క్రొతగా బ్లాగింగ్ స్టార్ట్ చేసిన బ్లాగర్స్ తెలుసుకోవాల్సిన 7 ముఖ్యమైన విషయాలు (7 Things Must known As a Blogger)
ఒక బ్లాగ్ స్టార్ట్ చేయటం చాలా ఈజీ. అంతే కాకుండా కంటెంట్ రాయడం కూడా పెద్ద కష్టం ఏమి కాదు. కానీ బ్లాగింగ్ ఒక సముద్రంలాంటిది. మీరు ఎన్ని నేర్చుకున్నాను అనుకున్నా ఇంకా క్రొత్తవి ఎన్నో ఉంటాయి.
అందులోనూ క్రొతగా బ్లాగింగ్ స్టార్ట్ చేసినవాళ్ళు తెలుసుకోవలసినవి ఇంకా ఎన్నో ఉంటాయి. ఈ ఆర్టికల్ లో క్రొత్తగా బ్లాగింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు తెలుసుకోవాల్సిన 7 ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం.
1) బ్లాగింగ్ ఈజీ కాదు
ముందుగా తెలుసుకోవాల్సిన విషయం బ్లాగింగ్ ఈజీ కాదు. అదేంటి ఎంతో మంది బ్లాగర్స్ బ్లాగింగ్ చాలా ఈజీ అని అన్నారు, మీరేంటి బ్లాగింగ్ ఈజీ కాదు అంటున్నారు ఆనుకుంటూ ఉన్నారా? అవును బ్లాగింగ్ ఈజీ కాదు. ఎందుకంటే ఈ 2020లో బ్లాగింగ్ చేయటం కష్టం.
ఎందుకంటే యూట్యూబ్ యాడ్సెన్స్ రూల్స్ మార్చిన తరువాత ఎక్కువ మంది బ్లాగింగ్ స్టార్ట్ చేస్తున్నారు. యూట్యూబ్ తో పోల్చితే బ్లాగింగ్ ద్వారా మనీ ఎర్న్ చేయటం ఈజీ. అంటే చాలా మంది బ్లాగర్స్ మీలాగే బ్లాగ్స్ స్టార్ట్ చేశారు.
ఒక సర్వే ప్రకారం ప్రతీ పది మందికి ఒక బ్లాగ్ ఉంది అంటే ఎంత కాంపిటీషన్ ఉందొ అర్థం చేసుకోవచ్చు. అందుకే నేను బ్లాగింగ్ ఈజీ కాదు అని అంటున్నాను. మీకు బ్లాగింగ్ ఈజీ అని చెప్పిన బ్లాగర్స్, చెప్పే బ్లాగర్స్ వాళ్ళు ఎప్పుడో ఇంత కాంపిటీషన్ లేని టైం లో బ్లాగ్స్ స్టార్ట్ చేసి ఇప్పుడు మనీ ఎర్న్ చేస్తున్నారు.
నేను బ్లాగింగ్ ద్వారా మనీ ఎర్న్ చేయటం కుదరదు అని చెప్పట్లేదు. కానీ కష్టం అని చెప్తున్నాను. ఒక స్ట్రాటజీ ప్రకారం వర్క్ చేయాలి. అలా చేయగలిగితేనే మీరు సక్సెస్ అవ్వగలరు.
2) బ్లాగింగ్ గోల్స్ పెట్టుకోవాలి
బ్లాగింగ్ స్టార్ట్ చేసిన తరువాత మీరు కొన్ని గోల్స్ పెట్టుకుని వర్క్ చేయాలి. ఒకవేళ మీకు కనుక గోల్స్ లేకపోతే మీరు ఎఫిషియెంట్ గా పని చేయలేరు. సక్సెస్ కాలేరు.
ఉదాహరణకి మీరు మీ బ్లాగ్ కోసం ఈ నెల ఒక 25 బ్లాగ్స్ రాయాలి అనుకోవచ్చు. మీ బ్లాగ్ కి 6 నెలల్లో రోజు 1000 మంది విజిటర్స్ రావాలి అని లేదా 3 నెలల్లో 1000 మంది సబ్స్క్రైబర్స్ రావాలి అని అనుకోవచ్చు.
ఇలా గోల్స్ పెట్టుకోవడం వలన మీరు మీ టార్గెట్ ని అచివ్ చేయటానికి ఇంకా బాగా వర్క్ చేయగలరు. ఒకవేళ మీకు కనుక గోల్స్ లేకపోతే మీకు ఏం చేయాలి, ఎలా వర్క్ చేయాలి అని అర్థం కాదు. కాబట్టి మీరు గోల్స్ పెట్టుకొని వర్క్ చేయాలి.
