Elementor Plugin in Telugu
ఒక బ్లాగ్ లేదా వెబ్ సైట్ చేయాలి అంటే వర్డుప్రెస్ యూస్ చేయవచ్చు అని ఇంతకుముందు అనేక ఆర్టికల్స్ లో అదే విధంగా వీడియోస్ లో కూడా చెప్పాను. అదేవిధంగా ఒక అద్భుతమైన వెబ్ సైట్ ని అద్భుతంగా డిజైన్ చేయటానికి మనకి వర్డుప్రెస్ కొన్ని థీమ్స్, అదే విధంగా ప్లగిన్స్ ఇస్తుంది ఫ్రీగా.
అటువంటి టూల్స్ లో పేజి బిల్డర్ టూల్స్ ముఖ్యమైనవి. (మీ వెబ్ సైట్ / బ్లాగ్ కి డిజైన్ పరంగా) అటువంటి పేజి బిల్డర్ ప్లగిన్స్ లో Elementor చాలా చాలా పాపులర్ పేజి బిల్డర్ ప్లగిన్. మీరు వీటికి సంబంధించిన యాడ్స్ కూడా యూట్యూబ్ లో చూసే వుంటారు.
అటువంటి Elementor ప్లగిన్ గురించి ఈ బ్లాగ్ పోస్ట్ లో తెలుసుకుందాం.
పేజి బిల్డర్ అంటే ఏంటి?
పేజి బిల్డర్ అంటే ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ అంటే ఒక్క లైన్ కూడా కోడ్ రాయకుండా అద్భుతమైన వెబ్ పేజెస్ ని డ్రాగ్ & డ్రాప్ పద్ధతిలో క్రియేట్ చేయవచ్చు.
పేజి బిల్డర్స్ తో ఏమేమి క్రియేట్ చేయవచ్చు?
ఈ పేజి బిల్డర్స్ ని యూస్ చేసుకుని మనం అద్భుతమైన పేజెస్ (ముఖ్యంగా హోం పేజెస్), అదే విధంగా ఇన్నర్ పేజెస్ అంటే అబౌట్ పేజి, కాంటాక్ట్ పేజెస్ ఇలాంటి ఇంపార్టెంట్ పేజెస్ ని వీటి ద్వారా మీకు నచ్చినట్టు క్రియేట్ చేయవచ్చు.
మీకు ఒక ఉదాహరణ కావాలి అంటే Blogger VJ హోం పేజి ఈ విధంగా పేజి బిల్డర్ తోనే క్రియేట్ చేయటం జరిగింది.
Elementar ప్లగిన్ అంటే ఏంటి?
Elementor అనేది ఒక పేజి బిల్డర్ ప్లగిన్. దీన్ని యూస్ చేసుకుని చాలాచాలా ఈజీగా వెబ్ పేజెస్ ని క్రియేట్ చేయవచ్చు. ఈ ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకుని మీకు నచ్చినట్టు మీ వెబ్ పేజెస్ డిజైన్ క్రియేట్ చేసుకోవచ్చు.
ఇందులో అనేక రకాల టూల్స్, అదే విధంగా ఎన్నో టెంప్లేట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ఈ Elementor ప్లగిన్ ఫ్రీ అదే విదంగా ప్రీమియం వెర్షన్స్ లో అవైలబుల్ లో ఉంది.
మీరు ఫ్రీగా యూస్ చేసుకోవాలి అనుకుంటే ఎన్ని వెబ్ సైట్స్ తో అయినా వర్క్ చేయవచ్చు.
అసలు ఈ elementor ఫ్రీ వెర్షన్ లో ఏమేమి టూల్స్ & సెక్షన్స్ ఉన్నాయి?
మనకి ఫ్రీ వెర్షన్ లో ఈ క్రింది సెక్షన్స్ అదే విధమగా టూల్స్ ఉన్నాయి.
- Inner Section
- Heading
- Image
- Text editor
- Video
- Button
- Divider
- Spacer
- Google maps
- Icon
ఇలా ఎన్నో సెక్షన్స్ ఫ్రీ గా అవైలబుల్ లో ఉన్నాయి
వీటిని యూస్ చేసుకుని మీరు అద్భుతమైన వెబ్ పేజెస్ ని క్రియేట్ చేయవచ్చు.
అదే విధంగా మీరు కనుక ప్రో వెర్షన్ తీసుకుంటే ఈ ఫీచర్స్ తో పాటుగా మీకు మరిన్ని అదనపు ఫీచర్స్ అదేనండి సెక్షన్స్ అవైలబుల్ లోకి వస్తాయి. అవి ఏంటో ఒక్కసారి చూద్దాం.
- Posts
- Portfolio
- Gallary
- Form
- Login
- Slides
- Navigation Menu
- Animated Headline
- Pricelist
- Price Table
- Flipbox
- Call to Action
- Media Carousel
- Testimonial Carousel
- Reviews
- Table of Contents
- Countdown
- Share Buttons
- BlockQuote
- Facebook Button
- Facebook Comments
- Facebook Embed
- Facebook Page
- Template
ఇలాంటివి అందుబాటులో ఉంటాయి.
ప్రో వెర్షన్ ప్రైస్ ఎంత?
ఈ ప్రో వెర్షన్ కి సంబంధించి 4 ప్లాన్స్ ఆఫర్ చేస్తున్నారు. అవి క్రింద మీకు చూపించినట్టు ఉన్నాయి.
