Always VJ

What is Google Analytics in Telugu

Spread the love

What is Google Analytics in Telugu?

మనం మొదటి నుండి డిజిటల్ మార్కెటింగ్ లో ప్రతిది మేసర్బుల్ (Measurable) అని చెపుకుంటున్నాం కదా! అసలు ఎలా measure చేస్తాం? మన వెబ్ సైట్ డిజైన్ చేసిన తరువాత మన వెబ్ సైట్ కి ఎంతమంది వస్తున్నారు? ఎంతమంది మన ప్రోడక్ట్ లేదా సర్వీస్ ని కొంటున్నారు? సోషల్ మీడియా ద్వారా ఎంత మంది వస్తునారు? ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ పోస్టులో తెలుసుకుందాం!

What is Google Analytics in Telugu

What is Google Analytics in Telugu?

డిజిటల్ మార్కెటింగ్ లో మన వెబ్ సైట్ కి ఎంత మంది వస్తున్నారు? facebook లో ఇచ్చిన ad
ద్వారా ఎంతమంది మన వెబ్ సైట్ లో రిజిస్టర్ అయ్యారు? YouTube వీడియో చేయడం ద్వారా మనకి ఎంత వెబ్ సైట్ traffic వచ్చింది? ఇలాంటివి అన్ని తెలుసుకోవటానికి మనకి ఒక ఫ్రీ టూల్ ఉంది. అదే Google Analytics (గూగుల్ అనలిటిక్స్).
అవును గూగుల్ వాళ్లు అందించే ఈ ఫ్రీ టూల్ డిజిటల్ మార్కెటింగ్ లో అత్యంత ముఖ్యమైనది. దీనీ ద్వారా మనం పైన చెప్పినట్టు ఒక వెబ్ సైట్ (మన)కి ఎంత మంది విసిటర్స్ వచ్చారో తెలుసుకోవచ్చు. మన వెబ్ సైట్ లో ప్రతీ యాక్షన్ ని గూగుల్ కనిపెడుతుంది.
మనకి హెల్ప్ చేస్తుంది
. గూగుల్ అనలిటిక్స్ అకౌంట్ create చేసుకోవటం, ఒక వెబ్ సైట్ ని అందులో ఇంటిగ్రేట్ చేయటం అనేవి చాలా ఈజీ. అలాగే ఈ టెక్నాలజీ ని అర్థం చేసుకోవటం కూడా చాలా ఈజీ. గూగుల్ అనలిటిక్స్ పై మనకి అవగాహనా వస్తే, మిగితా platforms కి సంభందించిన అనలిటిక్స్ కూడా ఈజీ గా అర్థం అవుతాయి.
ఇందులో మనం గోల్స్ సెట్ చేసుకొని, వాటిని మనం ఎలా రీచ్ అవ్వాలో, మన బిజినెస్ స్ట్రాటజీ ఎలా అప్లై చేయాలి అని నిర్ణయించుకోవచ్చు. సోషల్ మీడియా లో ప్రమోట్ చేసిన ad ద్వారా ఎంత మంది మన వెబ్ సైట్ ని విసిట్ చేసారు అనేది కూడా మనం తెలుసుకోవచ్చు.
అప్పుడు ఏ platform నుండి మన వెబ్ సైట్ కి traffic వస్తుందో చూసుకొని, మనం ఆ platform పైన ఇంకా ఫోకస్ చేయటానికి అవకాశం ఉంటుంది. గూగుల్ అనలిటిక్స్ లో మనకి మన వెబ్ సైట్ ఏ ఏ ఏజ్ గ్రూప్స్ వాళ్లు చూసారు, జెండర్ వైస్ గా ఎంత మంది చూసారు, రెగ్యులర్ విసిటర్స్ ఎంత మంది, క్రొత్తగావస్తున్నా విసిటర్స్ ఎంతమంది, ఏ ప్రోడక్ట్ లేదా సర్వీస్ కోసం ఎక్కువమంది మన వెబ్ సైట్ కి వస్తున్నారు అనే ఎన్నో విషయాలను మనం అర్థం చేసుకోవచ్చు.
మొబైల్ లో ఎంత మనది విసిట్ చేస్తున్నారు, కంప్యూటర్ లో ఎంత మంది విసిట్ చేస్తున్నారు, ఏ దేశం నుండి ఎంతమంది చూస్తున్నారు ఇలాంటివి కూడా మనం తెలుసుకోవచ్చు. గూగుల్ అనలిటిక్స్ ని అర్థం చేసుకోవటం చాలా ఈజీ.
ఈ పోస్టులో గూగుల్ అనలిటిక్స్ ని ఎందుకు వాడతారో మాత్రమే చెప్పగాలిగాం. మరిన్ని వివరాలకి ఈ వీడియో చుడండి.

ముందు ముందు కంప్లీట్ గూగుల్ అనలిటిక్స్ పై పూర్తీ గా ఆర్టికల్స్ వ్రాయటం జరుగుతుంది. మళ్ళి మరొక పోస్ట్ తో మీ ముందుకు వస్తాం.

TENGLISH

What is Google Analytics in Telugu

Manam modati nundi digital marketing lo pratidi measurable ani cheppukuntunnam kada! Asalu yela measure chestam? Mana website design chesina taruvata mana website ki yentha mandi vastunnaru? Yenta mandi mana product leda service ni kontunnaru? Social media dwara yentha mandi vastunnaru? Ilanti yenno vishayala gurinchi ee post lo telusundam!

What is Google Analytics in Telugu?

Digital marketing lo mana website ki yentha mandi vastunnaru? Facebook lo ichina ad dwara yenthamandi mana website lo register ayyaru? YouTube video cheyadam dwara manaki yentha website traffic vachindi? Ilantivi anni telusukovataniki manaki oka free tool undi. Ade Google Analytics. Avunu google vallu andinche ee free tool digital marketing lo chala chala important.
Dini dwara manam paina cheppinattu oka website (mana) ki yentha mandi visitors vacharo telusukovachu. Mana website lo prati action ni google kanipedutundi. Manaki help chestundi. Google Analytics account create chesukovatam, oka website ni andulo integrate cheyatam anevi chala easy. Alage ee technology ni artham chesukovatam kooda chala easy. Google Analytics pai manaki avagahana vaste, migitha platforms ki sambandhinchina analytics kooda easy ga artham avutayi.
Indulo manam goals set chesukoni, vatini manam yela reach avvalo, mana business strategy yela apply cheyali ani niernayinchukovachu. Social Media lo promote chesina ad dwara yentha mandi mana website ni visit chesaru anedi kooda manam telusukovachu. Appudu ye platform nundi mana website ki traffic vastundo chusukoni, manam aa platforms paina inka focus cheyataniki avakasam untundi.
Google Analytics lo manaki mana website yeye age groups vallu chusaru, gender wise ga yentha mandi chusaru, regular ga yentha mandi, kotha ga vastunna visitors yentha mandi, ye product leda service kosam yekkuava mandi mana website ki vastunnaro ane yenno vishayalanu manam artham chesukovachu. Mobile lo yentha mandi visit chestunnaru, computer lo yentha mandi visit chestunnaru, ye desam nundi yetha mandi chustunnaru, ilantivi kooda manam telusukovachu. Google Analytics ni yenduku vadataro matrame cheppagaligam. Mundu mundu complete google analytics pai complete ga articles wrayatam jarugutundi. Malli maroka post tho mi munduku vastam.
Exit mobile version