3) ప్రతిరోజూ క్రొత్త విషయాలు నేర్చుకోవాలి
మీరు ప్రతిరోజూ క్రొత్త విషయాలు నేర్చుకోవటానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే బ్లాగింగ్ అనేది ఒక సముద్రం. ఇందులో తెలుసుకోవలసినవి ఎన్నో ఉన్నాయి. అటువంటి వాటిని మీరు మీ బ్లాగ్ గోల్స్ కోసం నేర్చుకోవాలి.
ఉదాహరణకి మీ బ్లాగ్ కి వచ్చే ట్రాఫిక్ ఇన్‌క్రీస్ అవ్వాలి అంటే మీరు SEO చేయవలసి ఉంటుంది. SEO లో ఎన్నో విషయాలు ఉన్నాయి. వీటి ద్వారా మీ బ్లాగ్స్ సెర్చ్ ఇంజిన్ లో రాంక్ అవుతుంది. సెర్చ్ ఇంజిన్స్ లో రాంక్ అయితే మీకు ఆర్గానిక్ ట్రాఫిక్ వస్తుంది.
4) కేవలం మనీ ఎర్నింగ్ కోసమే బ్లాగింగ్ చేయకూడదు
90% మంది బ్లాగింగ్ స్టార్ట్ చేయటనికి మెయిన్ రీసన్ మనీ ఎర్నింగ్. నేను తప్పు అనను. కానీ బ్లాగింగ్ స్టార్ట్ చేసిన వెంటనే విలు మనీ ఎర్న్ చేయాలి అని అనుకుంటారు.
బ్లాగింగ్ గురించి వీళ్ళకి పెద్దగ ఏమి తెలియదు, సరిగ్గా బ్లాగ్ పోస్ట్స్ వ్రాయలేరు. వీళ్ళ బ్లాగ్ కి వచ్చే ట్రాఫిక్ కూడా చాలా చాలా తక్కువ ఉంటుంది.
వెంటనే వీళ్ళు యాడ్సెన్స్ నకి అప్లై చేయాలి అని అనుకుంటారు. దీని వల్ల బ్లాగింగ్ లో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా ప్యాషన్ తో బ్లాగింగ్ చేస్తే ఈ రోజు కాకపోయినా రేపు అయినా ఖచ్చితంగామనీ ఎర్న్ చేస్తారు.
5) రెగ్యులర్ గా బ్లాగింగ్ చేయాలి
చాలామంది బిగినర్స్ చేసే అతిపెద్ద తప్పు రెగ్యులర్ గా బ్లాగింగ్ చేయకపోవటం. మీరు బ్లాగింగ్ లో సక్సెస్ కావాలి అంటే రెగ్యులర్ గా మీరు బ్లాగింగ్ చేయాలి. మీరు ఏ ప్యాటర్న్ ఫాలో అయితే దాని ప్రకారం రెగ్యులర్ గా బ్లాగింగ్ చేయాలి.
ఉదాహరణకి మీరు రెండు రోజులకి ఒక బ్లాగ్ రాస్తుంటే ఖచ్చితంగా రాయాలి. అదే మీరు వారనికి ఒక బ్లాగ్ రాస్తుంటే అసలు మిస్ అవ్వకుండా బ్లాగ్స్ రాయాలి. కానీ నా సలహా మీరు కనుక క్రొత్త బ్లాగర్ అయితే ప్రతీ రోజు ఒక బ్లాగ్ పోస్ట్ రాయండి. (అవకాశం ఉంటె.)
6) ప్రతీ బ్లాగ్ కామెంట్ కి రిప్లై ఇవ్వాలి
మీ బ్లాగ్ పోస్ట్‌లకి వచ్చే కామెంట్స్ కి రిప్లై ఇవ్వండి. ఇలా చేయటం వలన మీకు మీ విజిటర్ కి మంచి రేలషన్ ఏర్పడుతుంది. అంతే కాకుండా మీ రీడర్ మిమ్మల్ని త్వరగా నమ్మటానికి అవకాశం ఉంటుంది. చాలా మంది బ్లాగర్స్ ఈ విషయాన్నీ అసలు పట్టించుకోరు.
7) యునిక్ కంటెంట్ క్రియేట్ చేయాలి
అన్నింటికన్నా ముఖ్యమైనది మీరు ఒర్గినల్ కంటెంట్ క్రియేట్ చేయాలి. బ్లాగింగ్ స్టార్ట్ చేసిన క్రొత్తలో కాపీ కంటెంట్ (సహజంగా) పోస్ట్ చేసే ప్రమాదం ఎక్కువగా ఉంది.
