How to start blogging for Low Price in Telugu by Blogger VJ

Spread the love

 

How to start blogging for low price by blogger vj
How to start blogging for low price by blogger vj

 

బ్లాగ్గింగ్ స్టార్ట్ చేసే వాళ్ళలో చాలా మంది స్టూడెంట్స్, ఉద్యోగులు, నిరుద్యోగులు, ఎక్కువ మంది మనీ ఎర్న్ చేయడం కోసమే చేస్తారు. కాబట్టి వాళ్ళలో చాలా మంది వీలు అయితే ఫ్రీగా, లేదా అతి తక్కువ ఖర్చుతో బ్లాగ్గింగ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటారు.అలంటి వల్ల కోసమే ఈ ఆర్టికల్. ఇందులో ఫ్రీ వెబ్ హోస్టింగ్ ఎందుకు తీసుకోకూడదు? Godaddy, Wixవంటి కంపెనీలు ఆఫర్ చేసే సర్వీసులు ఎందుకు రిఫర్ చేయకూడదు? అతి తక్కువ ఖర్చుతో బ్లాగ్గింగ్ స్టార్ట్ చేయటం ఎలా? అనే విషయాలని చూద్దాం!

ఫ్రీ వెబ్ హోస్టింగ్ బ్లాగ్గింగ్ కి ఎందుకు తీసుకోకూడదు?

        చాలా మంది ఫ్రీ వెబ్ హోస్టింగ్ ఎక్కడ దొరుకుతుంది? అని గూగుల్ లో వెతుకుతూ ఉంటారు. నిజానికి చాలా కంపెనీలు ఫ్రీ హోస్టింగ్ ని అందిస్తున్నాయి. అయితే ఈ హోస్టింగ్ సర్వీస్ లని బ్లాగ్గింగ్ చేసే వాళ్లు ఎందుకు రిఫర్ చేయకూడదు అని చూద్దాం.

 

  • ఫ్రీ హోస్టింగ్ సర్వీస్ లు అందించే వెబ్సైట్ల సర్వర్స్ ఎప్పుడు ఆగిపోతాయి తెలియదు.
  • వెబ్ సైట్ లోడింగ్ స్పీడ్ కూడా చాలా స్లోగా ఉంటుంది.
  • అంతే కాకుండా స్పేస్ లిమిటేషన్ ఉంటుంది.
  • ఫ్రీ సర్వీస్ కాబట్టి సపోర్ట్ అంత బాగోదు. ఏదో ఒక 20% – 30% మాత్రమే ఉంటుంది.
  • ఇవి WordPress వంటి అప్లికేషన్లకి సపోర్ట్ చేసిన అంత స్పీడ్ గా వుండవు.
  • ఈ సర్వర్స్ లో స్టాటిక్ వెబ్ సైట్ లకి అంత ఇబ్బంది ఉండదు. కానీ డైనమిక్ వెబ్ సైట్ల వర్కింగ్ స్పీడ్ చాలా తగ్గుతుంది.
  • వీళ్ళు ఎంతసేపటికి ఫ్రీగా రిజిస్టర్ అయిన వాళ్ళని ప్రీమియం సర్వీసెస్ / ప్యాకేజ్స్ తీసుకోమని రిఫర్ చేస్తారు.
  • వీళ్ళు అందించే బ్యాండ్విడ్త్ చాలా తక్కువగా ఉంటుంది, చాలా వెబ్ సైట్స్ / కంపెనీలు చెప్పటానికి అన్లిమిటెడ్ బ్యాండ్విడ్త్ అని అంటారు కానీ, అన్లిమిటెడ్ ఇవ్వరు.

WordPress కాకుండా Godaddy, Wix వంటివి ఎందుకు రిఫర్ చేయకూడదు?

