How to create WordPress Blog in Telugu వర్డుప్రెస్ ద్వారా ఒక బ్లాగ్ ని ఎలా క్రియేట్ చేయాలి?
బ్లాగ్గింగ్ చేద్దాం, చేయాలి అనుకునేవాళ్లు WordPress గురించి వినే ఉంటారు. చాలా మంది WordPress ని రిఫర్ చేస్తారు. WordPress అన్ని బ్లాగ్గింగ్ టూల్స్ లో ది బెస్ట్ అని సలహా ఇస్తుంటారు. WordPress కి అంతటి ప్రాముఖ్యం ఎందుకు? WordPress ఎందుకు అంత మంది మనసులని దోచుకుంది? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం రండి!
అసలు ఈ వర్డుప్రెస్సు ఏంటి?
WordPress ప్రపంచంలోనే బాగా పాపులర్ అయిన బ్లాగ్గింగ్ టూల్. దీనిని PHP ప్లాట్ఫాం పై డిజైన్ / ప్రోగ్రామింగ్ చేయడం జరిగింది. ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ లేనివాళ్ళు సైతం సులభంగా అర్థం చేసుకుని బ్లాగులు / వెబ్ సైట్లు డిజైన్ చేయవచ్చు.
సులభంగా మెయిన్టైన్ చేయవచ్చు. ప్రపంచంలో ఉన్న బ్లాగులలో 75% బ్లాగులు WordPress ద్వారా డిజైన్ చేసినవే. అంతే కాకుండా ఈ సాఫ్ట్వేర్ / అప్లికేషన్ ని ఎవరైనా ఉచితంగా ఉపయోగుంచుకోవచ్చు. వారికీ నచ్చినట్లుగా మార్చుకోవచ్చు.
వర్డుప్రెస్ ఈ పేరు తెలియని బ్లాగర్ లేదా డిజిటల్ మార్కేటర్ ఉండరు. అవునా ? కదా !
వర్డుప్రెస్ ఎందుకు అంత పాపులర్ అయ్యిందో మీకు తెలుసా?
➡️ ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా వర్డుప్రెస్ ని అర్థం చేసుకుని వాళ్ళకి కావాల్సిన విధంగా బ్లాగ్స్ / వెబ్ సైట్స్ క్రియేట్ చేసుకోవచ్చు.
➡️ అంతే కాకుండా ఈ వర్డుప్రెస్ సాఫ్ట్వేర్ (CMS) అప్లికేషన్ ని ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు.
➡️ ఎన్నో వెబ్ సైట్ / బ్లాగ్ డిజైన్స్ ఫ్రీగా లభిస్తాయి. కావాలంటే ప్రీమియం థీమ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు.
➡️ అంతే కాకుండా ఎన్నో నీ బ్లాగ్ / వెబ్ సైట్ అవసరాల కోసం ప్లగిన్స్ కూడా దాదాపుగా ఫ్రీగా దొరుకుతాయి. మరిన్ని ఫీచర్స్, బెనిఫిట్స్ కావాలి అంటే నువ్వు ప్రీమియం ప్లగిన్స్ యూస్ చేసుకోవచ్చు.
➡️ అంతే కాకుండా అన్నిటి కన్నా ముఖ్యమైనది సపోర్ట్. ప్రపంచ వ్యాప్తంగా వర్డుప్రెస్ డెవలపర్స్ ఉన్నారు. కొన్ని లక్షల ట్యుటోరియల్స్ వీడియోస్ గా బ్లాగ్స్ గా ఇంటర్నెట్ లో, యూట్యూబ్ లో అందుబాటులో ఉన్నాయి.
వర్డుప్రెస్ వాడటానికి ఇంతకూ మించి ఇంకా కారణాలు కావాలా?
మరి ఈ వర్డుప్రెస్ ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి , ఎలా ఒక బ్లాగ్ ని లేదా వెబ్ సైట్ ని క్రియేట్ చేయాలి?
నువ్వు వర్డుప్రెస్ ఇన్స్టాల్ చేయాలి అంటే నీకు ఒక డొమైన్ కావాలి. డొమైన్ తో పాటుగా వెబ్ హోస్టింగ్ కావాలి.
