని సార్లు మనం ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేయాలి అనేది చాలా స్పష్టంగా తెలుసు, కానీ మనం పట్టించుకోం అంతే. అదే ఇంగ్లీష్ లో చెప్పాలి అంటే A blog topic idea is right under your nose అని.

అయితే మీరు జాగ్రత్తగా కనుక పరిశీలిస్తే బ్లాగ్ కోసం ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేయాలి అని వెతకటం, డిసైడ్ అవ్వటం పెద్ద కష్టమైనా విషయం ఏమి కాదు. ఒక్కసారి మీరు బ్లాగ్ ఐడియాస్ ఎలా వెతకాలి అని కనుక తెలుసుకుంటే మీకు ఎప్పుడూ, బ్లాగ్ కోసం ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేయాలి అని ప్రశ్నే ఉండదు.

ఈరోజు నేను బ్లాగ్ పోస్ట్స్ కోసం టాపిక్స్ లేదా ఐడియాస్ ఎలా పొందాలి అనేది మీతో షేర్ చేస్తాను.

మీ రీడర్స్ అడిగిన క్వశ్చన్స్ అన్ని నోట్ చేసుకోండి.

ఎప్పుడైనా, ఎవరైనా మిమ్మలిని ఈమెయిలు ద్వారా కాని, మీ బ్లాగ్ కాంటాక్ట్ సెక్షన్ లో లేదా బ్లాగ్ కామెంట్స్ లో మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగి ఉంటె వాటిని ఒక పేపర్ పై రాసుకోండి. మళ్ళి మళ్ళి అడిగిన క్వశ్చన్స్ లేదా ఒకేలా ఉండే వాటి గురించి ఆలోచించండి దీనిని గురించి మనం ఎందుకు బ్లాగ్ పోస్ట్ వ్రాయకూడదు అని.

మీరు ఆ క్వశ్చన్ అడిగిన రీడర్స్ కోసం మాత్రమే కాకుండా అలాంటి డౌట్ ఉన్న అందరికీ ఆన్సర్ చేయండి. దీనివల్ల మీ బ్లాగ్ కి కంటెంట్ దొరుకుతుంది, బ్లాగ్ కి ట్రాఫిక్ కూడా వస్తుంది.

Suggested Post : బ్లాగ్స్ ఎలా వ్రాయాలి?  

మీ బ్లాగ్ పోస్ట్ కామెంట్స్ ని సెర్చ్ చేయండి

మీ బ్లాగ్ కోసం గ్రేట్ కంటెంట్ ఐడియాస్, మీ బ్లాగ్ పోస్ట్స్ లోని కామెంట్స్ లో దాగి ఉండొచ్చు. మీ బ్లాగ్ రీడర్స్ సజెషన్స్, ఒపీనియన్స్ లేదా వాళ్ళు చూసే భిన్నమైన కోణం నుండి మీ క్రియేటివ్ మైండ్ ని నిద్ర లేపండి. ఏదైనా ఒక కామెంట్ తీసుకుని దాన్ని ఎక్స్టెండ్ చేసి ఒక కొత్త బ్లాగ్ పోస్ట్ వ్రాయండి.

కాంపిటీటర్స్ బ్లాగ్ కామెంట్స్ చెక్ చేయండి

మీ బ్లాగ్ కామెంట్స్ ద్వారా ఎలాగైతే కంటెంట్ ఐడియాస్ జెనరేట్ చేస్తున్నారో అదే విధంగా మీ కాంపిటీటర్స్ బ్లాగ్ కామెంట్స్  నుండి మీ బ్లాగ్ కోసం కంటెంట్ ఐడియాస్ జెనరేట్ చేయవచ్చు. కాబట్టి మీరు కాంపిటీటర్స్ నుండి కూడా ఐడియాస్ తీసుకోవచ్చు.

Quora క్వశ్చన్స్ నుండి బ్లాగ్ పోస్ట్ ఐడియాస్ క్రియేట్ చేయండి

Quora మనకున్న ఇంకొక గ్రేట్ సోర్స్. Quora అనేది ఒక క్వశ్చన్ & ఆన్సర్స్ ప్లాట్ఫారం. ఇందులో ఎంతోమంది తమకున్న డౌట్స్ ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. తెలిసిన వాళ్ళు ఆన్సర్స్ ఇస్తుంటారు. ఇక్కడ నుండి కూడా మనం బ్లాగ్ పోస్ట్ ఐడియాస్ జెనరేట్ చేయవచ్చు.