        Godday,Wix వంటి చాలా వెబ్ సైట్లు చాలా తెలివిగా మార్కెటింగ్ చేస్తూ ఉంటాయి. వాళ్లు ఆఫర్ చేసే సర్వీస్ గురించి ఇక్కడ చెప్పుకుందాం. వల్ల దగ్గర మంత్లీ 600 – 800 రూపాయల మధ్యన ఉండే ప్లాన్లలో మనకి హోస్టింగ్ తో పాటుగా వెబ్ సైట్ బిల్డర్ సర్వీస్ ని కూడా అందిస్తారు. వెబ్ సైట్ బిల్డర్ అంటే డ్రాగ్ & డ్రాప్ పద్ధతి ద్వారా మనకి కావలసినట్టు వెబ్ సైట్ / బ్లాగ్ డిజైన్ చేసే టూల్. వీళ్ళు మనల్ని ఎట్ట్రక్ట్ చేయటానికి ఫ్రీ గా డొమైన్ ఇస్తారు. .com, .in, .org ఇలా ఏదైనా.
        ఈ సర్వీస్ లో మొదట ప్రైసింగ్ గురించి తెలుసుకుందాం. ఉదాహరణకి నెలకి 800 అని అనుకుందాం. అంటే సంవత్సరానికి 800 x 12 = 9600. GST ఎక్స్ట్రా. అదే మనం BlueHost సర్వీస్ తీసుకున్నా 5000 సంవత్సరానికి అంతకు మించదు. BlueHost అయితే ఫ్రీగా .com డొమైన్ ఎక్స్టెన్షన్ తో ఇస్తుంది. అలా కాకుండా HostGator, లేదా Hostinger వంటివి అయితే ఇంకా తక్కువ చార్జ్ చేస్తాయి. విడిగా డొమైన్ పర్చేస్ చేసిన ఇంకో వెయ్యి రూపాయల దాక తగ్గుతుంది.
        వెబ్ సైట్ బిల్డర్ టూల్ డ్రాగ్ & డ్రాప్ చేసుకునే వెసులుబాటు ఉన్నా అందులో మనకి కావాల్సిన అదనపు హంగులు అంటే ఈమెయిలు కలెక్షన్ ఫార్మ్స్, కాంటాక్ట్ ఫారం, సోషల్ షేరింగ్ వంటి ఆప్షన్స్ వుండవు, అదే సెల్ఫ్ హోస్టింగ్ WordPress లో మనకి అన్ని రకాల అవసరాలకి ఫ్రీ మరియు పైడ్ ప్లగిన్స్ అందుబాటులో ఉంటాయి. కాబట్టి వీటిని దృష్టిలో వుంచుకొని వీటిని తిరస్కరించడానికి ప్రయత్నించండి.

అతి తక్కివ ఖర్చుతో బ్లాగ్గింగ్ స్టార్ట్ చేయడం ఎలా?

        చాలా మంది బ్లాగ్గింగ్ చేసే బిగినర్స్ మనీ ఎఫ్ఫర్ట్ చేయలేకపోవచ్చు. వాళ్లు దాదాపుగా ఫ్రీ గా స్టార్ట్ చేద్దాం అనే అనుకుంటారు. ఫ్రీగా స్టార్ట్ చేసే సర్విసులలో ఉండే లాభనష్టాల గురించి ఇంతకు ముందు ఆర్టికల్స్ లో చెప్పుకోవటం జరిగింది. మరి అతి తక్కువతో అంటే 1000 రూపాయలతో బ్లాగ్ స్టార్ట్ చేయటం ఎలా? అంటే ఇందుకు నేను చెప్పే మార్గ డొమైన్ .com, .in, .org, .net వంటి ఎక్స్టెన్షన్ తో కొనుక్కొని blog-spot అప్లికేషను వాడుకోవచ్చు.
        అవును కస్టమ్ డొమైన్ నేమ్ ని blog-spot లో లింక్ చేఉకుని blog-spot ప్లాట్ఫారం లో (అంటే గూగుల్ హోస్టింగ్) ఉపయోగించుకుని బ్లాగ్గింగ్ స్టార్ట్ చేయవచ్చు. అంటే ఓక్ డొమైన్ కొనుకుంటే సరిపోతుంది. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఈ సర్వీస్ ని మనం కొంత కాలం మాత్రమే ఉపయోగించుకుంటాం. (అంటే గూగుల్ లైఫ్ టైం ఇస్తుంది.) వర్డుప్రెస్సు లోకి మారటం తప్పనిసరి. వర్డ్ప్రెస్ బ్లాగ్ కి అదనపు సౌకర్యాలు ఉంటాయి.
          Blog-spot లో కూడా చాలా థీమ్స్ ఫ్రీగా దొరుకుతాయి. వీటిని మనం ఉపయోగించుకోవచ్చు. Blog-spot పై కూడా YouTube, ఇంకా చాలా బ్లాగ్స్ ట్యుటోరియల్స్ అందిస్తున్నాయి. నిదానంగా బ్లాగ్గింగ్ స్టార్ట్ చేయవచ్చు. మంచి కంటెంట్ ప్రెసెంట్ చేయగలిగితే అతి తక్కువ సమయంలో పాపులర్ అవ్వవచ్చు. అప్పుడు నిదానంగా డబ్బులు చూసుకొని WordPress లోకి మారొచ్చు. ఈ పద్ధతి ఎందుకు చెప్తున్నాను అంటే డబ్బులు లేవు అని ఆగిపోకుండా త్వరగా సక్సెస్ అవ్వవచ్చు. ఏదో ఒక విధంగా మొదలుపెడితే త్వరగా బ్లాగ్గింగ్ స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు ఏమన్నా ఇబ్బందులు ఉంటె మమల్ని కాంటాక్ట్ అవ్వండి. జై హింద్.

