Always VJ

Digital Marketers Meetup in Hyderabad in 2021

Spread the love

డిజిటల్ మార్కేటర్స్ మీట్ అప్ హైదరాబాద్ 2021

మీరు ఎప్పుడైనా ఈవెంట్స్ కి లేదా మీట్ అప్స్ కి వెళ్ళారా? మీ ఇండస్ట్రీలో జరిగే మీట్ అప్స్ గురించి తెలిసినప్పుడు వెళ్ళాలి అనిపిస్తుందా? ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? అవును మన యూట్యూబ్ ఛానల్, నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యేవాళ్ళకి ఎందుకో అర్థం అవుతుంది.

Digital Marketers Meetup in Hyderabad

ఎందుకంటె నేను హైదరాబాద్ లో ఆగష్టు 26న జరిగిన డిజిటల్ మార్కేటర్స్ మీట్ అప్ గురించి చెప్పను. నేను కూడా అక్కడికి ఒక స్పీకర్ గా వెళ్ళాను. ఈ మీట్ అప్ గురించి వ్లోగ్స్ చేయమని నన్ను కొంత మంది ఫాలోయర్స్ అడిగారు.

ఈ మీట్ అప్ గురించి ఒక డీటెయిల్ బ్లాగ్ వ్రాయాలి అని నాకు అనిపించింది. అందుకే ఈ బ్లాగ్ పోస్ట్ లో నేను ఈ మీట్ అప్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను. ఎవరైతే మీట్ అప్ కి అటెండ్ కాలేకపోయారో వాళ్ళకి అక్కడి విశేషాలు తెలుస్తాయి అనేది కూడా ఈ బ్లాగ్ పోస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

మరి ఇంకెందుకు ఆలస్యం. ఈ బ్లాగ్ పోస్ట్ ని స్టార్ట్ చేసేద్దాం.

Digital Marketers Meetup in Hyderabad

మీట్ అప్ / ఈవెంట్ అంటే ఏంటి?

సాధారణంగా ఒక ఇండస్ట్రీ కి సంబంధించిన వ్యక్తులు, వివిధ రకాల ఎక్స్పర్ట్స్  (నిపుణుల) ని కలవటానికి మీట్ అప్స్ / ఈవెంట్స్ లాంటివి కండక్ట్ చేస్తారు. ఇందులో కొంత మంది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కొన్ని ముఖ్యమైన టాపిక్స్ తీసుకుని వాటి గురించి వివరిస్తారు.

తమ నాలెడ్జ్ పెంచుకోవటానికి, ఎక్స్పర్ట్స్ ని కలవటానికి ఇలాంటి మీట్ అప్స్ కి అటెండ్ అవుతారు.

మీట్అప్స్  వలన కలిగే బెనిఫిట్స్ ఏంటి?

ఇలాంటి మీట్అప్స్ వలన మనం ఆ ఇండస్ట్రీ కి చెందిన వివిధ రకాల ఎక్స్పర్ట్స్ తో ఇంటరాక్ట్ అవ్వవచ్చు. వాళ్ళ తో మన నాలెడ్జ్ షేర్ చేసుకోవచ్చు. అంతే కాకుండా మనకి ఉన్న సందేహలని వలని కలిసి క్లియర్ చేసుకోవచ్చు. మన సమస్యలకి వారి నుండి సలహాలు తీసుకోవచ్చు. కొత్త మిత్రులను ఏర్పరచుకోవచ్చు. ఇలా ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయి.

Suggested Post to Read: How to Create a Digital Marketing Strategy in Telugu

డిజిటల్ మార్కేటర్స్ మీట్ అప్ ఎవరు కండక్ట్ చేశారు?

తెలుగులో డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో అత్యంత వేగంగా వచ్చి, అందరికి తెలుసిన వ్యక్తీ జాన్. అయితే డిజిటల్ జాన్ అంటే మీకు బాగా అర్థం అవుతుంది. డిజిటల్ జాన్ ఇప్పటికే 5 మీట్ అప్స్ డిజిటల్ మార్కెటింగ్ పై హైదరాబాద్ లో కండక్ట్ చేశారు.

