What is Content Marketing? in Telugu

Spread the love

What is Content Marketing | కంటెంట్ మార్కెటింగ్ అంటే ఏంటి?

డిజిటల్ మార్కెటింగ్ లో కంటెంట్ రైటింగ్ అనేది చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. మన వెబ్ సైట్ కి వచ్చే విసిటర్ మనకి కస్టమర్ గా convert అవ్వాలి అంటే మనం మన వెబ్ సైట్ కి రెగ్యులర్ గా విసిటర్స్ వచ్చేలా చేయాలి. నిజానికి అలా చేయటం కష్టం.


What is content marketing in telugu

ఎందుకంటే ఒక విసిటర్ రెగ్యులర్ గా ఒక వెబ్ సైట్ ని విసిట్ చేస్తున్నాడు అంటే అతను మన వెబ్ సైట్ కంటెంట్ నచ్చి వస్తున్నాడు. మన ప్రోడక్ట్ లేదా సర్వీస్ గురించి మనకి పూర్తి అవగాహనా ఉంది అని అనుకుంటున్నాడు.
మరి అలాంటి కంటెంట్ ని మనం ఎలా వ్రాయాలి? what is content marketing in telugu? అందుకోసం కొన్ని టిప్స్ ని ఇందులో మేము మీకు అందిస్తాము.

అసలు కంటెంట్ మార్కెటింగ్ అంటే ఏంటి?

కంటెంట్ మార్కెటింగ్ అంటే మనం చెప్పాలనుకున్న విషయం ఎలా విసిటర్స్ లేదా మన కస్టమర్స్ కి అందేలా చేయటం. వారికీ మన ప్రోడక్ట్ లేదా సర్వీస్ పట్ల ఆసక్తి కలిగేలా చేయటంమే కంటెంట్ మార్కెటింగ్. కంటెంట్ మార్కెటింగ్ అనేది రకరకాలుగా ఉంటుంది.
మనం అందరం ప్రతీ రోజు కంటెంట్ మార్కెటింగ్ చేస్తూ ఉంటాం. ఆశ్చర్యపోతున్నారా? అవును మనం ప్రతీ రోజు కంటెంట్ మార్కెటింగ్ చేస్తూ ఉంటాం. ఎలా అంటే మనం facebookలో పోస్ట్లు పెడుతూ ఉంటాం, కొన్ని పోస్ట్లని లైక్ చేస్తాం, కొన్నింటికి కామెంట్ చేస్తాం. కొన్నింటిని షేర్ చేస్తాం.
అలాగే YouTube లో కూడా ఇదే విధంగా మనం లైక్, కామెంట్, షేర్ చేసి ఆ కంటెంట్ ని మార్కెటింగ్ చేస్తాం. చాలామంది బ్లాగ్స్ రాస్తూ ఉంటారు. ఎవరైనా కొత్తగా బ్లాగ్స్ రాస్తున్నారా? అయితే ఈ పోస్ట్ మీకు కూడా ఉపయోగపడుతుంది.
కంటెంట్ అనేది మేజర్ గా నాలుగు రకాలుగా ఉంటుంది. అవి:
  1. టెక్స్ట్,
  2. ఇమేజ్స్,
  3. ఆడియో,
  4. వీడియో.

టెక్స్ట్:

మీరు చదువుతున్న ఆర్టికల్ టెక్స్ట్ కంటెంట్ కిందకి వస్తుంది. బ్లాగ్ పోస్టులు, ఈబూక్స్, ఈమెయిల్స్, సోషల్ మీడియా పోస్టులు ఇవన్ని టెక్స్ట్ కంటెంట్ క్రింద పరిగణించబడతాయి.

ఇమేజ్స్:

ఇమేజ్స్ లేదా ఫోటోలు ఇవి కూడా కంటెంట్ కిందకే వస్తాయి. చాలా సార్లు ఇవి టెక్స్ట్ కంటెంట్ తో పాటుగా కలిసి ఉంటాయి. ఇమేజ్స్, చార్ట్స్, ఇన్ఫోగ్రాఫ్స్ ఇలాంటివి సోషల్ మీడియా లో ఎక్కువగా షేర్ చేయటానికి యూసర్స్ ఇష్టపడతారు.

ఆడియో:

ఆడియో కంటెంట్ అంటే ఇప్పుడు మళ్ళి క్రొత్తగా వస్తున్నా పోడ్కేస్ట్ అని అంటునారు కదా అవి. అంటే కేవలం ఆడియో ద్వారా ఇన్ఫర్మేషన్ ని ప్రోవైడ్ చేస్తే వాటిని పోడ్కేస్ట్ అని అంటారు. మళ్ళి ఇపుడిప్పుడే పోడ్కేస్ట్ లకు ఆదరణ పెరుగుతుంది.