అసలు ఈ డొమైన్ అంటే ఏంటి?
డొమైన్ అంటే నీ బ్లాగ్ / వెబ్ సైట్ కి ఇంటర్నెట్ లో కావాల్సిన ఒక పేరు. ఈ పేరుతోనే నీ బ్లాగ్ లేదా వెబ్ సైట్ కి ఇంటర్నెట్ లో యూసర్స్ లేదా కస్టమర్స్ చేరుకోగలరు.
డొమైన్ కోసం మీరు GoDaddy, NameCheap, BigRock ఇలా ఎన్నో కంపెనీల నుండి ఒక మంచి డొమైన్ నేమ్ ని చూస్ చేసుకోవచ్చు.
ఇక్కడ మీకు ఉదాహరణకి NameCheap లో ఏ విధంగా ఒక డొమైన్ ని రిజిస్టర్ చేసుకోవాలి అని చూపిస్తాను.
మీ డొమైన్ రిజిస్టర్ చేసుకోవటానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఒక సెర్చ్ బార్ కనిపిస్తుంది.
అందులో మీరు మీ బ్లాగ్ / వెబ్ సైట్ కోసం డొమైన్ అనుకున్న డొమైన్ నేమ్ ని సెర్చ్ చేయండి.
ఇక్కడ నేను bloggingtipsintelugu అని సెర్చ్ చేస్తున్నాను.
నాకు లక్కీగా .com డొమైన్ దొరికింది. ఒకవేళ మీకు మీరు సెర్చ్ చేసిన నేమ్ .com లో లేకపోతే .in ట్రై చేయండి. (మాక్సిమం .com తీసుకోవటానికి ట్రై చేయండి.)
Bloggingtipsintelugu.com ని సెలెక్ట్ చేసుకోవటానికి Add to Cart అని ఎదురుగా ఉన్న బటన్ పైన క్లిక్ చేయండి.
మీకు కార్ట్ కి యాడ్ అయిన తరువాత ఈ విధంగా కనిపిస్తుంది.
కింద రైట్ సైడ్ లో View Item అని, Checkout అని రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో మీరు checkout పైన క్లిక్ చేయండి.
ఇక్కడ మీకు ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. అంతే కాకుండా మీకు మీ బిల్ అమౌంట్ అంటే ఒక డొమైన్ కోసం మీరు పే చేయవలసిన అమౌంట్* (టాక్సెస్ కాకుండా). ఈ అమౌంట్ మీకు ఉండే ఆఫర్స్ ని బట్టి మారుతుంది.
Confirm Order పైన క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
ఇక్కడ మీరు ఇంతకూ ముందు డొమైన్ కనుక Namecheap లో రిజిస్టర్ చేసుకుంటే మీకు ఎకౌంటు క్రియేట్ అయ్యి ఉంటుంది. దానితో లాగిన్ అయ్యి పేమెంట్ కంప్లీట్ చేయవచ్చ్చు.
లేదు క్రొత్త గా మీరు డొమైన్ రిజిస్టర్ చేసుకుంటున్నారు అంటే Create an Account అని కనిపిస్తుంది కదా!
అందులో మీ డీటెయిల్స్ ఇచ్చి ఎకౌంటు క్రియేట్ చేసుకుని పేమెంట్ కంప్లీట్ చేయండి.
అంతే మీ బ్లాగ్ / వెబ్ సైట్ కోసం డొమైన్ రిజిస్టర్ చేసుకున్నట్లే.
Godaddy యూస్ చేసుకుంటాం అంటే Godaddy ద్వారా ఒక డొమైన్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అని ఒక వీడియో చేశాను. ఆ వీడియో చుడండి.
ఇప్పుడు మీరు వెబ్ హోస్టింగ్ రిజిస్టర్ చేసుకోవాలి.
వెబ్ హోస్టింగ్ అంటే ఏంటి?
వెబ్ హోస్టింగ్ అంటే మీ బ్లాగ్ / వెబ్ సైట్ కోసం క్రియేట్ చేసే ఫైల్స్, ఇమేజ్స్ , వీడియోస్ ఇలాంటి వాటిని అన్నింటిని మీ యూసర్స్ ఎక్కడి నుండి అయిన యాక్సెస్ చేయాలి అంటే మీరు ఎక్కడో ఒక చోట స్టోర్ చేయాలి కదా!
అలా స్టోర్ చేసే ప్లేస్ ఏదైతే ఉందొ దాన్నే వెబ్ హోస్టింగ్ అంటారు.
వెబ్ హోస్టింగ్ చాలా చాలా జాగ్రతగా తీసుకోవాలి.
వెబ్ హోస్టింగ్ రిజిస్టర్ చేసుకునేవారి కోసం నేను రెండు వెబ్ హోస్టింగ్ లు రెఫెర్ చేస్తాను.
వీటిల్లో మొదటిది మీరు వినే ఉంటారు. SiteGround ఒక మంచి వెబ్ హోస్టింగ్ కంపెనీ. చాలా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. నేను నా బ్లాగ్స్ కోసం దిన్ని యూస్ చేస్తున్నాను.
దీని కాస్ట్ కొంచెం ఎక్కువ. మంచి రిజల్ట్స్ కావాలి అంటే కొంచెం మనీ ఇన్వెస్ట్ చేయాలి. అలా చేయగలను అంటే కళ్ళు మూసుకుని SiteGround తీసుకోండి.
తరువాతది కంప్లీట్ గా బిగినర్స్ కోసం. Vaporhost వచ్చి మీకు నెలకి 60/- మాత్రమే. 5gb స్పేస్, 50gb bandwidth ఇస్తుంది. స్పేస్ లేదా bandwidth సరిపోదు అనుకుంటే మీరు నెక్స్ట్ ప్లాన్ కి మూవ్ అవ్వవచ్చు. ఎటువంటి సెటప్ ఛార్జ్స్ లేవు. .
మీకు కావాలి అంటే నెలకి, 3 నెలలకి, 6 నెలలకి, ఒక సంవత్సరానికి ఇలా బిల్లింగ్ చేసుకోవచ్చు.
నేను నా బ్లాగ్ ని కూడా ఇందులోనే రన్ చేస్తున్నాను. ఎందుకంటె బ్లాగ్ స్పీడ్ గా ఉంటుంది, నేనే రన్ చేస్తున్నాను అంటే మీకు ఈ Vaporhost బిగినింగ్ లో సరిపోతుంది.
మీరు ఎఫ్ఫెర్ట్ చేయగలిగినప్పుడు నీకు నచ్చిన హోస్టింగ్ తీసుకోవచ్చు.
Vaporhost వెబ్ హోస్టింగ్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలో స్టెప్-బై-స్టెప్ ఈ వీడియోలో వివరించాను, చూడండి.
Vaporhost వెబ్ హోస్టింగ్ రిజిస్టర్ చేసుకోవటానికి ఇక్కడ క్లిక్ చేయండి.
వర్డుప్రెస్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలి?
మీ డొమైన్ ని వెబ్ హోస్టింగ్ తో లింక్ చేసుకుని మీరు cpanel లోకి లాగిన్ అయితే మీకు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
(దాదాపుగా ఇలాగె ఉంటుంది, లేదా కొంచెం చేంజ్స్ ఉండవచ్చు)
ఇప్పుడు మీరు వర్డుప్రెస్ ని ఇన్స్టాల్ చేయటానికి మీ వెబ్ పేజి ని కిందకి స్క్రోల్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా Softaculus Apps Installer అని కనిపిస్తుంది. లేదా One Click Installer అని కనిపిస్తుంది.
ఇందులో నుండి మీరు వర్డుప్రెస్ అని కనిపిస్తుంది కదా ! దాని పైన క్లిక్ చేయండి. అప్పుడు మీకు వర్డుప్రెస్ సెటప్ పేజిలోకి వస్తుంది.
ఇక్కడ మీరు Install Now అని బటన్ కనిపిస్తుంది కదా! దాని పైన క్లిక్ చేయండి.
అప్పుడు ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఇవ్వవలసి ఉంటుంది.
