How to Write Viral Blog Posts in Telugu

Spread the love

వైరల్ బ్లాగ్ పోస్ట్స్ ఎలా వ్రాయాలి? How to Write Viral Blog Posts in Telugu

ఒక బ్లాగ్ పోస్ట్ ఎలా వ్రాయాలి అని మీరు అర్థం చేసుకుంటే బ్లాగ్స్ వ్రాయటం పెద్ద కష్టం ఏమి కాదు. కానీ వ్రాసిన బ్లాగ్ పోస్ట్స్ ని వైరల్ చేయటం కష్టం.

మంచి మంచి బ్లాగ్ పోస్ట్స్ వ్రాసిన తరువాత కూడా మీ బ్లాగ్ కి ట్రాఫిక్ ఎందుకు రావట్లేదు, షేర్స్ రావటం లేదో అర్థం కావట్లేదా?

మంచి బ్లాగ్ పోస్ట్స్ వ్రాయటం ఎంత ఇంపార్టెంటో వాటిని ప్రోమోట్ చేసుకుని వైరల్ కూడా చేయగలగాలి.

How to Write Viral Blog posts in Telugu

వైరల్ అయ్యే విధంగా బ్లాగ్ పోస్ట్స్ ఎలా వ్రాయాలి? How to write viral blog posts in telugu

మీరు మీ కంటెంట్ వైరల్ కావాలి అనుకుంటున్నారా? అయితే నేను మీ కోసం ఈరోజు 5 స్టెప్స్ ప్లాన్ ఒకటి మీ కంటెంట్ వైరల్ చేయటానికి ఉపయోగపడేది చెప్తాను.

ఒక్కసారి ఇది మీకు అర్థం అయ్యింది అంటే తప్పకుండా మీ బ్లాగ్స్ వైరల్ అవుతాయి.

ఆ 5 స్టెప్స్ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి అని ఉందా? మరి ఆలస్యం చేయకుండా వెంటనే స్టార్ట్ చేద్దాం.

స్టెప్ 1: బ్లాగ్ పోస్ట్ ఐడియాస్

Step 1 for Writing Viral Blog posts in Telugu

వైరల్ అయిన ప్రతి బ్లాగ్ పోస్ట్ ఎక్కడ మొదలవుతుంది, ఒక్క ఐడియాతోనే. అంతే కదా! అందుకే మీరు ఇంటరెస్టింగ్, వేల్యూబుల్  కంటెంట్ ఐడియాస్ తో బ్లాగ్స్ వ్రాయగాలగాలి.

ఇది నేను చెప్పినంత ఈజీ కాదు. ఎందుకంటె నేను కూడా ఒక బ్లాగర్ నే. వైరల్ బ్లాగ్ పోస్ట్ ఐడియాస్ కోసం బుర్రకి పదును పెట్టాలి, దానికి చాలా టైం పడుతుంది.

ఒకవేళ మీరు కనుక తరువాత ఎలాంటి బ్లాగ్ పోస్ట్స్ వ్రాయాలి అని అనుకుంటూ ఉంటె నేను మీకు కొన్ని టిప్స్ చెప్తాను. వాటిని కనుక మీరు ఇంప్లిమెంట్ చేయటానికి  ట్రై చేస్తే మీకు బ్లాగ్ పోస్ట్ ఐడియాస్ కుప్పలు కుప్పలుగా వస్తూనే ఉంటాయి.

మీ కాంపిటీటర్స్ పైన ఒక కన్ను వేయండి

వైరల్ బ్లాగ్ పోస్ట్ ఐడియాస్ కోసం ఈజీగా మనం చేయగలిగింది మన కాంపిటీటర్స్ బెస్ట్ పెర్ఫార్మింగ్ కీవర్డ్స్ ఏంటో తెలుసుకోవటం.

