ప్రొఫెషనల్ బ్లాగర్ కావడానికి కావాల్సిన 10 బ్లాగ్గింగ్ స్కిల్స్ | Blogging Skills in Telugu
మీరు ప్రొఫెషనల్ బ్లాగర్ కావాలనుకుంటున్నారా?మీ బ్లాగ్ ని ఈ 2021లో నెక్స్ట్ లెవెల్ కి ఎలా తిసుకువేల్లలో తెలియటం లేదా?
అయితే మీ బ్లాగ్ ని బేసిక్స్ నుండి ఒక ప్రాఫిటబుల్ బ్లాగ్ గా తీర్చిదిద్దటానికి మీలో ఉండాల్సిన అతి ముఖ్యమైన బ్లాగింగ్ స్కిల్స్ గురించి తెలుసుకుందాం.
ఒక బ్లాగ్ ని క్రియేట్ చేయటం, మైంటైన్ చేయటం కొంచెం సులభమే. వెబ్ హోస్టింగ్ లో వర్డుప్రెస్ సెటప్ చేయటం, ఒక మంచి థీమ్ సెలెక్ట్ చేసుకోవటం, కొన్ని బ్లాగ్ పోస్ట్స్ ప్రిపేర్ చేసుకోవటం వాటిని పబ్లిష్ చేయటం.
కంప్యూటర్స్, ఇంటర్నెట్ గురించి బేసిక్ నాలెడ్జ్ ఉన్నవాళ్లు ఎవరైనా ఒక బ్లాగ్ క్రియేట్ చేయటం పెద్ద విషయం కాదు.
అయితే మీరు ఒక బ్లాగ్ క్రియేట్ చేయటానికి, ఒక సక్సెస్ఫుల్ బ్లాగ్ క్రియేట్ చేయటానికి ఉన్న తేడా ఉంది అని గమనించాలి. సక్సెస్ఫుల్ బ్లాగ్ రీడర్స్ ని ఎట్రాక్ట్ చేయటం, వాళ్ళని అలాగే ఉంచగలదు.
ఎంతో మంది ఒక బ్లాగ్ స్టార్ట్ చేసి, కావాల్సిన స్కిల్స్ ని నేర్చుకుని సక్సెస్ఫుల్ బ్లాగ్ ని క్రియేట్ చేయగలగటం సంతోషకరమైన విషయం.
ఈరోజు మనం ఈ బ్లాగ్ పోస్ట్ లో ఒక బ్లాగ్ ని క్రియేట్ చేయటానికి, మంచి బ్లాగ్ క్రియేట్ చేయటానికి కావాల్సిన బ్లాగింగ్ స్కిల్స్ గురించి తెలుసుకుందాం.
ప్రో బ్లాగర్ అవ్వటానికి కావాల్సిన 10 బ్లాగింగ్ స్కిల్స్.
Blogging Skills in Telugu | కంటెంట్ రైటింగ్ స్కిల్స్
మీ బ్లాగ్ మీ రీడర్స్ కి గొప్ప వేల్యూని అందించడం ద్వారా మాత్రమే మీరు మనీ ఎర్న్ చేయగలరు.
మరి మీరు వేల్యూ వాళ్ళకి ఎలా అందించగలరు? మీ కంటెంట్ ద్వారా. మాంచి, యూస్ అయ్యే ఒరిజినల్ కంటెంట్ క్రియేట్ చేయకుండా మీరు ఒక ప్రాఫిటబుల్ బ్లాగ్ క్రియేట్ చేయలేరు. అందుకే మీరు ఖచ్చితంగా మంచి రైటర్ అవ్వాలి.
ప్రతి రోజు వ్రాయండి (ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ లో అయినా). మీ రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మాంచి బుక్స్ చదవండి, మాంచి బ్లాగ్స్ చదవండి.
