How to Start Blog in Telugu

Spread the love

బ్లాగింగ్ గురించి మనం తెలుసుకున్న తరువాత ఎంతో మంది బ్లాగ్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. అయితే చాలా మంది ఇక్కడే కొన్ని తప్పులు చేస్తారు, వీటి వాళ్ళ కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి బ్లాగింగ్ లో ప్రతి చిన్న విషయం జాగ్రతగా తెలుసుకొని, వాటిని ఆచరణలోకి పెడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు.

ఈరోజు మీరు ఒక బ్లాగ్ ని సెటప్-బై-స్టెప్ ఎలా ఒక బ్లాగ్ సెట్  చేసుకోవాలి (How to Start blog in Telugu) అని తెలుసుకుందాం.

ఒక బ్లాగ్ స్టార్ట్ చేయటానికి ఏం కావాలి?

ఒక వర్డుప్రెస్ బ్లాగ్ క్రియేట్ చేయటానికి ముఖ్యమైనవి 3 కావాలి.

డొమైన్ నేమ్

డొమైన్ అనేది మీ బ్లాగ్ కి ఇంటర్నెట్ లో ఒక అడ్రస్ లాంటిది. మనం google.com, bloggervj.com, digitaldeepak.com ఇలాంటి నేమ్స్ ని డొమైన్ నేమ్ అంటారు.

వెబ్ హోస్టింగ్

మీ బ్లాగ్ కోసం క్రియేట్ చేసిన వెబ్ పేజెస్, ఇమేజ్స్, వీడియోస్ ఇలాంటివాటిని మనం ఇంటర్నెట్ లో ఎక్కడో ఒక చోట సేవ్ చేయాలి కదా! అలా సేవ్ చేసిన ప్లేస్ ఎదైతో ఉందొ దానిని హోస్టింగ్ అంటారు.

మీ విలువైన సమయం, అంతకుమించి విలువైన మీ ఓపిక

మీ బ్లాగ్ ని సెటప్ చేయటనికి కొంచెం ఓపిక కావాలి ఎందుకంటె వర్డుప్రెస్ బ్లాగ్ సెటప్ లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. వాటిని కొంచెం జాగ్రతగా చేసుకోవాలి. కాబట్టి వాటిని నేర్చుకోవటానికి మీ టైం, అలాగే ఓపిక కూడా కావాలి.

కొంచెం కన్ఫ్యూస్ గా ఉందా! మరేం ఖంగారు పడకండి. ఈ బొగ్ పోస్ట్ లో డీటెయిల్ గా మీకు స్టెప్-బై-స్టెప్ ఒక బ్లాగ్ ని సెటప్ చేయాలి అని తెలుసుకుందాం. బ్లాగ్ సెటప్ తో ఈ విషయాలు కూడా నేర్చుకుందాం…

> ఒక నిష్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి

> ఒక డొమైన్ నేమ్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి

> మంచి వెబ్ హోస్టింగ్ కంపెనీ ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోవటం

> మీ బ్లాగ్ డొమైన్ నేమ్, వెబ్ హోస్టింగ్ ఎలా లింక్ చేయాలి?

> మీ బ్లాగ్ కోసం వర్డుప్రెస్ ఇన్స్టాల్ చేయటం

> మీ బ్లాగ్ కోసం ఒక మంచి థీమ్ (డిజైన్) సెలెక్ట్ చేసుకోవడం

> ఒక బ్లాగ్ పోస్ట్ బేసిక్స్

> మీ బ్లాగ్ కి కావాల్సిన ప్లగిన్స్

> మీ బ్లాగ్ ట్రాఫిక్ ఎలా ఇంక్రీస్ చేయాలి

> మీ బ్లాగ్ కి ట్రాఫిక్ వచ్చిన తరువాత మానటైజ్ చేయటం

ఇంకా ఆలస్యం చేయకుండా వీటి గురించి తెలుసుకుందాం.

నేను Blogger VJ స్టార్ట్ చేసిన తరువాత ఎంతో మందితో ఇంటరాక్ట్ అయ్యాను. అలా నేను ఎంతో మందికి బ్లాగ్ ని ఎలా స్టార్ట్ చేయాలి అని చాలా సార్లు చెప్పను. కాబట్టే ఈ డిటైల్డ్ గైడ్ ఇంకా ఈజీగా వ్రాయగలిగాను.

ఒక బ్లాగ్ స్టార్ట్ చేయటానికి అనేక కారణాలు ఉంటాయి. మీ ఆలోచనలు ఇంటర్నెట్ ద్వారా షేర్ చేయవచ్చు లేదా బ్లాగ్ లో వివిధ మార్గాల ద్వారా ఆన్లైన్ లో మనీ ఎర్న్ చేయవచ్చు.

ఏది ఏమైనా బ్లాగ్ స్టార్ట్ చేయటానికి ఈ డిటైల్డ్ గైడ్ మీకు బాగా హెల్ప్ అవుతుంది.

ఈరోజు ఒక బ్లాగ్ ని స్టార్ట్ చేయటం సులభం అంతే కాకుండా అతి తక్కువ ఖర్చుతో స్టార్ట్ చేయవచ్చు. మీరు ఒక ఫ్యాషన్ బ్లాగ్, ఫుడ్ బ్లాగ్, లైఫ్ స్టైల్, మ్యూజిక్, స్పోర్ట్స్ లేదా బిజినెస్ బ్లాగ్ ఇలా ఏదైనా స్టార్ట్ చేయవచ్చు.

“సిక్స్ ఫిగర్ ఇన్కమ్ ఆన్లైన్ ద్వారా ఎర్న్ చేయాలి అంటే ముందు మీరు మీ బ్లాగ్ ని లాంచ్ చేయాలి.”

చాలా మంది ఫ్రీగా బ్లాగ్ స్టార్ట్ చేయాలి అని అనుకుని హడావిడిగా స్టార్ట్ చేస్తారు. కానీ బేసిక్ బ్రాండింగ్ రిక్వైర్మెంట్స్ గురించి పట్టించుకోరు. అందుకే డొమైన్, వెబ్ హోస్టింగ్ తీసుకుని బ్లాగ్ స్టార్ట్ చేయాలి. మరి 2021 లో మీరు బ్లాగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు ఇప్పుడే స్టార్ట్ చేయండి.

దేని గురించి బ్లాగింగ్ చేయాలి?