మంచి సెర్చ్ వాల్యుం ఉన్న కీవర్డ్స్ కోసం కీవర్డ్స్ రీసెర్చ్ చేయండి. ఆ కీవర్డ్స్ యూస్ చేసుకుని మీ స్టైల్ లో బ్లాగ్ పోస్ట్స్ క్రియేట్ చేయండి.

మీ కాంపిటీటర్స్ బెస్ట్ బ్లాగ్ పోస్ట్స్ ఎలా తెలుసుకోవాలి అని మీరు ఆలోచిస్తున్నారా? చెప్తా…అది కూడా చెప్తా.

పాపులర్ పోస్ట్స్ : దాదాపుగా ప్రతి బ్లాగ్ లో సైడ్బార్ లోనో, About పేజి లోనో, ఫూటర్ లోనో ఎక్కడో ఒక చోట వాళ్ళ బ్లాగ్ లో ఎక్కవు మంది చదివే బ్లాగ్ పోస్ట్స్ ని ఫీచర్ చేస్తుంటారు. పాపులర్ పోస్ట్స్ అనో లేక వైరల్ పోస్ట్స్ అనో ఏదో ఒక పేరుతొ పాపులర్ పోస్ట్స్ ని ఉంచుతారు.

ఇలా మనం ఈజీగా మీ కాంపిటీటర్స్ పాపులర్ పోస్ట్స్ కనిపెట్టొచ్చు. ఒక 10-15 బ్లాగ్ పోస్ట్స్ కనుక గమనిస్తే మీకు కనీసం ఒక డజను బ్లాగ్ పోస్ట్ ఐడియాస్ అయినా వస్తాయి.

SEMRush: ఇది బాగా పాపులర్ పెయిడ్ SEO టూల్. ఆ విషయం మీ అందరికి బాగా తెలుసు. అయితే ఇందులో మనం మీ కాంపిటీటర్ బ్లాగ్ url తో మీ కాంపిటీటర్స్ బెస్ట్ కీవర్డ్స్ తెలుసుకోవచ్చు. దీంతో చాలా ఈజీగా మీరు ఇంకొన్ని బ్లాగ్ పోస్ట్ ఐడియాస్ గెయిన్ చేయవచ్చు.

Suggested Blog Post : How to Bring Traffic to New Blog Without SEO

మీ ఓన్ బ్లాగ్ పోస్ట్ ఐడియాస్

మీరు ఫ్రీగా ఉన్నపుడు (సాదారణంగా ఉండరు, ఒకవేళ ఉంటె) మీ బ్లాగ్ లో ఎలాంటి బ్లాగ్ పోస్ట్స్ వ్రాయాలి అని ఆలోచించండి. మీ రీడర్స్ కి సహజంగా ఉండే క్వశ్చన్స్ ఏం ఉంటాయి అని అలోచించి వాటిని ఒక పేపర్ పైన వ్రాయండి. ఆ క్వశ్చన్స్ నుండి మీకు కొన్ని బ్లాగ్ పోస్ట్ ఐడియాస్ వస్తాయి.

మీ బ్లాగింగ్ జర్నీ స్టార్ట్ చేసిన దగ్గర నుండి మీరు చేసిన మిస్టేక్స్ వ్రాసుకోండి. మీరు యూస్ చేసిన, చేస్తున్న టూల్స్ గురించి వ్రాయండి. మీరు ఏ నిష్ లో ఉన్నా రీడర్స్ కి ఉపయోగపడే వాటిని గురించి, వాళ్ళకి కనెక్ట్ అయ్యే వాటి గురించి వ్రాయగలిగితే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి.

స్టెప్ 2: రీసెర్చ్

Step 2 for Writing Viral Blog posts in Telugu

మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయవలసిన అంశం లేదా ఎక్కువ టైం స్పెండ్ చేసే అంశం.

Pat Flynn ఒకసారి ఇలా చెప్పారు, నేను ఒక బ్లాగ్ పోస్ట్ ని ఫినిష్ చేయటానికి 9-10 గంటలు స్పెండ్ చేస్తాను. మిగిలిన టైం అంతా నేను రీసెర్చ్ పైన స్పెండ్ చేస్తాను అని.