TENGLISH

Blogging start chese vallalo chala mandi students, employees, unemployees, yekkuva mandi money earn cheyadam kosame chesteru. Kabatti valalo chala mandi vilu ayithe freega, leda athi takkuva kharchutho blogging start cheyali ani anukuntaru. Alanti valla kosame ee Article Indulo Free Web hosting yenduku tisukokudadu? Godaddy, Wix vanti companies offer chese services yenduku refer cheyakudadu? Ati takkuva kharchutho blogging start cheyatam yela? Ane vishayalani chuddam!

Free Web Hosting Blogging ki yenduku tisukokudadu?

        Chala mandi free web hosting yekkada dorukutundi? ani google lo search chestoo untaru. Nijaniki chala companies free hosting ni andistunnayi. Ayithe ee hosting service lani blogging chese vallu yenduku refer cheyakoodadu ani chuddam.
·       Free Hosting servicelu andonche website servers yeppudu aagipothayo teliyadu.
·       Website loading speed kooda chala slowga untundi.
·       Anthe kakunda space limitation untundi.  
·       Free service kabatti support antha bagodu. Yedo oka 20% – 30 % matrame untundi.  
·       Ivi WordPress vanti applications ki support chesina antha speedga undavu.
·       Ee servers lo static website laki yentha ibbandi undadu. Kani dynamic website la working speed chala taggutundi.
·       Villu yentasepatiki freega register ayina vallani premium services / packages tisukomani refer chestaru.  
·       Villu andinche bandwidth chala takkuvaga untundi, Chala websites / companies unlimited, bandwidth ani antaru, kani unlimited ivvaru.

WordPress kakunda Godaddy, Wix vantivi yenduku refer cheyakoodadu?

        Godday, Wix vanti chala websites chala teliviga marketing chestoo untayi. Vallu offer chese service gurinchi ikkada cheppukundam. Valla daggara 600-800 rupees madhyana unde plans lo manaki hostingtho patuga website builder service ni kooda andistaru. Website builder ante drag and drop padhati dwara mana ki kavalsinattu website / blog domain istaru. .com, .in, .org ila yedaina.
        Ee service lo modata pricing gurinchi telusukundam. Udaharanaki nelaki 800 ani anukundam. Ante samvatsaraniki 800×12=9600. GST extra. Ade manam BlueHost service tisukunna 500 year ki antaku minchadu. BlueHost ayithe freega .com domain extension tho istundi. Ala kakunda Hostgator leda Hostinger vantivi ayithe ika takkuva charge chestayi. Vidiga Domain purchase chesina inko thousand daka taggutundi.
        Website builder tool drag and drop chesukune vesulubatu unna andulo manaki kavalsina adanapu hangulu ante email collection forms, contact form, social sharing vanti adanapu options undavu, ade self hosting wordpress lo manaki anni rakala avasaralaki free mariyu paid plugins andubatulo untayi. Kabatti vitini drushtilo vunchukoni vitini tiraskarinchadaniki prayatninchandi.
Ati takkuva kharchutho blogging start cheyadam yela?
        Chala mandi blogging chese beginners money effort cheyalekapovachu. Vallu dadapuga freega start cheddam ane anukuntaru. Freega start chese services lo unde labhanashtala gurinchi intaku mundu articles lo cheppukovatam jarigindi. Mari ati takkuvatho ante 1000/- roopayalatho blog start cheyatam yela? Ante induku nenu cheppe margam domain .com, .in, .org, .net vanti extension tho konnukkoni blogspot (blogger) application vadukovachu.
        Avunu custom domain name ni blogspot lo link chesukuni blogspot platform lo (ante google hosting) upayoginchukuni blogging start cheyavachu. Ante oka domain konukunte saripotundi. Ayihte oak vishayam gurtu pettukondi. Ee service ni manam kontha kalam matrame upayoginchukuntam. (Ante google lifetime istundi). WordPress loki maratam tappanisari. WordPress loki maratam tappanisari. WordPress blog ki adanapu facilities untayi.
          Blogspot lo kooda chala free themes / templates dorukutayi. Vitini manam upayoginchukovachu. Blogger pai kooda YouTube, inka chala blog tutorials andistunnyi. nidanamga blogging start cheyavachu. Manchi content present cheyagaligithe ati takkuva samayamlo popular avvvachu. Appudu nidanamga dabbulu chusukuni WordPress loki maravachu. Ee padhati yenduku cheptunnanu ante dabbulu levu ani aagipokunda twaraga success avvavachu. Yedo oka vidhamga modalupedithe twaraga blogging start cheyandi. Okavela miku yemanna ibbandulu unte mammlni contact avvandi. Jai Hind.

1 thought on “How to start blogging for Low Price in Telugu by Blogger VJ”

Leave a Comment