ఇది క్లియర్ గా ఉన్నా, కొంత మంది బ్లాగర్స్ దిన్ని అస్సలు పట్టించుకోరు. బ్లాగ్ పోస్ట్స్ పబ్లిష్ చేయటానికి మీరు బుక్స్ వ్రాసే రచయిత కావాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని బేసిక్స్ తెల్సుకోవాలి. వర్డ్స్ ఎలాంటివి యూస్ చేయాలి అనేది (టెర్మినాలజీ), వ్రాసే విధానం (ఈజీగా అర్థం అయ్యేలా), అదే విధంగా లాంగ్ పోస్ట్స్ లాంటివి (త్వరగా 2000+ వర్డ్స్ ఉన్న పోస్ట్స్ గూగుల్ లో ర్యాంక్ అవ్వటానికి అవకాశం ఉంది).
Blogging Skills in Telugu | CSS & HTML స్కిల్స్
ఒక సక్సెస్ఫుల్ బ్లాగ్ ని స్క్రాచ్ నుండి క్రియేట్ చేయటానికి, మీరు పూర్తి స్థాయి వర్డుప్రెస్ డెవలపర్ లేదా ప్రోగ్రామర్ అవ్వల్సిన అవసరం లేదు.
అయితే మీకు ఖచ్చితంగా HTML కోడింగ్ బేసిక్స్ తెలిసి ఉండాలి, ఇమేజ్ ఇంటర్ లింకింగ్ కోసం, ఆల్ట్ టాగ్స్ యాడ్ చేయటానికి, అలాగే h1 లేదా h2 టాగ్స్ యాడ్ చేయటానికి.
ఎటువంటి కోడింగ్ అవసరం లేకుండా ఓక్ బ్లాగ్ క్రియేట్ చేయటానికి వర్డుప్రెస్ ఒక గొప్ప ప్లాట్ఫారం. అయితే మనకి HTML బేసిక్స్ తెలియటం ద్వారా మన కంటెంట్ క్రియేషన్ ఈజీ (SEO పరంగా) అవుతుంది.
ప్రతి బ్లాగింగ్ ప్లాట్ఫారం కొన్ని బిల్ట్-ఇన్-థీమ్స్ తో వస్తాయి. ఒకవేళ మీరు మీ బ్రాండ్ స్ట్రాటజీ పరంగా థీమ్ చేంజ్ చేసుకోవాలి అనిపించవచ్చు. అలాంటప్పుడు మీకు HTML, అదే విధంగా CSS బేసిక్స్ తెలియటం చాలా ముఖ్యం.
ఈ బేసిక్స్ తెలుసుకోవటం వలన మనం సెటప్ చేసిన బ్లాగ్ కి, క్రియేట్ చేసిన బ్లాగ్ కి ఉన్న తేడా గమనించవచ్చు. ఈ బేసిక్స్ మీరు ఇంటర్నెట్ నుండి ఫ్రీగా నేర్చుకోవచ్చు.
ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పాలి అంటే మీరు ఒక ఫ్రీ వర్డుప్రెస్ లేదా బ్లాగర్ థీమ్ యూస్ చేస్తున్నారు అనుకుందాం. అయితే ఫ్రీ థీమ్స్ లో కూడా లిమిటేషన్స్ ఉంటాయని, మీకు తెలుసు కదా!
అలాంటప్పుడు మీరు మీకు కావాల్సిన చేంజెస్ కలర్స్, ఫాంట్స్ ఇలాంటివి ఈ HTML, CSS బేసిక్స్ ద్వారా ఈజీగా చేసుకోవచ్చు.
Blogging Skills in Telugu | Networking Skills
నెట్వర్కింగ్ అనేది బ్లాగింగ్ స్కిల్స్ లో ఖచ్చితంగా మీకు ఉండాల్సింది. నెట్వర్కింగ్ ద్వారా మీరు కేవలం మనం కొంతమంది బ్లాగర్స్ తో కలవటం మాత్రమే కాదు, మీ బ్లాగ్ కి ట్రాఫిక్, సేల్స్ కూడా పెంచుకోవటానికి గేట్స్ ఓపెన్ చేసినట్లే.
