Mail Chimp E-mail Marketing in Telugu
మీ బ్లాగ్ కి ట్రాఫిక్ ఇంక్రీస్ కావాలా? అయితే ఈమెయిలు లిస్టు బిల్డ్ చేయండి.
మీరు అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మనీ ఎర్న్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈమెయిలు లిస్టు బిల్డ్ చేయండి.
మీరు ప్రొడక్ట్స్/ సర్వీసెస్ సేల్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈమెయిలు మార్కెటింగ్ చేయండి.
ఇలా మీరు ఏం చేయాలి అన్నా ఈమెయిలు మార్కెటింగ్ హెల్ప్ అవుతుంది.
ఈమెయిల్ మార్కెటింగ్ అంటే ఏంటి?
ఈమెయిల్స్ ద్వారా మీ రీడర్స్ / యూసర్స్ కి మీ ప్రొడక్ట్స్ / సర్వీసెస్ గురించిన ఇన్ఫర్మేషన్ అందించి వారిని మీ ప్రొడక్ట్స్ / సర్వీసెస్ పర్చేస్ చేసే విధంగా మోటివేట్ చేయటం. ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారా తక్కువ టైం లో ఎక్కువ సేల్స్ చేయగలం. ఇందుకోసం మనం ఈమెయిల్ మార్కెటింగ్ టూల్స్ యూస్ చేస్తాం.
ఈమెయిల్ మార్కెటింగ్ టూల్స్ అంటే ఏంటి?
సాధారణంగా మనం జిమెయిల్ నుండి (ఎక్కువ మంది యూస్ చేస్తుంటారు కాబట్టి) రోజు 500 ఈమెయిల్స్ మాత్రమే పంపించగలం. అదే బిజినెస్ సూట్ ఎకౌంటు అయితే 2000 వరకు ఈమెయిల్స్ పంపించగలం.
మరి అలా కాకుండా మీ దగ్గర అంతకు మించి ఈమెయిల్స్ లిస్టు ఉంటె ఎలా? అందుకోసం కొన్ని ఈమెయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎన్ని ఈమెయిల్స్ కి అయిన మెయిల్స్ పంపటానికి కొన్ని సాఫ్ట్వేర్స్ క్రియేట్ చేసి వాటితో బిజినెస్ చేస్తున్నాయి.
అటువంటి సాఫ్ట్వేర్స్ నే మనం ఈమెయిల్ మార్కెటింగ్ టూల్స్ అంటాం. ఈమెయిల్ మార్కెటింగ్ కోసం అనేక టూల్స్ మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. Mailchimp, MailerLIte, Aweber, Convetkit, Sender, Drip ఇలా రకరకాల ఈమెయిల్ మార్కెటింగ్ టూల్స్ మనకి సర్వీసెస్ అందిస్తున్నాయి.
వీటిల్లో కొన్ని మనకి ఫ్రీ సర్వీసెస్ ని అందిస్తున్నాయి, మరికొన్ని ఫ్రీ ట్రైల్స్ మాత్రమే అందిస్తున్నాయి.
ఫ్రీ గా మనం ఈమెయిల్ మార్కెటింగ్ టూల్ ని యూస్ చేసుకోవాలి అనుకుంటే లేదా ఈమెయిల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనుకున్న మనం Mailchimp తో మనం మొదలుపెట్టవచ్చు.
ఈమెయిల్ మార్కెటింగ్ అనేది డిజిటల్ మార్కెటింగ్ లోనే అత్యంత తక్కువ ఖర్చుతో ఎక్కువ రిటర్న్ అఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చే మాడ్యుల్. అంతే కాకుండా బ్లాగింగ్ ద్వారా మనీ ఎర్న్ చేయాలి అనుకునేవారు పెద్దగా ట్రాఫిక్ లేకపోయినా ఈమెయిల్ లిస్టు బిల్డ్ చేసుకుంటే అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మనీ ఎర్న్ చేయవచ్చు.
ఈ రోజు మనం Mailchimp ఈమెయిల్ మార్కెటింగ్ టూల్ గురించి తెలుసుకుందాం.
MailChimp ఈమెయిల్ మార్కెటింగ్ టూల్ ని మనం ఫ్రీగా 2000 మంది సబ్స్క్రయిబర్స్ కి నెలకి 12,000 ఈమెయిల్స్ పంపించవచ్చు. మనకి Mailchimp లోనే ఫారంస్, లాండింగ్ పేజెస్ ఇలాంటి ఎన్నో ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.


