Smart Phone Blogging in Telugu in 2021

Spread the love

బ్లాగింగ్ అనేది ఒక స్టాండర్డ్ వర్క్. బ్లాగ్ పోస్ట్స్ చిన్నవి, పెద్దవి రాయటం వాటిని వెంటనే పోస్ట్ చేయటం లాంటివి చేసేవాళ్ళం. కానీ ఇదంతా ఒక 5 ఏళ్ళ క్రితం. ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ తో కూడా బ్లాగింగ్ చేస్తున్నారు.

గడిచిన 10 ఏళ్ళల్లో బ్లాగింగ్ మంచి బాగా మారింది. మనం ఇంకా ఎక్కువ బ్లాగ్ పోస్ట్స్ రాస్తున్నాం. ఇంకా ఎక్కువ ప్లాట్ఫారంస్ యూస్ చేస్తున్నాం. అయితే ఒక్క విషయం మాత్రం మారుతూ వస్తుంది. ఒకప్పుడు మనం బ్లాగ్ ని కంప్యూటర్ ద్వారా మాత్రమే యాక్సెస్ చేయగలిగేవాళ్ళం. కానీ ఇప్పుడు మనం మొబైల్ నుండి కూడా మన బ్లాగ్స్ ని యాక్సెస్ చేస్తున్నాం.

అంతే కాకుండా ఎంతో మంది నన్ను instagram లో మెసేజెస్ చేస్తున్నారు, అన్న, మొబైల్ ద్వారా బ్లాగింగ్ చేయవచ్చా అని. అటువంటి డౌట్ మీకు కూడా ఉంటె ఈ Smart Phone Blogging in Telugu బ్లాగ్ పోస్ట్ మీకోసమే.

Smart Phone Blogging in Telugu

smart phone blogging in telugu

మీరు మొబైల్స్ ద్వారా బ్లాగింగ్, వీడియో బ్లాగింగ్ కూడా చేయవచ్చు. మంచి మంచి ఫొటోస్ తీయవచ్చు, మంచి వీడియోస్ షూట్ చేయవచ్చు, కంటెంట్ క్రియేట్ చేయవచ్చు, మీ సోషల్ మీడియా పోస్ట్స్ షెడ్యూల్ చేయవచ్చ్చు. ఇంకా ఎన్నో పనులు చేయవచ్చు.

స్మార్ట్ ఫోన్ బ్లాగింగ్ లో మనం ఏమేమి చేయవచ్చు, ఏమేమి చేయకూడదు అని తెలుసుకుందాం.

కొన్ని టిప్స్ బ్లాగింగ్ రిలేటెడ్ టాప్ యాప్స్ గురించి చూద్దాం.

blogging apps for smart phone blogging

వర్డుప్రెస్సు

వర్డుప్రెస్సు ప్రపచంలోనే కొన్ని లక్షల మంది యూస్ చేస్తున్న CMS (కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టం) అప్లికేషను.

మీరు బ్లాగింగ్ కోసం వర్డుప్రెస్సు యూస్ చేసున్నారా? మీ సమాధానం అవును అయితే మీకు ఖచ్చితంగా వర్డుప్రెస్సు యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ వర్డుప్రెస్సు యాప్ ఆపిల్, ఆండ్రాయిడ్ లలో కూడా ఉంది.

ఈ వర్డుప్రెస్సు యాప్ తో మీరు ఏమేమి చేయవచ్చు అంటే

  • బ్లాగ్ పోస్ట్స్ వ్రాయవచ్చు.
  • మీ వెబ్సైటు అనలిటిక్స్ చెక్ చేయవచ్చు
  • మీ బ్లాగ్ లో చేసిన కామెంట్స్ అప్ప్రోవ్ చేయవచ్చు, లేదా రిమూవ్ చేయవచ్చు

అంటే ఒక బ్లాగర్ గా మీరు ఏమేమి చేయవచ్చో అవి అన్ని వర్డుప్రెస్సు యాప్ తో చేయవచ్చు.

మీరు బ్లాగింగ్ కోసం iPhone యూస్ చేస్తున్నారా? అయితే ఇక్కడి నుండి మీరు మీ వర్డుప్రెస్సు యాప్ ఇన్స్టాల్ చేసుకోండి.

మీరు బ్లాగింగ్ కోసం ఆండ్రాయిడ్ యూస్ చేస్తున్నారా? అయితే ఇక్కడి నుండి మీరు మీ వర్డుప్రెస్సు యాప్ ఇన్స్టాల్ చేసుకోండి.

వర్డుప్రెస్సు ద్వారా ఒక బ్లాగ్ ని ఎలా క్రియేట్ చేయాలి?

Blogger

బ్లాగర్ ప్లాట్ఫారం కూడా బ్లాగింగ్ కోసం ఎక్కువగా యూస్ చేసే ప్లాట్ఫారం.  మీరు బ్లాగర్ ద్వారా ఫ్రీ గా ఒక బ్లాగ్ ని క్రియేట్ చేయవచ్చు. ఎంతో మంది బ్లాగింగ్ స్టార్ట్ చేయాలి అనుకునేవారు, హోస్టింగ్ తీసుకోవటానికి డబ్బులు లేని వాళ్ళు బ్లాగర్ ప్లాట్ఫారం ద్వారానే వాళ్ళ కెరీర్ ని స్టార్ట్ చేస్తారు.

నేను కూడా బ్లాగర్ తోనే నా బ్లాగింగ్ కెరీర్ ని స్టార్ట్ చేశాను. ఒకవేళ మీరు బ్లాగర్ ప్లాట్ఫారం ద్వారా బ్లాగింగ్ చేస్తుంటే మీరు బ్లాగర్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు.

ఈ బ్లాగర్ యాప్ ద్వారా

  • బ్లాగ్ పోస్ట్స్ క్రియేట్ చేయవచ్చు.
  • పోస్ట్స్ & పేజెస్ ఎడిట్ చేయవచ్చు.
  • లేబుల్స్ యాడ్ చేయవచ్చు.
  • మీ స్మార్ట్ ఫోన్ నుండి వీడియోస్, ఇమేజ్స్ యాడ్ చేయవచ్చు.

అయితే బ్లాగర్ యాప్ iphone యూసర్స్ కి లేదు. కేవలం ఆండ్రాయిడ్ లో మాత్రమే ఉంది. చూద్దాం iphone కోసం చేస్తారేమో.

ఒకవేళ మీరు బ్లాగర్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

బ్లాగర్ బ్లాగ్ ఎలా క్రియేట్ చేయాలి?

Tumblr

Tumblr యాప్ మాత్రమే దాదాపు iphone, ఆండ్రాయిడ్ రెండింటిలో ఎక్కువగా ఇన్స్టాల్ చేసుకున్న బ్లాగింగ్ యాప్. వర్డుప్రెస్సు, బ్లాగర్ ల కన్నా ఎక్కువ డౌన్లోడ్స్ ఉన్న యాప్.

దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత మంది స్మార్ట్ ఫోన్ బ్లాగింగ్ చేస్తున్నారు అని.

మీరు బ్లాగింగ్ కోసం iPhone యూస్ చేస్తున్నారా? అయితే ఇక్కడి నుండి మీరు మీ Tumblr యాప్ ఇన్స్టాల్ చేసుకోండి.

మీరు బ్లాగింగ్ కోసం ఆండ్రాయిడ్ యూస్ చేస్తున్నారా? అయితే ఇక్కడి నుండి మీరు మీ Tumblr యాప్ ఇన్స్టాల్ చేసుకోండి.

WIX

Wix అనేది ఇంకొక పాపులర్ బ్లాగింగ్ యాప్. అయితే మిగితా బ్లాగింగ్ ప్లాట్ఫారంస్ ల కాకుండా, ఇది ఒక క్లౌడ్ బేస్డ్ ఆన్లైన్ బ్లాగింగ్ ప్లాట్ఫారం, డ్రాగ్ & డ్రాప్ పద్దతిలో నిమిషాల వ్యవధిలో వెబ్సైటుస్ చేయవచ్చు.

Wix కూడా బ్లాగింగ్ యాప్ ని ప్రోవైడ్ చేస్తుంది. ఒకవేళ మీరు Wix ద్వారా స్మార్ట్ ఫోన్ బ్లాగింగ్ చేయాలి అనుకుటే చేయవచ్చు.