కంటెంట్ క్యురేషన్ చేయండి

కంటెంట్ క్యురేట్ చేయటం అనేది తక్కువ టైం లో త్వరగా కంటెంట్  క్రియేట్ చేయటానికి మంచి ఐడియా. ఇందుకోసం మీరు మీకు ఇంటరెస్ట్ ఉన్న ఇమేజ్స్, కావాల్సిన లింక్స్ అన్ని సెట్ చేసుకుని, వాటి ద్వారా కంటెంట్ క్రియేట్ చేయవచ్చు. ఆల్రెడీ మీరు రీసెర్చ్ పార్ట్ కంప్లీట్ చేసి ఉంటారు కాబట్టి, కంటెంట్ క్యురేట్ చేయటం ద్వారా ఈజీగా కంటెంట్ క్రియేట్ చేయవచ్చు.

గెస్ట్ బ్లాగ్ పోస్టింగ్స్ అడగండి

మీ బ్లాగ్ లో కంటెంట్ ఫిల్ చేయటానికి గెస్ట్ బ్లాగ్ పోస్టింగ్ యూస్ చేసుకోండి. మీరు బ్లాగర్స్ కి పర్సనల్ గా ఈమెయిలు ద్వారా ఇన్విటేషన్ పంపండి, మీ బ్లాగ్ ల్ గెస్ట్ బ్లాగ్ పోస్ట్స్ రాయమని, గెస్ట్ బ్లాగ్ పోస్టింగ్స్ కోసం మీ బ్లాగ్ లో గెస్ట్ బ్లాగ్ పోస్ట్ రిక్వైర్మెంట్స్ పేజి క్రియేట్ చేయండి. ఇంటరెస్ట్ ఉన్నవాళ్లు కంటెంట్ ప్రోవైడ్ చేస్తారు.

గెస్ట్ బ్లాగ్ పోస్టింగ్ అంటే ఏంటి? గెస్ట్ బ్లాగ్ పోస్టింగ్ వలన కలిగే బెనిఫిట్స్ ఏంటి? అని తెలుసుకోండి.

ట్రేండింగ్ టాపిక్స్

ట్రేండింగ్ టాపిక్స్ పైన ఫోకస్ చేయండి. ఇందుకోసం గూగుల్ ట్రెండ్స్ లాంటి టూల్స్ యూస్ చేసుకుని కంటెంట్ క్రియేట్ చేయండి. ట్రేండింగ్ టాపిక్స్ తో మరిన్ని ఐడియాస్ జెనరేట్ చేయవచ్చు.

ఒక ఐడియాని ఇంకా డెప్త్గా ఆలోచించండి

మీ దగ్గర ఉన్న బ్లాగ్ పోస్ట్ ఐడియా గురించి ఇంకా ఎక్కువగా ఆలోచించండి. మీకు ఒక బ్లాగ్ పోస్ట్ఐడియా రాగానే కూర్చొని రాయటం మొదలు పెట్టకండి. ఆ బ్లాగ్ పోస్ట్ ఐడియాని ఇంకా డిటైల్డ్ గా ఎలా వ్రాయాలి, ఇంకా డెప్త్ గా ఎలా వ్రాయాలి అని ఆలోచించండి. ఇలా చేయటం వలన మీ టార్గెటెడ్ రీడర్స్ కి ఇంకా మంచి కంటెంట్ అందించే అవకాశం ఉంటుంది.

ఇంకా బాగా అర్థం అవ్వటానికి ఈ వీడియో చూడండి. (ఈ వీడియో మీకు ఈ బ్లాగ్ పోస్ట్ లో తప్ప ఇంకెక్కడా దొరకదు 🙁 )

ముగింపు

ఇప్పుడు మీకు చెప్పినవి అన్ని కూడా మీకు కంటెంట్ క్రియేట్ చేయటానికి కావాల్సిన ఐడియాస్ మీకు అందిస్తాయి. మీకు బ్లాగ్ పోస్ట్స్ క్రియేట్ చేయటనికి ఐడియాస్ లేవు, బ్లాగ్ టాపిక్స్ ఈజీగా క్రియేట్ చేయవచ్చు అనుకుంటాను. మీరు చేసే కీవర్డ్స్ రీసెర్చ్ నుండి కూడా మీరు మంచి బ్లాగ్ పోస్ట్ ఐడియాస్ పొందవచ్చు. మీకు తెలియదని కాదు, సెపరేట్ గా చెప్పలేదు కదా అని చెప్తున్నా! అంతే .

వీటిల్లో మీరు దేనిద్వారా మీ బ్లాగ్ కోసం కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, ఏ ఐడియా హెల్ప్ అయ్యింది అని కామెంట్ లో చెప్పండి. ఎందుకంటె నేను కూడా తెలుసుకోవాలి కదా నా రీడర్స్ కి ఏది హెల్ప్ అవుతుందో అని. ఇంకా ఏమైనా నేను వదిలేసి ఉంటె వాటిని కామెంట్ చేయండి, అప్డేట్ లో వాటిని కూడా యాడ్ చేస్తాను.

1 thought on “How to Find Blog Post Ideas for Blogging in Telugu”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *