always vj logo
Blog Monetization in telugu

Blog Monetization in Telugu

Spread the love

Blog Monetization in Telugu

మీరు ఒక బ్లాగ్ స్టార్ట్ చేయగానే ఎప్పుడెప్పుడు మనటైజేషన్ చేద్దామా అని మనసు తహతహలాడుతుంది. ఎందుకంటె మనం ఏం పనైనా చేస్తే దానిద్వారా డబ్బులు వస్తేనే కదా మనం సక్సెస్ అయినట్టు. మన కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు, నేను కూడా !

బ్లాగ్ ద్వారా డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. యాడ్సెన్స్, అఫిలియేట్ మార్కెటింగ్ ఇలాంటివి కొన్ని. ఈ రోజు మనం బ్లాగ్ మానటైజేషన్ గురించి మరింత వివరంగా తెలుసుకుందాం. ఈ రోజు మీకు బ్లాగింగ్ గురించి ఫుల్ క్లారిటీ వస్తుంది అనుకుంటున్నా.

blog monetization in telugu

బ్లాగింగ్ స్టార్ట్ చేసి సిక్స్ ఫిగర్ ఇన్కమ్ ఎర్న్ చేసేవాళ్ళు ఉన్నారు. అంతే కాకుండా వాళ్ళ సొంత బిజినెస్లు కూడా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు.

అలాగని బ్లాగ్ స్టార్ట్ చేసిన అందరూ డబ్బు సంపాదించగలరు అని నేను అనట్లేదు. బ్లాగ్ స్టార్ట్ చేసి ఒక్కరూపాయి కూడా సంపాదించని వాళ్ళూ ఉన్నారు. అంతే కాకుండా ఇంకా ఎంతో మంది కొత్త బ్లాగర్స్ వాళ్ళ అదృష్టాన్ని పరిక్షించుకుందాం అనుకునేవాళ్ళూ ఉన్నారు.

ఇంత వరకూ మీరు మీ బ్లాగ్ కోసం ఒక నిష్ ని సెలెక్ట్ చేసుకున్నారు, డొమైన్, హోస్టింగ్ తీసుకుని వర్డుప్రెస్ సెటప్ చేసి, బ్లాగ్ కోసం కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు అనుకుందాం. ఒక బ్లాగ్ క్రియేట్ చేయటం చాలా చాలా ఈజీ, కానీ ఆ బ్లాగ్ ద్వారా మనీ ఎర్న్ చేయటమే అసలు విషయం. మీరు నిజంగా ఒక ప్రాసెస్ ప్రకారం కష్టపడితే ఖచ్చితంగా మీ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని పొందుతారు.

నిదానంగా ట్రాఫిక్ పెరుగుతుంది. ట్రాఫిక్ పెరిగితే ఎంతో కొంత రెవిన్యూ కూడా వస్తుంది. అయితే మీ బ్లాగ్ ని, సిక్స్ ఫిగర్ ఇన్కమ్ గా జేనేరేట్ చేసే మెషిన్ గా కన్వర్ట్ చేయటం కష్టం.

ఎంతో బ్లాగర్స్ బ్లాగ్ మానటైజేషన్ మార్గాల కోసం వెతికి వెతికి అద్భుతమైన అవకాశాలని పొందలేకపోతున్నారు.

ఈ విషయాన్నీ మరింత వివరంగా మాట్లాడుకునే ముందు మనం కొన్ని ప్రశ్నలకి (మీ మనసులో కూడా ఉన్న) సమాధానాలు వెతుకుదాం !

బ్లాగింగ్ కోసం బ్లాగ్….లేదా డబ్బులకోసం బ్లాగింగ్…

నేను మిమ్మల్ని ఇప్పుడు ఒకటి అడుగుతాను చెప్పండి, మీరు బ్లాగ్ ఎందుకు రన్ చేస్తున్నారు అంటే చాలా మంది మనీ ఎర్న్ చేయటానికి అని తడుముకోకుండా చెప్పగలరు. కానీ మెజారిటీ బ్లాగర్స్ ప్రతిరోజు 2-3 బ్లాగ్ పోస్ట్స్ రాసిన మనీ ఎర్న్ చేయలేని వాళ్ళు ఉన్నారు.

బ్లాగింగ్ ప్యాషన్ కి సంబంధించింది…..ప్యాషన్ ఖచ్చితంగా లాభమే

మీరు ఎన్నోసార్లు వినే ఉంటారు మీరు మీ ప్యాషన్ ని ఫాలో అవ్వండి, ఆ ప్యాషన్ మీకు డబ్బులు సంపాదించగలదు అని. నేనే ఎన్నోసార్లు నా వీడియోస్ లో నా కోర్సెస్ లో చెప్పను. అంతే కాదు టాప్ బ్లాగర్స్ అందరూ కూడా ఇదే విషయం చెప్తారు.

కానీ దురదృష్టవశాత్తూ 98% బ్లాగర్స్ అసలు ఈ విషయాన్నే పట్టించుకోరు.

బ్లాగింగ్ లో సక్సెస్ కావటానికి ఎంతో టైం పడుతుంది, ఎంతో ఎఫర్ట్ చేయాలి. అంతే కాకుండా ఏదో ఒకటి వ్రాస్తున్నాం అనుకుంటే మీరు ఎక్కువ కాలం బ్లాగింగ్ చేయలేరు. ప్యాషన్ తో బ్లాగింగ్ చేయాలి అనటానికి ఇది అతి ముఖ్యమైన కారణం.

ఫైనాన్షియల్ బ్లాగ్ పోస్ట్స్ ర్యాంక్ చేయటం సులభం, కానీ బోరింగ్ టాపిక్స్ తీసుకుని వాటిని ఇంటరెస్టింగ్ గా రాయగలిగితే ఇంకా ఈజీగా ర్యాంక్ అవుతాయి. అంటే మీ కొత్త ఇంటి కోసం హోం లోన్ తీసుకోవటం ఎలా? ఇలాంటివి రాయటం కష్టం.

 Call to Action బటన్స్ లోనే మనీ ఉంటుంది

బ్లాగ్ ని మనం కేవలం ఒక మనీ మేకింగ్ మెషిన్ లా కాకుండా రీడర్స్ కి అవసరం అయిన ఇన్ఫర్మేషన్ ని కూడా అందించే విధంగా ఉన్నపుడే మీరు బ్లాగ్ ద్వార ఎర్న్ చేయగలరు. రీడర్స్ సాధారణంగా 3 కారణాలతో ఇంటర్నెట్ ని యూస్ చేస్తుంటారు. అందులో మీ బ్లాగ్ దేని కిందకి వస్తుంది.

1) ఎంటర్టైన్మెంట్ కోసం

2) ఏదైనా కొనాలి అనుకున్నపుడు

3) దేని గురించి అయినా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు.

కానీ ఎంతో మంది ఎంటర్టైన్మెంట్  క్యాటగిరిలో మాయలో పడిపోతున్నారు. బ్లాగింగ్ లో మనీ ఎర్న్ చేయటానికి ఎంటర్తైన్మెంట్ క్యాటగిరి అత్యంత కష్టమైనది.

మీరు ఎవరైనా ఏదైనా కొనాలి అనుకున్నప్పుడు మీ బ్లాగ్ పోస్ట్స్ వాళ్ళకి హెల్ప్ చేయగలిగితే అటువంటి బ్లాగ్స్ ద్వారా మీరు మనీ ఎర్న్ చేయవచ్చు.

ఇక లాస్ట్ క్యాటగిరి ఇన్ఫర్మేషన్, ఇందులో కూడా మీరు గూగుల్ యాడ్సెన్స్ అలాగే అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా కూడా ఎర్న్ చేయవచ్చు.

మీ బ్లాగ్ మీ రీడర్స్ టైంకి వేల్యూ ఇస్తుందా?

మీరు బ్లాగ్, కంటెంట్ తో బ్లాగింగ్ ద్వారా మనీ ఎర్న్ చేయటానికి కష్టపడుతూ ఉంటె మాత్రం మీరు ఒక్కసారి అసలు ఏం జరుగుతుంది అని ఆలోచించాలి. మీరు మీ బ్లాగ్ రీడర్ అని అనుకుంటే మీ బ్లాగ్ కంటెంట్ నిజంగా మీకు హెల్ప్ ఫుల్ అవుతుందా అని చెక్ చేయండి.

మీ బ్లాగ్ ద్వారా మీరు మనీ ఎర్న్ చేయకపోతే మీ బ్లాగ్ యొక్క లాంగ్ టర్మ్ సక్సెస్ కి అది ఆటంకం కావచ్చు. ఎందుకంటె ఏదైనా ఒక పని చేస్తున్నాం అంటే దాని ద్వారా మనకి రెవిన్యూ వస్తేనే మనకి ఆ పని పైన ఇంటరెస్ట్ వస్తుంది. అప్పుడే దానిని మనం లాంగ్ రన్ లో చేయగలం.

అలా చేయలి అంటే మీకు ఒక స్ట్రాటజీ ప్రకారం హార్డ్ వర్క్ చేయాలి, అలా కాకుండా ఏదో బ్లాగ్స్ రాస్తున్నాం, షేర్ చేస్తున్నాం అంటే ఈరోజుల్లో అది వర్క్ అవుట్ కాదు. బ్లాగింగ్ లో సక్సెస్ కావాలి అంటే మీకు లాంగ్ రన్ గోల్స్ కావాలి. అలా మీ లాంగ్ రన్ గోల్స్ కోసం హార్డ్ వర్క్ చేస్తే మీరు మీ గోల్స్ రీచ్ అయ్యే లోపే మీరు మనీ ఎర్నింగ్ స్టార్ట్ చేయవచ్చు.

బ్లాగర్స్ మనీ ఎలా ఎర్న్ చేస్తారు?

ఇంత వరకూ మనం మనీ ఎర్నింగ్ బేసిక్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం బ్లాగర్స్ ఎలా మనీ ఎర్న్ చేస్తారో తెలుసుకుందాం. మీరు బ్లాగింగ్ ద్వారా ఎంత వరకూ ఎర్న్ చేయవచ్చు అని Blogging Basics Guide లో తెలుసుకున్నాం. మీరు కనుక ఫుల్ టైం బ్లాగ్ రన్ చేయగలం అనుకుంటే ఖచ్చితంగా మనీ ఎర్న్ చేయటం పెద్ద విషయం కాదు.

బ్లాగ్ మానటైజేషన్ మార్గాలు:

1) పెయిడ్ యాడ్స్

2) అఫిలియేట్ మార్కెటింగ్

3) ఫిజికల్ ప్రొడక్ట్స్

4) డిజిటల్ ప్రొడక్ట్స్ & సర్వీసెస్

పెయిడ్ యాడ్స్ (యాడ్సెన్స్ లాంటివి)

డిస్ప్లే యాడ్స్ ని మీ బ్లాగ్ లో రన్ చేయటం మీ బ్లాగ్ ని మానటైజ్ చేయటానికి ఒక మార్గం. కానీ సక్సెస్ఫుల్ బ్లాగర్స్ పబ్లిష్ చేసే ఇన్కమ్ రిపోర్ట్స్ ఆధారంగా అఫిలియే మార్కెటింగ్ మేజర్ సోర్స్ అని తెలుసుకోవచ్చు. డిస్ప్లే యాడ్స్ అఫిలియేట్ మార్కెటింగ్ తో పోల్చుకుంటే అంత మనీ ఎర్న్ చేయలేవు.