మీరు బ్లాగింగ్ కోసం iPhone యూస్ చేస్తున్నారా? అయితే ఇక్కడి నుండి మీరు మీ Wix యాప్ ఇన్స్టాల్ చేసుకోండి.

మీరు బ్లాగింగ్ కోసం ఆండ్రాయిడ్ యూస్ చేస్తున్నారా? అయితే ఇక్కడి నుండి మీరు మీ Wix యాప్ ఇన్స్టాల్ చేసుకోండి.

Weebly

Weebly కూడా ఇంకొక బ్లాగింగ్ ప్లాట్ఫారం. Wix లాగే ఇది కూడా డ్రాగ్ & డ్రాప్ మెథడ్ తో వెబ్సైటు లేదా బ్లాగ్ ని స్క్రాచ్ నుండి నిమిషాల్లోనే చేసుకోగల ప్లాట్ఫారం. ఎటువంటి కోడింగ్ లేకుండా మీరు బ్లాగ్స్ వెబ్సైటుస్ చేసుకోవచ్చు.

మీరు బ్లాగింగ్ కోసం iPhone యూస్ చేస్తున్నారా? అయితే ఇక్కడి నుండి మీరు మీ Weebly యాప్ ఇన్స్టాల్ చేసుకోండి.

మీరు బ్లాగింగ్ కోసం ఆండ్రాయిడ్ యూస్ చేస్తున్నారా? అయితే ఇక్కడి నుండి మీరు మీ Weebly యాప్ ఇన్స్టాల్ చేసుకోండి.

స్మార్ట్ ఫోన్ బ్లాగింగ్ లాభ నష్టాలు

smart phone blogging advantages & disadvantages

లాభాలు:

  • మీరు ఎప్పుడైనా బ్లాగింగ్ చేయవచ్చు. (అంటే మీరు జర్నీస్ లో ఉన్నా, ఎక్కడైనా క్యూలో ఉన్న కూడా)
  • మీరు ఇంకా ప్రోడక్టివ్ గా వర్క్ చేయవచ్చు.
  • మీరు మీ బ్లాగ్ ని ఎప్పుడైనా యాక్సెస్ చేయవచ్చు.

నష్టాలు:

  • కొంచెం గజిబిజిగా ఉంటుంది.
  • మీరు బ్లాగింగ్ కి సంబంధిచిన అన్ని పనులు స్మార్ట్ ఫోన్ యూస్ చేసుకుని చేయలేరు.
  • మీరు మీ వెబ్సైటు కి సంబంధించిన కోర్ ఫైల్స్ ఎడిట్ చేయలేరు. లేదా FTP లోకి లాగిన్ అవ్వలేరు.
  • మీ బ్లాగ్ కంటెంట్ చేంజ్ చేయాలన్న, లేదా కొత్తగా క్రియేట్ చేయాలన్న మీరు మొబైల్ ద్వారా ఫాస్ట్ గా టైపు చేయలేరు.
  • డెస్క్టాపు లో చేసినట్లుగా మీరు ఒకేసారి కంటెంట్ రీసెర్చ్, కంటెంట్ క్రియేషన్ చేయలేరు.
  • స్మార్ట్ ఫోన్ స్క్రీన్, కీబోర్డ్, ఫంక్షనాలిటి లో లిమిటేషన్స్ ఉంటాయి. (ఉదాహరణకి డెస్క్టాపు లేదా లాప్టాప్ తో ఒక 1000వర్డ్స్ తో ఒక ఆర్టికల్ వ్రాయటానికి 1-2 గంటలు పడుతుంది. కానీ మొబైల్ లో కూడా అంతే టైం లో వ్రాయగలమా? )

స్మార్ట్ ఫోన్ తో బ్లాగింగ్ లో ఏమేమి చేయవచ్చు? Do’s List

smart phone blogging dos list

మనం సాదారణంగా కొన్ని మిస్టేక్స్ టైపు చేస్తుంటాం. కొంతమంది కామెంట్స్ లో లేదా పర్సనల్ గా కూడా మెయిల్ చేస్తారు, ఫలానా చోట పళన మిస్టేకస్ ఉన్నాయి అని. అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ని సరి చేయటం మన కర్తవ్యమ్. అప్పుడే మనకి మొబైల్ బ్లాగింగ్ యప్స్ బాగా హెల్ప్ అవుతాయి. అతి తక్కువ టైం లో మనం ఆ మిస్టేక్స్ సరి చేయవచ్చు. మనం మొబైల్ బ్లాగింగ్ యాప్స్ తో సిస్టం దగ్గర లేకపోయినా మన వర్క్ ఆగకుండా ఉంటుంది.