మీరు ప్రో వెర్షన్ తీసుకోవాలి అంటే ఈ ప్లాన్స్ లో ఏది మీకు సూట్ అవుతుంది అనుకుంటే దాన్ని తీసుకోవచ్చు.
ప్రో వెర్షన్ కనుక తీసుకుంటే మామూలుగా కన్నా కూడా అదనపు సెక్షన్స్ అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇంకా బాగా ఆకర్షణియంగా మీ వెబ్ పేజెస్ ని క్రియేట్ చేయవచ్చు.
ఈ Elementor గురించి సాధారణంగా వచ్చే డౌట్స్ గురించి కూడా తెలుసుకుందాం.
Elementor FAQ’s
Elementor ప్లగిన్ ని ఎవరైనా యూస్ చేయగలరా?
ఈ elementor ప్లగిన్ ని ఎలాంటి వాళ్ళు అయినా చాలాచాలా ఈజీగా యూస్ చేయవచ్చు. మీరు నేర్చుకోవాలి అనుకుంటే మనకి ఎన్నో ట్యుటోరియల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ elementor ప్లగిన్ కష్టం అంట కదా! నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు, నా ఫ్రెండ్స్ చెప్పారు అని ఆలోచించకండి.
దిగితేనే నది లోతు ఎంతో తెలుస్తుంది. అదే విధంగా మనం యూస్ చేయకుండా ఇలాంటి మాటలు నమ్మకూడదు. అందుకే కదా మనకి ఫ్రీ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.
మీకు తెలుసా మీరు కనుక ఒక elementor ప్లగిన్ ని పర్ఫెక్ట్ గా యూస్ చేసుకోగలిగితే మీకు ఎటువంటి పెయిడ్ థీమ్స్ అవసరం లేదు.
మీకు ఆల్రెడీ నేను పైన నా హోం పేజి కూడా ఈ Elementor ప్లగిన్ ని యూస్ చేసే చేశాను అని చెప్పాను. నా హోం పేజి ని చూసారా? చూడకపోతే ఇప్పుడే Blogger VJ హోం పేజి చెక్ చేయండి. నేను కూడా ఈ elementor టూల్ ని యూస్ చేశాను.
ఈ elementor ప్లగిన్ నా థీమ్ తో వర్క్ అవుతుందా?
అవును elementor దాదాపుగా ప్రతి థీమ్ కి సపోర్ట్ చేస్తుంది. మీరు ఎటువంటి థీమ్ యూస్ చేసిన ఫ్రీ కావచ్చు, లేదా పెయిడ్ కావచ్చు దానికి మీకు ఈ ప్లగిన్ ఈజీ గా సెట్ అవుతుంది.
Elementor ప్లగిన్ నా సైట్ ని స్లో చేస్తుందా?
ఈ elementor ప్లగిన్ వల్ల మీ వెబ్ సైట్ యొక్క పెర్ఫార్మన్స్ పెరుగుతుంది తప్ప తగ్గదు. ఎందుకంటె నేను ఈ elementor ప్లగిన్ ని నాకోసం అదేవిధంగా నా క్లైంట్స్ కోసం కూడా యూస్ చేస్తున్నాను. నాకు లేదా వాళ్ళకి ఇంత వరకూ ఎటువంటి ప్రాబ్లంస్ ఈ ప్లగిన్ వల్ల రాలేదు.
దాదాపుగా ప్రతి బ్లాగర్ వాళ్ళ హోం పేజెస్ కోసం, లాండింగ్ పేజెస్ కోసం ఈ ప్లగిన్ ని యూస్ చేస్తే వాళ్ళకి చాలా టైం ఇంకా మనీ కూడా సేవ్ అవుతాయి.
నేను నా ఈబూక్స్, కోర్స్ ల కోసం కూడా నేను ఈ elementor ప్లగిన్ నే యూస్ చేస్తాను. అదే విధంగా thank you పేజెస్ ఇలా దాదాపుగా నాకు కావలసినవి అన్ని నేను ఈ ప్లగిన్ తో ఈజీగా క్రియేట్ చేసుకుంటాను.
ఇది elementor ప్లగిన్ కి సంబందించిన ఓవర్వ్యూ. ఈ ప్లగిన్ పైన నేను ఒక వీడియోని కూడా తెలుగులో చేశాను. ఒకసారి ఆ వీడియో పూర్తిగా చుడండి. ఇక్కడ నేను చెప్పిన విషయాలు వీడియో చుస్తే ఇంకా బాగా అర్థం అవుతాయి అని అనుకుంటున్నాను.
మరి మీలో ఎంత మంది ఈ elementor ప్లగిన్ ని యూస్ చేస్తున్నారు? ఒకవేళ మీరు elementor కాకుండా వేరే పేజి బిల్డర్ కనుక యూస్ చేస్తుంటే దాన్ని ఎందుకు యూస్ చేస్తున్నారో చెప్పండి. మళ్ళి మరో టాపిక్ తో మీ ముందుకు వస్తాము.
- Website Design Formula for Small Businesses - October 27, 2021
- Digital Marketers Meetup in Hyderabad in 2021 - September 1, 2021
- How to Write Viral Blog Posts in Telugu - August 12, 2021