2020 Instant Traffic Tips to Bloggers in Telugu

Spread the love

Instant Traffic Tips to Bloggers in Telugu

ఒక జీవికి బ్రతకడానికి  ఆక్సిజన్ ఎంత అవసరమో, ఒక బ్లాగర్ కి ట్రాఫిక్ అంతే అవసరం. ప్రతి బ్లాగర్ తన బ్లాగ్ ట్రాఫిక్ ఇంక్రీస్ చేసుకోవటానికి అనేకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఈ ట్రాఫిక్ విషయంలో సెర్చ్ ఇంజిన్స్ నుండి వచ్చే ట్రాఫిక్ ఎక్కువగానూ, క్వాలిటీ ట్రాఫిక్ వస్తుంది అని మనం ఇంతకూ ముందు తెలుసుకున్నాం.

కానీ కొత్తగా బ్లాగ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి సెర్చ్ ఇంజిన్స్ నుండి ట్రాఫిక్ వచ్చే అవకాశం లేదు. అందుకే ఈరోజు నేను మీకు ఇన్స్టంట్ గా మీ బ్లాగ్ కి ట్రాఫిక్ వచ్చే మార్గాల గురించి చెప్పాలి అనుకుంటున్నాను. మరి ఇంకెందుకూ ఆలస్యం, ఇక మొదలుపెడదాం!

బ్లాగర్ కి తన బ్లాగ్ కి వచ్చే ట్రాఫిక్ పైనే తన బ్లాగ్ భవిష్యతు ఆధారపడి ఉంటుంది. ఎందుకంటె ఎక్కువ మంది ట్రాఫిక్ బాగా ఉంటె మనీ ఎర్న్ చేయవచ్చు అను అనుకుంటారు. (అందరూ కాదు, కానీ ఎక్కువ శాతం మంది). మరి అలాంటి వాళ్ళకి నేను ఇప్పుడు చెప్పబోయే విషయాలు కేవలం ట్రాఫిక్ కోసం మాత్రమే కాకుండా వాళ్ళ బ్లాగ్ ని డెవలప్ చేసుకోవటానికి కూడా హెల్ప్ అవుతాయి.

Instant Traffic Tips to Bloggers in Telugu

ఫేస్బుక్ పేజి

మీ బ్లాగ్ పేరు పై మీరు ఒక ఫేస్బుక్ పేజి ని క్రియేట్ చేయండి. మీ బ్లాగ్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అన్ని వాటిల్లో పోస్ట్ చేయండి. ఇలా చేయడం వలన మీ ఫేస్బుక్ పేజిని ఫాలో అయ్యే మీ ఫాలోయర్స్ కి మీరు పోస్ట్ చేసే అప్డేట్స్ చూసి మీ బ్లాగ్స్ చదవటానికి ఇంటరెస్ట్ కలుగుతుంది. దీని వలన మీ బ్లాగ్ కి ట్రాఫిక్ వస్తుంది.

మీ ఫేస్బుక్ పేజి కి ఫాలోయర్స్ ని ఇంక్రీస్ చేయండి. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని ఇమేజ్స్ రూపంలో, వీడియోస్ రూపంలో అందించండి. అప్పుడు మీరు పోస్ట్ చేసే బ్లాగ్ అప్డేట్స్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. దాని వల్ల మీ బ్లాగ్ కి ట్రాఫిక్ వస్తుంది.

మా ఫేస్బుక్ పేజిని ఫాలో అవ్వండి

ఫేస్బుక్ గ్రూప్

ఈ రోజుల్లో ఫేస్బుక్ గ్రూప్స్ కి ఉన్న వేల్యూ దేనికి లేదు. ఎందుకంటే ఒకే రకమైన ఇంటరెస్ట్, అభిరుచి ఉన్నవాళ్లు అందరూ ఒక చోట చేరి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవటానికి ఈ గ్రూప్స్ బాగా హెల్ప్ అవుతాయి.

మీ బ్లాగ్ ఫాలోయర్స్ కోసం ఒక ఫేస్బుక్ పేజి ని క్రియేట్ చేయండి. ఇందులో కేవలం మీ బ్లాగ్ పోస్టులు మాత్రమే కాకుండా మీ గ్రూప్ మెంబెర్స్ కి అవసరం అయిన కంటెంట్ అందించండి.