కామెంట్స్ మోడరేట్ చేయవచ్చు.

కామెంట్ మోడరేషన్ అనేది దాదాపుగా ప్రతి బ్లాగ్ లో ఉంటుంది. అయితే ఒక్కోసారి మనం మన వర్క్స్ లో పడి బ్లాగ్ ఓపెన్ చేయకపోతే మనకి ఎవరు కామెంట్ చేసిన తెలియదు. అలాంటప్పుడు మనం మన కామెంట్స్ అప్ప్రోవ్ చేయలేము. లేదా మనం సిస్టంకి అందుబాటులో లేనప్పుడు వచ్చిన కామెంట్స్ మనం అప్ప్రోవ్ చేయాలి అంటే అప్పుడు మొబైల్ బ్లాగింగ్ యప్స్ బాగా హెల్ప్ అవుతాయి.

రీసెర్చ్ చేయటానికి

స్మార్ట్ ఫోన్స్ ద్వారా బ్లాగ్ పోస్ట్స్ వ్రాయమని నేను రికమెండ్ చేయను. ఎందుకో ఇదే పోస్ట్ లో ఇంకొంచెం ముందుకు వెళ్ళాక తెలుసుకుందాం.

బ్లాగర్స్ తమ స్మార్ట్ ఫోన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ చేయవచ్చు. వాళ్ళ నెక్స్ట్ బ్లాగ్స్ కోసం కంటెంట్ గ్రబ్ చేయవచ్చు. గూగుల్ లో సెర్చ్ చేయవచ్చు. మీ నిష్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. మీరు బ్లాగ్ పోస్ట్ వ్రాయటనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఒకచోట గ్రబ్ చేసి మీరు బ్లాగ్ పోస్ట్స్ వ్రాయటనికి రెడీ అవ్వవచ్చు.

స్మార్ట్ ఫోన్ తో బ్లాగింగ్ లో ఏమేమి చేయలేము? Don’ts List:

smart phone blogging does not list

బ్లాగ్ పోస్ట్స్ వ్రాయటం.

మొబైల్ బ్లాగింగ్ యాప్స్ అన్ని కూడా బ్లాగ్ పోస్ట్స్ స్క్రాచ్ నుండి వ్రాయటనికి అవకాశాన్ని కల్పిస్తున్నాయి. కానీ అలా మొబైల్ లో బ్లాగ్ పోస్ట్ వ్రాయటం అనేది అంత మంచి ఐడియా కాదు.

ఎందుకంటె మొబైల్ కీబోర్డ్ లో మనం ఫాస్ట్గా చాట్ చేయగలేమేమో కానీ, ఫాస్ట్ గా టైపింగ్ చేయలేము. ఎందుకంటె అక్కడ ఉన్న లిమిటెడ్ స్పేస్ లో మనం ఎక్కువ సేపు టైపింగ్ చేయలేము.

అంతే కాకుండా చాలా టైం పడుతుంది మొబైల్ లో బ్లాగ్ పోస్ట్ టైపు చేయటానికి. అలా కాకుండా మనం మన డెస్క్టాపు లేదా లాప్టాప్ లో కంటెంట్ టైప్ చేసుకుని దాన్ని మొబైల్ కి ట్రాన్స్ఫర్ చేసుకుని అప్పుడు మొబైల్ లో దాన్ని పబ్లిష్ చేసుకోవచ్చు.

నేను అయితే మొబైల్ లో బ్లాగ్ పోస్ట్ టైపింగ్ చేయటాన్ని రికమెండ్ చేయను.

HTML ఎడిట్ చేయటం

ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో అయిన HTML ట్యాగ్ ఒక్కటి బ్రేక్ అయినా మొతం వెబ్సైటు యొక్క లేఔట్ మొత్తం డిస్టర్బ్అవుతుంది. సాదారణంగా మనం డెస్క్టాపు లేదా లాప్టాప్ నుండి టైపు చేసేటప్పుడు ఎన్నో మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. అదే మొబైల్ లో టైపు చేసేటప్పుడు ఇంకా ఎక్కువ మిస్టేక్స్ జరుగుతాయి. అటువంటప్పుడు మీరు HTML కోడ్ ని స్మార్ట్ ఫోన్ ద్వారా ఎడిట్ చేస్తుంటే కొంచెం కష్టంగా ఉంటుంది.

