చిన్నచిన్నబిజినెస్లకి ఉండే డిజిటల్ మార్కెటింగ్ మిత్స్

Spread the love

చిన్నచిన్నబిజినెస్లకి ఉండే డిజిటల్ మార్కెటింగ్ మిత్స్ (Digital Marketing myths in Telugu)

చిన్న చిన్న బిజినెస్లని త్వరగా డెవలప్ చేయడంలో డిజిటల్ మార్కెటింగ్ బాగా ఉపయోగపడుతుంది. ఆన్లైన్ లో మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవడానికి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఇంటర్నెట్ లో అందుబాటులో ఉంది. అయితే సరిగ్గా ఇక్కగే ఇంటర్నెట్ లో ఉన్న అపోహలు (myths) మిమ్మల్ని కన్ఫ్యూషన్ లో పడేస్తాయి.

మీరు మీ బిజినెస్ ని త్వరగా డెవలప్ చేసుకోవాలి అంటే డిజిటల్ మార్కెటింగ్ పైన ఫోకస్ చేయాలి. ఈ బ్లాగ్ లో చిన్న చిన్నబిజినెస్ ఓనర్స్ కి ఉండే డిజిటల్ మార్కెటింగ్ మిత్స్ (అపోహలు) గురించి
తెలుసుకుందాం.

digital marketing myths in telugu

Digital Marketing Myths in Telugu

#1 Digital Marketing Myths in Telugu | డిజిటల్ మార్కెటింగ్ పెద్ద పెద్ద బిజినెస్ లకి మాత్రమే

ఒకప్పుడు ఈ మాట నిజం, కానీ ఇప్పుడు కాదు. ఎందుకంటె టెక్నాలజీ లో వచ్చిన ఎన్నో రెవల్యూషన్స్ పరిస్థితులను మార్చాయి. ఈ రోజుల్లో చిన్న చిన్న బిజినెస్ లను డెవలప్ చేసుకోవడం చాలా ఈజీ. స్ట్రాంగ్ ఆన్లైన్ ప్రేసెన్స్ కలిగి ఉండటం వల్ల మన బిజినెస్ ని చాలా త్వరగా డెవలప్ చేసుకోవచ్చు.

చాలా మంది సోషల్ మీడియా, గూగుల్ సెర్చ్, ఆన్లైన్ వెబ్ సైట్స్ ద్వారా కొనుగోళ్ళు చేస్తున్నారు.

మీ వెబ్ సైట్ మీకు ఒక సేల్స్ పర్సన్ గా పని చేస్తుంది. డిజిటల్ మార్కెటింగ్ మీకు మార్కెటింగ్ ఎక్సిక్యుటివ్ గా పని చేస్తుంది. కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ పెద్ద పెద్ద బిజినెస్లకి మాత్రమే కాదు, చిన్న చిన్న బిజినెస్లకి కూడా కావాలి.

#2 Digital Marketing Myths In Telugu | ఈమెయిలు మార్కెటింగ్ స్పాం

చాలా మంది బిజినెస్ ఓనర్స్, క్లైంట్స్  ఈమెయిలు మార్కెటింగ్ నేర్చుకోవటానికి ఆలోచిస్తారు. ఎందుకంటె ఈమెయిలు మార్కెటింగ్ స్పాం అని ఒక అపోహ ఉంది.

డిజిటల్ మార్కెటింగ్ లో ఉండే అన్ని మాడ్యుల్స్ లో ఎక్కువ ROI (రిటర్న్ అఫ్ ఇన్వెస్ట్మెంట్) ఇచ్చే మాడ్యుల్. అంతే కాకుండా ఈమెయిలు మార్కెటింగ్ కాస్ట్ చాలా తక్కువ.

మీరు ఈమెయిలు మార్కెటింగ్ ని మీరు పర్ఫెక్ట్ గా యూస్ చేసుకుంటే మీకు మంచి మంచి రిజల్ట్స్ ఇస్తుంది. అదే ఒకవేళ మీరు ఈమెయిలు మార్కెటింగ్ ని స్పామింగ్ కోసం యూస్ చేస్తే దిని వాళ్ళ వచ్చే రిజల్ట్స్ అన్ని మాడ్యుల్స్ కన్నా తక్కువగా ఉంటాయి.

కానీ చిన్న చిన్న బిజినెస్ లు ఈమెయిలు మార్కెటింగ్ యూస్ చేసుకుని వాళ్ళ ఈమెయిలు డేటాబేస్ ద్వారా మంచి మంచి రిజల్ట్స్ పొందవచ్చు.

#3 Digital Marketing Myths in Telugu |మీరు ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫారం లో ఉండాలి

సోషల్ మీడియా లో అనేక ప్లాట్ఫారంస్  ఉన్నాయి. Facebook, Instagram, Twitter, YouTube, Tiktok, ShareChat, Hello, trell ఇలా చాలా ఉన్నాయి. అయితే మీ బిజినెస్ కి అన్ని ప్లాట్ఫారంస్ యూస్ అవ్వవు.

కాబట్టి మీరు మీ బిజినెస్ కి యూస్ అయ్యే ఏవైనా ౩ ప్లాట్ఫారంస్ యూస్ చేయవచ్చు. ఎందుకంటె ఒక్కో ప్లాట్ఫారం ఒక్కో రకంగా యూస్ అవుతాయి.

ఉదాహరణకి, యూట్యూబ్ లో వీడియోస్ చూడటానికి ఇష్టపడతారు, ఇన్స్టాగ్రామ్ లో ఇమేజ్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు. పిన్ట్రెస్ట్ లో కేవలమ ఇమేజ్స్ ఉంటాయి.

