డిజిటల్ మార్కెటింగ్ కాంపెయిన్స్ వలన కలిగే బెనిఫిట్స్ ఏంటి? Blogger VJ

Spread the love

Digital Marketing Campaigns Benefits in Telugu for Small Businesses

ఆన్లైన్ ద్వారా మీ బిజినెస్ ని ఇన్క్రీస్ చేసుకోవాలన్న, ఆన్లైన్ లో మీ ప్రొడక్ట్స్/సర్వీసెస్ సేల్స్ పెంచుకోవాలన్నామీరు ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ యూస్ చేయవచ్చు.

ఒకవేళ మీరు కనుక ఇంతకుముందు చెప్పుకున్న యాడ్ కాంపెయిన్స్ రన్ చేయాలి అనుకుంటే డిజిటల్ మార్కెటింగ్ కాంపెయిన్స్ బెనిఫిట్స్ గురించి ఈ బ్లాగ్ లో తెలుసుకుందాం.

Digital Marketing Campaigns Benefits in Telugu
డిజిటల్ మార్కెటింగ్ కాంపెయిన్స్ బెనిఫిట్స్

#1 Digital Marketing Campaigns Benefits in Telugu | కాస్ట్ ఎఫెక్టివ్

డిజిటల్ మార్కెటింగ్ కాంపెయిన్స్ కాస్ట్ ఎఫెక్టివ్. ట్రెడిషనల్ మార్కెటింగ్ తో పోల్చుకుంటే, చాలా చాలా తక్కువ. ట్రెడిషనల్ మార్కెటింగ్ తో పాంఫ్లెట్స్, బ్రోచెర్స్, పేపర్ యాడ్స్, టీవీ యాడ్స్ చాలా ఖర్చుతో కూడుకొని ఉంటాయి.

మరి చిన్నచిన్న బిజినెస్లకి ఉండే ఫైనాన్షియల్ రిసోర్సెస్ లిమిటెడ్ గా ఉంటాయి. అలాంటప్పుడు ఇలాంటి ఖర్చుతో కూడుకున్న కాంపెయిన్స్మరింత భారమవుతాయి. అందుకే వాళ్ళు ప్రతిదానికి ఒకటికి 10 సార్లు ఆలోచిస్తారు.

మీకు ఒక చిన్న బిజినెస్ వుంది అనుకుందాం. మీరు మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలి అనుకోని ట్రెడిషనల్ మార్కెటింగ్ కాంపెయిన్స్ అయిన ప్రింట్ యాడ్స్, పాంఫ్లెట్స్, టీవీ యాడ్స్ ఇలాంటివి చేయించాలి అనుకున్నారు.

అందుకోసం మీరు ఒక డిజైనర్ ని హైర్ చేసుకోవాలి లేదా ఒక డిజైనింగ్ కంపెనీ ద్వారా చేయించుకోవాలి. అవి ప్రొఫెషనల్ గా ఉండాలి అంటే తప్పదు ప్రొఫెషనల్స్ ద్వారా నే చేయించాలి.

మీకు ఈ డిజైనింగ్ కాస్ట్ తో పాటు మీ పాంఫ్లెట్స్ ప్రింటింగ్, పేపర్ యాడ్ ప్రింటింగ్, టీవీ యాడ్ టెలికాస్ట్ ఛార్జ్స్ కూడా ఉంటాయి.

వీటి ద్వారా మనకి మంచి ప్రమోషన్ జరుగుతుంది, కానీ ఒకటి చెప్పండి, వాటి కాస్ట్ చాలా చాలా ఎక్కువ. అంతే కాకుండా వాటి ద్వారా మనకి వచ్చే రిటర్న్ అఫ్ ఇన్వెస్ట్మెంట్ చాలా చాలా తక్కువ. (బహుశా వస్తే తరువాత ఎప్పుడైనా వస్తుందేమో!)

