Always VJ

2020లో ఎలాంటి బ్లాగ్ పోస్టుల ద్వారా మీ బ్లాగ్ కి ట్రాఫిక్ పెరుగుతుంది?

Spread the love

Which blog posts increase blog traffic in Telugu

ఎలాంటి బ్లాగ్ పోస్టుల ద్వారా మీ బ్లాగ్ కి ట్రాఫిక్ పెరుగుతుంది?

ప్ర‌తీ ఒక్క బ్లాగ‌ర్ కు ట్రాఫిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ బ్లాగర్ అయినా తను రాసిన బ్లాగ్ పోస్ట్ ల ద్వారా మంచి ట్రాఫిక్ రావాల‌ని అనుకుంటాడు. మీరు కూడా అలాగే అనుకుంటున్నారా..?

అయితే ఈ బ్లాగ్ పోస్ట్ మీకోసమే. ఎలాంటి బ్లాగ్ పోస్ట్ రాస్తే ట్రాఫిక్ వ‌స్తుంద‌నే  టాపిక్ గురించి ఈ బ్లాగ్ పోస్ట్ లో తెలుసుకుందాం.

Which blog posts increase blog traffic in telugu

సాదారణంగా మీ బ్లాగ్ కి ట్రాఫిక్ రావాలి అంటేముఖ్యంగా 3 రకాల బ్లాగ్ పోస్ట్స్ మీరు మీ బ్లాగ్ లో రాయాలి. అవి:

Which blog posts increase blog traffic in Telugu

1) How to blog posts & Tutorials Blog Posts

2) Interview Blog Posts

3) Review Blog Posts

ఒక్కసారి వాటి గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం.

1) How to blog posts & Tutorials Blog Posts

How to blog posts

How to బ్లాగ్ పోస్ట్ లు అంటే, మీకు ఏదైనా ఇన్ఫ‌ర్మేష‌న్ కావాలంటే గూగుల్ లో సెర్చ్ చేస్తారు. ఉదాహ‌ర‌ణ‌కు బ‌రువు పెర‌గాల‌న్నా, బ‌రువు త‌గ్గాల‌న్నా, మంచి ఫుడ్ ఐట‌మ్ ను కుక్ చేయాల‌న్నా ముందుగా మీరు గూగుల్ లో సెర్చ్ చేస్తారు.

అవునా, మరి ఏమని సెర్చ్ చేస్తారు? How to cook biryani, how to cook chicken curry, how to loss weight అని ఇలా సెర్చ్ చేస్తారు. ఇలాంటి బ్లాగ్ పోస్ట్ లు రాయ‌డం వ‌ల్ల మ‌నం రాసే బ్లాగ్ పోస్ట్ లైఫ్ స్పాన్ లాంగ్ ర‌న్ లో ఎక్కువ కాలం ఉంటుంది. దీని వ‌ల్ల మీ బ్లాగ్ కు లాంగ్ రన్ లో ట్రాఫిక్ పెరిగిపోతుంది.

ట్యూటోరియ‌ల్ బ్లాగ్ పోస్ట్ లు

How to కేట‌గిరిలో నేను రాసిన How to register a Domain, How to create a WordPress blog in Telugu ఇలా  tutorial  బ్లాగ్ పోస్ట్ లు రాయ‌డం వ‌ల్ల మీ బ్లాగ్ పోస్ట్ లు ఎవ‌ర్ గ్రీన్ గా ఉంటుంది.

అప్ డేట్స్ వ‌స్తే మొత్తం బ్లాగ్ పోస్ట్ లు ఎడిట్ చేయాల్సిన అవ‌స‌రం లేకుండా కొద్దిగా ఎడిట్ చేసి అప్ డేట్ చేస్తే మీ బ్లాగ్ కి మంచి ట్రాఫిక్ వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది.