అదే వర్క్ మీరు డెస్క్టాపు లో చేయటానికి చేసిన కొన్ని మిస్టేక్స్ జరిగీ అవకాశం ఉంది. మరి స్మార్ట్ ఫోన్ లో HTML ఎడిట్ చేయటం కుదరని పని.

ఇందుకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. రీసెంట్ గా నేను ఒక బ్లాగర్ తో ఇంటరాక్ట్ అవ్వాల్సి వచ్చింది. (అవును అవ్వాల్సి వచ్చింది). అతను బ్లాగర్ ద్వారా బ్లాగ్ స్టార్ట్ చేసాడు. మీకు తెలుసు కదా! బ్లాగర్ లో కోడింగ్ అంతా XML లో ఉంటుంది.

అయితే అతను ఆ బ్లాగ్ ని చివరి వరకు నా వీడియో ట్యుటోరియల్స్ చూసి స్మార్ట్ ఫోన్ లోనే  డిజైన్ చేసుకున్నాడు. కానీ ఒక్క ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఎక్కడో కోడింగ్ లో మిస్టేక్ చేసాడు. దాంతో ఒక్కసారిగా అతని బ్లాగ్ లేఔట్ అంత డిస్టర్బ్ అయ్యింది.

ఎక్కడ మిస్టేక్ జరిగిందో తెలియదు, కాబట్టి మళ్ళి అతను మళ్ళి బ్లాగ్ ని ఫస్ట్ నుండి డిజైన్ చేసుకోవాల్సి వచ్చింది.

అందుకే స్మార్ట్ ఫోన్ లో కోడింగ్ ఎడిట్ చేయటం కష్టం మాత్రమే కాదు, మేము ఎవరం రిఫర్ చేయము.

చిన్న చిన్న చేంజెస్ చేసుకోవచ్చు కానీ, థీమ్ కష్టమైజేషన్ చేయటం కుదరని పని.

Smart Phone Blogging in Telugu ముగింపు

ఇప్పుడు చాలా మంది లాప్టాప్స్ కన్నా కూడా మొబైల్స్ లోనే వర్క్ చేసుకోవటానికి ఇష్టపడుతున్నారు. మొబైల్ ఇండస్ట్రీ కూడా విపరీతంగా పెరుగుతుంది. ఇదంతా చదివిన తరువాత మీరు డిసైడ్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ ద్వారా బ్లాగింగ్ చేయవచ్చా? లేదా? అని.

ఒకవేళ స్మార్ట్ ఫోన్ బ్లాగింగ్ గురించి మేము ఏమైనా మర్చిపోతే కామెంట్ లో తెలియచేయండి. వాటిని నెక్స్ట్ అప్డేట్ లో యాడ్ చేస్తాను. ఈ బ్లాగ్ పోస్ట్ ఎలా ఉంది, మీ అభిప్రాయం ఏంటి అని కూడా మాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి.

ఆన్లైన్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో బ్లాగింగ్ చాలా పవర్ఫుల్ ప్లాట్ఫారం. దీనిని యూస్ చేసుకోండి. ఈ పోస్ట్ బాగుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ కి, మీ అక్కలకి, చెల్లెళ్లకి, అన్నలకి, తమ్ముళ్ళకి, బావలకి, బామ్మర్దులకి, మరదల్లకి షేర్ చేయండి. ఈ పోస్ట్ షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి.