అదే డిజిటల్ మార్కెటింగ్ కాంపెయిన్స్ అయితే చాలా తక్కువ ఖర్చుతో క్రియేట్ చేయవచ్చు. గూగుల్ యాడ్స్ లేదా ఫేస్బుక్ యాడ్స్ అయితే 1000 ఇంప్రెషన్స్ కి మనకి ట్రెడిషనల్ మార్కెటింగ్ తో అయ్యే ఖర్చులో చాలా చాలా తక్కువ ఛార్జ్ చేస్తాయి.

#2 Digital Marketing Campaigns Benefits in Telugu | ఈజీగా, ఫాస్ట్ గా ప్లాన్ చేసుకోవచ్చు

డిజిటల్ మార్కెటింగ్ కాంపెయిన్స్ మనం చాలా ఈజీగా, ఫాస్ట్ గా క్రియేట్ చేయవచ్చు. ట్రెడిషనల్ మార్కెటింగ్ కాంపెయిన్స్ మనం అలా చేయలేం. ఎదహరణకి మీరు రేపటి నుండి ఒక ఆఫర్ సేల్ స్టార్ట్ చేద్దాం అని ఇప్పుడు అనుకున్నారు అని అనుకుందాం.

ట్రెడిషనల్ మార్కెటింగ్ లో మనం అందుకోసం కాంపెయిన్స్ క్రియేట్ చేయలేం. అదే డిజిటల్ మార్కెటింగ్ కాంపెయిన్స్ వెంటనే క్రియేట్ చేయవచ్చు.

ట్రెడిషనల్ మార్కెటింగ్ లో మనకి మన కాంపెయిన్స్ రన్ చేయటానికి ఫ్లేక్సిబులిటి తక్కువగా ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ లో కొన్ని బటన్ క్లిక్స్ తో కాంపెయిన్స్ క్రియేట్ చేయవచ్చు.

డిజిటల్ మార్కెటింగ్ కాంపెయిన్స్ మనం  చాలా త్వరగా అప్డేట్ చేయవచ్చు. చిన్న చిన్న బిజినెస్లకి టైం చాలా ఇంపార్టెంట్ అసెట్. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఆ టైం కలసి వస్తుంది.

#3 Digital Marketing Campaigns Benefits in Telugu | మీ కాంపెయిన్స్ ఈజీగా ట్రాక్ చేయవచ్చు

డిజిటల్ మార్కెటింగ్ కాంపెయిన్స్ ఎలాగైతే ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చో, అదే విధంగా ఈజీగా ట్రాక్ చేయవచ్చు. ఒక వేల మీరు మీ యాడ్ కాంపెయిన్ ఎలా రన్ అవుతుంది, ఎలా పెర్ఫామ్ చేస్తుంది అని తెలుసుకోవాలి అంటే మీ యాడ్ కాంపెయిన్ ని ఓపెన్ చేసే సరిపోతుంది.

మీకు ఈ యాడ్ కాంపెయిన్ వాళ్ళ బెనిఫిట్ / లాస్ అని తెలుసుకోవాలన్నా, మీ యాడ్ కాంపెయిన్ యొక్క ఇంపార్టెంట్ aspects ని మెజర్ చేయాలి.

ఉదాహరణకి మీరు ఒక ఫేస్బుక్ యాడ్ ని రన్ చేసారు అనుకుందాం. ఆ యాడ్ ఏ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు చేసారు, జెంట్స్ ఎంత మంది లేడీస్ ఎంత మంది చూసారు? ఓవరాల్ గా ఎంత మందికి రీచ్ అయ్యింది?

ఎంత మంది ఆ యాడ్ ని క్లిక్ చేసి మీ సేల్స్ పేజికి వచ్చారు? ఇలాంటి ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు. అదే మీరు ఒక పేపర్ యాడ్ కనుక ఇస్తే ఆ యాడ్ ఎవరు చూశారో, ఎంత మందికి మీ గురించి తెలుసుందో తెలియదు. ఈ అనలిటిక్స్ డిజిటల్ మార్కెటింగ్ కాంపెయిన్స్ ఉండే మెయిన్ అడ్వాంటేజ్స్ లో ఒకటి.

