Benefits of Guest Blog Posting in Telugu
మీ బ్లాగ్ కి క్వాలిటీ ట్రాఫిక్ రావాలి అన్నా, మీ బ్లాగ్ కి జెన్యూన్ బ్యాక్ లింక్స్ కావాలి అంటే మీరు గెస్ట్ బ్లాగ్ పోస్టింగ్ చేయాలి? ఎక్కడో విన్నట్టు ఉంది కదా. మీరు నా లాస్ట్ బ్లాగ్ పోస్ట్ కనుక చదివితే నేను ఏమంట్టున్నానో మీకు అర్థం అవుతుంది. మీ బ్లాగ్ కి ట్రాఫిక్ ని ఇంక్రీస్ చేయటం లో గెస్ట్ బ్లాగ్ పోస్టింగ్ హెల్ప్ చేస్తుంది.
ఈ బ్లాగ్ పోస్ట్ లో మనం అసలు గెస్ట్ బ్లాగ్ పోస్టింగ్ అంటే ఏంటి? గెస్ట్ బ్లాగ్ పోస్టింగ్ వలన కలిగే బెనిఫిట్స్ ఏంటి? అనే విషయాలు తెలుసుకుందాం.
గెస్ట్ బ్లాగ్ పోస్టింగ్ అంటే ఏంటి?
గెస్ట్ బ్లాగ్ పోస్టింగ్ అంటే మీరు నా బ్లాగ్ లో ఆర్టికల్ రాయడాన్ని గెస్ట్ బ్లాగ్ పోస్టింగ్ అంటారు. ఉదాహరణకు మీరు డిజిటల్ మార్కెటింగ్ గురించి బ్లాగింగ్ చేస్తున్నారు. సేమ్ నేను కూడా డిజిటల్ మార్కెటింగ్ పై బ్లాగ్ రన్ చేస్తున్నాను.
సో మీరు లేటెస్ట్ గా డిజిటల్ మార్కెటింగ్ అప్ డేట్స్ నా బ్లాగ్ లో, మీరు ఆథర్ గా ఒక బ్లాగ్ పోస్ట్ రాస్తే దాన్ని గెస్ట్ బ్లాగ్ పోస్టింగ్ అంటారు.
మీకు గెస్ట్ బ్లాగ్ పోస్టింగ్ అంటే ఏమిటో అర్ధం అయ్యిందని అనుకుంటున్నాను
గెస్ట్ బ్లాగ్ పోస్టింగ్ వల్ల కలిగే బెన్ ఫిట్స్ ఏంటి?
గెస్ట్ బ్లాగ్ పోస్టింగ్ చేయడం వల్ల అనే బెన్ ఫిట్స్ ఉన్నాయి.
1) Benefits of Guest blog posting in Telugu | బ్యాక్ లింక్స్ పొందటం
వాటిలో ఒకటి మనం హైక్వాలిటీ బ్యాక్ లింక్స్ ను పొందవచ్చు. హై అథారిటీ డొమైన్ నుంచి హై అథారిటీ పేజ్ లలో మనం గెస్ట్ బ్లాగ్ పోస్టింగ్ చేయడం వల్ల మనం హైక్వాలిటీ బ్యాక్ లింక్స్ ను పొందవచ్చు.
SEO లో బ్యాక్ లింక్స్ కీరోల్ ప్లే చేస్తాయి. హైక్వాలిటీ బ్యాక్ లింక్స్ పొందడం వల్ల మన బ్లాగ్ ప్రమోషన్ అవుతుంది.
2) Benefits of Guest blog posting in Telugu | ట్రాఫిక్
గెస్ట్ బ్లాగ్ పోస్టింగ్ రాయడం వల్ల మీ బ్లాగ్ కి ట్రాఫిక్ పెరిగిపోతుంది. అదెలా అంటే మీరు గెస్ట్ బ్లాగ్ పోస్టింగ్ చేస్తే అందులో మీ గురించి పూర్తి డీటేయిల్స్ ఉంటాయి. ఒక వేళ మీరు రాసిన బ్లాగ్ పోస్ట్ నచ్చితే యూజర్స్ మీ సైట్ ను విజిట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది.
ఉదాహరణకు – Quora లో గెస్ట్ బ్లాగింగ్ చేయోచ్చు. కానీ చాలామంది క్వశ్చన్స్ కు ఆన్సర్ రాసి కింద వెబ్ సైట్ లింక్ ఇస్తారు.