కొటేషన్స్ పెట్టండి, టిప్స్ & ట్రిక్స్ షేర్ చేయండి, వీడియోస్ షేర్ చేయండి. మీ గ్రూప్ మెంబెర్స్ కి వేల్యూ ప్రోవైడ్ చేయండి. అప్పుడు వాళ్ళకి మీ పై, మీ బ్లాగ్ పైన మంచి ఇంప్రెషన్ కలుగుతుంది. అప్పుడు వాళ్ళు మీరు బ్లాగ్ పోస్ట్స్ అప్డేట్ పెట్టిన వెంటనే మీ బ్లాగ్ పోస్ట్స్ చదువుతారు.

మీ బ్లాగ్ ట్రాఫిక్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. అలా కాకుండా కేవలం మీ బ్లాగ్ పోస్ట్స్ లింక్స్ మాత్రమే షేర్ చేస్తే మీ గ్రూప్ మెంబెర్స్ లెఫ్ట్ అయిపోతారు. మీ బ్లాగ్ లింక్స్ పోస్ట్ చేయటానికి మీ ఫేస్బుక్ పేజి ఉంది. గ్రూప్ లో వేల్యూ యాడ్ చేయండి. ఆ గ్రూప్ మీకు ట్రాఫిక్ తీసుకువస్తుంది.

ఇంటర్నల్ లింకింగ్

ఏదైనా ఒక బ్లాగ్ పోస్ట్ రాసేటప్పుడు ఆ బ్లాగ్ పోస్ట్ కి రిలేటెడ్ గా ఉండే బ్లాగ్ పోస్ట్స్ ఏమన్నా ఉంటె వాటిని కూడా ఆ బ్లాగ్ పోస్ట్ లో లింక్స్ ఇవ్వండి. ఇలా చేయటాన్ని ఇంటర్నల్ లింకింగ్ అంటారు.

ఇలా చేయటం వలన మీ బ్లాగ్ యొక్క ట్రాఫిక్ పెరుగుతుంది. ఉదాహరణకి ఒక బ్లాగ్ క్రియేట్ చేయటం ఎలా? అనే బ్లాగ్ పోస్ట్ నేను రాస్తున్నాను. అందులో నేను డొమైన్స్ గురించి అదే విధంగా వెబ్ హోస్టింగ్ గురించి చెప్పాలి.

డొమైన్స్ గురించి రాసేటప్పుడు నేను సింపుల్ గా కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇన్న బ్లాగ్ లింక్ ఇస్తాను. ఒక డొమైన్ ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి? లేదా టాప్ డొమైన్ రిజిస్ట్రార్స్ అనే బ్లాగ్ లింక్స్ అక్కడ ఇస్తాను.

ఇలా చేయటం వలన మీ బ్లాగ్ యొక్క పేజి వ్యూస్ పెరుగుతాయి, బ్లాగ్ యొక్క బౌన్స్ రేట్ తగ్గుతుంది. ఈ ఇంటర్నల్ లింకింగ్ మీకు SEO లో కూడా హెల్ప్ అవుతుంది.

కామెంట్స్

మీ ఇండస్ట్రీ లేదా మీ నిష్ లో ఉన్న బ్లాగ్స్ లో మీరు కామెంట్స్ చేయండి. కామెంట్స్ చేయమన్నం కదా అని good, nice ఇలా కాదు. మీరు ఏ పర్టికులర్ బ్లాగ్ పోస్ట్ గురించి చదువుతున్నారో ఆ బ్లాగ్ పోస్ట్ లో మీరు అబ్జర్వ్ చేసిన విషయాలు, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన విషయాలు కామెంట్ చేయండి చివరిలో మీ యొక్క బ్లాగ్ లింక్ కూడా షేర్ చేయండి.