అదేవిధంగా 2021 ఫిబ్రవరిలో కూడా ఒక మీట్ అప్ కండక్ట్ చేశారు. అయితే ఈ మీట్ అప్ కి కొన్ని కారణాల వలన నేను, అదే విధంగా Blogging Carnival founder Ur’s Vishnu అటెండ్ కాలేకపోయాం.

ఇప్పుడు కొంత కవిడ్ రెండవ దశ తగ్గటం, వెంటనే మూడవ దశ వస్తుంది అనేటువంటి ఊహాగానాల నడుమ, Ur’s Vishnu, Digital John ఇద్దరు కలిసి ఈ మీట్ అప్ ని కండక్ట్ చేయటం జరిగింది. అలా ఈ సంవత్సరం 2వ డిజిటల్ మార్కేటర్స్ మీట్ అప్ హైదరాబాద్ లో జరిగింది.

మీట్ అప్ కి ఎవరెవరు వచ్చారు?

ఈ మీట్ అప్ అనుకున్న తరువాత నాకు విష్ణు గారు మీట్ అప్ గురించి చెప్పి తప్పకుండా రావాలి, మనం కలుద్దాం అని చెప్పారు. నేను కూడా ఈసారి వెళ్ళాలి అని నిశ్చయించుకున్నాను. తరువాత డిజిటల్ జాన్ గారు కాల్ చేసి, ఇలా మీట్ అప్ కండక్ట్ చేస్తున్నాం VJ, మీమ్స్ చేయాలి అని చెప్పారు.

ఓ! తప్పకుండ చేస్తాను అని చెప్పను. ఆ తరువాత ఈసారి మీట్ అప్ కి నువ్వు కూడా రావాలి అని డిజిటల్ జాన్ గారు కూడా నాకు చెప్పారు, అంతే కాకుండా ఈసారి మీమ్స్ మార్కెటింగ్ పైన నువ్వు మాట్లాడాలి అను కూడా చెప్పారు. అందుకు కావలసినవి అన్ని రెడీ చేసుకో అని చెప్పారు.

సరే అని నేను కూడా ఒప్పుకున్నాను. మనకి తెలిసిన పని మనం చేయటం లో ఎటువంటి కష్టం ఉండదు అని మరోసారి నాకు ఋజువు అయ్యింది.  ఇక మెల్లిగా మీట్ అప్ స్పీకర్స్ ని అనౌన్స్ చేశారు.

అందులో Content Vidhya ఫౌండర్ ఉమా మాధవి గారు, Niche Marketers Club ఫౌండర్ గోవర్ధన్ గారు, Ur’s Vishnu ఫౌండర్ విష్ణు గారు, డిజిటల్ బడి ఫౌండర్ డిజిటల్ జాన్ గారు, Pitchground లో వర్క్ చేసే మినాంక్ గారు ఇంకా నేను ఉన్నాం.

ఈ మీట్ అప్ గురించి నేను కూడా కొన్ని మీమ్స్ క్రియేట్ చేశాను. నేను వాటిని షేర్ చేస్తున్నాను. విష్ణు గారు మీట్ అప్ పోస్టర్స్ అదే విధంగా ప్రమోషనల్ వీడియోస్ లాంచ్ చేశారు.

వాటితో మీట్ అప్ కి మంచి హైప్ వచ్చింది. డిజిటల్ జాన్ గారు, నేను కూడా వీడియోస్ చేసాం. రిజిస్ట్రేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. రిజిస్ట్రేషన్ ఫి కేవలం 350 రూపాయలు మాత్రమే, అది కూడా కేవలం 30 మందికి మాత్రమే అనుమతి. (కోవిడ్ నిబంధనలు కారణంగా సంఖ్యని తగ్గించారు)

మీట్ అప్ దగ్గర పడే సమయానికి ఒక ప్రక్క మీట్ అప్ గురించి ప్రమోషన్స్ జరుగుతున్నాయి. మరి ప్రక్క రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. మీట్ అప్ ఆర్గనైజర్స్ కూడా వారి పనుల్లో ఉన్నారు.