Medium – మీడియం వెబ్ సైట్ గురించి మీ అందరికి తెలిసే ఉంటుంది. ఈ మీడియం వెబ్ సైట్ లో గెస్ట్ బ్లాగ్ పోస్టింగ్ చేస్తుంటారు. దీని వల్ల మనం బ్యాక్ లింక్స్ ను పొందవచ్చు. ఈ మీడియం వెబ్ సైట్ అనేది ట్విట్టర్, టంబ్లర్ లాగా ఉంటుంది. అందులో మనం ఆర్టికల్ రాస్తే బ్యాక్ లింక్ ను పొందవచ్చు.
3) Benefits of Guest blog posting in Telugu | బ్రాండింగ్
గెస్ట్ బ్లాగ్ పోస్టింగ్ వల్ల మీ బ్రాండింగ్ అనేది ఇన్ క్రీస్ అవుతుంది. గెస్ట్ బ్లాగ్ పోస్ట్ రాస్తే దానికి వచ్చే విజిటర్స్ మీ బ్లాగ్ ను విజిట్ చేసే అవకాశం ఉంది.
హై అథారిటీ ఉన్న బ్లాగ్ లకు వ్యూహర్స్ ఎక్కువ మంది వస్తుంది. మీరు రాసిన పోస్ట్ వాళ్లకు నచ్చితే మీ బ్లాగ్ ను విజిట్ చేస్తారు. దీని వల్ల మీ ట్రాఫిక్ పెరిగిపోతుంది.
4) Benefits of Guest blog posting in Telugu | బ్లాగర్ నెట్ వర్క్ పెరుగుతుంది
గెస్ట్ బ్లాగ్ పోస్టింగ్ వల్ల బ్లాగర్ నెట్ వర్క్ పెరిగిపోతుంది. మీ ఇండస్ట్రీలో ఎవరున్నారు. వేరే ఇండస్ట్రీలో ఎవరున్నారనే విషయం తెలుస్తోంది. దీని వల్ల మిగిలిన బ్లాగర్స్ తో పరిచయాలు పెరుగుతుంటాయి.
5) Benefits of Guest blog posting in Telugu | రైటింగ్స్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి.
గెస్ట్ బ్లాగ్ పోస్టింగ్ వల్ల మన రైటింగ్ స్కిల్స్ పెరుగుతాయి. ఎలా అంటారా. మనం రాసే గెస్ట్ బ్లాగ్ పోస్టింగ్ సైట్ అథారిటీ ఎక్కువగా ఉండడం, మనం రాసే గెస్ట్ బ్లాగ్ పోస్టింగ్స్ లో ఎటువంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేయడంతో పాటు మన వీక్ నెస్ మరియు స్ట్రెంగ్త్ గురించి తెలుసుకోవచ్చు.
మీరు కనుక మీ బ్లాగ్ కి మంచి బ్యాక్ లింక్స్ కావాలి, ట్రాఫిక్ పెరగాలి అనుకుంటే మీరు గెస్ట్ బ్లాగ్ పోస్టింగ్ చేయాలి. గెస్ట్ బ్లాగ్ పోస్టింగ్ చేస్తే మీకు పైన మనం చెప్పుకున్న బెనిఫిట్స్ వాళ్ళ మీ బ్లాగ్ త్వరగా గ్రో అవుతుంది.
SEO లేకుండా మీ బ్లాగ్ కి ట్రాఫిక్ ఇంక్రీస్ చేయటం ఎలా?
మీరు బ్లాగింగ్ / డిజిటల్ మార్కెటింగ్ పై నా బ్లాగ్ లో గెస్ట్ బ్లాగ్ పోస్టింగ్ చేయాలి అంటే [email protected] కి మెయిల్ చేయండి.
మీకు గెస్ట్ బ్లాగ్ పోస్టింగ్ వలన కలిగే బెనిఫిట్స్ ఇంకా తెలిస్తే కామెంట్స్ లో తెలియచేయండి. ఈ టిప్స్ మీకు యూస్ అయితే మీకు కలిగిన బెనిఫిట్ ఏంటి అని కామెంట్ లో చెప్పండి. ఈ బ్లాగ్ పోస్ట్ కనుక మీకు నచ్చితే షేర్ చేయండి. ఎందుకంటె Sharing is Caring 💓 కదా!
- Website Design Formula for Small Businesses - October 27, 2021
- Digital Marketers Meetup in Hyderabad in 2021 - September 1, 2021
- How to Write Viral Blog Posts in Telugu - August 12, 2021
నాకు మీ బ్లాగింగ్ కోర్స్ చాలా బాగా ఉపయోగపడింది మరియు మీ ఆర్టికల్స్ కూడా బాగా ఉంటాయి. భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి ఆర్టికల్స్ అందించాలి అని నేను కోరుకుంటున్నాను.
ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. మీ సహకారం ఇలాగె ఉందటే అలాగే మంచి మంచి ఆర్టికల్స్ అందించగలను.