ఇలా చేయటం వలన ఆ బ్లాగ్ లో ఆ బ్లాగ్ పోస్ట్ చదివే రీడర్స్ మీ కామెంట్ చూసి మీ బ్లాగ్ కి వచ్చే అవకాశం ఉంటుంది. లేదా ఎవరైనా ఏదైనా ఒక క్వశ్చన్ అడిగితే దానికి ఆ బ్లాగర్ సమాధానం చెప్పకపోతే మీకు తెలిస్తే మీరు సమాధానం చెప్పండి.

ఇలా చేయటం వలన కూడా మీ బ్లాగ్ కి వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ ఇండస్ట్రీ లోని వేరే బ్లాగర్స్ యొక్క బ్లాగ్స్ లో కామెంట్ చేయండి, మీ బ్లాగ్ కి ట్రాఫిక్ ని వాళ్ళ బ్లాగ్ నుండి తెచ్చుకోండి.

Exit Popups

మీరు కనుక గమనిచే ఉంటె కొన్ని బ్లాగ్స్ లో మీరు ఆ బ్లాగ్ టాబ్ క్లోజ్ చేయబోయిన లేదా వేరే వెబ్ అడ్రస్ ఎంటర్ చేయబోయినా ఒక పాప్ అప్ ఓపెన్ అవుతుంది. వీటినే ఎగ్జిట్ పాప్ అప్స్ అంటారు. మీరు కూడా వీటిని మీ బ్లాగ్ లో యూస్ చేయండి.

దీని వలన మీ బ్లాగ్ కి ట్రాఫిక్ ఎలా పెరుగుతుంది అనుకుంటున్నారా? చ చెప్తా, ఈ ఎగ్జిట్ పాప్ అప్ లో మీరు మీ రీడర్ యొక్క ఈమెయిలు ఐడి తీసుకోగలిగితే మీరు బ్లాగ్ పోస్ట్ పబ్లిష్ చేసినప్పుడు వాళ్ళకి ఒక ఈమెయిలు నోటిఫికేషన్ వెళ్తుంది.

దీనిని మనం చాలా ఈజీగా ఈమెయిలు మార్కెటింగ్ టూల్స్ సహాయం తో క్రియేట్ చేయవచ్చు. అంతే కాకుండా వాళ్ళకి మన బ్లాగ్ లో ఉన్న పోస్టులు కూడా ఈమెయిల్స్ ద్వారా పంపించవచ్చు. ఇలా చేయటం ద్వారా మన కొత్త బ్లాగ్ పోస్ట్ లకే కాదు, మన పాత బ్లాగ్ పోస్టులకి కూడా ట్రాఫిక్ వస్తుంది. ఓవరాల్ గా మీ బ్లాగ్ కి వచ్చే ట్రాఫిక్ పెరుగుతుంది.

సోషల్ మీడియా బటన్స్ యాడ్ చేయటం

మీ బ్లాగ్ పోస్ట్ వైరల్ అవ్వాలి అంటే అది సోషల్ మీడియా ద్వారానే సాధ్యం అవుతుంది. మరి అలాంటప్పుడు మీరు మీ బ్లాగ్ లో సోషల్ మీడియా షేరింగ్ బటన్స్ ఉంచకపోతే మీ బ్లాగ్ ని వాళ్ళు ఎలా షేర్ చేస్తారు? షేర్ చేస్తేనే కదా మీ బ్లాగ్ కి న్యూ రీడర్స్ వస్తారు.

కాబట్టి మీ బ్లాగ్ లో సోషల్ మీడియా బటన్స్ యాడ్ చేయండి. అడగందే అమ్మ అయిన అన్నం పెట్టదు అంటారు. మీ బ్లాగ్ పోస్ట్ చివర్లో మీ బ్లాగ్ పోస్ట్ ని షేర్ చేయమని అడగండి.

బ్లాగర్ యూస్ చేస్తున్నట్లయితే మీకు దాదాపుగా ప్రతి టెంప్లేట్ లో సోషల్ మీడియా షేరింగ్ బటన్స్ ఉంటాయి. కానీ వర్డుప్రెస్ లో మీరు విడిగా ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసుకుంటేనే వస్తాయి. కాబట్టి ఇప్పుడే మీ బ్లాగ్ లో సోషల్ మీడియా షేరింగ్ బటన్స్ యాడ్ చేయండి.

