HOW TO BECOME A SUCCESSFUL BLOGGER IN TELUGU |
ఒక బ్లాగ్ బాగా పాపులర్ కావాలంటే ఏం చేయాలి? అనే ప్రశ్న ఎదురైనప్పుడు కను చాలా సమాధానాలు వినిపించాయి. బాగా SEO చేయాలి, మంచి ఆర్టికల్స్ వ్రాయాలి, బ్లాగ్ బాగా స్పీడ్ గా ఉండాలి. మన బ్లాగ్ కి చాలా మంది రెగ్యులర్ విసిటర్స్ వుండాలి.
FB లో మన పేజికి వేలలో ఫాలోవర్స్ ఉండాలి. ఇలా ఇంకా చాలానే ఉన్నాయి. నిజానికి ఇవన్ని కరెక్టే. కానీ నా దృష్టిలో మన బ్లాగ్ లో వ్రాసే ఆర్టికల్స్, మన బ్లాగ్స్ ని పాపులర్ చేస్తాయి.
ఒక ఆర్టికల్ చాలా చక్కగా ఎలాంటి వారికైనా అర్థం అయ్యే విధంగా వ్రాసారు. ఉదాహరణకి బరువు తగ్గటం ఎలా ప్రయత్నిస్తే మంచి ఫలితాలు వస్తాయి అని మీరు ఒక బ్లాగ్ వ్రాసారు అని అనుకుందాం.
ఆ బ్లాగ్ లింక్ ని మీరు facebook లో షేర్ చేసారు. మీరు వ్రాసిన ఆర్టికల్ అందరికి చాలా సులభంగా అర్థం అయ్యేలా వుంది. అప్పుడు వాళ్లు ఆ ఆర్టికల్ చదివినా తరువాత ఆ పోస్ట్ ని షేర్ చేసారు అనుకుందాం.
అప్పుడు మీ ఆర్టికల్ మరింత మందికి రీచ్ అయ్యింది. దాన్ని మరికొంత మంది వాళ్ళ స్నేహితులకి whatsapp ద్వారా షేర్ చేసారు. అప్పుడు మీ బ్లాగ్ పోస్ట్ గురించి చాలా మందికి తెలుస్తుంది.
వాళ్లు అందరూ మీ బ్లాగులో ఉన్న ఆర్టికల్ చదివినా తరువాత, అందులో ఉన్న మిగిలిన ఆర్టికల్స్ ని కూడా, కనీసం 2 లేదా 3 ఆర్టికల్స్ చదువుతారు. అప్పుడు వాళ్ళకి మనం రాసిన కంటెంట్ నచ్చుతుంది.
మన బ్లాగ్ అప్డేట్స్ కోసం మన బ్లాగ్ లో సబ్స్క్రయిబ్ చేసుకోవడం, లేదా ఫేస్బుక్ లో మన బ్లాగ్ పేజి ని లైక్ చేయడం చేస్తారు. మనం క్రొత్త బ్లాగ్ పోస్ట్ చేసిన ప్రతిసారి వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది.
ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తాం కాబట్టి, వాళ్లు వల్ల మెయిల్ నుండి ఫేస్బుక్ లా నుండి మన బ్లాగ్ కి వస్తారు. రేగులర్ గా వాళ్లు మన బ్లాగ్ ని విసిట్ చేస్తారు.
అలా రెగ్యులర్ విసిటర్స్ మన బ్లాగ్ ని విసిట్ చేసి వాళ్ళ అభిప్రాయాలని లైవ్ చేయడం, కామెంట్ చేయడం ఆ ఆర్టికల్ ని షేర్ చేయడం చేస్తే ఆటోమేటిక్ గా SEO కూడా అవుతుంది. అప్పుడు డైరెక్ట్ గా గూగుల్ సెర్చ్ నుండి కూడా విసిటర్స్ మన బ్లాగ్ కి వస్తారు.
అంటే ఒక బ్లాగ్ సక్సెస్ కావాలన్నా, పాపులర్ కావాలన్నా మంచి ఆర్టికల్స్ వ్రాయడం అనేది చాలా అవసరం. అందుకే గూగుల్ కూడా “SEO కోసం బ్లాగ్స్ వ్రాయవద్దు, మీ రీడర్స్ కోసం ఆర్టికల్స్ వ్రాయండి” అని చెప్తుంది.
ఈ ఆర్టికల్ లో ఒక ఆర్టికల్లో ఒక మంచి ఆర్టికల్ వ్రాసేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు ఏంటి? అని చూద్దాం!
ఒక మంచి ఆర్టికల్ వ్రాయటం ఎలా?
సాదారణంగా మనం ఒక ఆర్టికల్ వ్రాయాలి అని కూర్చున్న తరువాత, ఆ ఆర్టికల్ లో వ్రాసే సమయంలో మన మైండ్ లో ఎన్నో ఆలోచనలు వస్తాయి. ఒక్కోసారి సంబంధం లేని వాటిని, అవసరం లేని వాటిని కూడా రాస్తూ ఉంటాం.
అలాంటప్పుడు రఫ్ గా మీరు వ్రాయాలనుకున్న టాపిక్ టైటిల్, వాటిల్లో వచ్చే సబ్ టాపిక్స్ ని హెడ్డింగ్స్ గా వ్రాసుకోండి. అలా వ్రాసుకున్న తరువాత వాటిని కవర్ చేస్తూ ఆర్టికల్ వ్రాయండి.