మొదట Software Setup అని ఉంది కదా దానిని ఏమి చేయకండి. తరువాత మీకు Site Settings అని కనిపిస్తుంది కదా అందులో మీ బ్లాగ్ యొక్క టైటిల్, బ్లాగ్ డిస్క్రిప్షన్ ఇవ్వండి, ఇవ్వకపోయినా పర్వాలేదు, వర్డుప్రెస్ కస్టమైజేషన్ లో మార్చుకోవచ్చు.
తరువాత మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే పైన కనిపించినట్టు కనిపిస్తుంది.
ఇదే చాలా చాలా ఇంపార్టెంట్. Admin Account అని ఉంది కదా!
అందులో మీరు అడ్మిన్ యూసర్ నేమ్ దగ్గర మీరు ఏ యూసర్ నేమ్ తో లాగిన్ అవ్వాలి అనుకుంటున్నారో దానిని ఇవ్వండి.
(ఎవరు గెస్ చేయని యూసర్ నేమ్స్ సెలెక్ట్ చేసుకోండి. లేకుంటే మీ బ్లాగ్ హ్యాక్ అయ్యా అవకాశం ఉంది)
తరువాత అడ్మిన్ పాస్వర్డ్ దగ్గర మీకు నచ్చిన పాస్వర్డ్ ఇవ్వండి.
(సెక్యూర్ పాస్వర్డ్ పెట్టుకోండి)
తరువాత అడ్మిన్ ఈమెయిల్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు రెగ్యులర్ గా యూస్ చేసే ఈమెయిల్ ఇవ్వండి. దీనివలన మనకి మన బ్లాగ్ లో జరిగే అప్డేట్స్ , నోటిఫికేషన్స్ గురించి తెలుస్తుంది.
లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంచండి. తరువాత సెలెక్ట్ ప్లగిన్స్ అని ఉంది కదా! అందులో ఫస్ట్ ప్లగిన్ Limit Login Attempts (Loginizer) అని ఉంది కదా ! దాని ఎదురుగా ఉన్న బాక్స్ ని క్లిక్ చేయండి.
తరువాత ఇంక లాస్ట్ కి వెళ్ళిపోతే Email Installation Details to అని ఒక బాక్స్ కనిపిస్తుంది. అందులో మీరు మీ రెగ్యులర్ ఈమెయిల్ అడ్రస్ అవ్వండి.
ఆ తరువాత Install బటన్ పైన క్లిక్ చేయండి.
మీకు ఈ విధంగా ఇన్స్టలేషన్ స్టార్ట్ అవుతుంది. మీ ఇంటర్నెట్ స్పీడ్ ని బట్టి 2-3 నిమిషాల్లో ఇన్స్టాల్ అయిపోతుంది.
మీ వర్డుప్రెస్ సక్సెస్ ఫుల్ గా ఇన్స్టాల్ అయ్యింది అని ఈ విధంగా మీకు చూపిస్తుంది.
ఇప్పుడు ఒకసారి మీ బ్లాగ్ ని చెక్ చేసుకోండి. మీ బ్లాగ్ ఇలా కనిపిస్తుంది. (డిఫాల్ట్ థీమ్)
మీరు వర్డుప్రెస్ డాష్ బోర్డు లో కి వెళ్ళాలి అంటే
www.miblogname.com/wp-admin అని యుఆర్ఎల్ తో లాగిన్ అవ్వండి.
మీ వర్డుప్రెస్ డాష్ బోర్డు ఇలా ఉంటుంది.
ఈ విధంగా మీరు చాల చాలా ఈజీగా మీ బ్లాగ్ / వెబ్ సైట్ కోసం వర్డ్ప్రెస్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
ఆ తరువాత మీ బ్లాగ్ / వెబ్ సైట్ ని మీకు నచ్చిన థీమ్స్ తో డిజైన్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన ప్లగిన్స్ ని కూడా యూస్ చేసుకుని ఒక మంచి బ్లాగ్ / వెబ్ సైట్ ని మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు.
ఇప్పటికే మన యూట్యూబ్ ఛానల్ లో వర్డుప్రెస్ ద్వారా ఒక బ్లాగ్ ని స్తే-బై-స్టెప్ ఎలా క్రియేట్ చేయాలి అని వీడియో ట్యుటోరియల్స్ చేయడం జరిగింది. అందులో డొమైన్ రిజిస్ట్రేషన్ నుండి మీ బ్లాగ్ ని లైవ్ చేయటం వరకు చెప్పాను.