బ్లాగింగ్ ఒక్కరే చేసుకున్నా, మీరు మీ రీడర్స్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. మీరు మీ బ్లాగ్ రీడర్స్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటె, మీరు మీ బ్లాగ్ రీడర్స్ కి కావాల్సింది ఏంటో తెలుసుకోగలరు. వాళ్ళకి కావాల్సిన కంటెంట్ ని రెగ్యులర్ గా అందించగలరు.
ఉదాహరణకి మీరు పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్ బ్లాగ్ రన్ చేస్తుంటే మీరు మీ బ్లాగ్ పోస్ట్స్ లో వివిధ రకాల వాళ్ళకి ఉపయోగపడే క్రెడిట్ కార్డు డీటెయిల్స్ గురించి వ్రాయాలి.
Blogging Skills in Telugu | ఫాలో అప్ స్కిల్స్
రీడర్స్ కి ఫ్రెష్ కంటెంట్ కావాలి. మీరు ఏదైనా ఒక క్వశ్చన్ వేసినప్పుడు ఒక టైం ప్రకారం వాళ్ళని ఫాలో అప్ చేయాలి. నిజానికి నేను చెప్పాలి అనుకున్నది ఏంటి అంటే ప్రతి రోజు మీరు మీ రీడర్స్ తో ఇంటరాక్ట్ అవ్వటం, దీనిద్వారా మీరు కన్సిస్టెన్సి కూడా మైంటైన్ చేయవచ్చు.
మీరు సోషల్ మీడియా ద్వారా కూడా మీ రీడర్స్ తో ఇంటరాక్ట్ అవ్వొచ్చు. మీరు మీ ఇండస్ట్రీలోని మిగిలిన బ్లాగర్స్ తో మంచి కనెక్షన్స్ కనుక బిల్డ్ చేసుకుంటే ఖచ్చితంగా మీ మిగిలిన బ్లాగింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు.
Blogging Skills in Telugu | ఫోటో ఎడిటింగ్ స్కిల్స్
ఒక్క ఇమేజ్ కొన్ని వేల పదాలకి సమానం. మనందరికీ తెలుసు ఇమేజ్స్ ఎలా వైరల్ అవుతాయో, ప్రత్యేకించి సోషల్ మీడియాలో. బ్లాగ్ పోస్ట్స్ లో ఇమేజ్స్ యూస్ చేయటం వాళ్ళ మన రీడర్స్ బాగా ఇన్వొల్వ్ అవ్వటమే కాకుండా మన సెర్చ్ ర్యాంకింగ్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి అని మీకు తెలుసు కదా!
చాలా బ్లాగ్స్ లో టెక్స్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు మీ బిజినెస్ లేదా బ్లాగ్ కి సంబంధించిన ఇమేజెస్ అందులో ఇన్సర్ట్ చేయండి. అయితే ఇందుకు మీకు ఎలా ఎడిట్ చేయాలి అని తెలిసి ఉండాలి. ఉదేహరణకి ఎలా క్రాప్ చేయాలి, ఎలా రిసైజు చేయలి, రిఫార్మటు చేయాలి అని.
ఇమేజ్ ఎడిటింగ్ అన్నాం కదా అని మీరు ఫోటోషాప్ ఎక్స్పర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు Canva వంటి ఆన్లైన్ టూల్స్ లేదా ఇమేజ్ ఎడిటింగ్ మొబైల్ యాప్స్ కూడా యూస్ చేసుకోవచ్చు.
ఈ బ్లాగ్ పోస్ట్ లో యూస్ చేసిన ఇమేజ్స్ అన్ని కూడా Canva లో ఫ్రీగా చేసినవే. మీరు మీ బ్లాగ్ కి వచ్చే రీడర్స్ కి మాంచి లుక్, ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా మీకు ఫోటో ఎడిటింగ్ స్కిల్స్ వచ్చి తీరాలి.