మీట్ అప్ స్పీకర్స్ గురించి:

ఉమా మాధవి గారు:

ఉమా మాధవి గారు కంటెంట్ విద్య అనే ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చెన్నై లో రన్ చేస్తున్నారు. ఉమా మాధవి గారు ఒక కంటెంట్ రైటింగ్ ఎక్స్పర్ట్. అంతే కాకుండా ఆన్లైన్ లో కూడా సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నారు.

గోవర్ధన్ గారు:

గోవర్ధన్ గారు ఒక ఈమెయిలు మార్కెటింగ్ ఎక్స్పర్ట్. అంతే కాకుండా నిష్ మార్కేటర్ క్లబ్ అని ఒక కమ్యూనిటీ ని స్టార్ట్ చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం, ఫ్రీలాన్సర్స్ కి మంచి అవకాశాలు కల్పించి, వాళ్ళని ఎక్స్పర్ట్స్ గా తీర్చిదిద్దటం. అంతే కాకుండా ఏజెన్సీ ఓనర్స్ కి, ఫ్రీలన్సర్స్ కి మధ్య వారధిగా ఈ కమ్యూనిటీ హెల్ప్ అవుతుంది.

మినాంక్ మిన్ను గారు:

మినాంక్ మిన్ను ఒక సోషల్ మీడియా మార్కెటింగ్ మేనేజర్. మినాంక్ ఎక్కువగా సోషల్ మీడియా ప్లాట్ఫారంస్ లో బాగా ఆక్టివ్ గా ఉంటారు. డిజిటల్ మార్కెటింగ్ గ్రూప్స్ లో బాగా ఆక్టివ్ గా ఉంటారు. Pitchground అనే కంపనీలో ఇప్పుడు  సోషల్ మీడియా మార్కెటింగ్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నారు.

Ur’s Vishnu:

విష్ణు గారు ఒక బ్లాగర్, డిజిటల్ మార్కేటర్, LIRC డిజిటల్ అనే కంపెనీ రన్ చేస్తున్నారు. Blogging Carnival అని ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం అందిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ బ్రాండింగ్ గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తారు.

డిజిటల్ జాన్ గారు:

డిజిటల్ మార్కెటింగ్ రంగంలో పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. డిజిటల్ బడి అనే ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నారు. ఇందులో వివిధ రకాల కోర్సులు నేర్పిస్తుంటారు. డిజిటల్ జాన్ అనే బ్లాగ్ ని కూడా రన్ చేస్తున్నారు.

Blogger VJ :

ఇక చివరగా మిగిలింది నేను. నా గురించి మీకు అందరికి తెలుసు. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే ఈ బ్లాగ్ లో ఉన్న 10 బ్లాగ్ పోస్ట్స్ చదవండి, అర్థం అవుతుంది. అంతే కాదు నేను యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చెస్తునాను. అంతే కాకుండా నేను వెబ్సైట్స్ డిజైన్ చేయటం, మీమ్స్ చేయటం కూడా చేస్తాను.

మీట్ అప్ కి నేను ఎలా వెళ్ళాను?

నేను మీట్ అప్ కోసం ఆ రోజు ఉదయం నేను ఉండే ప్లేస్ నుండి 5 గంటలకి బస్సు లో హైదరాబాద్ బయలుదేరాను. 9.30 కల్లా హైదరాబాద్ MGBS కి చేరుకున్నాను. ఆ తరువాత అక్కడే ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి దగ్గరే ఉన్న మెట్రో స్టేషన్ కి వెళ్ళాను. నేను ఫస్ట్ టైం మెట్రో ఎక్కటం (అంటే చాలా సంవత్సరాల తరువాత హైదరాబాద్ వెళ్ళాను). అక్కడి నుండి అమీర్ పేట్ కి మెట్రో ద్వారా వెళ్ళాను. మెట్రో ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఎందుకంటె  హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ట్రాఫిక్ ఒక పెద్ద సమస్య. ఆ సమస్యలో చిక్కుకోకుండా ఉండటానికి మెట్రో బాగా ఉపయోగపడుతుంది.