11 thoughts on “Smart Phone Blogging in Telugu in 2021”

  1. మొబైల్ ద్వారా బ్లాగింగ్ చేయవచ్చా? చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఇదే డౌట్ నాకూ ఎప్పటి నుండో వుంది. దీని గురించి నేను చాలా ఆర్టికల్స్ చదివాను, యూట్యూబ్ లో వీడియోస్ కూడా చాలా చూశాను. కొంత మంది పూర్తిగా పొజిటివ్ గా లేదా పూర్తిగా నెగెటివ్ గా చెప్పారు. దాంతో నాకు ఏమీ అర్దం కాలేదు. మొబైల్ ద్వారా బ్లాగింగ్ చేస్తే వుండే లాభాలు & నష్టాలు ఏంటనేవి మీరు చాలా క్లియర్ చెప్పారు. ఇప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చింది. బ్లాగ్స్ రాయడానికి చాలా మంది రాస్తారు, కానీ అవి చాలా మందికి అర్దం కాకుండా వుంటాయి. కానీ అందరికీ అర్దం అయ్యేలా, అందరికీ ఉపయోగపడేలా మీరు బ్లాగ్స్ రాస్తున్నందుకు థాంక్యూ సో మచ్ బ్రదర్.

    Reply
    • ఈ డౌట్ చాలా మందికి ఉంది. నన్ను కూడా చాలా మంది అడిగారు. అందుకోసమే ఈ బ్లాగ్ పోస్ట్ రాయటం జరిగింది. అందరికి ఉపయోగపడే మరిన్ని పోస్ట్స్ రాయటం కోసం ప్రయత్నిస్తున్నాను. మీ సపోర్ట్ కి ధన్యవాదాలు

      Reply
  2. చాలా బాగా రాసావ్. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వుంది ఈ బ్లాగ్ పోస్ట్ లో.
    లాభనష్టాలు చాలా బాగా వివరించావ్. అన్ని బ్లాగ్ ప్లాట్ఫారం గురించి చెప్పావ్.
    నిజం చెప్పాలి అంటే నువ్వు ఏఒక్క పాయింట్ కూడా వదలలేదు.
    నువ్వు ఇంకా ఇల్లాంటి మంచి మంచి బ్లాగ్స్ రాయాలి అని కోరుకుంటున్న.

    With all love
    Urs Vishnu

    Reply
    • Thank you Bro, ఈ మధ్య చాలా మంది మొబైల్ ద్వారా బ్లాగింగ్ చేయవచ్చా అని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం డిటైల్డ్ గా ఒక పోస్ట్ రాస్తే బాగుంటుంది అని అనిపించింది. అందుకే ఈ బ్లాగ్ పోస్ట్ క్లియర్ గా వ్రాసాను. మీ సపోర్ట్ కి ధన్యవాదాలు బ్రో.

      Reply
  3. Very useful information to me now a people’s are using laptops but many people active in social media. They can post lot of activities in there. Are you explained a lot of platforms about smartphone blogging. It was a good opportunity to who have a good contact to post. This article is very useful to me.

    Thank you. Bloggervj

    Reply
    • You’re 100% Correct Chandra Sekhar. There are a lot of opportunities in the digital Era. We have to choose the right one. That’s crucial in the game. Thanks for sharing your thoughts about this blog post.

      Reply
    • Blogging mobile lo cheyatam konni vishayallo manchidi, konni vishayalu konchem kashtam. Anthe kakunda chalaa rojula nundi nannu yentho mandi ide prashna adugutoo unnaru. anduke oka detail blog post raste baguntundi ani anipinchi ee blog post rasanu. Thanks for sharing your valuable feedback. Soon we are starting a course on mobile blogging.

      Reply
    • Blogging mobile lo cheyatam konni vishayallo manchidi, konni vishayalu konchem kashtam. Thanks for sharing your valuable feedback. Soon we are starting a course on mobile blogging.

      Reply
  4. చాలా బాగుంది సార్..
    బ్లాగ్ మొదలు పెట్టడం కోసం ఏఏ ప్లాట్ ఫార్మ్స్ ఉంటాయో చాలా మందికి తెలిసి ఉండదు. అనడ్రు బ్లాగర్ మాత్రమే ఉంటుందని అనుకుంటారు కానీ అది మాత్రమే కాకుండా వీటి వల్ల కూడా మనం ఒక బ్లాగ్ ని మొదలుపెట్టవచ్చునని ఈ ఆర్టికల్ చదివాకే అర్థం అయ్యింది. ధన్యవాదాలు సార్

    Reply
    • ధన్యవాదాలు శ్రీహర్ష. మరింతమందికి బ్లాగింగ్ అందుబాటులోకి రావాలి అనేదే మా ప్రయత్నం.

      Reply

Leave a Comment