ఈమెయిలుస్ లో ఈమెయిలు మెసేజెస్, whatsapp చాటింగ్ కోసం యూస్ చేస్తారు. అదే మనం ఎక్కుఅవ ప్లాట్ఫారంస్ యూస్ చేయడం స్టార్ట్ చేస్తే అన్ని ప్లాట్ఫారంస్ లో ఆక్టివ్ గా కంటెంట్ పోస్ట్ చేయటం కష్టం.

ఎందుకంటే ఒక్కో ప్లాట్ఫారంలో ఒక్కో టైప్ కంటెంట్ పోస్ట్ చేయాలి. సోషల్ మీడియా లో రెగ్యులర్ గా పోస్టింగ్స్ చేయకపోతే మీ ప్రొఫైల్స్, పేజెస్, ఎక్కువ మందికి రీచ్ అవ్వవు. కాబట్టి మీరు ప్రతి సోషల్ మీడియా లో ఉండాల్సిన అవసరం లేదు.

#4 Digital Marketing Myths in Telugu | ఇన్స్టెంట్ రిజల్ట్స్

డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మానని ఇన్స్టంట్ రిజల్ట్స్ మాత్రమే వస్తాయి. కానీ డిజిటల్ మార్కెటింగ్ లో మనం చాలా కష్టపఅది కంటెంట్, క్రియేట్ చేయటం, కంటెంట్ డిస్ట్రిబ్యూట్ చేయడం వంటివి చేస్తాం.

అయితే మన హార్డ్ వర్క్ లాంగ్ రన్ లో కూడా రిజల్ట్స్ ఇవ్వాలి అని మనం అనుకుంటాం. అయితే డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మనకి ఇన్స్టెంట్ రిజల్ట్స్ మత్రకే వస్తాయి అనెడు ఒక అపోహ మాత్రమే.

ఎందుకంటె మనం చేసే కంటెంట్ మార్కెటింగ్, SEO, సోషల్ మీడియా మేనేజ్మెంట్ మనకి లాంగ్ రన్ లో మనకి రిజల్ట్స్ ని ఇస్తాయి. అయితే PPC, సోషల్ మీడియా మార్కెటింగ్ లా ద్వారా ఇన్స్టెంట్ రిజల్ట్స్ కూడా వస్తాయి.

మనం డిజిటల్ మార్కెటింగ్ లో చేసే ఎఫర్ట్స్, ఇంకా రిజల్ట్స్ ట్రాక్ చేయగలం. దిని బట్టి మనకి ఇన్స్టెంట్ రిజల్ట్స్ మాత్రమే కాకుండా లాంగ్ రన్ లో కూడా రిజల్ట్స్ వస్తాయి అని తెలుసుకోవచ్చు.

#5 Digital Marketing Myths in Telugu | లాంగ్ ఆర్టికల్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వటం

డూప్లికేట్ కంటెంట్ యూస్ చేయటం, లాంగ్ ఆర్టికల్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది ఒక డిజిటల్ మార్కెటింగ్ అపోహ. చాలా మంది బిజినెస్ ఓనర్స్ వెబ్ సైట్స్ లో కాపీ చేసి పేస్టు చేస్తూ ఉంటారు.

అలా చేయడం వల్ల ఏం కాదు, పర్లేదు అని చెప్తూ ఉంటారు. కానీ గూగుల్ మీ వెబ్ సైట్ ర్యాంకింగ్స్ తగ్గిస్తుంది. మీరు అలాగే డూప్లికేట్ కంటెంట్ పబ్లిష్ చేస్తుంటే మీ వెబ్ సైట్ ని స్పాం క్రింద ట్రీట్ చేసి బాన్ చేస్తుంది.

అదే విధంగా చాలా మంది మార్కేటర్స్ లాంగ్ ఆర్టికల్స్ యూస్ చేయాలి అని చెప్తూంటారు. లాంగ్ ఆర్టికల్స్ యూస్ చేయటం మంచిదే. కానీ అన్నిసార్లు ఆ ట్రిక్ వర్క్ చేయదు.

ఎందుకంటె సింపుల్ ఆన్సర్స్ కావాలి అనుకునేవారికి మీ లాంగ్ ఆర్టికల్స్ చిరాకు తెప్పించి, ఇంకో వెబ్ సైట్ కి వెళ్ళేలా చేస్తాయి. అన్ని కేసెస్ లో లాంగ్ ఆర్టికల్స్ యూస్ అవ్వవు.

మరి సొల్యూషన్ ఏంటి? మీరు లాంగ్ ఆర్టికల్స్ తో పాటు, షార్ట్ మీడియం ఆర్టికల్స్ ని కూడా డిఫరెంట్ స్టైల్స్ లో పబ్లిష్ చేయాలి. మనం మన వెబ్ సైట్ ద్వారా అందించే క్వాలిటీ ఇన్ఫర్మేషన్ మన నుండి మన ప్రొడక్ట్స్, సర్వీసెస్ పర్చేస్ చేసేలా ఎంకరేజ్ చేస్తాయి. మంచి కంటెంట్ అంటే మన బిజినెస్ కి మంచి బెనిఫిట్ అన్నమాట.

ఇవి డిజిటల్ మార్కెటింగ్ గురించి చిన్న చిన్న బుసినెస్ ఓనర్స్ కి ఉండే టాప్ డిజిటల్ మార్కెటింగ్ మిత్స్ (myths). మీకు కూడా ఇలాంటి అపోహలే ఉంటే వాటిని క్లియర్ చేయటమే ఆ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం.

మీకు ఇంకా డిజిటల్ మార్కెటింగ్ గురించి ఏమన్నా అపోహలు ఉంటె కామెంట్ చేయండి. ఈ ఆర్టికల్ ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయండి.

Leave a Comment