ఒకవేళ మీరు ఇంత వరకు మెట్రో యూస్ చేయకపోతే ఈసారి హైదరాబాద్ వెళ్తే తప్పకుండా ట్రై చేయండి. భలే మజా వస్తుంది. ఆ తరువాత మనవాళ్ళకి కాల్ చేస్తే వస్తున్నాం అన్నారు. ఒక 30 మినిట్స్ తరువాత విష్ణు గారు కాల్ చేసి ఎక్కడ దాక వచావ్, ఏంటి అని అడిగి అక్కడే దగ్గరలో ఉన్న ఒక హోటల్ కి రమ్మన్నారు మధ్యాహ్నం భోజనానికి.

అక్కడ నేను విష్ణు గారిని, అది విధంగా ఫణి భుమా ని కలిశాను. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇంకొక్క విషయం హైదరాబాద్ లో డిజిటల్ మార్కేటర్స్ మీట్ అప్ కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఫణి భుమానే చేశారు. నిజంగా బాగా చేశారు అని చెప్పటం కూడా తక్కువ అనే చెప్పాలి. అద్భుతంగా ఏర్పాట్లు చేశారు. ఈ  మీట్ అప్ సక్సెస్ అవ్వటానికి అతి ముఖ్యమైన వాళ్ళలో ఫణి ఒకడు. ఫణి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఒక వీడియో ఇస్తాను, ఆ వీడియో చూడండి.

ఇక అక్కడే మినాంక్ ని కూడా కలిశాను. డిజిటల్ జాన్ గారు కూడా మాతో కలిశారు. తెలుగులో డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీ గురించి, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. నిజంగా అదొక అద్భుతమైన ఘట్టం.

ఆ తరువాత మేము మీట్ అప్ జరిగే ప్లేస్ కి వెళ్ళిపోయాం. అప్పటికే రిజిస్టర్ చేసుకున్నవాళ్ళు కొంత మంది అక్కడికి వచ్చి ఉన్నారు. మేము టైం కి రీచ్ అయ్యాం. అయితే మాకు ఆ ప్లేస్ వాళ్ళు చేయవలసిన అరేంజ్మెంట్స్ చేయలేదు. కాబట్టి ఇక మేమే అన్ని చేసుకుని స్టార్ట్ చేసాం.

అయితే కొన్ని హెల్త్ ఇష్యూస్ వలన ఉమా మాధవి గారు మీట్ అప్ కి అటెండ్ అవ్వలేకపోయారు అని తెలిసింది, కొంచెం బాధగా కూడా అనిపించింది. ఎందుకంటె కలవలేకపోయాను అని.

ఇక విష్ణు గారు మీట్ అప్ ని ఐస్ బ్రేకింగ్ సెషన్స్ ద్వారా స్టార్ట్ చేశారు. ఈ మీట్ అప్ ని నేనే స్టార్ట్ చేయవలసి వచ్చింది.

నేను మీమ్స్ మార్కెటింగ్ అనే టాపిక్ గురించి మాట్లాడను.

మీమ్స్ అంటే ఏంటి? మీమ్స్ ఎలా క్రియేట్ చేయాలి? ఈరోజుల్లో మీమ్స్ ఎందుకు యూస్ చేయాలి? మీమ్స్ మార్కెటింగ్ ఎలా చేయాలి? అని అనేక విషయాలు, నిష్స్ లో మీమ్స్ ఎలా యూస్ చేయాలి అని కొన్ని ఉదాహరణలు చూపించాను.