Blogging Skills in Telugu | సోషల్ నెట్వర్కింగ్ స్కిల్స్
సోషల్ మీడియా కొత్త SEO టూల్. సోషల్ మీడియా ద్వారా బ్లాగ్ ట్రాఫిక్ పెరగటమే కాదు, మీరు మీ బ్లాగ్ పోస్ట్స్ కోసం ఇంకా ఎక్కువ మంది ఆడియన్స్ ని వెతకవచ్చు.
మీకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటివి ఎలా యూస్ చేయాలి అని మీరు నేర్చుకోవాలినేర్చుకుంటే మీ బ్లాగ్ కోసం రీడర్స్ ని కూడా పొందవచ్చు. సోషల్ నెట్వర్కింగ్ స్కిల్స్ ద్వారా మీరు మీ పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోవచ్చు.
ఈ ప్లాట్ఫారంస్ లో మీ బ్లాగ్ లింక్స్ ఇవ్వటం ద్వారా, మీ బ్లాగ్ ని ప్రోమోట్ చేస్తాయి. సోషల్ మీడియా వల్ల కలిగే బెనిఫిట్ ఏంటి అంటే త్వరగా వైరల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. అలా మన కంటెంట్ నచ్చిన రీడర్స్ మన కంటెంట్ ని మళ్ళి వాళ్ళ సర్కిల్ లో ఉన్నవాళ్ళకి షేర్ చేస్తారు. మంచి క్వాలిటీ ట్రాఫిక్ మన బ్లాగ్ కి వస్తుంది.
సోషల్ నెట్వర్కింగ్ నేర్చుకోవాలి అంటే మీరు ముందు మీరు సోషల్ మీడియా ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకుని అందులో రీడర్స్ కి ఉపయోగపడే కంటెంట్ పోస్ట్ చేయటం మొదలుపెట్టటమే.
Blogging Skills in Telugu | మార్కెటింగ్ స్కిల్స్
అతి తక్కువ మంది బ్లాగర్స్ మాత్రమే త్వరగా సక్సెస్ అవ్వటానికి కారణం, వాళ్ళకి ఉన్న సెల్లింగ్ స్కిల్స్.
మీకు మీ బ్లాగ్ కంటెంట్, ప్రొడక్ట్స్ లేదా సర్వీసెస్ ఎలా ప్రోమోట్ చేసుకోవాలి లేదా ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి అని తెలుసుకోకపోతే మీరు మీ బ్లాగింగ్ నెట్వర్క్ చుట్టూ నమ్మకమైన రీడర్స్ ని క్రియేట్ చేసుకోవటం లో ఫెయిల్ అయినట్లే.
ఒక బ్లాగర్ గా మీ మార్కెటింగ్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవటానికి కొన్ని సింపుల్ టిప్స్:
> మీ ఇండస్ట్రీ లోని ఇన్ఫ్లుయన్సర్స్ తో కనెక్ట్ అవ్వండి. వాళ్ళ కంటెంట్ ని ప్రోమోట్ చేయండి. వాళ్ళు మీ ప్రొడక్ట్స్ లేదా కంటెంట్ ని ఎలా ప్రోమోట్ చేయగలరు అని ఆలోచించండి. ఒక ఎక్స్పర్ట్ కనుక మిమ్మల్ని రికమెండ్ చేస్తే మీ బ్లాగ్ ట్రాఫిక్ రాకెట్ లా మారుతుంది. దాంతో పాటే సేల్స్ కూడా పెరుగుతాయి.
> బాగా బుక్స్ చదవండి, ప్రత్యేకంగా మార్కెటింగ్ గురించి, సైకాలజీ, బిజినెస్ ల గురించి. ఈ టైపు బుక్స్ చదవటం వలన మార్కెటింగ్ లో ఏం చేయాలి, “ఏం చేయకూడదు” అని మనకి కొన్ని ఐడియాస్ వస్తాయి.