కొంత మంది యూట్యూబర్స్ బ్లాగింగ్ అంటే రాత్రికి రాత్రి లక్షలు సంపాదించవచ్చు అని చెప్తారు, పాపం ఎంతో మంది నమ్మి బ్లాగింగ్ స్టార్ట్ చేసి రెవిన్యూ రాక బ్లాగింగ్ గురించి తప్పుగా అర్థం చేసుకుంటారు.

బ్లాగింగ్ అంటే మీరు మీ బ్లాగ్ స్టార్ట్ చేసి అందుకోసం మీరు ఎంత చేయాలో అంతా చేయాలి, అందుకోసం మీరు మీ సమయాన్ని, వెచ్చిస్తే మీ బ్లాగ్ డెవలప్ అవుతుంది.

బ్లాగింగ్ కూడా మిగిలిన బిజినెస్ల లాగానే నిలదొక్కుకోవడానికి టైం పడుతుంది, అందుకు మీరు ఎంతో ఓపికగా, కమిట్మెంట్ తో మీరు ప్యాషన్ తో ఒక నిష్ ని సెలెక్ట్ చేసుకోవాలి. (నిష్ నే మనం సింపుల్ గా బ్లాగ్ టాపిక్ అని అనుకోవచ్చు.) మీ బ్లాగ్ కంటెంట్ లో మీకున్న నాలెడ్జ్, ఇంటరెస్ట్ మీ రీడర్స్ కి అర్థం అవుతుంది. దీనిద్వారా వాళ్ళకి మీ పైన నమ్మకం కలుగుతుంది.

నేను కూడా నా కెరీర్ బిగినింగ్ లో ఇలాంటి మిస్టేక్ చేశాను. మీరు కూడా ఆ తప్పు చేయకండి. అంతే కాకుండా మీకు తెలియని విషయాల గురించి బ్లాగ్స్ రాయటం కష్టం. అంతే కాకుండా అవి మీ రీడర్స్ కి కూడా అంతగా ఉపయోగపడదు. అందుకే మీకు దేని గురించి బాగా తెలుసో, మీకు దేని గురించి ఇంటరెస్ట్ ఉందొ అటువంటి వాటి గురించి మాత్రమే బ్లాగింగ్ చేయండి.

అంతే కాకుండా మీరు రాసే కంటెంట్ చదివే రీడర్స్ కి కొత్తగా అనిపించాలి. అంతే కాకుండా ఆ కంటెంట్ ని సోషల్ మీడియా లో షేర్ చేయటానికి కూడా బాగుంటుంది.

దీని గురించి మీరు పెద్దగ తెలుసుకోకుండా మీరు బ్లాగ్ రన్ చేస్తే ఎక్కువ కాలం రన్ చేయలేరు. అందుకే మీకు బాగా ఇంటరెస్ట్ ఉన్న టాపిక్ గురించి మీరు బ్లాగింగ్ చేస్తే మీరు మీ ఇండస్ట్రీలో టాప్ లో ఉండగలరు.

మరి ఎక్కువగా ఆలోచించకండి. మీకు బాగా ఇంటరెస్ట్ ఉన్నవాటిలో, లేదా హాబీ గా బ్లాగింగ్ స్టార్ట్ చేయవచ్చు. మీరు నిష్ సెలక్షన్ గురించి ఇంకా డౌట్ ఉంటె మా బ్లాగింగ్ ఈబూక్ లో డిటైల్డ్ గ వివరించడం జరిగింది. ఈబూక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఏ బ్లాగింగ్ ప్లాట్ఫారం యూస్ చేయాలి?

బ్లాగింగ్ ప్లాట్ఫారం లేదా కంటెంట్ మానేజ్మెంట్ సిస్టం (CMS), మీ బ్లాగ్ పోస్ట్ ఇమేజ్స్, డిజైన్, కంటెంట్ ఈజీగా మేనేజ్ చేయటానికి ఈ CMS ఉపయోగపడుతుంది. CMS లో అనేక రకాల ఉన్నాయి. కానీ వాటి అన్నింటిలో వర్డుప్రెస్ చాలా చాలా ఈజీగా ఉంటుంది, ఫ్లెక్సిబుల్ గా కూడా ఉంటుంది.

దాదాపుగా 100 మిలియన్ల వెబ్ సైట్స్ ఈ వర్డుప్రెస్ చేశారు అంటే వర్డుప్రెస్ గురించి అర్థం చేసుకోవచ్చు. అంతే కాకుండా దాదాపుగా అన్ని వెబ్ హోస్టింగ్ ప్లాట్ఫారంస్ “1 క్లిక్ బ్లాగ్ ఇన్స్టలేషన్” ఫీచర్ ని అందిస్తున్నాయి. ఇవి కొత్తగా బ్లాగింగ్ స్టార్ట్ చేయాలి అనుకునేవారికి బాగా హెల్ప్ అవుతుంది.

ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేదా కోడింగ్ వంటివి అవసరం లేకుండా మంచి బ్లాగ్ ని డిజైన్ చేసుకోవచ్చు.

మనం కావాలి అనుకుంటే Blogger, Tumblr, Wix, Weebly లాంటివి కూడా యూస్ చేయవచ్చు. కానీ మీరు ఫ్రీ సర్వీసెస్ యూస్ చేయాలి అనుకుంటే మనీ ఎర్న్ చేయాలి అన్న మీ లక్ష్యం పూర్తిగా నెరవేరదు. మీరు కనుక బ్లాగింగ్ ఫ్రీగా స్టార్ట్ చేయాలి అనుకుంటే అది తప్పుడు నిర్ణయం అని చెప్పగలను.

ఎందుకో చెప్తాను….

ఫ్రీ అనేది ఎందుకు ఫ్రీ కాదు

డొమైన్ ఎప్పుడు మీది కాదు

Bloggervj.com, google.com, gmail.com eenadu.net ఇలాంటివి అన్ని వాళ్ళ సొంత డొమైన్స్. సోల్ఫ్ హోస్ట్ బ్లాగ్ కోసం మీరు ఒక మంచి డొమైన్ నేమ్ సెలెక్ట్ చేసుకుని రిజిస్టర్ చేసుకుంటారు.