నేను మీమ్స్ ఎలా చేస్తాను అని కూడా చెప్పను. అయితే జనరల్ గా ఎక్కడ కూడా మీమ్స్ గురించి ఎవరు చెప్పారు. కాబట్టి ఆ టాపిక్ మేము ఇంట్రడ్యూస్ చేయటం మాకు ఒక అడ్వాంటేజ్ అయింది అనే చెప్పాలి. ఆ టాపిక్ గురించి ఎన్నో క్వశ్చన్స్ అడిగారు, వాళ్ళ అందరికి ఆన్సర్స్ ఇచ్చాను. ఇంకా ఎవరికి ఎలాంటి డౌట్స్ లేవు అని చెప్పాక, నేను నా స్పీచ్ ముగించాను.

తరువాత సోషల్ మీడియా మార్కేటర్ అయిన మినాంక్ SaaS మార్కెటింగ్ గురించి మాట్లాడారు. SaaS అంటే Software As a Software. మనం యూస్ చేసే సాఫ్ట్వేర్స్ ప్రతి నెల సర్వీస్ గా మనం పే చేసేవి. ఉదాహరణకి canva, mailchimp ఇలా ఏ సాఫ్ట్వేర్ అయిన మనం యూస్ చేసుకుని మనీ పే చేస్తే అటువంటి వాటిని SaaS అంటారు.

మినాంక్ ఒక SaaS ప్రోడక్ట్ ని ఎలా క్రియేట్ చేయాలి అని స్టెప్ బై స్టెప్ వివరించారు. ఒక SaaS ప్రోడక్ట్ క్రియేట్ చేసే అసలైన ప్రాసెస్, అందులో వచ్చే అటుపోటులు, వాటిని అధిగమించడం ఇలా ఎన్నో విలివైన విషయాలు చెప్పారు.

ఇది కూడా ఒక కొత్త కాన్సెప్ట్. రెగ్యులర్ డిజిటల్ మార్కెటింగ్ ఈవెంట్స్ / మీట్ అప్స్ లో ఇలాంటి విషయాలు చెప్పారు. ఇక కొంత మంది వాళ్ళకి ఉన్న డౌట్స్ అడిగితే, వాటిని మినాంక్ క్లియర్ చేశారు.

తరువాత గోవర్ధన్ గారు లీడ్స్ ని ఈమెయిలు మార్కెటింగ్ ద్వారా ఎలా నర్చర్ చేయాలి అని చెప్పటం స్టార్ట్ చేశారు. ఈమెయిలు మార్కెటింగ్ అనేది ఎంత ముఖ్యమైనది, ఈమెయిలు మార్కెటింగ్ ద్వారా వచ్చిన లీడ్స్ ని ఎలా నర్చర్ చేయాలి అని వివరంగా చెప్పారు.

అందుకు కావాల్సిన కొన్ని ఉదాహరణలు కూడా వివరంగా చెప్పారు. అంతే కాకుండా ఒక ఈబూక్ ని అచ్చంగా ఈమెయిలు లిస్టు తో సుమారుగా 700 కాపీలు ఎలా సేల్ చేసారో వివరంగా చెప్పారు. కంటెంట్ రైటింగ్ నేర్చుకోవాలి అనుకుంటే ఈమెయిలు న్యూస్లెటర్స్ అబ్సర్వ్ చేస్తే బాగా హెల్ప్ అవుతుంది అని చెప్పారు.

సేల్స్ ప్రాసెస్ లో ఈమెయిల్ సీక్వెన్స్ ఎలా హెల్ప్ అవుతుంది అని చెప్పారు. తరువాత కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇచ్చి గోవర్ధన్ గారు తన స్పీచ్ కంప్లీట్ చేశారు.

ఇప్పుడు ఒక 10 నిముషాలు బ్రేక్ ఇచ్చారు మీట్ అప్ ఆర్గనైజర్స్. ఈ టైం లో నే అందరు అక్కడికి స్మార్ట్ తెలుగు రవి కిరణ్ గారు కూడా వచ్చారు. ప్రతి ఒక్కరు అక్కడ ఉన్న స్పీకర్స్ తో ఇంటరాక్ట్ అయ్యారు. నాతో మన ఫాలోయర్స్ లక్ష్మణ్, నయీం మాట్లాడారు. తరువాత కొంత మంది మీమ్స్ మార్కెటింగ్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఇదే మీట్ అప్ ల బలం.

