Always VJ

Smart Phone Blogging in Telugu in 2021

Spread the love

బ్లాగింగ్ అనేది ఒక స్టాండర్డ్ వర్క్. బ్లాగ్ పోస్ట్స్ చిన్నవి, పెద్దవి రాయటం వాటిని వెంటనే పోస్ట్ చేయటం లాంటివి చేసేవాళ్ళం. కానీ ఇదంతా ఒక 5 ఏళ్ళ క్రితం. ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ తో కూడా బ్లాగింగ్ చేస్తున్నారు.

గడిచిన 10 ఏళ్ళల్లో బ్లాగింగ్ మంచి బాగా మారింది. మనం ఇంకా ఎక్కువ బ్లాగ్ పోస్ట్స్ రాస్తున్నాం. ఇంకా ఎక్కువ ప్లాట్ఫారంస్ యూస్ చేస్తున్నాం. అయితే ఒక్క విషయం మాత్రం మారుతూ వస్తుంది. ఒకప్పుడు మనం బ్లాగ్ ని కంప్యూటర్ ద్వారా మాత్రమే యాక్సెస్ చేయగలిగేవాళ్ళం. కానీ ఇప్పుడు మనం మొబైల్ నుండి కూడా మన బ్లాగ్స్ ని యాక్సెస్ చేస్తున్నాం.

అంతే కాకుండా ఎంతో మంది నన్ను instagram లో మెసేజెస్ చేస్తున్నారు, అన్న, మొబైల్ ద్వారా బ్లాగింగ్ చేయవచ్చా అని. అటువంటి డౌట్ మీకు కూడా ఉంటె ఈ Smart Phone Blogging in Telugu బ్లాగ్ పోస్ట్ మీకోసమే.

Smart Phone Blogging in Telugu

smart phone blogging in telugu

మీరు మొబైల్స్ ద్వారా బ్లాగింగ్, వీడియో బ్లాగింగ్ కూడా చేయవచ్చు. మంచి మంచి ఫొటోస్ తీయవచ్చు, మంచి వీడియోస్ షూట్ చేయవచ్చు, కంటెంట్ క్రియేట్ చేయవచ్చు, మీ సోషల్ మీడియా పోస్ట్స్ షెడ్యూల్ చేయవచ్చ్చు. ఇంకా ఎన్నో పనులు చేయవచ్చు.

స్మార్ట్ ఫోన్ బ్లాగింగ్ లో మనం ఏమేమి చేయవచ్చు, ఏమేమి చేయకూడదు అని తెలుసుకుందాం.

కొన్ని టిప్స్ బ్లాగింగ్ రిలేటెడ్ టాప్ యాప్స్ గురించి చూద్దాం.

వర్డుప్రెస్సు

వర్డుప్రెస్సు ప్రపచంలోనే కొన్ని లక్షల మంది యూస్ చేస్తున్న CMS (కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టం) అప్లికేషను.

మీరు బ్లాగింగ్ కోసం వర్డుప్రెస్సు యూస్ చేసున్నారా? మీ సమాధానం అవును అయితే మీకు ఖచ్చితంగా వర్డుప్రెస్సు యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ వర్డుప్రెస్సు యాప్ ఆపిల్, ఆండ్రాయిడ్ లలో కూడా ఉంది.

ఈ వర్డుప్రెస్సు యాప్ తో మీరు ఏమేమి చేయవచ్చు అంటే

అంటే ఒక బ్లాగర్ గా మీరు ఏమేమి చేయవచ్చో అవి అన్ని వర్డుప్రెస్సు యాప్ తో చేయవచ్చు.

మీరు బ్లాగింగ్ కోసం iPhone యూస్ చేస్తున్నారా? అయితే ఇక్కడి నుండి మీరు మీ వర్డుప్రెస్సు యాప్ ఇన్స్టాల్ చేసుకోండి.

మీరు బ్లాగింగ్ కోసం ఆండ్రాయిడ్ యూస్ చేస్తున్నారా? అయితే ఇక్కడి నుండి మీరు మీ వర్డుప్రెస్సు యాప్ ఇన్స్టాల్ చేసుకోండి.

వర్డుప్రెస్సు ద్వారా ఒక బ్లాగ్ ని ఎలా క్రియేట్ చేయాలి?