వర్డుప్రెస్ లో సోషల్ మీడియా బటన్స్ ఎలా యాడ్ చేయాలి? అని తెలుసుకోవటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

రీడర్స్ కామెంట్ చేసే విధంగా చేయటం

ఇలా చేయటం వలన మీకు వాళ్ళకి ఒక మంచి రేలషన్ ఏర్పడుతుంది. అంతే కాకుండా మీ బ్లాగ్ లో మీరు రాసిన కంటెంట్ మాత్రమే కాకుండా సెర్చ్ ఇంజిన్స్ ఈ కామెంట్స్ ని కూడా కంటెంట్ గానే చూస్తాయి.

అంతే కాకుండా రీడర్స్ కూడా ఈ బ్లాగ్ పోస్ట్ ఎవరు ఎలాంటి కామెంట్స్ చేసారు అని చదువుతారు. ఇలా చదవటం వలన మీ బ్లాగ్ లో వాళ్ళు ఎక్కువ సేపు ఉంటారు. దాన్ని వలన మీ బ్లాగ్ మంచి ఇన్ఫర్మేటివ్ బ్లాగ్ అని సెర్చ్ ఇంజిన్స్ కి మంచి సైన్స్ వెళ్తాయి.

మీ బ్లాగ్ కి మంచి ర్యాంకింగ్స్ వచ్చే అవకాశం ఉంది. మంచి ర్యాంకింగ్స్ వస్తే ఆటోమేటిక్ గా సెర్చ్ ఇంజిన్ నుండి కూడా క్వాలిటీ ట్రాఫిక్ వస్తుంది.

ఎక్కువ కంటెంట్ క్రియేట్ చేయండి

మీ బ్లాగ్ కోసం మీరు ఎంత కంటెంట్ క్రియేట్ చేయగలరో అంత కంటెంట్ క్రియేట్ చేయండి. ఎందుకంటె మీ బ్లాగ్ కి వచ్చిన రీడర్ మీ కంటెంట్ నచ్చితే మీ బ్లాగ్ లో ఉన్న మిగిలిన పోస్ట్స్ కూడా చదువుతారు.

ఒక రీసెర్చ్ ప్రకారం ఒక బ్లాగ్ పోస్ట్ చదివే రీడర్ యావరేజ్ గా 2-4 బ్లాగ్ పోస్ట్స్ చదువుతారు అని అంచనా!. కాబట్టి మీ బ్లాగ్ లో ఎక్కువ బ్లాగ్ పోస్ట్స్ ఉంటేనే కదా ఎక్కువగా చదివే అవకాశం ఉంటుంది.

ఎక్కువ కంటెంట్ అన్నం కదా అని ఎలాంటి కంటెంట్ పడితే అలాంటి కంటెంట్ కాకుండా మంచి కంటెంట్ ని మీ రీడర్స్ కోసం క్రియేట్ చేయండి. అప్పుడు మీ బ్లాగ్ యొక్క ట్రాఫిక్ పెరుగుతుంది.

రెగ్యులర్ గా బ్లాగింగ్ చేయాలి

రెగ్యులర్ గా బ్లాగింగ్ చేయటం వలన అనేక బెనిఫిట్స్ ఉన్నాయి. రెగ్యులర్ గా బ్లాగింగ్ చేయటం వలన మీ బ్లాగ్ ట్రాఫిక్ తో పాటుగా మీ యొక్క సెర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్స్ కూడా పెరుగుతాయి.

ఉదాహరణకి మీరు వారానికి 3 పోస్ట్స్ రాస్తున్నారు అనుకుందాం. ఒక్కో బ్లాగ్ పోస్ట్ కి మీకు యావరేజ్ గా 500 మంది రీడర్స్ వస్తున్నారు అనుకుందాం. అంటే మీ బ్లాగ్ కి వారానికి 1500 మంది, నెలకి 6000 మంది రీడర్స్ వస్తున్నారు.