2) Interview Blog Posts

ప్ర‌తీ ఇండ్ర‌స్టీలో సెక్సస్ పీపుల్ ఉంటారు. ఉదాహ‌ర‌ణ‌కు యూట్యూబ్ క్రియేట‌ర్స్, డిజిటల్ మార్కెట‌ర్స్, కుకింగ్ ఇలా ప్ర‌తీ ఇండ‌స్ట్రీలో రూట్ లెవ‌ల్ నుంచి  క‌ష్ట‌ప‌డుతూ స‌మాజంలో త‌న‌కంటూ ప్ర‌త్యేక  గుర్తింపు పొందిన పీపుల్స్ గురించి బ్లాగ్ పోస్ట్ లు రాయండి.

అలా రాయ‌డం వ‌ల్ల మీ బ్లాగ్ ను ఫాలో అయ్యే రీడర్స్ కు మంచి కంటెంట్ ను అందించిన వార‌వుతారు. ఈ కంటెంట్ కు లాంగ్ ర‌న్ లో మంచి ట్రాఫిక్  ఉంటుంది. దీంతో పాటు మంచి ర్యాంకింగ్స్  ను పొందవ‌చ్చు.

3) Review Blog Posts

మీరు ఏదైనా ప్రాడ‌క్ట్ గురించి, స‌ర్వీస్ కు గురించి రివ్యూస్ రాయండి. దీంతో పాటు మీరు రాసే కంటెంట్ గురించి ఇంత‌కు ముందే ఎక్స్ ప‌ర్ట్స్ రాసి ఉంటే , వాళ్లు రాసిన రివ్యూ పోస్ట్ ల గురించి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు రివ్యూలు రాయండి.

అలా రివ్యూస్ రాయ‌డం వ‌ల్ల సెర్చ్ స్ కు మీ బ్లాగ్ పోస్ట్ ను గూగుల్ స‌జెస్ట్ చేస్తుంది. దీంతో పాటు మీరు వీక్లీ రివ్యూలు రాయండి. ఉదాహ‌ర‌ణ‌కు టెక్ రిలేటెడ్ బ్లాగ్స్ అయితే కొత్త కొత్త స్మార్ట్ ఫోన్స్ విడుద‌ల చేస్తున్నారు.

వాటి గురించి రివ్యూ రాయండి. వారంలో ఎంత సేల్ అయ్యాయి? ఏఏ కంట్రీలో ఎంత సేల్ అయ్యాయి? వాటి ఫీచ‌ర్స్ ఏంట‌నేది మీరు రివ్యూ రాయండి.

మీరు ఏదైనా ఒక హెల్త్ ప్రోగ్రాం లో జాయిన్ అయ్యారు. ఆ ప్రోగ్రాం ఎలా ఉంది? ఆ ప్రోగ్రాం యూస్ చేయటం వలన మీకు కలిగిన బెనిఫిట్స్ ఏంటి? ఇలాంటివి. వీటి వల్ల ఆ ప్రోగ్రాం తీసుకోవాలా, వద్దా అని అనుకునేవారు మీ రివ్యూ ద్వారా ఒక నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి వాళ్ళు రెగ్యులర్ గా మీ బ్లాగ్ కి వస్తూంటారు.

మీరు కూడా ఈ మూడు రకాల బ్లాగ్ పోస్ట్స్ మీ బ్లాగ్స్ లో రాసి మీ బ్లాగ్ ట్రాఫిక్ ని పెంచుకోండి. ఇందులో చెప్పిన 3 రకాల బ్లాగ్ పోస్టుల ద్వారా లాంగ్ రన్ లో కూడా మీకు ట్రాఫిక్ వస్తుంది. సక్సెస్ ఫుల్ బ్లాగర్స్ ఈ మూడు ప‌ద్ద‌తుల్ని ఫాలో అయ్యి బ్లాగ్ పోస్ట్ లు రాసి ఎక్కువ ట్రాఫిక్ తెచ్చుకుంటారు.

ఇది అండి ఈ బ్లాగ్ పోస్ట్. మీరు ఎలాంటి బ్లాగ్ పోస్ట్స్ రాస్తున్నారు అని నాకు తెలుసుకోవాలి ఉంది. మీరు ఎలాంటి బ్లాగ్ పోస్ట్స్ రాస్తున్నారు అని కామెంట్ చేయండి. ఈ బ్లాగ్ పోస్ట్స్ కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, ఎందుకంటె Sharing is Caring 💓 కదా.

Exit mobile version