Blogger

బ్లాగర్ ప్లాట్ఫారం కూడా బ్లాగింగ్ కోసం ఎక్కువగా యూస్ చేసే ప్లాట్ఫారం.  మీరు బ్లాగర్ ద్వారా ఫ్రీ గా ఒక బ్లాగ్ ని క్రియేట్ చేయవచ్చు. ఎంతో మంది బ్లాగింగ్ స్టార్ట్ చేయాలి అనుకునేవారు, హోస్టింగ్ తీసుకోవటానికి డబ్బులు లేని వాళ్ళు బ్లాగర్ ప్లాట్ఫారం ద్వారానే వాళ్ళ కెరీర్ ని స్టార్ట్ చేస్తారు.

నేను కూడా బ్లాగర్ తోనే నా బ్లాగింగ్ కెరీర్ ని స్టార్ట్ చేశాను. ఒకవేళ మీరు బ్లాగర్ ప్లాట్ఫారం ద్వారా బ్లాగింగ్ చేస్తుంటే మీరు బ్లాగర్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు.

ఈ బ్లాగర్ యాప్ ద్వారా

అయితే బ్లాగర్ యాప్ iphone యూసర్స్ కి లేదు. కేవలం ఆండ్రాయిడ్ లో మాత్రమే ఉంది. చూద్దాం iphone కోసం చేస్తారేమో.

ఒకవేళ మీరు బ్లాగర్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

బ్లాగర్ బ్లాగ్ ఎలా క్రియేట్ చేయాలి?

Tumblr

Tumblr యాప్ మాత్రమే దాదాపు iphone, ఆండ్రాయిడ్ రెండింటిలో ఎక్కువగా ఇన్స్టాల్ చేసుకున్న బ్లాగింగ్ యాప్. వర్డుప్రెస్సు, బ్లాగర్ ల కన్నా ఎక్కువ డౌన్లోడ్స్ ఉన్న యాప్.

దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత మంది స్మార్ట్ ఫోన్ బ్లాగింగ్ చేస్తున్నారు అని.

మీరు బ్లాగింగ్ కోసం iPhone యూస్ చేస్తున్నారా? అయితే ఇక్కడి నుండి మీరు మీ Tumblr యాప్ ఇన్స్టాల్ చేసుకోండి.

మీరు బ్లాగింగ్ కోసం ఆండ్రాయిడ్ యూస్ చేస్తున్నారా? అయితే ఇక్కడి నుండి మీరు మీ Tumblr యాప్ ఇన్స్టాల్ చేసుకోండి.

WIX

Wix అనేది ఇంకొక పాపులర్ బ్లాగింగ్ యాప్. అయితే మిగితా బ్లాగింగ్ ప్లాట్ఫారంస్ ల కాకుండా, ఇది ఒక క్లౌడ్ బేస్డ్ ఆన్లైన్ బ్లాగింగ్ ప్లాట్ఫారం, డ్రాగ్ & డ్రాప్ పద్దతిలో నిమిషాల వ్యవధిలో వెబ్సైటుస్ చేయవచ్చు.

Wix కూడా బ్లాగింగ్ యాప్ ని ప్రోవైడ్ చేస్తుంది. ఒకవేళ మీరు Wix ద్వారా స్మార్ట్ ఫోన్ బ్లాగింగ్ చేయాలి అనుకుటే చేయవచ్చు.

మీరు బ్లాగింగ్ కోసం iPhone యూస్ చేస్తున్నారా? అయితే ఇక్కడి నుండి మీరు మీ Wix యాప్ ఇన్స్టాల్ చేసుకోండి.

మీరు బ్లాగింగ్ కోసం ఆండ్రాయిడ్ యూస్ చేస్తున్నారా? అయితే ఇక్కడి నుండి మీరు మీ Wix యాప్ ఇన్స్టాల్ చేసుకోండి.

Weebly

Weebly కూడా ఇంకొక బ్లాగింగ్ ప్లాట్ఫారం. Wix లాగే ఇది కూడా డ్రాగ్ & డ్రాప్ మెథడ్ తో వెబ్సైటు లేదా బ్లాగ్ ని స్క్రాచ్ నుండి నిమిషాల్లోనే చేసుకోగల ప్లాట్ఫారం. ఎటువంటి కోడింగ్ లేకుండా మీరు బ్లాగ్స్ వెబ్సైటుస్ చేసుకోవచ్చు.

మీరు బ్లాగింగ్ కోసం iPhone యూస్ చేస్తున్నారా? అయితే ఇక్కడి నుండి మీరు మీ Weebly యాప్ ఇన్స్టాల్ చేసుకోండి.