Mailchimp ప్రైసింగ్ ఇలా ఉంటుంది. మీకు అసలు ఈమెయిల్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలియదు, నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ Mailchimp ఫ్రీ ఎకౌంటు ట్రై చేయండి.
అప్పుడు మీకు ఈమెయిల్ మార్కెటింగ్ గురించి ఒక ఐడియా వస్తుంది. అప్పుడు మీరు ఇంకా మంచి పెయిడ్ ఈమెయిల్ మార్కెటింగ్ యూస్ చేయవచ్చు.
ఫ్రీ ఎకౌంటు ద్వారా మీరు 2 నిమిషాల్లోనే సైన్ అప్ అవ్వచ్చు.
Mailchimp లో ఎకౌంటు ఎలా క్రియేట్ చేయాలి అని కింద వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను.
మీరు ఎకౌంటు క్రియేట్ చేసిన తరువాత మీ Mailchimp టూల్ తో లాగిన్ అయితే మీకు ఈ విధంగా స్క్రీన్ కనిపిస్తుంది.
ఇందులో మనం సైన్ అప్ ఫారంస్ క్రియేట్ చేయవచ్చు. లాండింగ్ పేజెస్ క్రియేట్ చేయవచ్చు. ఇందులో మీకు ఈమెయిల్ టెంప్లేట్స్ కూడా ఉంటాయి. వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు.
ఈ టూల్ కేవలం బ్లాగర్స్, డిజిటల్ మార్కేటర్స్ కే కాదు చిన్న చిన్న బిజినెస్ లు చేసుకునేవారికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఇందులోనే మనం e-కామర్స్ ప్రొడక్ట్స్ ని కూడా సేల్ చేయవచ్చు. అందుకు కూడా మనకి ఇందులో ఆప్షన్స్ ఉన్నాయి.
మనం ఈ టూల్ ని యూస్ చేయటానికి మనకి ఈమెయిల్ లిస్టు ఉండాలి. ఈమెయిల్ లిస్టు కోసం మనం ఒక సైన్ అప్ ఫారం క్రియేట్ చేయాలి.
Mailchimpలో సైన్అప్ఫారం ఎలా క్రియేట్ చేయాలి?
మనం లెఫ్ట్ సైడ్ బార్ లో కనిపించే mailchimp లోగో తరువాత రెండవ ఐకాన్ పైన క్లిక్ చేస్తే మనకి Audience అని ఒక మెనూ ఓపెన్ అవుతుంది.

పైన కనిపించే ఇమేజ్ లో మీకు ఎల్లో కలర్ లో Signup Forms అని కనిపిస్తుంది కదా దాని పైన క్లిక్ చేస్తే మీకు ఇలా కనిపిస్తుంది.

ఇందులో మనకి ఇలా 4 రకాల ఫార్మ్స్ కనిపిస్తాయి. ఫార్మ్ బిల్డర్, ఎంబెడ్ ఫార్మ్స్, సుబ్స్చ్రిబెర్ పాప్అప్, ఫార్మ్ ఇంటిగ్రేషన్స్ అని.
ముందుగా form builder పైన క్లిక్ చేయండి. అప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తుంది.

ఇక్కడ మనం మనకి కావాల్సిన ఫార్మ్ ని క్రియేట్ చేసుకోవాలి. ప్రస్తుతానికి ఒక సైన్ అప్ ఫార్మ్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది.