ఒకసారి WordPress వాడిన వాళ్లు ,మళ్ళి మళ్ళి ఏ అప్లికేషన్ గురించి ఆలోచించట్లేదు, అంటే అతిశయోక్తి కాదు. WordPress లో SEO చేయటానికి, బ్లాగ్ ఎనలిటిక్స్ లెక్కించటానికి, మన Facebook, ట్విట్టర్ వంటి వాటిని బ్లాగ్ లో ఇంక్లూడ్ చేయటానికి ఈమెయిల్స్ కలెక్ట్ చేయటానికి చాలా ప్లగిన్స్ ఫ్రీగా అందుబాటులో ఉన్నాయి. వీటి కోసం ఎలాంటి ప్రోగ్రామింగ్ స్కిల్స్ మనకి అవసరం లేదు, జస్ట్ అర్థం చేసుకుంటే చాలు.
WordPress లో పోస్టింగ్ చేసే విధానం కొంచెం YouTube లో వీడియో అప్లోడ్ చేసే విధానంలాగే ఉంటుంది. చాలా ఈజీగా క్యాటగిరిస్ గా డివైడ్ చేసుకొని, బ్లాగ్ పోస్టులని, మెనూలో కూడా ఒక మెనూగా చూపించవచ్చు.
చాలా ఈమెయిలు మార్కెటింగ్ టూల్స్, పేమెంట్ గేట్వే టూల్స్ ప్రత్యేకంగా WordPress ప్లగిన్స్ తయారు చేస్తున్నాయి. కాబట్టి వీటిని కూడా సులభంగా ఉపయోగించుకోవచ్చు.
ఈ వర్డుప్రెస్ ఇన్స్టలేషన్ లో మీకు ఏమన్నా ప్రాబ్లంస్ ఉంటె మమల్ని కాంటాక్ట్ అవ్వండి. తక్కువ ఛార్జ్స్ తో మీకు బ్లాగ్ సెటప్ చేసి ఇస్తాము.
ఈ బ్లాగ్ పోస్ట్ ఎలా ఉంది? మీకు ఈ విధంగా హెల్ప్ అయ్యింది అని కింద కామెంట్ చేయండి.
ఈ బ్లాగ్ పోస్ట్ మీకు యూస్ఫుల్ అయ్యింది అనుకుంటే షేర్ చేయండి, ఎందుకంటె షేరింగ్ అంటే కేరింగ్ ❤️ కదా !
- Website Design Formula for Small Businesses - October 27, 2021
- Digital Marketers Meetup in Hyderabad in 2021 - September 1, 2021
- How to Write Viral Blog Posts in Telugu - August 12, 2021
Nice content bro
Thank you Pushkar, Keep reading for your success.
Very useful content…. Well explained…. Please visit my blog recently i started
https://pcodpregnancy.blogspot.com/?m=1
Thank you, and all the best for your blogging journey
Hai, bro this blog post is very helpful to Telugu people, who want to start a blog. Thank you for providing this amazing post.
kevalam 10 class chadivi intha baga blogs videos chesthunnarante meeru super sir
I had one drought meeru Telugu Fonts yela use chesthunaru cheppagalara veetiki sambandichina vidos unte
naku mail cheyyandi mail id = [email protected]
హాయ్ రాజ్, బ్లాగ్ లో కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు.
నేను తెలుగు ఫాంట్స్ కింద ఉన్న లింక్ ద్వారా యాడ్ చేసుకుంటాను. ప్రస్తుతం ఈ టాపిక్ పైన ఎలాంటి వీడియోస్ అయితే చేయలేదు.
ఈ ఫాంట్స్ యాడ్ చేసుకోవటానికి మీకు కొంత HTML,CSS నాలెడ్జ్ కావాలి.
మెయిల్ చేయమన్నారు బాగానే ఉంది, కానీ మీ మెయిల్ పని చేయటం లేదు కదా! ఒకసారి చూసుకోండి.
https://fonts.google.com/?subset=telugu