మీరు బ్లాగింగ్ కోసం ఆండ్రాయిడ్ యూస్ చేస్తున్నారా? అయితే ఇక్కడి నుండి మీరు మీ Weebly యాప్ ఇన్స్టాల్ చేసుకోండి.

స్మార్ట్ ఫోన్ బ్లాగింగ్ లాభ నష్టాలు

లాభాలు:

నష్టాలు:

స్మార్ట్ ఫోన్ తో బ్లాగింగ్ లో ఏమేమి చేయవచ్చు? Do’s List

మనం సాదారణంగా కొన్ని మిస్టేక్స్ టైపు చేస్తుంటాం. కొంతమంది కామెంట్స్ లో లేదా పర్సనల్ గా కూడా మెయిల్ చేస్తారు, ఫలానా చోట పళన మిస్టేకస్ ఉన్నాయి అని. అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ని సరి చేయటం మన కర్తవ్యమ్. అప్పుడే మనకి మొబైల్ బ్లాగింగ్ యప్స్ బాగా హెల్ప్ అవుతాయి. అతి తక్కువ టైం లో మనం ఆ మిస్టేక్స్ సరి చేయవచ్చు. మనం మొబైల్ బ్లాగింగ్ యాప్స్ తో సిస్టం దగ్గర లేకపోయినా మన వర్క్ ఆగకుండా ఉంటుంది.

కామెంట్స్ మోడరేట్ చేయవచ్చు.

కామెంట్ మోడరేషన్ అనేది దాదాపుగా ప్రతి బ్లాగ్ లో ఉంటుంది. అయితే ఒక్కోసారి మనం మన వర్క్స్ లో పడి బ్లాగ్ ఓపెన్ చేయకపోతే మనకి ఎవరు కామెంట్ చేసిన తెలియదు. అలాంటప్పుడు మనం మన కామెంట్స్ అప్ప్రోవ్ చేయలేము. లేదా మనం సిస్టంకి అందుబాటులో లేనప్పుడు వచ్చిన కామెంట్స్ మనం అప్ప్రోవ్ చేయాలి అంటే అప్పుడు మొబైల్ బ్లాగింగ్ యప్స్ బాగా హెల్ప్ అవుతాయి.

రీసెర్చ్ చేయటానికి

స్మార్ట్ ఫోన్స్ ద్వారా బ్లాగ్ పోస్ట్స్ వ్రాయమని నేను రికమెండ్ చేయను. ఎందుకో ఇదే పోస్ట్ లో ఇంకొంచెం ముందుకు వెళ్ళాక తెలుసుకుందాం.

బ్లాగర్స్ తమ స్మార్ట్ ఫోన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ చేయవచ్చు. వాళ్ళ నెక్స్ట్ బ్లాగ్స్ కోసం కంటెంట్ గ్రబ్ చేయవచ్చు. గూగుల్ లో సెర్చ్ చేయవచ్చు. మీ నిష్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. మీరు బ్లాగ్ పోస్ట్ వ్రాయటనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఒకచోట గ్రబ్ చేసి మీరు బ్లాగ్ పోస్ట్స్ వ్రాయటనికి రెడీ అవ్వవచ్చు.

స్మార్ట్ ఫోన్ తో బ్లాగింగ్ లో ఏమేమి చేయలేము? Don’ts List:

బ్లాగ్ పోస్ట్స్ వ్రాయటం.

మొబైల్ బ్లాగింగ్ యాప్స్ అన్ని కూడా బ్లాగ్ పోస్ట్స్ స్క్రాచ్ నుండి వ్రాయటనికి అవకాశాన్ని కల్పిస్తున్నాయి. కానీ అలా మొబైల్ లో బ్లాగ్ పోస్ట్ వ్రాయటం అనేది అంత మంచి ఐడియా కాదు.

ఎందుకంటె మొబైల్ కీబోర్డ్ లో మనం ఫాస్ట్గా చాట్ చేయగలేమేమో కానీ, ఫాస్ట్ గా టైపింగ్ చేయలేము. ఎందుకంటె అక్కడ ఉన్న లిమిటెడ్ స్పేస్ లో మనం ఎక్కువ సేపు టైపింగ్ చేయలేము.

అంతే కాకుండా చాలా టైం పడుతుంది మొబైల్ లో బ్లాగ్ పోస్ట్ టైపు చేయటానికి. అలా కాకుండా మనం మన డెస్క్టాపు లేదా లాప్టాప్ లో కంటెంట్ టైప్ చేసుకుని దాన్ని మొబైల్ కి ట్రాన్స్ఫర్ చేసుకుని అప్పుడు మొబైల్ లో దాన్ని పబ్లిష్ చేసుకోవచ్చు.