మీరు ఏం వ్రాయాలి అని అనుకుంటున్నారో దాని గురించి ఎంత ఎక్కువ టైం స్పెండ్ మీరు రీసెర్చ్ చేయగలిగితే ఆ బ్లాగ్ పోస్ట్ మీరు అంత బాగా వ్రాయగలరు.

ఆ ఏముందిలే ! ఒక గంటా, రెండు గంటల్లో బ్లాగ్ పోస్ట్ వ్రాయొచ్చు అని చాలా మంది అనుకుంటారు. అయితే మీరు ఇంకా ఎక్కువ ట్రాఫిక్ మీ బ్లాగ్ కి తీసుకురావాలి అనుకుంటే ఈ మెథడ్ కరెక్ట్ కాదు అని అయితే నేను చెప్పగలను.

రీసెర్చ్ కోసం ఎక్కువ టైం కనుక తీసుకుంటే మీరు ఖచ్చితంగా మీ రీడర్స్ కి హెల్ప్ అయ్యే విధంగా అద్భుతమైన కంటెంట్, డిటైల్డ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ ప్రాబ్లంస్ సాల్వ్ అయ్యే విధంగా సొల్యూషన్స్ ప్రోవైడ్ చేయగలరు.

అంతే కాకుండా మీరు ఇన్-డెప్త్ కంటెంట్ కూడా వ్రాయగలరు.

రీసెంట్ గా ఒక బ్లాగ్ ని పబ్లిష్ చేశాను, 2000 + వర్డ్స్ తో బ్లాగ్ పోస్ట్స్ ఎలా వ్రాయాలి అని. అందులో నేను లాంగ్ ఫార్మ్ కంటెంట్ సెర్చ్ ఇంజిన్స్ లో త్వరగా రాంక్ అవుతుంది అని కూడా చెప్పను. మీరు చదవకపోతే ఒక్కసారి ఆ బ్లాగ్ పోస్ట్ చూడండి.

ఎక్కువ టైం రీసెర్చ్ పైన కనుక స్పెండ్ చేయగలిగితే అదొక అడ్వాంటేజ్ అవుతుంది. ఈసారి బ్లాగ్ పోస్ట్ వ్రాయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా రీసెర్చ్ పైన కూడా ఫోకస్ చేయండి. రిజల్ట్స్ మిరే ఎక్స్పీరియన్స్ చేయగలరు.

స్టెప్ 3: త్వరగా వ్రాయటానికి క్విక్ టిప్స్

Step 3 for Writing Viral Blog posts in Telugu

చాలా మంది బ్లాగర్స్ కి సహజంగా ఉండే ఇబ్బంది, బ్లాగ్ పోస్ట్స్ వ్రాసేటప్పుడు ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటారు. ఎక్కువ టైం రీసెర్చ్ పైన స్పెండ్ చేయటం తప్పు కాదు. కానీ మీరు ప్రొడక్టివిటీ టిప్స్ తెలుసుకుని త్వరగా వ్రాయగాలగాలి.

ఫాస్ట్ గా వ్రాయగలగటానికి కొన్ని టిప్స్

  1. అవుట్ లైన్

ఒక ఐడియాతో బ్లాగ్ పోస్ట్ వ్రాయాలి అని డిసైడ్ అయ్యాక, బ్లాగ్ పోస్ట్ అవుట్ లైన్ సెట్ చేసుకోవాలి. దీని కోసం మీరు వ్రాయాలి అనుకున్న టాపిక్స్ ని చిన్న చిన్న సబ్ హెడ్డింగ్స్ గా డివైడ్ చేసుకోండి. కంటెంట్ ని అవుట్ లైన్ చేసుకోవటం వలన మీరు చాలా ఈజీగా ఫాస్ట్ గా బ్లాగ్స్ వ్రాస్తారు.