మొదట్లో ఒక బుక్ లో ఆర్టికల్స్ వ్రాసి వాటిని టైపు చేసి బ్లాగ్ లో పబ్లిష్ చేయండి. ఇలా చేయడం కొంచెం కష్టం, అయినప్పటికీ నిదానంగా మీకు ఆర్టికల్స్ వ్రాయడం అలవాటు అవుతుంది. అప్పుడు మీరు డైరెక్ట్ గా బ్లాగ్ లో వ్రాయడం మొదలు పెట్టవచ్చు.
తరువాత మనం ఆర్టికల్ ఎవరిని దృష్టిలో పెట్టుకొని వ్రాస్తున్నామో క్లారిటీ ఉండాలి. ఎందుకంటె అన్నిసార్లు అన్నివర్గాలని మనం తృప్తిపరచలేము. కాబట్టి ఎవరికి వ్రాస్తున్నారో వల్ల స్టాండర్డ్స్, వాళ్ళ ఆలోచనలకి తగినట్లుగా వ్రాయాలి. లేదంటే 5th క్లాసు చెదివే పిల్లాడికి 10th క్లాసు పాఠాలు చెప్పునట్లు ఉంటుంది.
మీరు వ్రాసే ఆర్టికల్ మీరు ఏం చెప్పాలనుకున్నారో ఆ విషయాన్నీ సూటిగా చెప్పగలగాలి. అలా చెప్పలేకపోతే రీడర్స్ డైలమాలో పడిపోతారు. ఇందుకోసం నేను ఒక ఉదాహరణ చెప్తాను. నేను 10th క్లాసు అయ్యాక ఫోటోషాప్ నేర్చుకున్నాను. ఆ తరువాత కూడా రెగ్యులర్ గా ప్రాక్టీసు చేసేవాడిని. కొంతకాలం తరువాత నేను నాకు వచ్చిన ఫోటోషాప్ తో పార్ట్ టైం జాబు చేయాలి అని అనుకున్నాను.
అయితే ఒక ఫోటో స్టూడియో లో డిజైనర్స్ కావాలి అని తెలుసుకొని అక్కడికి వెళ్ళాను. అక్కడ ఆ ఫోటో స్టూడియో ఓనర్ నన్ను ఫోటోషాప్ గురించి కొన్ని విషయాలు అడిగాడు, నేను తెలిసినంత వరకూ చెప్పను. అప్పుడు ఆయన “మేము మ్యారేజ్ ఆల్బమ్స్ ఎక్కువగా చేస్తాము” అని చెప్పాడు.
ఒక ఫోటో ఇచ్చి ఒక డిజైన్ చేయమని చెప్పాడు. నేను నాకు తెలిసినట్లు డిజైన్ ఒక గంట తరువాత అయన వచ్చి నేను చేసిన డిజైన్ చూసాడు. నీకు హెయిర్ డీటెయిలింగ్ రాదా! అని అడిగాడు. నేను ఆ మాట వినడమే ఫస్ట్ టైం. లేదండి నాకు తెలియదు, అంటే ఏమిటి? అని అడిగాను.
అప్పుడు ఆయన ఒకతన్ని పిలిపించి తన చేత వర్క్ చేయించాడు. తను చాలా ఫాస్ట్ గా, చాలా పర్ఫెక్ట్ గా చేసాడు. అప్పుడు అర్థం అయ్యింది, హెయిర్ డీటెయిలింగ్ అంటే ఫోటోషాప్ లో హెయిర్ కటింగ్ అని. అక్కడి నుండి నేను వచ్చేశాను.
ఆ తరువాత నేను ఆ హెయిర్ కటింగ్ (అదే హెయిర్ డీటెయిలింగ్) నేర్చుకుందాం అని ఒక సంవత్సరం పటు youtube లో ట్యుటోరియల్స్ వెతికి ప్రయత్నించేవాడిని. వాటిలో ఒక్కసారి కూడా నేను సక్సెస్ కాలేకపోయాను. ఆ తరువాత నేను చూసేన వీడియోలు అన్నింటి నుండి నేను ఒక ప్రాసెస్ తయారు చేసి దాన్ని ప్రయత్నించి సక్సెస్ అయ్యాను.
అంటే నేను ఇక్కడ చెప్పే విషయం ఏంటి అంటే నేను దాదాపు 100 – 200 వీడియో ట్యుటోరియల్స్ హిందీ, ఇంగ్లీష్, తమిళ్ ఇలా అన్ని భాషలలో హెయిర్ కటింగ్ in ఫోటోషాప్ అని ఉన్నవి అన్ని చూసాను. కానీ ఒకటి కూడా వర్క్ అవ్వలేదు. అంటే వాళ్లు చెప్పాలనుకున్న విషయం డీటెయిల్ గా చెప్పలేదు. కాబట్టి మీరు చెప్పాలనుకున్న విషయం చాలా క్లియర్ గా ఉండాలి.
మీరు ఆర్టికల్స్ వ్రాసే సమయంలో ఆ టాపిక్ కి కీవర్డ్స్ ని సహజంగా అందులో ఇమిడేలా చూసుకోవాలి. అలాగని కీవర్డ్స్ ఎక్కువ, కంటెంట్ తక్కువగా ఉండకూడదు. ఎంతవరకూ అవసరమో అంటే వాడాలి. వీటిని దృష్టిలో పెట్టుకొని ఆర్టికల్ వ్రాయడం అలవాటు చేసుకుంటే నిదానంగా మీరు ఒక మంచి బ్లాగర్ అవ్వవచ్చు. జై హింద్.
Latest posts by dasaradhi (see all)
- Website Design Formula for Small Businesses - October 27, 2021
- Digital Marketers Meetup in Hyderabad in 2021 - September 1, 2021
- How to Write Viral Blog Posts in Telugu - August 12, 2021