వీడియో:

ఇవి మన అందరికి తెలిసినవే! YouTube వెబ్ సైట్లో ఉన్న వీడియోస్ అన్నిరకాల కంటెంట్ లభిస్తుంది. అలాంటివి అన్ని కూడా వీడియో కంటెంట్ కిందకే వస్తాయి.
ఇన్ని రకాలుగా మనం కంటెంట్ ని create చేయవచ్చు. ఒక రెండేళ్ళ క్రితం వరకూ టెక్స్ట్ కంటెంట్ కి మంచి వేల్యూ ఉండేది. ప్రస్తుతం వీడియో కంటెంట్ కి మంచి ఆదరణ ఉంది. బహుశా తిరిగి మళ్ళి టెక్స్ట్ కంటెంట్ కి తిరిగి మంచి రోజులూ వస్తాయి అనేది టాప్ bloggers అంచనా వేస్తున్నారు.

మనం కంటెంట్ మార్కెటింగ్ ఎందుకు చేస్తాము?

మనం కంటెంట్ మార్కెటింగ్ brand awareness, lead generation, engagement, sales వంటి లక్ష్యాల కోసం చేస్తాము.ఈ లక్ష్యలన్ని కూడా మనం మన కస్టమర్స్ ఎంగేజ్మెంట్ వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. మీ లక్ష్య సాధనలో ప్రతీ నిత్యం క్రొత్త కంటెంట్ create చేయండి.
దానిని ఈమెయిల్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా మీ విసిటర్స్ కి చేరవేయండి. మీ కంటెంట్ క్రొత్త గా ఉండి, వారికి, వారి సమస్యలకి సహాయం చేయగలిగేలా ఉంటె మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు.
కంటెంట్ అనేది ఎప్పుడు కూడా శిఖర భాగాన ఉంటుంది. కాబట్టి కంటెంట్ మార్కెటింగ్ చేయడంలో మీరు మాస్టర్స్ అయితే డిజిటల్ మార్కెటింగ్ రంగంలో ఎక్స్పర్ట్స్ అవుతారు.

TENGLISH

What is content marketing ? Digital Marketing lo content writing anedi chala chala key role play chestundi. Mana website ki vache visitor manaki customer ga convert kavali ante manam mana website ki regular ga visitors vachela cheyali.
Nijaniki ala cheyatam kashtam. Yendukante oka visitor regular ga oka website ni visit chestunnadu ante atanu mana website content nachchi vastunnadu. Mana product leda service gurinchi manaki poorti avagahana undi ani anukuntunnadu. Mari alanti content ni manam yela rayali? Andukosam konni tips ni indulo memu miku andistamu.

Asalu content marketing ante yenti?

Content marketing ante manam cheppalanukunna vishayam yela visitiors leda mana customers ki andela cheyatam. Variki mana product leda service patla interest kaligela cheyatame content marketing.
Content marketing anedi rakarakaluga untundi. Manam andaram prati roju content marketing chestoo untam. Asharya pothunnara? Avunu manam prati roju content marketing chestoo untam. Yela ante manam facebook lo posts pedutoo untam, konni posts ni like chestam, konnintiki comment chestam.
Inkonnintini share chestam. Alage YouTube lo kooda ide vidhamga manam like, comment, share chesi aa content ni marketing chestam.
Chalamandi blogs rastoo untaru. Yevaraina kothaga blogs rastunnara? Ayithe ee
post miku kooda use avutundi.
Content anedi major ga 4 rakaluga untundi. Avi :
  1. Text,
  2. Images,
  3. Audio,
  4. Video.

Text:

Miru chaduvitunna ee article text content kindaki vastundi. Blog posts, eBooks, emails, social media posts ivanni text content kindake vastayi.

Images:

Images leda photos ivi kooda content kindake vastayi. Chala sarlu ivi text content tho patuga kalisi untayi. Images, charts, infographs ilantivi social media lo yekkuavaga share cheyataniki users ishtapadataru.

Audio:

Audio content ante ippudu malli kothaga vastuna poscast ani antunnaru kada! Ave. Ante kevalam audio dwara information ni provide cheste vatini podcast ani antaru. Mallu ippudipude podcast laki adarana perugutundi.

Video:

Ivi mana andariki telisinave! YouTube website lo unna videos anni rakala content labhistundi. Alantivi anni kooda video content kindake vastayi.
Inni rakaluga manam content ni create cheyavachu. Oka rendella kritam varaku manchi aadarana undi. Bahusa tirigi malli text content ki tirigi manchi rojulu vastayi anedi top bloggers anchana vestunnaru.

Manam content marketing yenduku chestam?

Manam content marketing brand awareness, lead generation, engagement, sales vanti lakshyala kosam chestamu. Ee lakshayalanni kooda manam mana customers engagement valla matrame sadhyapadutundi.
Mi lakshya sadhanalo prati nityam kotha content create cheandi. Danini emails dwara, social media dwara mi visitors ki cheraveyandi. Mi content kothaga undi, variki vari samasyalaki sahayam cheyagaligela unte miru compulsory ga success avutaru.
Content anedi yeppudu kooda top lo untundi. Kabatti content marketing cheyadam lo miru masters ayithe digital marketing rangam lo experts avutaru.

Leave a Comment