  1. మైండ్ డైవెర్ట్ చేసే వాటికీ దూరంగా ఉండండి

మీ సోషల్ మీడియా, ఈమెయిల్ నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండి. మీరు వర్క్ చేసేటప్పుడు మీ మొబైల్ సైలెంట్ మోడ్ లో ఉంచుకోవటానికి ట్రై చేయండి.

లేదా మీ మొబైల్ మీరు వర్క్ చేసుకునేటప్పుడు దూరంగా ఉంచుకోండి. మీరు ఫాస్ట్ గా వ్రాయటానికి అడ్డం పడే ఈ డైవెర్షన్స్ నుండి దూరంగా ఉండండి.

  1. టైమర్ పెట్టుకోండి.

బ్లాగ్ పోస్ట్స్ వ్రాసేటప్పుడు ఎలాంటి అనవసరమైన పనులు చేయకోడదు. అందుకోసం మీరు టైమర్ పెట్టుకోండి. దీనివలన మీరు కేవలం రైటింగ్ పైన మాత్రమే ఫోకస్ చేయగలుగుతారు.

Pomodoro టూల్ యూస్ చేయండి. దీనిద్వారా మీరు 25 మినిట్స్ కంటిన్యూగా వర్క్ చేయగలరు. 25 మినిట్స్ వర్క్ చేసిన తరువాత 5 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. మళ్ళి టైమర్ పెట్టుకుని వర్క్ చేయండి. ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది.

ఈ టెక్నిక్ నేను పర్సనల్ గా కూడా యూస్ చేస్తాను. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది.

  1. మీరు వ్రాయటానికి బెస్ట్ టైం ఎప్పుడో తెలుసుకోండి.

కొంత మంది నైట్ టైం వ్రాస్తారు, కొంత మంది ఉదయాన్నే వ్రాస్తారు. ఇంకొంత మంది మధ్యాహ్నం వ్రాస్తారు, ఇంకొంతమంది సాయంత్రం. ఇలా ఎవరికి ఎలా వీలుగా ఉంటె అప్పుడు వ్రాస్తుంటారు. అలాగే మీరు కూడా ఫ్రీగా ఎప్పుడు వ్రాయగలరు అని తెలుసుకోవాలి.

నేను బ్లాగ్ పోస్ట్స్ వ్రాయాలి అనుకుంటే ముందురోజే రీసెర్చ్ అంతా కూడా కంప్లీట్ చేసి, ఉదయాన్నే వ్రాయటం స్టార్ట్ చేస్తాను. టైమర్ పెట్టుకుని వ్రాస్తాను. బ్లాగ్స్, ఈబూక్స్ ఇలాంటివి అన్ని నేను దాదాపుగా మార్నింగ్ టైం ప్రిఫర్ చేస్తాను.

కొంత మందికి ఉదయం లేవటం చాలా కష్టం అని నాకు తెలుసు, కానీ అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుంది.

  1. ఫస్ట్ వ్రాయండి, తరువాత ఎడిట్ చేయండి

చాలా మంది బ్లాగర్స్ చేసే అతి పెద్ద మిస్టేక్ ఏంటి అంటే కంటెంట్ వ్రాసేటప్పుడు ఎడిటింగ్ కూడా చేస్తారు. దీని వల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది. అలా కాకుండా ఫ్లో ప్రకారం వ్రాసుకుంటూ వెళితే తరువాత అవసరం లేనివి అలాంటివి అన్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా చేయటం వలన మీరు ఎంత టైం లో ఎంత వ్రాయగాలుగుతున్నారు అని కూడా మీరు క్యాలుక్లేట్ చేయవచ్చు.

 స్టెప్ 4: స్ట్రాటజిక్ గా మిగిలిన బ్లాగర్స్ ని మెన్షన్ చేయండి

Step 4 for Writing Viral Blog posts in Telugu

మీ ఇండస్ట్రీలోని బ్లాగర్స్ ని లింకింగ్ చేయటం ద్వారా మీ బ్లాగ్ పోస్ట్స్ లో ప్రస్తావించడం నేర్చుకోండి. దీనిద్వారా ఎక్స్టర్నల్ లింకింగ్ ఇంప్రూవ్ అవ్వటమే కాకుండా, మిగిలిన బ్లాగర్స్ మిమ్మల్ని త్వరగా గుర్తించగలరు.

మీ ఇండస్ట్రీలో ఇన్ఫ్లుయన్స్ ఉన్న బ్లాగర్స్ ని యూస్ చేసుకోవటం అనేది ఒక ఆర్ట్ అని చెప్పుకోవచ్చు.

ఇన్ఫ్లుయన్సర్ మార్కెటింగ్ ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో ఈరోజు మనకి తెలియంది కాదు. మంచి అథారిటీ ఉన్న ఒక్క బ్లాగర్ అయినా సరి మీ బ్లాగ్ ట్రాఫిక్ ఇన్క్రీస్ కావటానికి, మీ బ్లాగ్ ఫాలోయర్స్ పెరగటానికి, ఇంకా సేల్స్ కూడా పెంచటానికి మీకు హెల్ప్ అవుతారు.

అలాంటి ఇన్ఫ్లుయన్స్ ఉన్న బ్లాగర్స్ తో రిలేషన్ షిప్ బిల్డ్ చేయటం అంత సులభం అయిన విషయం కాదు. ఎందుకంటె మీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ వాళ్ళ దృష్టిలో పడాలి అని అనుకుంటారు.

అత్యంత ముఖ్యమైనది టాప్ బ్లాగర్స్ అందరూ కూడా దాదాపుగా బిజీగా ఉంటారు.

వాళ్ళు కంటెంట్ క్రియేట్ చేయటం, వాళ్ళ ప్రొడక్ట్స్ మేనేజ్ చేయటం, వాటిని ప్రోమోట్ చేయటం వంటి వాటితో తీరిక లేకుండా ఉంటారు. అటువంటి వాళ్ళు తమకి ఉండే అతి తక్కువ టైం లో న్యూ బ్లాగర్స్ తో కనెక్ట్ అవుతూ ఉంటారు.

అటువంటి వాళ్ళ దృష్టిని ఆకర్షించటానికి ఉన్న అత్యంత గొప్ప మార్గం వాళ్ళని తరచూ లింక్ చేసే మెన్షన్ చేయటం.

ఒకవేళ మీది క్రొత్త బ్లాగ్ అయితే మీరు వాళ్ళని లింక్ చేయవచ్చు, కానీ దీనితో మాత్రమే మీరు వాళ్ళని రీచ్ అవ్వలేరు.

అదే కనుక ఒక టాప్ బ్లాగ్ లో మీరు ఒక గెస్ట్ బ్లాగ్ పోస్ట్ వ్రాసి వాళ్ళని అందులో మెన్షన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ దృష్టిలో మీరు పడే అవకాశం ఉంది.

అప్పుడు మీరు పంపే మెయిల్స్ కి వాళ్ళు రెస్పాండ్ అవ్వటం జరుగుతుంది. అంతే కాకుండా మీరు రాసిన బ్లాగ్ పోస్ట్ ని వాళ్ళ రీడర్స్ కి రీచ్ అయ్యేలా షేర్ చేస్తారు.

ఈ విధంగా మీరు గెస్ట్ పోస్ట్స్ ద్వారా అథారిటీ ఉన్న బ్లాగర్స్ తో రిలేషన్స్ బిల్డ్ చేయవచ్చు.

Suggested Blog Post : Instant Traffic tips to New Bloggers in Telugu

స్టెప్ 5: మీ కంటెంట్ వైరల్ అవ్వాలి అంటే ప్రోమోట్ చెయ్యాలి

Step 5 for Writing Viral Blog posts in Telugu

Derak Halpern సోషల్ ట్రిగర్స్ బ్లాగ్ మిలియన్ డాలర్స్ బ్లాగ్ గా చేసిన సీక్రెట్ ఫార్ములా ఏంటో తెలుసా? Derak Halpern తన టైం లో 80% తను ఆల్రెడీ క్రియేట్ చేసిన కంటెంట్ ప్రోమోట్ చేయటనికి, మిగిలిన 20% క్రొత్త  కంటెంట్ క్రియేట్ చేయటానికి యూస్ చేస్తారట!

అయితే చాలా మంది బ్లాగర్స్ దీనికి పూర్తిగా రివర్స్ లో ఉన్నారు. వాళ్ళు 80% టైం కొత్త కంటెంట్ క్రియేట్ చేయటానికి, 20% ఆ బ్లాగ్ పోస్ట్స్ ని ప్రోమోట్ చేయటానికి యూస్ చేస్తున్నారు. మీరు మీ బ్లాగ్ పోస్ట్స్ వైరల్ కావాలి అనుకుంటే బీభత్సంగా ప్రోమోట్ చేయాలి.

మీ బ్లాగ్ పోస్ట్స్ ఎక్కువ మందికి రీచ్ అవ్వటానికి ఈ టిప్స్ ఫాలో అవ్వొచ్చు.

  1. మీ కంటెంట్ ని రీపర్పస్ (రీయూస్) చేయండి

రీపర్పస్ చేయటం అంటే ఆల్రెడీ చేసిన కంటెంట్ ని త్వరగా, తెలివిగా ఆన్లైన్ లో ప్రోమోట్ చేయటం. కంటెంట్ ని రీపర్పస్ చేయటం ద్వారా మీ బ్లాగ్ లో న్యూ కంటెంట్ క్రియేట్ చేయకుండా మీ బ్లాగ్ కి హైప్ తీసుకురావచ్చు. సింపుల్ గా చెప్పాలి అంటే మీ బ్లాగ్ పోస్ట్ లో వ్రాసిన మెయిన్ సబ్ హెడ్డింగ్స్ తో చిన్నచిన్న వీడియోస్ చేసి సోషల్ మీడియా లో ప్రోమోట్ చేయండి. పూర్తీ డీటెయిల్స్ బ్లాగ్ పోస్ట్ లో ఉన్నాయ్ అని లింక్ ఇవ్వండి. అవే పాయింట్స్ ని ట్విట్టర్ లో షేర్ చేయండి, అక్కడ కూడా లింక్ ఇవ్వండి.

PDF ఫైల్స్ గా మార్చండి లేదా ఇన్ఫోగ్రాఫిక్స్ గా డిజైన్ చేయండి.

మీరు ఒక బ్లాగ్ పోస్ట్ పబ్లిష్ చేసిన బ్లాగ్ పోస్ట్స్ ని PDF ఫైల్స్ గా చేసి ఫ్రీ హోస్టింగ్ (గూగుల్ డ్రైవ్) లాంటి వాటిల్లో అప్లోడ్ చేయండి. వాటిని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునేలా చేయండి.

ఈ డౌన్లోడ్ ఆప్షన్ అనేది మీ బ్లాగ్ లో ఇంటర్నల్ లింక్స్ లా ఉండేలా చూసుకోండి. దీనిద్వారా మీ ట్రాఫిక్ బాగా పెరుగుతుంది. దీనికి పెద్దగా టైం కూడా పట్టదు.

మీ పాపులర్ పోస్ట్స్ ని వీడియోస్ గా చేయండి

మీరు వ్రాసిన ఇన్-డెప్త్ బ్లాగ్ పోస్ట్స్ ని వీడియోస్ గా చేయటానికి ట్రై చేయండి. వాటిని యూట్యూబ్ లో అప్లోడ్ చేయండి. యూట్యూబ్ ద్వారా మన బ్లాగ్ కి ట్రాఫిక్ రావటమే కాకుండా మిగిలిన బ్లాగ్ పోస్ట్స్ ని కూడా వీడియో డిస్క్రిప్షన్ లో ఇవ్వవచ్చు.

అందుకే ఇప్పుడు ప్రతిఒక్క ఇన్ఫ్లుయన్సర్ (ఇంతకూ ముందు పెద్దగా యూస్ చేయని వాళ్ళు కూడా) ఖచ్చితంగా యూట్యూబ్ యూస్ చేస్తున్నారు.

  1. గెస్ట్ పోస్ట్స్ వ్రాసి, అందులో మీ బ్లాగ్ లింక్స్ ఇవ్వండి.

గెస్ట్ బ్లాగ్ పోస్టింగ్ మీ బ్లాగ్ ని ప్రోమోట్ చేసుకోవటానికి ఒక గొప్ప స్ట్రాటజీ అని కళ్ళు మూసుకుని చెప్పవచ్చు. మీ బ్లాగ్ కి క్వాలిటీ లింక్స్ రావటమే కాకుండా, టాప్ బ్లాగ్స్ ద్వారా ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వొచ్చు.

అయితే గెస్ట్ బ్లాగ్ పోస్టింగ్ అంటే ఏది పడితే అది వ్రాయటం కాదు, మీకు రిలవెంట్ గా ఉండే విధంగా మీ ఓన్ ఆర్టికల్స్ వ్రాయటం. ఇలా చేయటం వలన మీకు త్వరగా రిలవెంట్ బ్యాక్ లింక్స్, క్వాలిటీ బ్యాక్ లింక్స్ దొరుకుతాయి. వీటి ద్వారా మీ సెర్చ్ ర్యాంకింగ్స్ ఇంకా పెరుగుతాయి.

  1. ఇండస్ట్రీలోని మిగిలిన బ్లాగర్స్ తో ఇంటరాక్ట్ అవ్వండి.

ఒక బ్లాగర్ కి అత్యంత ముఖ్యమైనవి మిగిలిన బ్లాగ్స్ నుండి బ్యాక్ లింక్స్ తెచ్చుకోవటం, ఎక్కువ మందికి తెలియటం. మీరు ఒక బ్లాగ్ పోస్ట్ వ్రాసినప్పుడు ఎవరిని అయినా మెన్షన్ చేసినప్పుడు మీరు వాళ్ళకి సోషల్ మీడియా ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా మీ బ్లాగ్ లింక్ షేర్ చేసి, మీరు అందులో వాళ్ళని మెన్షన్ చేశాను అని చెప్పండి.

వయా ఈమెయిలు:

ఈమెయిల్స్ ద్వారా వాళ్ళని అప్రోచ్ అవ్వండి. ఫలానా టాపిక్ పైన ఒక బ్లాగ్ పోస్ట్ వ్రాసాను, అందులో మీ గురించి కూడా వ్రాసాను, మీకు కుదిరినప్పుడు ఒక్కసారి బ్లాగ్ పోస్ట్ ఓపెన్ చేసి చూడండి అని. ఆ తరువాత వల్లే ఆ బ్లాగ్ పోస్ట్ ని వాళ్ళ రీడర్స్ కి షేర్ చేస్తారు.

ఆ తరువాత నుండి వాళ్ళు మీ బ్లాగ్ ని చెక్ చేయటం స్టార్ట్ చేస్తారు. మీ కంటెంట్ బాగుంటే తప్పకుండ వాళ్ళు మిమ్మల్ని కూడా వాళ్ళ బ్లాగ్స్ లో మెన్షన్ చేస్తారు.

వయా సోషల్ మీడియా:

ఈరోజు మన దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైన మీడియా సోషల్ మీడియా. దాదాపుగా బ్లాగర్స్, ఇన్ఫ్లుయన్సర్స్ అందరూ సోషల్ మీడియాలో ఏదో ఒక ప్లాట్ఫారం లో ఆక్టివ్ గా ఉంటారు. పైన చెప్పినట్లుగానే అప్రోచ్ అవ్వండి.

ఇంక ముగిస్తా..

బ్లాగ్ పోస్ట్స్ ని వైరల్ చేయటం రాకెట్ సైన్సు ఏమి కాదు. మీరు క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి, మీ ఎఫర్ట్స్ పెట్టాలి.

ఈ బ్లాగ్ పోస్ట్ లో చెప్పిన అన్ని స్టెప్స్ ప్రాక్టికల్ గా చేయటానికి అవకాశం ఉన్నవి, మీరు చేయగలిగినవే. మీరు చేయగలిగితే తప్పకుండా మీకు హెల్ప్ అవుతుంది.

ఒక్క విషయం చెప్తాను, ఏ విషయం అయినా తెలుసుకున్నంత మాత్రాన రిజల్ట్స్ రావు. తెలుసుకున్న వాటిని ఇంప్లిమెంట్ చేస్తేనే రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి తెలుసుకున్న వాటిని ట్రై చేయండి. మీరు తెలుసుకున్నది ట్రై చేసి సక్సెస్ అయితే రిజల్ట్స్ వస్తాయి, వర్క్ అవుట్ కాకపోతే ఎక్స్పీరియన్స్ వస్తుంది ఎలా చేయకూడదు అని. ఎందుకంటె ఇదంతా కూడా ప్రాక్టికల్ వరల్డ్.

ఇంకేంటి, ఈ బ్లాగ్ పోస్ట్ మీకు ఎంతవరకూ హెల్ప్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారు. మీకు ఇంకా ఏమన్నా టిప్స్ తెలిస్తే చెప్పండి, వాటిని నెక్స్ట్ అప్డేట్ లో యాడ్ చేస్తాను.

మీరు ఆ స్టెప్స్ ఫాలో అవ్వండి, వచ్చిన రిజల్ట్స్ ఏంటి అని మీరు కామెంట్స్ లో చెప్తే ఎంతో మందికి మీరు ఇన్స్పిరేషన్ అవుతారు, వాళ్ళు కూడా యూస్ చేస్తారు. వీలయితే షేర్ చేయండి, ఎందుకంటె షేరింగ్ అంటే కేరింగ్ కదా!

5 thoughts on “How to Write Viral Blog Posts in Telugu”

  1. నేను మీ article మొత్తం చేయడం జరిగింది. ఈ ఆర్టికల్ లో మీరు 5 స్టెప్స్
    చెప్పారు కదా ఆ ఐదు స్టెప్స్ చాలా బాగా నచ్చాయి వాటిని నేను వుపయెగించి నా బ్లాగ్ లో article రాయడానికి ప్రయత్నించెయాలి.

    నీకు సమయం ఉంటే నా బ్లాక్ ని ఒకసారి పరిశీలిస్తారని నేను ఆశిస్తాను.

    culturalandtraditions.blogspot.com

    నా బ్లాగులో ఏవైనా మోడిఫికేషన్ ఉంటే చెప్పండి

    Reply
  2. నేను మీ article మొత్తం చదవడం జరిగింది. ఈ ఆర్టికల్ లో మీరు 5 స్టెప్స్
    చెప్పారు కదా ఆ ఐదు స్టెప్స్ చాలా బాగా నచ్చాయి వాటిని నేను వుపయెగించి నా బ్లాగ్ లో article రాయడానికి ప్రయత్నించెయాలి.

    నీకు సమయం ఉంటే నా బ్లాక్ ని ఒకసారి పరిశీలిస్తారని నేను ఆశిస్తాను.

    culturalandtraditions.blogspot.com

    నా బ్లాగులో ఏవైనా మోడిఫికేషన్ ఉంటే చెప్పండి

    Reply

Leave a Comment