ఈ టైం లోనే టీ, స్నాక్స్ కూడా ఇచ్చారు. ఆ బ్రేక్ అయ్యేసరికి సుమారుగా సాయంత్రం 4.30 అయ్యింది. బ్రేక్ అయ్యాక విష్ణు గారు ఇన్స్టాగ్రామ్ బ్రాండింగ్ గురించి సెషన్ స్టార్ట్ చేశారు. అయితే సమయా భావం వలన కొంచెం త్వరగానే ముగించవలసి వచ్చింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా బిజినెస్ లు ఎలా గ్రో చేసుకోవచ్చు?

అలా గ్రో చేసుకోవడం లో బ్రాండింగ్ ఎలా హెల్ప్ అవుతుంది? బిజినెస్ కోసం ఇన్స్టాగ్రామ్ బ్రాండింగ్ ఎలా క్రియేట్ చేయాలి అనే విషయాలు వివరించారు. ఆ తరువాత కొంత మంది బిజినెస్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగితె వాటికీ సమాధానాలు ఇచ్చారు.

ఇక అప్పటికే అనుకున్న సమయం అయిపోవడంతో డిజిటల్ జాన్ గారు ఏ టాపిక్ గురించి చెప్పలేదు. అయితే సడన్ సర్ప్రైస్ గా మీట్ అప్ కి వచ్చిన రాకేశ్ చంద్ర గారు విష్ణు గారు బిజినెస్ పార్టనర్, పైడ్ యాడ్స్ గురించి 2 నిముషాలు మాట్లాడారు.

ఇక ఆ తరువాత అక్కడికి వచ్చిన వాళ్ళు అందరితో గ్రూప్ ఫొటోస్ దిగటం జరిగింది. కొంత మంది వాళ్ళకి నచ్చిన వాళ్ళతో సేల్ఫీస్ దిగారు. స్పీకర్స్ అందరం కలిసి ఫొటోస్ దిగాము. అలా ఆ ఈవెంట్ ముగిసింది.

తరువాత హాల్ బయటకి వచ్చిన తరువాత నేను కొంత మంది తో ఇంటరాక్ట్ అయ్యాను. నిజంగా నేను ఆశ్చర్యపోయాను, ఎందుకంటె ఈ మీట్ అప్ కోసమే ఇద్దరు బెంగుళూరు నుండి వచ్చారు అని తెలిసి. అందులోను వాళ్ళు ఇద్దరు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్స్.

అయితే వాళ్ళు ఇక్కడికి వచ్చింది కేవలం ఏదో నేర్చుకోవటానికి కాదు, ఇక్కడ ఉన్న మిగిలిన డిజిటల్ మార్కేటర్స్ ని కలవటం కోసం. కాబట్టి ఇలాంటి మీట్అప్స్ మీ పరిసరాలలో జరుగుతుంటే అసలు మిస్ అవ్వకండి.

ఇక ఈవెంట్ అయ్యాక నేను, స్మార్ట్ తెలుగు రవి కిరణ్ గారు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. రవి కిరణ్ గారు కూడా చాలా ఫ్రీగా మాట్లాడారు. ప్రస్తుతం డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీ గురించి, బ్లాగ్గింగ్ ఇండస్ట్రీ గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం.

మాతో గోవర్ధన్ గారు కూడా జాయిన్ అయ్యారు.

నిజంగా గోవర్ధన్ గారి నాలెడ్జ్ అసలు అద్భతం. ఎందుకంటె ఎంత చదివిన ఆ నాలెడ్జ్ రాదు. అయన ఎంతో మంది తో ఇంటరాక్ట్ అయ్యి, ఆ నాలెడ్జ్ ని సంపాదించారు అని అర్థం అయ్యింది. గోవర్ధన్ గారితో అప్పుడే మొదటిసారి మాట్లాడటం. అయిన కూడా బాగా పరిచయం ఉన్న వ్యక్తితో మాట్లాడినట్లుగా మాట్లాడారు.