> మీరు ఫెయిల్ అయితే లైట్ తీసుకోండి. మార్కెటింగ్ లో ఇదంతా కామన్ గా జరుగుతుంది. ఎవ్వరూ మీ ప్రొడక్ట్స్ కొనట్లేదు, మీ సర్వీసెస్ తీసుకోవట్లేదు అని వెనకడుగు వేయకండి. వాళ్ళు ఎందుకు ఇంటరెస్ట్ చూపించటం లేదు అని ఐడెంటిఫై చేయండి. ఇలా చేయటం ద్వారా మీరు ఏ ఇండస్ట్రీలో అయిన బెస్ట్ మార్కేటర్ కాగలరు.
Blogging Skills in Telugu | సేల్ చేయగలిగిన ఆర్ట్
మీరు ఏ ఇండస్ట్రీలో అయినా #1 బ్లాగర్ కావాలి అనుకుంటే సెల్లింగ్ ఆర్ట్ నేర్చుకోవాలి. అలాగని మీరేమి ఒక సేల్స్ మాన్ లాగా పెద్దగా అరుస్తూ సేల్స్ చేయాల్సిన అవసరం లేదు.
సెల్లింగ్ స్కిల్ అనేది ఖచ్చితంగా ఒక బ్లాగర్ లేదా మార్కేటర్ కి ఉండాల్సిన బ్లాగింగ్ స్కిల్. ఆన్లైన్ ద్వారా సేల్స్ చేయటం లో మీరు ఎక్స్పర్ట్ అవ్వటానికి కొన్ని టిప్స్:
నిజాయితీగా ఉండండి, ఎక్స్పర్ట్ లాగా ఆలోచించండి.
ఏదైనా ఒక ప్రోడక్ట్ లేదా సర్వీస్ మనం ఆన్లైన్ ద్వారా సేల్ చేస్తున్నాం అంటే ఖచ్చితంగా నిజాయితీగా ఉండాలి. అందుకోసం మీరు ఇంతకూ ముందు పర్చేస్ చేసిన వాళ్ళ రివ్యూస్ షో చేయండి. వీటి ద్వారా మీరు ఎక్స్పర్ట్ అని చెప్పవచ్చు.
ఎక్స్పర్ట్స్ నుండి నేర్చుకోండి
Neil Patel, Pat Flynn, Sorav Jain, Deepak Kanakaraju లాంటి వాళ్ళకి ఆన్లైన్ ద్వారా ఎలా సేల్స్ చేయాలో తెలుసు. వాళ్ళు ఎలా సేల్స్ చేస్తున్నారు అని గమనించగలిగితే మీరు చాలా నేర్చుకోవచ్చు.
ఎక్కువగా చదవండి
ఆన్లైన్ ద్వారా ఎలా సేల్ చేయాలి అని నేర్చుకోవాలి అంటే మీరు మార్కెటింగ్, సైకాలజీ, ఇంకా బిజినెస్ రిలేటెడ్ బుక్స్ చదవటం ద్వారా ఈజీగా నేర్చుకోగలరు.
Blogging Skills in Telugu | మీ ఆడియన్స్ యొక్క ఎమోషనల్ ట్రిగ్గర్స్ ని అర్థం చేసుకోండి.
మనం ఎవరికి అమ్మాలి అనేది తెలుసుకోవటం అతి ముఖ్యమైన బ్లాగింగ్ స్కిల్. ఖచ్చితంగా ఈ స్కిల్ నేర్చుకోవాలి. మీ టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరూ, వాళ్ళు ఎలా చెప్తే ఆన్లైన్ లో ఒక వస్తువు కొంటారు అని తెలియకపోతే ఆన్లైన్ ద్వారా డబ్బు సంపాదించడం కష్టం.