నేను అయితే మొబైల్ లో బ్లాగ్ పోస్ట్ టైపింగ్ చేయటాన్ని రికమెండ్ చేయను.

HTML ఎడిట్ చేయటం

ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో అయిన HTML ట్యాగ్ ఒక్కటి బ్రేక్ అయినా మొతం వెబ్సైటు యొక్క లేఔట్ మొత్తం డిస్టర్బ్అవుతుంది. సాదారణంగా మనం డెస్క్టాపు లేదా లాప్టాప్ నుండి టైపు చేసేటప్పుడు ఎన్నో మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. అదే మొబైల్ లో టైపు చేసేటప్పుడు ఇంకా ఎక్కువ మిస్టేక్స్ జరుగుతాయి. అటువంటప్పుడు మీరు HTML కోడ్ ని స్మార్ట్ ఫోన్ ద్వారా ఎడిట్ చేస్తుంటే కొంచెం కష్టంగా ఉంటుంది.

అదే వర్క్ మీరు డెస్క్టాపు లో చేయటానికి చేసిన కొన్ని మిస్టేక్స్ జరిగీ అవకాశం ఉంది. మరి స్మార్ట్ ఫోన్ లో HTML ఎడిట్ చేయటం కుదరని పని.

ఇందుకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. రీసెంట్ గా నేను ఒక బ్లాగర్ తో ఇంటరాక్ట్ అవ్వాల్సి వచ్చింది. (అవును అవ్వాల్సి వచ్చింది). అతను బ్లాగర్ ద్వారా బ్లాగ్ స్టార్ట్ చేసాడు. మీకు తెలుసు కదా! బ్లాగర్ లో కోడింగ్ అంతా XML లో ఉంటుంది.

అయితే అతను ఆ బ్లాగ్ ని చివరి వరకు నా వీడియో ట్యుటోరియల్స్ చూసి స్మార్ట్ ఫోన్ లోనే  డిజైన్ చేసుకున్నాడు. కానీ ఒక్క ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఎక్కడో కోడింగ్ లో మిస్టేక్ చేసాడు. దాంతో ఒక్కసారిగా అతని బ్లాగ్ లేఔట్ అంత డిస్టర్బ్ అయ్యింది.

ఎక్కడ మిస్టేక్ జరిగిందో తెలియదు, కాబట్టి మళ్ళి అతను మళ్ళి బ్లాగ్ ని ఫస్ట్ నుండి డిజైన్ చేసుకోవాల్సి వచ్చింది.

అందుకే స్మార్ట్ ఫోన్ లో కోడింగ్ ఎడిట్ చేయటం కష్టం మాత్రమే కాదు, మేము ఎవరం రిఫర్ చేయము.

చిన్న చిన్న చేంజెస్ చేసుకోవచ్చు కానీ, థీమ్ కష్టమైజేషన్ చేయటం కుదరని పని.

Smart Phone Blogging in Telugu ముగింపు

ఇప్పుడు చాలా మంది లాప్టాప్స్ కన్నా కూడా మొబైల్స్ లోనే వర్క్ చేసుకోవటానికి ఇష్టపడుతున్నారు. మొబైల్ ఇండస్ట్రీ కూడా విపరీతంగా పెరుగుతుంది. ఇదంతా చదివిన తరువాత మీరు డిసైడ్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ ద్వారా బ్లాగింగ్ చేయవచ్చా? లేదా? అని.

ఒకవేళ స్మార్ట్ ఫోన్ బ్లాగింగ్ గురించి మేము ఏమైనా మర్చిపోతే కామెంట్ లో తెలియచేయండి. వాటిని నెక్స్ట్ అప్డేట్ లో యాడ్ చేస్తాను. ఈ బ్లాగ్ పోస్ట్ ఎలా ఉంది, మీ అభిప్రాయం ఏంటి అని కూడా మాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి.

ఆన్లైన్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో బ్లాగింగ్ చాలా పవర్ఫుల్ ప్లాట్ఫారం. దీనిని యూస్ చేసుకోండి. ఈ పోస్ట్ బాగుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ కి, మీ అక్కలకి, చెల్లెళ్లకి, అన్నలకి, తమ్ముళ్ళకి, బావలకి, బామ్మర్దులకి, మరదల్లకి షేర్ చేయండి. ఈ పోస్ట్ షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి.

Exit mobile version