Blog Monetization in Telugu | Paid Ads

కానీ డిస్ప్లే యాడ్స్ కూడా ఒక సోర్స్ గా కూడా చూడవచ్చు. అంతే కాకుండా న్యూ బ్లాగర్స్ కి ఇది ప్రైమరీ సోర్స్. అదే మీరు కనుక డిస్ప్లే యాడ్స్ ద్వారా మనీ ఎర్న్ చేయాలి అనుకుంటే మీరు ముందుగా మీ బ్లాగ్ కి మంచి ట్రాఫిక్ తీసుకురావాలి. అలా ట్రాఫిక్ వస్తేనే ఈ పెయిడ్ యాడ్స్ ద్వారా మనీ ఎర్న్ చేయగలం.

ఈ పెయిడ్ యాడ్స్ Pay-Per-Click (PPC) మోడల్ లో పని చేస్తాయి. మీ బ్లాగ్ కి వచ్చే విజిటర్స్ ఈ యాడ్స్ పైన క్లిక్ చేస్తేనే మీకు ఇన్కమ్ వస్తుంది. ఒక్క క్లిక్ ద్వారా వచ్చే అమౌంట్ చాలా చాలా తక్కువ. అదే కనుక మీ బ్లాగ్ కి  ప్రతి నెల ఒక వెయ్యి క్లిక్స్ అయిన వస్తే అప్పుడు మీరు ఎంతో కొంత అమౌంట్ ప్రతి నెల సంపాదించగలరు.

అయితే ఈ డిస్ప్లే యాడ్స్ వలన రీడర్స్ కి అంత మంది యూసర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వలేము. ఒక్కసారి ఆలోచించండి, మీరు సీరియస్ గా ఈబ్లాగ్ పోస్ట్ చదువుతుంటే మధ్య మధ్యలో మీకు మూవీ రిలేటెడ్ యాడ్స్, లేదా ఏదైనా ప్రోడక్ట్ రిలేటెడ్ యాడ్స్ వస్తే మీ ఇంటరెస్ట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అవునా!

అంతే కాకుండా వీటి వల్ల మీ రీడర్స్ కూడా డిస్ట్రక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, మీ బ్లాగ్ నుండి కూడా బయటకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇలాంటి ప్రాబ్లంస్ ఉన్న కూడా ఎంతో మంది బిగినర్స్ కి ప్రైమరీ ఇన్కమ్ సోర్స్. ఇక గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ కోసం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. ఎందుకంటె గూగుల్ యాడ్సెన్స్ కి అంత పబ్లిసిటీ కల్పించింది బ్లాగింగ్.

“మీకు తెలుసా బ్లాగింగ్ పాపులర్ అయింది కూడా మనీ ఎర్న్ చేయవచ్చు అనే”

ఇంటర్నెట్ తో ఉన్న విస్తృతమైన అవకాశాలు మనకి ఇంటి నుండే మనం డబ్బు సంపాదించే మార్గాలని కల్పిస్తుంది. ఈ PPC మెథడ్ ద్వారా ఎంతో మంది బ్లాగర్స్, పబ్లిషర్స్ వాళ్ళ బ్లాగ్స్ ద్వారా మనీ ఎర్న్ చేస్తున్నారు. అయితే మన దగ్గర మాత్రం ఈ బ్లాగింగ్ గురించి పూర్తీ అవగాహనా, నాలెడ్జ్ లేవు.

గూగుల్ యాడ్సెన్స్

యాడ్సెన్స్ PPC ప్రోగ్రామ్స్ లో బాగా పాపులర్ అయిన ఒక ప్రోగ్రాం. ఈ గూగుల్ యాడ్సెన్స్ ప్రోగ్రాం లో ఎవరైనా జాయిన్ అవ్వవచ్చు, మనీ ఎర్న్ చేయవచ్చు. నిజంగా ఈ ప్రోగ్రాం ఫ్రీనా?