ఒకవేళ మీరు ప్రొఫెషనల్ బ్లాగర్ కావాలి అనుకుంటే, ఎమోషనల్ ట్రిగ్గర్స్ గురించి తెలుసుకొని, వాటిని అర్థం చేసుకోవాలి. అందుకు ముందు మీరు మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరో తెలుసుకోవాలి.
మీరు మీ టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరో తెలుసుకోవటానికి కొన్ని మార్గాలు
> మీరు మీ బ్లాగ్ / వెబ్సైటు లో ఎలాంటి ప్రొడక్ట్స్ / సర్వీసెస్ అందిస్తున్నారు, అవి ఎలాంటి వాళ్ళకి ఉపయోగపడతాయి అని తెలుసుకోవటానికి మీ టైం స్పెండ్ చేయవలసి ఉంటుంది.
> మీరు మీ టార్గెటెడ్ ఆడియన్స్ ని ఎవరు, వాళ్ళకి ఏం కావాలి అని తెల్సుకోవటానికి అత్యంత సులభమైన మార్గం మీ కాంపిటీటర్స్ ని రీసెర్చ్ చేయటం.
> సోషల్ మీడియా లో మీరు క్విజ్ లాంటివి కండక్ట్ చేయటం ద్వారా కూడా మీ టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరో తెలుసుకోవచ్చు.
> మీ ఆడియన్స్ యొక్క డెమోగ్రాఫిక్ అంటే వాళ్ళ వయస్సు, జెండర్, ఎడ్యుకేషన్, వాళ్ళ లొకేషన్ ఇలాంటి వాటి ద్వారా కూడా తెలుసుకోవచ్చు.
టార్గెటెడ్ ఆడియన్స్ యొక్క ఎమోషనల్ ట్రిగ్గర్స్ ఎలా తెలుసుకోవాలి?
మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు మీరు మీ ఆడియన్స్ ని అర్థం చేసుకోవటం అతి ముఖ్యమైన్ బ్లాగింగ్ స్కిల్. మీరు అందులో మాస్టర్ కావాలి. అలా అవ్వగలిగితేనే మీ వెబ్సైటు / బ్లాగ్ నుండి మీ ఆడియన్స్ ఏదైనా పర్చేస్ చేస్తారు.
AIDA ఫార్ములా యూస్ చేయండి.
> Attention
Attention అంటే మీ వెబ్సైటు లోని ప్రోడక్ట్ లేదా లాండింగ్ పేజికి వచ్చే విజిటర్ ని తీసుకురాగలగటం.
> Interest
Interest అంటే వాళ్ళకి మనం చెప్పాలి అనుకున్న విషయం బాగా గుర్తు ఉండేలా, ఇంటరెస్టింగ్ గా చెప్పగలగటం.
> Desire
Desire అంటే మన వెబ్ పేజికి వచ్చిన విజిటర్ మనం చెప్పిన దానిని అర్థం చేసుకున్న తరువాత ఈ పని మనం చేయాలి అనే కోరిక అతనిలో కలిగించటం.
> Action
Action అంటే కాల్ టూ యాక్షన్ (CTA) జరిగే విధంగా చేయగలగటం. ఉదాహరణకి ఒక ప్రోడక్ట్ కొనటం లేదా ఈమెయిల్ లిస్టుకి సబ్స్క్రయిబ్ చేసుకోవటం ఇలాంటివి.
Blogging Skills in Telugu | Negotiation Skills
Negotiation అంటే నిజానికి చర్చించటం. చర్చల ముఖ్య ఉద్దేశ్యం మనం అనుకున్న విధంగా అవతలి వాళ్ళని ఒప్పించటం. మీరు బ్లాగింగ్ ద్వారా మనీ ఎర్న్ చేయాలి అనుకుంటే మిగిలిన వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియాలి.
ఎందుకో తెలుసా? ఒక బ్లాగర్ గా లేదా మార్కేటర్ గా మీరు ఎంతో మందితో మాట్లాడాల్సి ఉంటుంది.