ఇక అక్కడ టైం అయిపొయింది అంటే ఇక మీట్ అప్ కి వచ్చిన వాళ్ళు అందరు వెళ్ళిపోయారు. విష్ణు గారు కూడా వేరే ఇంపార్టెంట్ వర్క్ ఉంది అని వెళ్ళిపోయారు. మినాంక్ గారు ఇంకా ముందే వెళ్ళిపోయారు.

నేను, జాన్ గారు, రవి కిరణ్ గారు, గోవర్ధన్ గారు, రాకేష్ (డిజిటల్ జాన్ గారు టీం) కలిసి ఒక హోటల్ కి వెళ్ళాం. ఇది ఈ మీట్ అప్ కి కాదు కానీ నాకు బాగా హెల్ప్ అయ్యింది. 2 ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తో డిన్నర్ అంటే ఎలా ఉంటుందో, ఎలాంటి డిస్కషన్స్ జరుగుతాయో అర్థం చేసుకోండి.

ఈ డిన్నర్ లో రవి కిరణ్ గారు స్టార్ట్ అప్స్ గురించి, స్టార్ట్ అప్స్ కి డిజిటల్ మార్కెటింగ్ వంటి అంశాల గురించి ఎన్ని విషయాలు చర్చించారు. అలాగే గోవర్ధన్ గారు ఇండస్ట్రీలో ఎలాంటి ఎక్స్పర్ట్స్ కావాలి, వాళ్ళు ఎలా దొరుకుతారు అనే విషయాల గురించి డిస్కస్ చేశారు.

నిజంగా నాకు ఆ డిస్కషన్ ఒక వరం అని చెప్పుకోవాలి. ఎందుకంటె ఇండస్ట్రీలోని ఎక్స్పర్ట్స్ ఎన్నో ఎత్తుపల్లాలు చుసిన వాళ్ళు వాళ్ళ నాలెడ్జ్ ని షేర్ చేయటం, అక్కడ నేను ఉండటం, ఇప్పుడు తలుచుకున్నా కూడా నాకు ఒళ్ళు పులకరిస్తుంది.

ఇక ఫైనల్ గా హైదరాబాద్ బిర్యానీ తినేసి అందరికి సెండ్ ఆఫ్ ఇచ్చి మళ్ళి నేను మెట్రో లో MGBS కి వచ్చి నేను రిజర్వు చేసుకున్న బస్సు ఎక్కి మా ఊరికి వచ్చాను. అలా ఈ మీట్ అప్ ప్రయాణం సక్సెస్ ఫుల్ గా ముగిసింది.

ఈ మీట్ అప్ కి ఒకవేళ మీరు వచ్చి ఉంటె ఈ మీట్ అప్ ఎలా అనిపించింది అని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఒకవేళ మీరు మీట్ అప్ కి అటెండ్ కాలేక పోతే ఈ బ్లాగ్ పోస్ట్ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందో కామెంట్ చేయండి. ఎందుకంటె మీట్ అప్ కి దూర ప్రాంతాల నుండి రాలేకపోయం అనుకునే వారి కోసం నేను ఈ బ్లాగ్ పోస్ట్ ని ఇంత డిటైల్డ్ గా రాసాను.

నా ప్రయత్నం నచ్చ్సితే మీకు తెలిసిన డిజిటల్ మార్కేటర్స్ కి ఈ బ్లాగ్ పోస్ట్ ని షేర్ చేయండి. ఎందుకంటె షేరింగ్ ఇస్ కేరింగ్ అని మీకు తెలుసు కదా! ఇలాంటి అప్డేట్స్ కావాలి అనుకుంటే మీరు నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేసుకోండి. అంతే కాకుండా ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాల్లో అవ్వండి. కేవలం ఫాలో అయితే సరిపోదు, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి, లేకపోతే మేము పోస్ట్ చేసే పోస్టుల గురించి మీకు తెలియవచ్చు, తెలియకపోవచ్చు. అందుకే ఇంతలా చెప్తున్నా. మరి ఉంటా !!!

Exit mobile version