అదే కనుక మీరు వారానికి 6 పోస్ట్స్ రాయగలిగితే మీకు వారానికి 3000 మంది, నెలకి 12000 మంది రీడర్స్ మీ బ్లాగ్ కి వస్తారు. కనీసం ఓవరాల్ గా 10,000 మంది అయిన వస్తారు కదా! కాబట్టి రెగ్యులర్ గా బ్లాగింగ్ చేయండి.

రెగ్యులర్ గా బ్లాగింగ్ చేయడం వలన బెనిఫిట్స్ తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఒకవేళ మీకు రెగ్యులర్ గా బ్లాగింగ్ చేయడం కుదరటం లేదు అనుకుంటే మీరు కనీసం వారానికి ఒక్క బ్లాగ్ పోస్ట్ అయిన వ్రాయండి. అలా చేయటం వలన సెర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్స్ డ్రాప్ అవ్వకుండా ఉంటాయి.

ఎందుకంటె సెర్చ్ ఇంజిన్ క్రాలర్స్ మీ బ్లాగ్ ని చెక్ చేసినప్పుడు మీ బ్లాగ్ రీసెంట్ గా అప్డేట్ చేసి ఉంటె “ఈ బ్లాగ్ అప్డేట్ కంటెంట్ ప్రోవైడ్ చేస్తుంది” అని క్రాలర్స్ సెర్చ్ ఇంజిన్స్ కి రిపోర్ట్ చేస్తాయి. అలా చేయకపోతే మీ బ్లాగ్ అప్డేట్ గా లేదు అని రిపోర్ట్ ఇస్తాయి.

80/20 ప్రిన్సిపల్

మీరు 80/20 ప్రిన్సిపల్ గురించి వినే ఉంటారు. ఈ ప్రిన్సిపల్ బ్లాగర్స్ కి ఎలా ఉపయోగపడుతుంది అని చూద్దాం. జనరల్ గా బ్లాగర్స్ చేసే మిస్టేక్ ఏంటి అంటే ఎప్పుడూ కొత్తగా క్రియేట్ చేసిన పోస్టులనే ప్రోమోట్ చేసుంటారు.

పాత వాటిని ప్రోమోట్ చేయరు. కానీ ఈ ప్రిన్సిపల్ ప్రకారం మీ టైం లో 20% కొత్త బ్లాగ్ పోస్ట్స్ రాయటానికి క్రియేట్ చేయటానికి, మిగిలిన 80% టైం ని పాత బ్లాగ్ పోస్ట్స్ ని ప్రమోట్ చేయటానికి ఉపయోగించాలి. ఎందుకంటె మనకి ఎప్పుడూ కొత్త ఫాలోయర్స్ ఫాలో అవుతూ ఉంటారు.

వాళ్ళకి మన ఓల్డ్ బ్లాగ్ పోస్ట్స్ గురించి తెలియదు కదా! ఈ రోజుల్లో మన బ్లాగ్ కి రావటమే కష్టం. అలాంటిది మన బ్లాగ్ లో ఉన్న ఓల్డ్ బ్లాగ్ పోస్ట్స్ వెతకటం అనేది అత్యాశే అవుతుంది. కాబట్టి వాళ్ళకి తెలిసేలా మనమే ప్రోమోట్ చేయాలి.

ఇవి మీ బ్లాగ్ కి ఇన్స్టంట్ గా బ్లాగ్ ట్రాఫిక్ ఇంక్రీసే చేసే టిప్స్. వీటిని మీ బ్లాగ్ లో ఇంప్లెమెంట్ చేసి చూడండి. మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. మీకు ఏ టిప్స్ బాగా వర్కౌట్ అయ్యయో మాకు కామెంట్స్ లో తెలియచేయండి. ఒకవేళ మీ దగ్గర ఇంకా ఏమైనా టిప్స్ ఉంటే కామెంట్స్ లో షేర్ చేయండి.

ఈ బ్లాగ్ పోస్ట్ ని ఫేస్బుక్, ఇన్స్టగ్రామ్, whatsapp లో షేర్ చేయండి. ఎందుకంటె Sharing is Caring కదా!

2020 లో SEO లేకుండా మీ బ్లాగ్ కి ట్రాఫిక్ ఎలా తీసుకురావాలి?

 

Leave a Comment