చర్చించటం మీకు ఎలా ఉపయోగపడుతుంది అంటే,
> మీరు వ్రాసిన గెస్ట్ బ్లాగ్ పోస్ట్స్ టాప్ బ్లాగ్స్ లో పబ్లిష్ చేయటానికి
> మీరు ప్రోమోట్ చేసే అఫిలియేట్ ప్రొడక్ట్స్ కి మంచి డీల్స్ కుదుర్చుకోవటానికి
> ఈజీగా ఇంకా ఎక్కువ ఎర్న్ చేయటానికి
> మీ ఇండస్ట్రీలోని ఇతర బ్లాగర్స్ తో కనెక్ట్ అవ్వటానికి
> చెప్పుకుంటూ పోతే అంతే లేదు.
ఒక బ్లాగర్ గా ఈ స్కిల్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవటం
> మాట్లాడే దాన్నికన్న ఎక్కువగా వినటం ద్వారా మనం ఇతరుల ఎమోషన్స్ అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ పెయిన్ పాయింట్స్ యంతో అర్థం చేసుకుంటే ఇంకా బాగా డీల్ చేయవచ్చు.
> మీరు ఎప్పుడూ మీ అర్హత కన్నా ఎక్కువ అడగండి, అడగటంలో తప్పు లేదు కదా!
> మీరు మీ రిజల్ట్స్ కనుక చూపించగలిగితే, మీరు ఎక్స్పర్ట్ అని వాళ్ళు నమ్మితే చాలు. మీరు అడిగినంత వాళ్ళు ఖర్చు పెట్టగలరు.
ముగింపు
ఇప్పుడు బాగా మనీ ఎర్న్ చేస్తున్న ప్రతీ బ్లాగర్ ఒక్కప్పుడు బిగినర్ అని తెలుసుకోండి.
మీరు గొప్పగా భావించే ప్రతి బ్లాగర్ ఒక్కప్పుడు ఎన్నో తప్పులు చేశారు, ఎన్నో విషయాలు నేర్చుకున్నారు అని తెలుసుకోండి. అలా ఈ బ్లాగింగ్ స్కిల్స్ నేర్చుకొని వాళ్ళ ట్రాఫిక్, ఆడియన్స్, ఇన్కమ్ పెంచుకున్నారు అని అర్థం చేసుకోండి.
సక్సెస్ కావాలి అని ఎంతో ప్రాక్టీసు చేశారు అని గుర్తు పెట్టుకోండి. అలాగని మీరు టాప్ బ్లాగర్ తో మిమ్మల్ని మీరు పోల్చుకోకండి. ఎందుకంటె మీరు బిగినర్ కాబట్టి. ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే ఒక్కదాని పైన ఫోకస్ చేయండి. అందులో మాస్టర్ అవ్వండి.
ఇప్పడు చెప్పండి మీరు ఇంకా ఎన్ని స్కిల్స్ నేర్చుకోవాలి? ఈ స్కిల్స్ నేర్చుకోవటం వల్ల మీకు ఉపయోగం ఉంది అనుకుంటున్నారా? మీరు కామెంట్స్ లో చెప్పగలిగితే ఇంకా ఎక్కువ మందికి హెల్ప్ అవుతుంది. అంతే కాదండోయ్! ఇంతవరకూ ఇష్టపడి చదివారు, ఒక్క షేర్ చేయోచ్చు కదా! మీరు షేర్ చేస్తే ఇంకొకరికి హెల్ప్ అవుతుంది కదా! ఏమంటారు.
- Website Design Formula for Small Businesses - October 27, 2021
- Digital Marketers Meetup in Hyderabad in 2021 - September 1, 2021
- How to Write Viral Blog Posts in Telugu - August 12, 2021
We want more in telugu…. Visit my blogs
Moneytechinfo.com
Bloggig guide
Yes, Realy we need more inforamtion in Telugu. That’s why Blogger VJ created. For more info & updates follow us
Great!!!
Thanks for Sharing Information.
You’re Welcome Abhi