ఇక్కడ మనకి పైన Build it, Design It, Translate it అని 3 రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి.
మొదట మనం Build It లో మన ఫార్మ్ ని క్రియేట్ చేసుకోవాలి. మీకు కింద కొన్ని ఫార్మ్ ఫీల్డ్స్ కనిపిస్తున్నాయి కదా! అలాగే మీరు రైట్ సైడ్ ఫీల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి.
ఇక్కడ సాధారణంగా మనం ఈమెయిల్ లిస్టు క్రియేట్ చేయాలి అంటే మనకి ఈమెయిల్ ఐడి, నేమ్ ఉంటె సరిపోతుంది. కాబట్టి మిగిలిన ఫీల్డ్స్ అవసరం లేదు. ఇప్పుడు ఒక ఫారం ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం.
మొదట మీకు click to add a message అని కనిపిస్తుంది కదా అందులో మీరు మీ ఫారం యొక్క హెడ్డింగ్ యాడ్ చేయాలి. మీకు ఆ మెసేజ్ పైన మౌస్ పెడితే ఈ విధంగా కనిపిస్తుంది.

ఇక్కడ కనిపించే edit పైన క్లిక్ చేయండి. అప్పుడు ఈ విధంగా ఒక పాప్అప్ కనిపిస్తుంది.

ఇక్కడ మనం మనకి కావాల్సిన విధంగా మనం కంటెంట్ క్రియేట్ చేయవచ్చు. ఒక ఉదాహరణ చూద్దాం.

నేను ఒక కొంత కంటెంట్ క్రియేట్ చేశాను. ఇప్పుడు Save & Close పైన క్లిక్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది.

మీరు ఏదైతే యాడ్ చేసారో అది మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు కావాలి అంటే ఇమజేస్ కూడా యాడ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు కింద ఉన్న ఫార్మ్స్ ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం.
ఇక్కడ మనకి ఆల్రెడీ Email Address, First Name, Last Name ఉన్నాయి కాబట్టి, మనకి అవసరం లేని ఫార్మ్స్ తీసేద్దాం.
కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఈ విధంగా మనకి అడ్రస్ ఫీల్డ్స్ కనిపిస్తాయి.

ఆ ఫీల్డ్ ని సెలెక్ట్ చేసుకోగానే మనకి రైట్ సైడ్ ఆప్షన్ లో ఫీల్డ్ సెట్టింగ్ ఇలా ఓపెన్ అవుతుంది.

ఒకవేళ మనం ఈ ఫీల్డ్ ని యూస్ చేయాలి అనుకుంటే మనం ఇక్కడ మనం చేంజ్ చేయవలసినవి ఫీల్డ్ లేబిల్ చేంజ్ చేసుకోవచ్చు. తరువాత రిక్వైర్ద్ ఫీల్డ్ అని ఉంది కదా, అది అడ్రస్ కంపల్సరీగా కావాలి అనికుంటే దానిని టిక్ చేసుకోవాలి. ఈ ఫీల్డ్ కనపడకుండా ఉంది దానిని విసిబుల్ లో పెట్టుకోవాలి. కావాల్సిన చేంజ్స్ చేసి సేవ్ ఫీల్డ్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది.

ఆ ఫీల్డ్ అవసరం లేదు అనుకుంటే delete పైన క్లిక్ చేయండి. అప్పుడు మనకి ఇలా కనిపిస్తుంది.

ఈ పాప్అప్ లో DELETE అని టైపు చేస్తేనే ఈ ఫీల్డ్ డిలీట్ అవుతుంది. అంటే పొరబాటున ఫీల్డ్స్ డిలేట్ అవ్వకుండా అన్నమాట.
delete ఎంటర్ చేసి delete బటన్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ ఫీల్డ్ డిలీట్ అవుతుంది.