#4 Digital Marketing Campaigns Benefits in Telugu | ఈజీ గా అప్డేట్ చేయవచ్చు

డిజిటల్ మార్కెటింగ్ కాంపెయిన్స్ ఈజీగా ఎలా ట్రాక్ చేయొచ్చో, అంతే ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు. ఎలాంటి చేంజ్స్ అయిన కావచ్చు. చిన్నదైన, పెద్దదైన ఇలా ఏ చేంజ్ అయిన చేసుకోవచ్చు.

నిన్న మీరు ఒక యాడ్ కాంపెయిన్ క్రియేట్ చేసారు అనుకుందాం. లేదా ఉదయం క్రియేట్ చేసారు అనుకుందాం. మీకు సాయంత్రానికి అంతకన్నా మంచి కాప్షన్, మంచి మెసేజ్ (కంటెంట్) స్ట్రైక్ అయ్యింది. దానిని మీరు ఏ ప్లాట్ఫారంలో అయితే యాడ్ కాంపెయిన్ క్రియేట్ చేసారో అందులోని వెళ్లి ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు.

అదే ట్రెడిషనల్ మార్కెటింగ్ లో మీరు ఒక పేపర్ యాడ్ ఇచ్చారు అనుకుందాం. ఒక్కసారి ప్రింటింగ్ అయ్యాక మీరు ఏమి చేయలేరు. Once fasak. ప్రింటింగ్ కి పంపేముందు ఒకటిక్ 10 సార్లు అన్ని చెక్ చేసుకునే పంపించాలి. కలర్, డిజైన్ ఇక ఏదైనా.

#5 Digital Marketing Campaigns Benefits in Telugu | టార్గెటెడ్ ఆడియన్స్

డిజిటల్ మార్కెటింగ్ లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఆడియన్స్ ని టార్గెట్ చేయడం. మనం క్రియేట్ చేసే యాడ్ కి మొత్తం కంట్రోల్ పాయినీ ఇక్కడే ఉంటుంది.

టార్గెట్ ఆడియన్స్ ద్వారా మనం ఎవరిని అయితే టార్గెట్ చేస్తున్నామో వారిక మాత్రమే ఎలా యాడ్ కాంపెయిన్స్ కనిపిస్తాయి. మరి మీరు ఆడియన్స్ ని ఎలా టార్గెట్ చేయాలి? అని మీకు డౌట్ రావచ్చు.

అందుకోసం ప్లాట్ఫారంస్ లో మనకి టూల్స్ అవైలబుల్ లో ఉన్నాయి.


ఉదాహరణకి మీరు జెంట్స్ వాచెస్ సేల్స్ చేస్తారు అనుకుందాం. అప్పుడు మీరు కేవలం జెంట్స్ ని మాత్రమే టార్గెట్ చేయవచ్చు. మీరు చీరలు సేల్స్ చేస్తారు అనుకుందాం, అప్పుడు మీరు లేడీస్ ని టార్గెట్ చేయవచ్చు.

ఈ విధంగా మీకు అన్ని ప్లాట్ఫారంస్ లో ఆడియన్స్ ని టార్గెట్ చేయటానికి అవకాశం ఉంటుంది.ఈ బెనిఫిట్స్ వల్లనే డిజిటల్ మార్కెటింగ్ ఇంకా బాగా పాపులర్ అవుతుంది.

మీరు కనుక డిజిటల్ మార్కెటింగ్ కాంపెయిన్స్ యూస్ చేస్తే మీరు కూడా ఈ బెనిఫిట్స్ పొంది మీ బిజినెస్ ని ఇంకా త్వరగా డెవలప్ చేసుకోవచ్చు. ఈ బ్లాగ్ పై మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఇంకెందుకు ఆలస్యం వెంటనే కామెంట్ చేయండి.

Leave a Comment