అలా కాకుండా కుదిరినంత వరకు మీరు ఓన్ గా కంటెంట్ ప్రిపేర్ చేసుకోండి. దీని వల్ల మీ బ్లాగ్ కి సెర్చ్ ఇంజిన్స్ కి మీ బ్లాగ్ పైన మంచి ఇంప్రెషన్ ఉంటుంది. మీకు బెటర్ ర్యాంకింగ్స్ ఇవ్వటానికి అవకాశం ఉంటుంది.
ఈ విషయాలు ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు కొంచెం నిదానంగా అయినా సక్సెస్ అవుతారు. లాంగ్ రన్ లో బ్లాగింగ్ ఇండస్ట్రీలో ఎక్కువకాలం ఉంటారు.
కాబట్టి ఈ 7 విషయాలు కొత్తగా బ్లాగింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. మీకు ఏమన్నా డౌట్ ఉంటె కామెంట్ చేయండి. ఈ బ్లాగ్ పోస్ట్ మీకు నచ్చితే షేర్ చేయండి.
ఒక్క నిమిషం … ఇంకొక్క నిమిషం చదవండి
✅ బ్లాగ్స్ ఎవరైనా క్రియేట్ చేస్తారు. కానీ ఒక సక్సెస్ ఫుల్ బ్లాగ్ ని కొంత మంది 👨💼 మాత్రమే క్రియేట్ చేయగలరు.
✅ అటువంటి వారిలో హర్ష్ అగర్వాల్, దీపక్ కనకరాజు, సౌరవ్ జైన్, తెలుగులో స్మార్ట్ తెలుగు రవి కిరణ్ గారు….ఇలా ఎంతో మంది బ్లాగింగ్ ద్వారా మంచి పోసిషన్స్ లో ఉన్నారు.
💥 మరి మీ సంగతి ఏంటి 🤔 ?
💥 మీకు తెలుసా? ఒక సక్సెస్ ఫుల్ బ్లాగ్ వలన కలిగే బెనిఫిట్స్ ఏంటో తెలుసా?
➡️ బ్లాగింగ్ ద్వారా మీకు నచిన టైంలో పని చేయవచ్చు.
➡️ బ్లాగింగ్ ద్వారా మీకు ఆర్థిక స్వతంత్రం లభిస్తుంది.
➡️ బ్లాగింగ్ ద్వారా మీరు ఒక మంచి కెరీర్ లో సెటిల్ అవ్వవచ్చు
➡️ బ్లాగింగ్ కి ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు.
➡️ ఇలా ఇంకా ఎన్నో…
💻 మరి ఒక సక్సెస్ ఫుల్ బ్లాగ్ ని క్రియేట్ చేయటం ఎలా 🧐?
💥 నేను VJ. నేను 2014 నుండి బ్లాగింగ్ ఇండస్ట్రీ లో ఉన్నాను. స్పోర్ట్స్ బ్లాగ్, విషెస్ బ్లాగ్, వాల్ పేపర్స్ బ్లాగ్, ఈవెంట్ బ్లాగింగ్, టెక్నికల్ బ్లాగ్ ఇలా ఎన్నో బ్లాగ్స్ ని రన్ చేశాను.
🔥 నా కెరీర్ స్టార్టింగ్ లో సరైన గైడెన్స్ లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మన దగ్గర ఇప్పుడిప్పుడే బ్లాగింగ్ గురించి అవగాహన్ వస్తుంది.
⭐ అటువంటి వారికీ హెల్ప్ చేయాలి అనే ఉదేశ్యంతో నేను ఒక ఈబూక్ వ్రాసాను. ఆ ఈబూక్ ఒక సక్సెస్ ఫుల్ బ్లాగ్ ని క్రియేట్ చేయటం ఎలా?
⚡⚡ ఈ ఈబూక్ లో మీరు ఒక సక్సెస్ ఫుల్ బ్లాగ్ ని క్రియేట్ చేయటానికి 7 స్టెప్స్ చెప్పటం జరిగింది. ఈ సెవెన్ స్టెప్స్ తో మీరు కూడా ఒక సక్సెస్ ఫుల్ బ్లాగ్ ని క్రియేట్ చేసి సక్సెస్ అవ్వవచ్చు. ఈ ఈబూక్ బిగినర్ ఫ్రెండ్లీగా ఉంటుంది.
🔥🔥 ఈ లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది ఆర్థిక పరిస్థితి బాగా దిగజారింది. అందుకోసం 999/- విలువ కలిగిన ఈ ఈబూక్ ని 90% ఆఫర్ కి ఇస్తున్నాను. ఇప్పుడే మీ ఈబూక్ ని డౌన్లోడ్ చేసుకోండి.
ఇప్పుడే మీ ఈబూక్ తీసుకోండి
- Website Design Formula for Small Businesses - October 27, 2021
- Digital Marketers Meetup in Hyderabad in 2021 - September 1, 2021
- How to Write Viral Blog Posts in Telugu - August 12, 2021