ఈ యాడ్సెన్స్ ని ప్రత్యేకంగా గూగుల్ తన రెవిన్యూని పెంచుకోవటం కోసం, అలాగే వెబ్సైటు ఓనర్స్ కంటెంట్ కంట్రీబ్యుట్ చేసే విధంగా డిజైన్ చేసింది. ఈ యాడ్సెన్స్ ప్రోగ్రాం ద్వారా ఆన్లైన్ లో ప్రొడక్ట్స్ / సర్వీసెస్ ప్రోమోట్ చేసేవాళ్ళకి యాడ్ కాస్ట్ కూడా తగ్గటం, ఆన్లైన్ లో ప్రమోట్ చేయటానికి ఇంటరెస్ట్ చూపించటం ఇలాంటివి అన్ని బ్లాగర్స్ కి బాగా హెల్ప్ అయ్యింది.

అఫిలియేట్ మార్కెటింగ్

మీ బ్లాగ్ కి రెగ్యులర్ గా రావాలి అనుకుంటే అఫిలియేట్ మార్కెటింగ్ చాలా ముఖ్యమైనది. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఒక కంపెనీ ప్రొడక్ట్స్ / సర్వీసెస్ ని మన బ్లాగ్ ద్వారా ప్రోమోట్ చేసే మన యునిక్ లింక్ ద్వారా సేల్ చేయగలిగితే మనకి ఆ కంపెనీ కొంత మనీ కమిషన్ గా ఇస్తుంది. ఇలా మనం ఎన్నో సేల్స్ చేయగలిగితే అంత మనీ అన్నమాట.

Affiliate Marketing in Telugu
IMG Source : Masterblogging.com

అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేయటానికి ఒక బిజినెస్ స్టార్ట్ చేయటానికి కావలసినంత ఇన్వెస్ట్మెంట్ ఏమి అవసరం లేదు. అఫిలియేట్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయటం వలన ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే మీరు ప్రొడక్ట్స్ తాయారు చేయవలసిన అవసరం లేదు. వాటిని స్టోర్ చేయటం, లేదా డెలివర్ చేయటం ఇలాంటి తలనొప్పులు ఏమి ఉండవు.

మీరు చేయవలసిందల్లా మీ రీడర్స్ ఆ ప్రొడక్ట్స్ / సర్వీసెస్ వెబ్సైటు కి పంపటమే. అయితే ఇక్కడ మనం అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మనీ ఎర్న్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీ రీడర్స్ కి మీ పైన నమ్మకం ఉండాలి, మీరు ఒక ప్రోడక్ట్ ని రిఫర్ చేస్తున్నారు అంటే వాళ్ళకి అది ఎంత వరకూ ఉపయోగపడుతుంది అనేది చెక్ చేయాలి. అలాంటి ప్రొడక్ట్స్ రిఫర్ చేయగలిగితేనే  మీరు అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మనీ ఎర్న్ చేయగలరు. మీ పైన నమ్మకం ఉంటేనే మీ రీడర్స్ మీరు రిఫర్ చేసిన ప్రొడక్ట్స్ / సర్వీసెస్ ట్రై చేయగలరు.

అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి అనుకుంటే మీరు ఏదైనా ఒక నెట్వర్క్ లో జాయిన్ అవ్వవచ్చు. మీరు ప్రొడక్ట్స్ / సర్వీసెస్ ప్రమోట్ చేయవచ్చు.