అప్పుడు మీకు ఫారం ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ఫోన్ నెంబర్, బర్త్డే అని ఇంకా రెండు ఫీల్డ్స్ ఉన్నాయి. నాకు అవి అవసరం లేదు అందుకని వాటిని కూడా రిమూవ్ చేస్తున్నాను.
ఇప్పుడు మీకు ఫారం ఇలా కనిపిస్తుంది.

ఒక్కసారి నేమ్ ఫీల్డ్స్ రిక్వైర్ద్ ఆప్షన్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి.
ఇక్కడికి మీ ఫార్మ్ క్రియేట్ అయ్యింది. ఈ ఫార్మ్ ఎలా ఉంది అని చెక్ చేయాలి అని ఉందా? అయితే మీకు పైన Signup form URL అని ఒక లింక్ కనిపిస్తుంది దానిని కాపీ చేసుకుని ఇంకో టాబ్ లో ఓపెన్ చేయండి.

అప్పుడు మీకు ఇలా కనిపిస్తుంది.

మీ సైన్అప్ ఫార్మ్ క్రియేట్ అయ్యింది. దీని ద్వారా మీరు మీ లిస్టు బిల్డ్ చేయటం స్టార్ట్ చేయవచ్చు. దీనిని మీ వెబ్ సైట్ లో యాడ్ చేయటం ఎలా?
ముందు ఈ ఫార్మ్ కోడ్ కాపీ చేసుకోవాలి. అందుకోసం మళ్ళి మనం సైన్అప్ ఫార్మ్స్ పేజికి వెళ్ళాలి.

ఇక్కడ మీకు embedded forms అని ఉంది కదా! దానిని సెలెక్ట్ చేసుకోండి.

ఇక్కడ ఇంకా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ మీకు Copy/paste onto your site అని ఉంది కదా ! అక్కడ మీకు html కోడ్ కనిపిస్తుంది కదా!
దాని పైన క్లిక్ చేయగానే మొత్తం సెలెక్ట్ అవుతుంది.

కాపీ చేసుకోండి. ఈ కోడ్ ని మీ బ్లాగ్ లో html విడ్జెట్ లో యాడ్ చేయండి. అప్పుడు మీకు ఇలా కనిపిస్తుంది.

ఈ విధంగా మీరు మీ బ్లాగ్ లో ఈమెయిల్ సైన్అప్ ఫారం యాడ్ చేయవచ్చు.
ఒక ఈమెయిల్ కాంపెయిన్ ని ఎలా క్రియేట్ చేయాలో ఇంకో బ్లాగ్ పోస్ట్ లో తెలుసుకుందాం.
ఈ బ్లాగ్ పోస్ట్ మీకు యూస్ అవుతుంది అనుకుంటున్నా.
మీకు ఈ సైన్అప్ ఫార్మ్ క్రియేట్ చేయటంలో ఏమన్నా డౌట్స్ ఉంటె కామెంట్ చేయండి.
ఈ బ్లాగ్ పోస్ట్ ని ఫేస్బుక్, WhatsApp లో షేర్ చేయండి. ఎందుకంటె Sharing is Caring కదా!
Mail Chimp Email Marketing Campaign Creation in Telugu
- Website Design Formula for Small Businesses - October 27, 2021
- Digital Marketers Meetup in Hyderabad in 2021 - September 1, 2021
- How to Write Viral Blog Posts in Telugu - August 12, 2021
బ్లాగ్ కి ట్రాఫిక్ ఇంక్రీస్ కావాలంటే ఈమెయిల్ లిస్ట్ బిల్డ్ చేయండి అని అందరూ చెబుతుంటారు కానీ అసలు బ్లాగ్ కి ఈమెయిల్ లిస్ట్ బిల్డ్ చెయ్యడానికి అవసరమైన సైన్ అప్ ఫార్మ్ ఎలా క్రియేట్ చేయాలో మాత్రం చాలా మంది చెప్పడం లేదు.మీరు సైన్ అప్ ఫార్మ్ ఎలా క్రియేట్ చెయ్యాలో చాలా వివరంగా చెప్పారు.థాంక్యూ సో మచ్.