అదే మీరు blogger.com, లేదా tumblr.com లో కనుక బ్లాగ్ స్టార్ట్ చేస్తే మీ బ్లాగ్ నేమ్ bloggervj.blogger.com అని లేదా blogger.tumblr.com అని వస్తుంది, అవునా! మరి మీ రీడర్స్ ఇలాంటి బ్లాగ్ నేమ్స్ గుర్తుపెట్టుకోవటం కొంచెం కష్టం. Bloggervj.com, గుర్తుపెట్టుకోవటానికి bloggervj.blogspot.com అని గుర్తుపెట్టుకోవటానికి చాలా తేడా ఉంది, అవునా!

మీ బ్లాగ్ నిజంగా మీది కాదు

ఎందుకంటె మీ బ్లాగ్ వాళ్ళ వెబ్సైటు లో ఉంది, కాబట్టి మీ బ్లాగ్ కి మీరు ఓనర్ కాలేరు కదా! వాళ్ళు మనకి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా డిలీట్ చేయవచ్చు. ఒకవేళ తరువాత మీరు మీ బ్లాగ్ ని డొమైన్, హోస్టింగ్ రిజిస్టర్ చేసుకుందాం అనుకున్న మీరు మీ కంటెంట్, మీ బ్లాగ్ కి వచ్చే ట్రాఫిక్ మాత్రమే తీసుకువెళ్లగలరు.

ఎటువంటి ఫ్లేక్సిబులిటి ఉండదు

మీరు ఫ్రీ బ్లాగింగ్ సర్వీస్ యూస్ చేస్తుంటే మీకు అనేక లిమిటేషన్స్ ఉంటాయి. డిజైన్ పరంగా లేదా లేఔట్ పరంగా లిమిటేషన్స్ ఉంటాయి. వీటిల్లో కొన్నింటిలో మనకి కావాల్సిన థీమ్స్ లేదా ప్లగిన్స్ మనం యూస్ చేయలేము.

కాబట్టి నేను సెల్ఫ్ హోస్ట్ బ్లాగ్ సెటప్ చేయాలి అని చెప్తున్నాను. సెల్ఫ్ హోస్ట్ బ్లాగ్ క్రియేట్ చేయటానికి అయ్యే కాస్ట్ గురించి కూడా తెలుసుకుందాం.

ఒక బ్లాగ్ సెటప్ కి ఎంత ఖర్చు అవుతుంది

ఈరోజు కంపెనీల మధ్య ఉన్న కాంపిటీషన్ వల్ల ఒక బ్లాగ్ స్టార్ట్ చేయటానికి తక్కువ ఖర్చు అవుతుంది.  ఒక డొమైన్ రిజిస్టర్ చేయటానికి 650-700 రూపాయల వరకూ మొదటి సంవత్సరం ఉంటుంది.

అదే హోస్టింగ్ అయితే నెలకి 60 రూపాయల చొప్పున సంవత్సరానికి 720 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. ఇది పూర్తిగా బిగినర్స్ కి ఒక మంచి విషయం.

తరువాత మనం ఖర్చు పెట్టవలసింది థీమ్ కోసం. వర్డుప్రెస్ లో చాలా థీమ్స్ ఫ్రీగానే ఉంటాయి. అయితే ఎన్నో మంచి థీమ్స్ మనకి ప్రీమియం లో లభిస్తున్నాయి. GeneratePress Premium థీమ్ యూస్ చేస్తే మీ బ్లాగ్ ఫాస్ట్ గా లోడ్ అవుతుంది, ఈ థీమ్ దాదాపు $59 ఖర్చు అవుతుంది. ఒకవేళ మీకు ఇంకా తక్కువ ప్రైస్ కి కావాలి అంటే మమ్మల్ని సంప్రదించండి. అతి తక్కువ ప్రైస్ కి మీకు GeneratePress Premium థీమ్ ఇవ్వగలను.

ఒక బ్లాగ్ స్టార్ట్ చేయాలి అని అనుకోవటం అత్యంత తక్కువ రిస్క్ కలిగిన బిజినెస్ ని స్టార్ట్ చేయటం. ఒకవేళ మీరు లాంగ్ రన్ లో బ్లాగ్ రన్ చేయలేకపోతే నెక్స్ట్ ఇయర్ రెన్యువల్ చేసుకోకుండా ఉంటె సరిపోతుంది. కాబట్టి లాస్ అయ్యేది ఏమి ఉండదు.

చాలా వెబ్ హోస్టింగ్ కంపెనీలు 30 డేస్ మనీ బ్యాక్ గ్యారంటి కూడా అందిస్తున్నాయి. కాబట్టి మీ డబ్బులు చాలా వరకూ సేఫ్ గా ఉంటాయి.

ఒక డొమైన్ నేమ్ ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు

సెల్ఫ్ హోస్ట్ బ్లాగ్ స్టార్ట్ చేయాలి అనుకున్నందుకు కంగ్రాట్స్. ఇప్పుడు మీ బ్లాగ్ కోసం ఒక నేమ్ ఇంకా డొమైన్ నేమ్ సెలెక్ట్ చేసుకుందాం.

how to register domain in telugu

డొమైన్ తీసుకోవడం

చాలా మంది బ్లాగర్స్ కి డొమైన్ నేమ్ సెలెక్ట్ చేసుకోవడం  ఒక గొప్ప ఛాలెంజ్ గా ఉంటుంది. ఒక బ్రాండ్ క్రియేట్ చేయలన్నా, ఈజీగా అర్థం కావాలి అంటే ఇది ఖచ్చితంగా అవసరం.

ఒకవేళ మీరు హెల్త్ ఫుడ్ & రేసిపీస్ గురించి ఇంటరెస్ట్ ఉంది అనుకుందాం, అప్పుడు మీరు my-favourite-healthy-food-receipes.com / myfavouritefoodrecipies.com లాంటివి తీసుకోకూడదు. సింపుల్గా క్యాచి నేమ్ సెలెక్ట్ చేయండి. ఉదాహరణకి eatwell.com / healthfanatic.com లాగా ట్రై చేయవచ్చు. కావాలి అంటే దీన్నే మీ బ్రాండ్ నేమ్ గా పెట్టుకోవచ్చు లేదా మీ బ్రాండ్ నేమ్ ని డొమైన్ గా కూడా తీసుకోవచ్చు. నా బ్రాండ్ నేమ్ డొమైన్ నేమ్ రెండూ ఒక్కటే, bloggervj.com.

డొమైన్ ఎక్కడ కొనాలి. సాదారణంగా చాలా మంది డొమైన్ ని వాళ్ళు తీసుకునే హోస్టింగ్ ప్యాకేజ్ తో పాటుగా తీసుకుంటారు. కొన్ని వెబ్ హోస్టింగ్ కంపనీలు హోస్టింగ్ తో పాటుగా ఒక సంవత్సరం డొమైన్ నేమ్ ని ఫ్రీగా అందిస్తున్నాయి. ఉదాహరణకి మీరు Hostgator లేదా Hostinger లాంటి కంపెనీలు వాళ్ళ షేర్డ్ హోస్టింగ్ ప్యాకేజ్స్ అందిస్తున్నాయి.

అలా కాకుండా మీరు వెబ్ హోస్టింగ్ తో కాకుండా మీరు డొమైన్ కూడా విడిగా తీసుకోవచ్చు. నేను విడిగానే తీసుకోమని రెఫెర్ చేస్తాను. ఎందుకంటె ఆ వెబ్ హోస్టింగ్ సర్వీస్ బాగా లేకపోయినా కాస్ట్ బేర్ చేయలేకపోయినా హోస్టింగ్ మారాలి. కానీ ఇలా మారే సమయంలో డొమైన్ ఇవ్వకపోవచ్చు, లేదా టెక్నికల్ ఇష్యూస్ వల్ల మీ బ్లాగ్ పూర్తిగా ఆగిపోయే ప్రమాదం ఉంది. అందుకే నేను విడిగా తిసుకోమంటాను.

మనకి మార్కెట్ లో అనేక మంది డొమైన్ రిజిస్ట్రార్స్ ఉన్నారు. వారిలో నుండి మీరు డొమైన్ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఉదాహరణకి GoDaddy, NameCheap, BigRock, SiteGround, GreenGeeks ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. వీటిల్లో నుండి మీరు ఒకరి ద్వారా మీ డొమైన్ రిజిస్టర్ చేసుకోవచ్చు.

వీలైనంత వరకూ మీరు GoDaddy కి దూరంగా ఉండండి. నేను NameCheap రెఫెర్ చేస్తాను. ఎందుకు అంటే డొమైన్ రిజిస్ట్రార్స్ లో Namecheap బాగా పాపులర్ కంపెనీ. అంతే కాకుండా డొమైన్ కాస్ట్ 9-10$ మధ్యలో ఉంటుంది. అంతే కాకుండా WhoisGuard అనే సర్వీస్ ని ఫ్రీగా అందిస్తుంది. దీనివల్ల మన డేటా సీక్రెట్గా ఉంచబడుతుంది, ఇలా ఉండటం వలన మనకి అనవసరం అయిన ఫోన్ కాల్స్ రాకుండా ఉంటాయి.

ఒక డొమైన్ ఎలా రిజిస్టర్ చేయాలి?

ఇక్కడ మీకు ఉదాహరణకి NameCheap లో ఏ విధంగా ఒక డొమైన్ ని రిజిస్టర్ చేసుకోవాలి అని చూపిస్తాను.

మీ డొమైన్ రిజిస్టర్ చేసుకోవటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది.  కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఒక సెర్చ్ బార్ కనిపిస్తుంది.

అందులో మీరు మీ బ్లాగ్ / వెబ్ సైట్ కోసం డొమైన్ అనుకున్న డొమైన్ నేమ్ ని సెర్చ్ చేయండి.

ఇక్కడ నేను bloggingtipsintelugu అని సెర్చ్ చేస్తున్నాను.

నాకు లక్కీగా .com డొమైన్ దొరికింది. ఒకవేళ మీకు మీరు సెర్చ్ చేసిన నేమ్ .com లో లేకపోతే .in ట్రై చేయండి. (మాక్సిమం .com తీసుకోవటానికి ట్రై చేయండి.)

Bloggingtipsintelugu.com ని సెలెక్ట్ చేసుకోవటానికి Add to Cart అని ఎదురుగా ఉన్న బటన్ పైన క్లిక్ చేయండి.

మీకు కార్ట్ కి యాడ్ అయిన తరువాత ఈ విధంగా కనిపిస్తుంది.

కింద రైట్ సైడ్ లో View Item అని, Checkout అని రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో మీరు checkout పైన క్లిక్ చేయండి.

ఇక్కడ మీకు ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. అంతే కాకుండా మీకు మీ బిల్ అమౌంట్ అంటే ఒక డొమైన్ కోసం మీరు పే చేయవలసిన అమౌంట్* (టాక్సెస్ కాకుండా).  ఈ అమౌంట్ మీకు ఉండే ఆఫర్స్ ని బట్టి మారుతుంది.

Confirm Order పైన క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.

 

ఇక్కడ మీరు ఇంతకూ ముందు డొమైన్ కనుక Namecheap లో రిజిస్టర్ చేసుకుంటే మీకు ఎకౌంటు క్రియేట్ అయ్యి ఉంటుంది. దానితో లాగిన్ అయ్యి పేమెంట్ కంప్లీట్ చేయవచ్చ్చు.

లేదు క్రొత్త గా మీరు డొమైన్ రిజిస్టర్ చేసుకుంటున్నారు అంటే Create an Account అని కనిపిస్తుంది కదా!

అందులో మీ డీటెయిల్స్ ఇచ్చి ఎకౌంటు క్రియేట్ చేసుకుని పేమెంట్ కంప్లీట్ చేయండి.

అంతే మీ బ్లాగ్ / వెబ్ సైట్ కోసం డొమైన్ రిజిస్టర్ చేసుకున్నట్లే.

కంప్లీట్ వీడియో ట్యుటోరియల్ కోసం ఈ వీడియో చూడండి 👇👇

Godaddy యూస్ చేసుకుంటాం అంటే Godaddy ద్వారా ఒక డొమైన్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అని ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడండి 👇

ఇప్పుడు మీరు వెబ్ హోస్టింగ్ రిజిస్టర్ చేసుకోవాలి.

వెబ్ హోస్టింగ్ అంటే ఏంటి?

వెబ్ హోస్టింగ్ అంటే మీ బ్లాగ్ / వెబ్ సైట్ కోసం క్రియేట్ చేసే ఫైల్స్, ఇమేజ్స్ , వీడియోస్ ఇలాంటి వాటిని అన్నింటిని మీ యూసర్స్ ఎక్కడి నుండి అయిన యాక్సెస్ చేయాలి అంటే మీరు ఎక్కడో ఒక చోట స్టోర్ చేయాలి కదా!

అలా స్టోర్ చేసే ప్లేస్ ఏదైతే ఉందొ దాన్నే వెబ్ హోస్టింగ్ అంటారు.

వెబ్ హోస్టింగ్ చాలా చాలా జాగ్రతగా తీసుకోవాలి.

వెబ్ హోస్టింగ్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?

how to register web hosting in telugu

వెబ్ హోస్టింగ్ రిజిస్టర్ చేసుకునేవారి కోసం నేను రెండు వెబ్ హోస్టింగ్ లు రెఫెర్ చేస్తాను.

వీటిల్లో మొదటిది మీరు వినే ఉంటారు. SiteGround ఒక మంచి వెబ్ హోస్టింగ్ కంపెనీ. చాలా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. నేను నా బ్లాగ్స్ కోసం దిన్ని యూస్ చేస్తున్నాను.

how to start blog in telugu

దీని కాస్ట్ కొంచెం ఎక్కువ. మంచి రిజల్ట్స్ కావాలి అంటే కొంచెం మనీ ఇన్వెస్ట్ చేయాలి. అలా చేయగలను అంటే కళ్ళు మూసుకుని SiteGround తీసుకోండి.

తరువాతది కంప్లీట్ గా బిగినర్స్ కోసం. Vaporhost వచ్చి మీకు నెలకి 60/- మాత్రమే. 5gb స్పేస్, 50gb bandwidth ఇస్తుంది. స్పేస్ లేదా bandwidth సరిపోదు అనుకుంటే మీరు నెక్స్ట్ ప్లాన్ కి మూవ్ అవ్వవచ్చు. ఎటువంటి సెటప్ ఛార్జ్స్ లేవు. .

మీకు కావాలి అంటే నెలకి, 3 నెలలకి, 6 నెలలకి, ఒక సంవత్సరానికి ఇలా బిల్లింగ్ చేసుకోవచ్చు.

నేను నా బ్లాగ్ ని కూడా ఇందులోనే రన్ చేస్తున్నాను. ఎందుకంటె బ్లాగ్ స్పీడ్ గా ఉంటుంది, నేనే రన్ చేస్తున్నాను అంటే మీకు ఈ Vaporhost బిగినింగ్ లో సరిపోతుంది.

మీరు ఎఫ్ఫెర్ట్ చేయగలిగినప్పుడు నీకు నచ్చిన హోస్టింగ్ తీసుకోవచ్చు.

Vaporhost వెబ్ హోస్టింగ్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలో స్టెప్-బై-స్టెప్ ఈ వీడియోలో వివరించాను, చూడండి.

Vaporhost వెబ్ హోస్టింగ్ రిజిస్టర్ చేసుకోవటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

వర్డుప్రెస్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలి?

how to install wordpress in webserver

మీ డొమైన్ ని వెబ్ హోస్టింగ్ తో లింక్ చేసుకుని మీరు cpanel లోకి లాగిన్ అయితే మీకు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.

(దాదాపుగా  ఇలాగె ఉంటుంది, లేదా కొంచెం చేంజ్స్ ఉండవచ్చు)

ఇప్పుడు మీరు వర్డుప్రెస్ ని ఇన్స్టాల్ చేయటానికి మీ వెబ్ పేజి ని కిందకి స్క్రోల్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా Softaculus Apps Installer అని కనిపిస్తుంది. లేదా One Click Installer అని కనిపిస్తుంది.

ఇందులో నుండి మీరు వర్డుప్రెస్ అని కనిపిస్తుంది కదా ! దాని పైన క్లిక్ చేయండి. అప్పుడు మీకు వర్డుప్రెస్ సెటప్ పేజిలోకి వస్తుంది.

ఇక్కడ మీరు Install Now అని బటన్ కనిపిస్తుంది కదా! దాని పైన క్లిక్ చేయండి.

అప్పుడు ఈ విధంగా స్క్రీన్ వస్తుంది.  ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఇవ్వవలసి ఉంటుంది.

మొదట Software Setup అని ఉంది కదా దానిని ఏమి చేయకండి. తరువాత మీకు Site Settings అని కనిపిస్తుంది కదా అందులో మీ బ్లాగ్ యొక్క టైటిల్, బ్లాగ్ డిస్క్రిప్షన్ ఇవ్వండి, ఇవ్వకపోయినా పర్వాలేదు, వర్డుప్రెస్ కస్టమైజేషన్ లో మార్చుకోవచ్చు.

how to start blog in telugu

తరువాత మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే పైన కనిపించినట్టు కనిపిస్తుంది.

ఇదే చాలా చాలా ఇంపార్టెంట్. Admin Account అని ఉంది కదా!

అందులో మీరు అడ్మిన్ యూసర్ నేమ్ దగ్గర మీరు ఏ యూసర్ నేమ్ తో లాగిన్ అవ్వాలి  అనుకుంటున్నారో దానిని ఇవ్వండి.

(ఎవరు గెస్ చేయని యూసర్ నేమ్స్ సెలెక్ట్ చేసుకోండి. లేకుంటే మీ బ్లాగ్ హ్యాక్ అయ్యా అవకాశం ఉంది)

తరువాత అడ్మిన్ పాస్వర్డ్ దగ్గర మీకు నచ్చిన పాస్వర్డ్ ఇవ్వండి.

(సెక్యూర్ పాస్వర్డ్ పెట్టుకోండి)

తరువాత అడ్మిన్ ఈమెయిల్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు రెగ్యులర్ గా యూస్ చేసే ఈమెయిల్ ఇవ్వండి. దీనివలన మనకి మన బ్లాగ్ లో జరిగే అప్డేట్స్ , నోటిఫికేషన్స్ గురించి తెలుస్తుంది.

లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంచండి. తరువాత సెలెక్ట్ ప్లగిన్స్ అని ఉంది కదా! అందులో ఫస్ట్ ప్లగిన్ Limit Login Attempts (Loginizer) అని ఉంది కదా ! దాని ఎదురుగా ఉన్న బాక్స్ ని క్లిక్ చేయండి.

తరువాత ఇంక లాస్ట్ కి వెళ్ళిపోతే Email Installation Details to అని ఒక బాక్స్ కనిపిస్తుంది. అందులో మీరు మీ రెగ్యులర్ ఈమెయిల్ అడ్రస్ అవ్వండి.

ఆ తరువాత Install బటన్ పైన క్లిక్ చేయండి.

మీకు ఈ విధంగా ఇన్స్టలేషన్ స్టార్ట్ అవుతుంది. మీ ఇంటర్నెట్ స్పీడ్ ని బట్టి 2-3 నిమిషాల్లో ఇన్స్టాల్ అయిపోతుంది.

మీ వర్డుప్రెస్ సక్సెస్ ఫుల్ గా ఇన్స్టాల్ అయ్యింది అని ఈ విధంగా మీకు చూపిస్తుంది.

ఇప్పుడు ఒకసారి మీ బ్లాగ్ ని చెక్ చేసుకోండి. మీ బ్లాగ్ ఇలా కనిపిస్తుంది. (డిఫాల్ట్ థీమ్)

మీరు వర్డుప్రెస్ డాష్ బోర్డు లో కి వెళ్ళాలి అంటే

www.miblogname.com/wp-admin అని యుఆర్ఎల్ తో లాగిన్ అవ్వండి.

మీ వర్డుప్రెస్ డాష్ బోర్డు ఇలా ఉంటుంది.

How to Create WordPress Blog in Telugu

ఈ విధంగా మీరు చాల చాలా ఈజీగా మీ బ్లాగ్ / వెబ్ సైట్ కోసం వర్డ్ప్రెస్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు.

ఆ తరువాత మీ బ్లాగ్ / వెబ్ సైట్ ని మీకు నచ్చిన థీమ్స్ తో డిజైన్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన ప్లగిన్స్ ని కూడా యూస్ చేసుకుని ఒక మంచి బ్లాగ్ / వెబ్ సైట్ ని మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు.

ఇప్పటికే మన యూట్యూబ్ ఛానల్ లో వర్డుప్రెస్ ద్వారా ఒక బ్లాగ్ ని స్తే-బై-స్టెప్ ఎలా క్రియేట్ చేయాలి అని వీడియో ట్యుటోరియల్స్ చేయడం జరిగింది. అందులో డొమైన్ రిజిస్ట్రేషన్ నుండి మీ బ్లాగ్ ని లైవ్ చేయటం వరకు చెప్పాను.

Installing Themes

ఇప్పుడు మీ సర్వర్ లో ఫ్రెష్ గా వర్డుప్రెస్ ఇన్స్టాల్ చేసుకున్నారు. నిజానికి వర్డుప్రెస్ లో డిఫాల్ట్ గా వచ్చే డిజైన్ లుక్ అంతగా బాగుండదు. 2021 లో వర్డుప్రెస్ లో డిఫాల్ట్ గా ట్వంటీ వన్ థీమ్ ఇన్స్టాల్ అయి ఉంది. అయితే వర్డుప్రెస్ లో ఉన్న అద్భుతమైన విషయం కొన్ని వేల థీమ్స్ ఫ్రీగా అందుబాటులో ఉన్నాయి, కొన్ని వందల ప్రీమియం థీమ్స్ కూడా ఉన్నాయి.

వర్డుప్రెస్ లో ఒక మంచి థీమ్ సెలెక్ట్ చేసుకోవటం కూడా కష్టమే. ఎందుకంటె ఇక్కడ థీమ్స్ కేవలం డిజైన్ మాత్రమే కాకుండా వెబ్సైటు స్పీడ్ పైన కూడా చూపిస్తుంది. ఒక్క విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మీ బ్లాగ్ ఆన్లైన్ లో మీ ఐడెంటిటీ. కాబట్టి జాగ్రతగా సెలెక్ట్ చేసుకోవాలి.

చాలా మంది ఫ్రీ థీమ్స్ యూస్ చేస్తారు, నేను కూడా కెరీర్ మొదట్లో ఫ్రీ థీమ్స్ యూస్ చేశాను. ఇప్పుడు ప్రీమియం యూస్ చేస్తున్నాను. నేను GeneratePress థీమ్ ని రెఫెర్ చేస్తాను.

ఒక థీమ్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి?

ఒక వర్డుప్రెస్సు థీమ్ ని సెలెక్ట్ చేసుకోవటానికి 5 రూల్స్ మీకు చెప్పాలి అనుకుంటాను. ఇవి మీకు బాగా హెల్ప్ అవొచ్చు.

థీమ్ కోడ్ లో వైరస్ లాంటివి ఉండకుండా చూసుకోవాలి

బ్లాగ్ సెక్యూరిటీ మనకి టాప్ ప్రయారిటీ. ఎందుకంటె మన కష్టం, మన భవిష్యతు ఈ బ్లాగ్. కాబట్టి దీనిని జాగ్రతగా చూసుకోవాలి. కొంత మంది మనకి కొన్ని ఫ్రీ థీమ్స్ ఆఫర్ చేస్తుంటారు. అయితే వీటిల్లో మనకి తెలియకుండా వైరస్ కి సంబంధించిన కోడింగ్ కూడా ఉంచుతారు. టెక్నికల్ నాలెడ్జ్ లేని వాళ్ళు దిన్ని కనిపెట్టడం కష్టం.

ఇలా చేయటం వలన మీ బ్లాగ్ హ్యాక్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఒకవేళ హ్యాక్ అయితే మీ బ్లాగ్ లో రిలేటెడ్ గా లేని కంటెంట్ రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.

ఒక థీమ్ ఇన్స్టాల్ చేస్తుంటే ముందుగ డౌన్లోడ్ చేసిన వెంటనే మనం వైరస్ క్విక్ స్కాన్ చేయాలి. ఇందుకోసం మీరు AntiVirus Plugin యూస్ చేయవచ్చు. ఈ ప్లగిన్ ద్వారా మీరు మీ బ్లాగ్ లో వైరస్ ఉందా అని చెక్ చేసుకోవచ్చు.

వీలు అయినంత వరకూ మీరు థర్డ్ పార్టీస్ నుండి డౌన్లోడ్ చేయకండి. వర్డుప్రెస్ లైబ్రరీలోనే కొన్ని వేల థీమ్స్ అందుబాటులో ఉంటాయి. లేదు అంటే అఫీషియల్ సైట్స్ నుండి పర్చేస్ చేయండి.

మీ థీమ్ ఫాస్ట్ గా లోడ్ అవ్వాలి

చాలా థీమ్స్ ప్రీమియం వెర్షన్స్ చాలా ఫాస్టుగా లోడ్ అవుతాయి. ఎందుకంటె ఇలా ఫాస్ట్ గా లోడ్ అవ్వటం వల్ల రీడర్ కి మంచి యూసర్ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. కొన్ని స్టాట్స్ ప్రకారం 3 సెకండ్స్ లోపు లోడ్ అయ్యే వెబ్సైటు కి మంచి ర్యాంకింగ్స్ లభిస్తాయి.

మరి మన బ్లాగ్ ఎంత స్పీడ్ గా ఉంది అని ఎలా తెలుసుకోగలం. ఇందుకోసం మనకి కొన్ని టూల్స్ ఫ్రీ & ప్రీమియం టూల్స్ ఉన్నాయి. వచ్చిన రిజల్ట్స్ ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.

థీమ్ డెవలపర్ నమ్మకస్తుడు అయి ఉండాలి

చాలా మంది బ్లాగ్స్ హ్యాక్ చేయటానికి వీలుగా ఎలా పడితే అలా థీమ్స్ క్రియేట్ చేస్తుంటారు. అయితే దీనివల్ల మనం మన బ్లాగ్ కోల్పోవలసి వస్తుంది. ఒక థీమ్ యూస్ చేయాలి అనుకున్నప్పుడు మనం ప్రీమియం థీమ్స్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైటుస్ నుండి తీసుకోవాలి, లేదా కొన్ని మార్కెట్ ప్లేసెస్ ఉన్నాయి, వాటి నుండి తీసుకోవచ్చు.

రివ్యూస్ చూడండి, ఫేస్బుక్ గ్రూప్స్ లో అడగండి, ఫలానా థీమ్ ఎలా ఉంటుంది అని. దాన్ని బట్టి ఆ థీమ్ మీకు ఎంతవరకూ అవసరమో అర్థం అవుతుంది. (ఇంకో విషయం ఎక్కువ మంది అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోండి… ఎందుకంటె అఫిలియేట్ మార్కెటింగ్ చేయటానికి కూడా కొంత మంది అది మంచిది కాదు, ఇది మంచిది కాదు అని చెప్పే ప్రమాదం ఉంది).

మీ బ్లాగ్ థీమ్ ఎడిట్ చేయటానికి, కష్టమైజ్ చేయటానికి ఈజీగా ఉందా?

మీకు తెలుసా కొన్ని ప్రీమియం థీమ్స్ లో కష్టమైజ్ ఆప్షన్స్ తక్కువగా ఉంటాయి. కొన్ని కొన్ని థీమ్స్ ఎడిట్ చేయటానికి కష్టంగా  ఉంటాయి. మీకు ఇటువంటి నాలెడ్జ్ లేకుండా మీరు ప్రీమియం థీమ్ ని యూస్ చేసుకోలేరు. లాస్ట్ అప్డేట్ ఎప్పుడు వచ్చంది అని కూడా మనం చూస్తూ ఉంటాం.

మంచి కస్టమర్ సపోర్ట్ ఉండాలి

అయితే ఇక్కడ చాలా థీమ్స్ వాళ్ళ థీమ్ గురించిన ప్రతి టాపిక్ గురించి డిటైల్డ్ గా ఆర్టికల్స్ అందిస్తున్నారు. అప్పటికి మనకి ఇంకా ప్రాబ్లంస్ ఉంటె చాట్ ద్వారా సపోర్ట్ ఉంటుంది. అప్పటికి మన ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోతే మనం ఆ థీమ్ ఫోరం లో మన ప్రాబ్లం గురించి అడిగితే ఆ డెవలపర్ మీకు సొల్యూషన్ అందించగలరు.

కాబట్టి మీరు ఒక థీమ్ తీసుకునే ముందు వీటిని ఆలోచిస్తే మీకే తెలుస్తుంది ఆ థీమ్ మీకు అవసరమా లేదా అని.

బ్లాగ్ కష్టమైజ్ చేయటం

ఇప్పుడు మనం మీ బ్లాగ్ ని కష్టమైజ్ చేయాలి. అంటే మీ కంటెంట్ తో మీరు మీ డీటెయిల్స్ తో బ్లాగ్ ని రెడీ చేయాలి. ఇందులో మీరు ఈ క్రింది పనులు చేయాలి.

1) మీ బ్లాగ్ నేమ్, ట్యాగ్ లైన్ ని సెట్ చేయటం

2) యుఆర్ఎల్(url) స్ట్రక్చర్ సెట్ చేయటం

3) హెడర్ ఇమేజ్ యాడ్ చేయటం

4) సైడ్ బార్ లో మీకు కావాల్సిన విడ్జెట్స్ అరేంజ్ చేయాలి

5) Akismet ప్లగిన్ ఆక్టివేట్ చేసుకోవాలి (స్పాం కామెంట్స్ బ్లాక్ చేయటం కోసం).

6) మీకు కావాల్సిన ప్లగిన్స్ ఇన్స్టాల్ చేయాలి

7) మీకు అనువైన విధంగా సెట్టింగ్స్ చేంజ్ చేయాలి

8) RSS ఫీడ్ యాడ్ చేయటం

9) సబ్స్క్రిప్షన్ సైన్ అప్ ఫారం యాడ్ చేయాలి

10) క్యాటగిరీస్ ట్యాగ్స్ యాడ్ చేయాలి.

Installing Plugins (Functionality)

వర్డుప్రెస్ లో ప్లగిన్స్ మీ బ్లాగ్ కి కావాల్సిన సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ రన్ చేయగల కెపాసిటీ మీకు కల్పిస్తుంది. ఒక్క లైన్ కోడింగ్ కూడా రాకుండా అద్భుతమైన వెబ్ సైట్ / బ్లాగ్ క్రియేట్ చేయవచ్చు. అంతే కాకుండా రకరకాల మార్గాల ద్వారా మీ రీడర్స్ కి కావాల్సినవన్నీ మీకు కోడింగ్ రాకపోయినా సులభంగా చేయవచ్చు.

వర్డుప్రెస్ డైరెక్టరీ లో 57వేలకు పైగా వర్డుప్రెస్ ప్లగిన్స్ ఉన్నాయి. మీ అవసరాలకి తగ్గట్లుగా ప్లగిన్స్ యూస్ చేసుకోవచ్చు. మీ బ్లాగ్ బ్రాండింగ్ లో ఈ ప్లగిన్స్ కూడా మరింత హెల్ప్ అవుతాయి. ప్రతి అవసరానికి ఒక ప్లగిన్ వర్డుప్రెస్ లో ఉంది.

ప్రతి బ్లాగర్ కి బిగినింగ్ లో కావాల్సిన ప్లగిన్స్ గురించి మనం తెలుసుకుందాం.

RankMath SEO

RankMath SEO ప్లగిన్ ఒక పాపులర్ SEO ప్లగిన్. ఈ ప్లగిన్ బిగినర్ ఫ్రెండ్లీ గా ఉంటుంది. ఈ ప్లగిన్ ద్వారా మనం సెర్చ్ కన్సోల్ కి సబ్మిట్ చేయటం, సైట్ మ్యాప్స్ క్రియేట్ చేయటం, ఆన్ పేజి SEO లాంటివి ఎన్నో చేయవచ్చు. మెటా టాగ్స్, డిస్క్రిప్షన్ లాంటి వాటి ద్వారా మీ బ్లాగ్ సెర్చ్ ఇంజిన్స్ లో మంచి ర్యాంకింగ్స్ పొందటానికి సహాయపడుతుంది.

Contact Form 7

మీ బ్లాగ్ లో మీ రీడర్స్ మీతో కాంటాక్ట్ అవ్వటానికి కావాల్సిన ఫుల్ ఫంక్షనల్ కాంటాక్ట్ పేజిని క్రియేట్ చేయటం కోసం ఈ కాంటాక్ట్ ఫారం 7 ప్లగిన్ బాగా హెల్ప్ అవుతుంది. ఈ ప్లగిన్ ద్వారా చేసిన కాంటాక్ట్ పేజి ప్రొఫెషనల్ గా డిజైన్ చేయవచ్చు. అంతే కాకుండా డైరెక్ట్ గా మీ ఈమెయిలు కి వచ్చే విధంగా చాలా సింపుల్ గా కన్ఫిగర్ చేయవచ్చు.

Akismet

వర్డుప్రెస్ లో మనం బ్లాగ్ పోస్ట్స్ పబ్లిష్ చేసిన తరువాత కొన్ని స్పాం కామెంట్స్ వస్తూ ఉంటాయి. బ్యాక్ లింక్స్ కోసం ఇలాంటివి కామెంట్స్ చేయటం లేదా పోర్న్ రిలేటెడ్ సైట్స్ గురించి కూడా కామెంట్ చేస్తూ ఉంటారు. వీటిని మనం లైట్ తీసుకోకూడదు. వీటివల్ల మన బ్లాగ్ ర్యాంకింగ్స్ కోల్పోయే అవకాశం ఉంది. అందుకోసం ఈ ప్లగిన్ మనం యూస్ చేయాలి. ఈ ప్లగిన్ మనకి డిఫాల్ట్ గా వర్డుప్రెస్ ఇన్స్టలేషన్ తో పాటుగా వస్తుంది. మనం ఒక ఎకౌంటు క్రియేట్ చేసుకుని ఫ్రీ ప్లాన్ ద్వారా స్పాం కామెంట్స్ ని బ్లాక్ చేస్తుంది.

Loginizer

వర్డుప్రెస్ యూస్ చేయడానికే కాదు, హ్యాక్ చేయటానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. మరి ఎలా మనం ఇంత కష్టపడి బ్లాగ్ క్రియేట్ చేస్తే, హ్యాక్ అయితే ఎలా అనుకుంటున్నారా? మనం చేయగలిగినంతలో జాగ్రతలు తీసుకోగలిగితే చాలు. అటువంటి ఒక సెక్యూరిటీ ప్లగిన్.

3 సార్లు పాస్వర్డ్ తప్పుగా ఆక్టివేట్ చేస్తే మళ్ళి యాక్సెస్ చేయకుండా బ్లాక్ చేస్తుంది. ఇది మీ బ్లాగ్ ని యాక్సెస్ చేయటానికి ట్రై చేసి, ఫెయిల్ అయ్యే  IP అడ్రస్ లను బ్లాక్ చేస్తుంది. కాబట్టి ఈ ప్లగిన్ కూడా అత్యవసరం.

Easy Social Sharing

మనం ఏం చేసినా మన కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. అలా చేయాలి అంటే మీ బ్లాగ్ లో సోషల్ మీడియా షేరింగ్ ఐకాన్స్ ఉండాలి. ఈ సోషల్ మీడియా షేరింగ్ బటన్స్ కోసం ఈ ప్లగిన్ యూస్ అవుతుంది. దీనిని కన్ఫిగర్ చేయటం చాలా ఈజీ.

AMP

ఈరోజుల్లో ప్రతి వెబ్ సైట్ మొబైల్ ఫ్రెండ్లీగా ఉండేలా డిజైనర్స్, డెవలపర్స్ క్రియేట్ చేస్తున్నారు. అయితే ఈ మొబైల్ సైట్స్ మొబైల్ డివైస్లలో త్వరగా లోడ్ అయ్యి ఓపెన్ అవ్వటానికి ఈ ప్లగిన్ హెల్ప్ అవుతుంది. ఒకసారి ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది.

తరువాత ఏం చేయాలి?

ఇప్పుడు మీరు మీ బ్లాగ్ ప్రొఫెషనల్ గా ఉంది. ఇంకా మన పని పూర్తి కాలేదు. ఇప్పుడు మనం కంటెంట్ ని రెగ్యులర్ గా పోస్ట్ చేయాలి. అది కూడా మీ నిష్ కి రిలవెంట్ గా ఉండే కంటెంట్, మీ రీడర్స్ కి హెల్ప్ అయ్యే కంటెంట్. అంతే కాకుండా కొంత సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ నేర్చుకోవాలి. మీ బ్లాగ్ ట్రాఫిక్ ఇంక్రీస్ చేయాలి.

మీ గోల్స్ కి రిలేటెడ్ గా ఉండే విధంగా మీ బ్లాగ్ ని మానటైజ్ చేయాలి. అంటే మీరు ఒకా చాలా నేర్చుకోవాలి. బ్లాగింగ్ అనేది క్విక్ రిచ్ స్కీం కాదు.

మీకు టైం ఉంటె ఈ బ్లాగ్స్ కూడా చదవండి. ఇవి మీకు ఇంకా హెల్ప్ అవుతాయి 👇👇

Leave a Comment