మనకి బాగా తెలిసిన అఫిలియేట్ నెట్వర్క్ అమెజాన్. మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే అమెజాన్ ద్వారా ట్రై చేయవచ్చు. లేదు అనుకుంటే కమిషన్ జంక్షన్ లేదా షేర్ ఏ సేల్ లాంటి నెట్వర్క్స్ నుండి ప్రోడక్ట్స్ లేదా సర్వీసెస్ ప్రోమోట్ చేయవచ్చు. ఈ నెట్వర్క్స్ లో జాయిన్ అవ్వటానికి మీకు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. మీరు ప్రమోట్ చేయటానికి మీకు ఒక బ్లాగ్ కావాలి. మీరు మీ బ్లాగ్ ద్వారా ఆ ప్రోడుక్ట్స్ / సర్వీసెస్ సేల్ చేయవచ్చు.

ఫిజికల్ ప్రొడక్ట్స్

మీ బ్లాగ్ ద్వారా మీ ఓన్ ప్రొడక్ట్స్ సెల్ చేయటం ద్వారా ఎక్కువ ప్రాఫిట్స్ పొందవచ్చు. డిజిటల్ ప్రొడక్ట్స్ తో పోల్చుకుంటే ఫిజికల్ ప్రొడక్ట్స్ కొంచెం ఖర్చుతో కూడుకున్నది. అందుకోసం మీరు ఈ-కామర్స్ స్టోర్ స్టార్ట్ చేయవలసి ఉంటుంది. ఇందుకోసం మీరు ప్రొడక్ట్స్ తయారీకి కావాల్సిన వస్తువులు లేదా మెటీరియల్ వంటివి కొనవలసి ఉంటుంది, అంతే కాకుండా డెలివరీ వంటి ఇష్యూస్ కూడా ఉంటాయి. అదే కనుక మీరు డ్రాప్ షిప్పింగ్ కనుక చేయాలి అనుకుంటే మీ ప్రొడక్ట్స్ , డెలివరీ వంటివి వేరే కంపెనీస్ చూసుకుంటాయి.

డిజిటల్ ప్రొడక్ట్స్

మీ బ్లాగ్ రెగ్యులర్ గా గ్రో అవుతుంది అంటే ఖచ్చితంగా మీ బ్లాగ్ ని ఒక ఆన్లైన్ బిజినెస్ గా ఎక్స్పాండ్ చేయవలసి ఉంటుంది. మీరు బిజినెస్ గా మార్చిన తరువాత మీరు మీకున్న హాబీ ని ప్రొఫెషన్ గా మార్చుకోవచ్చు.  ఈ డిజిటల్ ప్రొడక్ట్స్ లో మీరు ఎబూక్స్ సేల్ చేయవచ్చు, మీ రీడర్స్ కి సబ్స్క్రిప్షన్స్ ద్వారా ప్రీమియం కంటెంట్ అందించవచ్చు. సర్వీసెస్ ని కూడా ప్రోవైడ్ చేయవచ్చు.

చాలా మంది బ్లాగర్స్ ఎబూక్స్, అదే విధంగా ఆన్లైన్ కోర్సెస్ సేల్ చేయటం మనం చూస్తూనే ఉన్నాం. నేను కూడా బ్లాగింగ్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా అని ఒక ఈబూక్ ని రాసాను. దాని ప్రైస్ 999/- కానీ నా బ్లాగ్ రీడర్స్ కి మాత్రం 499/-మీ మాత్రమే అందిస్తున్నాను. ఇలా కూడా బ్లాగ్ ద్వారా మనీ ఎర్న్ చేయవచ్చు.

ఈ విధంగా మీరు మీ బ్లాగ్ ద్వారా మనీ ఎర్న్ చేయవచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటె మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి.

 

మీకు టైం ఉంటె ఈ బ్లాగ్స్ కూడా చదవండి. ఇవి మీకు ఇంకా హెల్ప్ అవుతాయి 👇👇

2 thoughts on “Blog Monetization in Telugu”

  1. sir is this blog made with the blogger interface or WordPress…and please mansion the name of the theme /template by which you have made this blog ….thanks in advance vijay .:)

    1. Hai Chandu, Thank you for visiting our Blog. We made Blogger VJ with complete WordPress and we are using GeneratePress theme.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *