Always VJ

Top Hosting Providers in Telugu

Spread the love

Top Hosting Providers in Telugu

ఒక బ్లాగ్ లేదా వెబ్ సైట్ కి డొమైన్ ఎంత అవసరమో వెబ్ హోస్టింగ్ కూడా అంతే అవసరం. వెబ్ హోస్టింగ్ గురించి చాలా మంది లైట్ తీసుకుంటారు. ఏదో ఒకటి తీసుకుందాంలే అనుకుంటారు. కానీ అది తప్పు.

వెబ్ హోస్టింగ్ అనేది ఉంటేనే మీ ఆన్లైన్ ప్రేసేన్స్ అనేది ఉంటుంది. అసలు ఈ వెబ్ హోస్టింగ్ అంటే ఏంటి? ఈ వెబ్ హోస్టింగ్ ఎలా తీసుకోవాలి? ఎవరి వద్ద నుండి తీసుకోవాలి? అని ఈ బ్లాగ్ పోస్ట్ లో డీటెయిల్ గా తెలుసుకుందాం.

వెబ్ హోస్టింగ్ అంటే ఏంటి?

ఇంటర్నెట్ లో మన కస్టమర్స్ లేదా యూసర్స్ మన బ్లాగ్ లేదా వెబ్ సైట్ లేదా ఆన్లైన్ స్టోర్ కి సంబంధించిన ఫైల్స్, ఇమేజ్స్, వీడియోస్ ఇలా ఇంటర్నెట్ లో చూడాలి అనుకుంటే మనం వాటిని ఇంటర్నెట్ లో ఎక్కడో ఒక చోట స్టోర్ చేయాలి. అలా స్టోర్ చేసే ప్లేస్ ఏదైతే ఉందొ దానినే వెబ్ హోస్టింగ్ అంటారు.

వెబ్ హోస్టింగ్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?

డొమైన్ ని ఏ విధంగా అయితే డొమైన్ రిజిస్ట్రార్ లా నుండి తీసుకోవాలి అనే తెలుసు కదా! అదే విధంగా వెబ్ హోస్టింగ్ సర్వీస్ ప్రొవైడర్స్ నుండి మనకి కావాల్సిన హోస్టింగ్ ప్యాకేజ్స్ తీసుకోవచ్చు.

మనకి వెబ్ హోస్టింగ్ కోసం కూడా GoDaddy యాడ్స్ వస్తుంటాయి. తక్కువ ప్రైస్ కే మీరు మీ బిజినెస్ ని ఆన్లైన్ కి తీసుకురావచ్చు అని. వెబ్ హోస్టింగ్ కోసం కూడా అనేక సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు. Vapourhost, Siteground, BlueHost, Go Green Geeks, GoDaddy, Bigrock, Namecheap,Hostgator, Hostinger ఇలా ఇంకా ఎన్నో వెబ్ హోస్టింగ్ కంపెనీస్ ఉన్నాయి.

మనం మన బ్లాగ్ లేదా వెబ్ సైట్ కోసం వెబ్ హోస్టింగ్ ని ఒక సంవత్సరానికి రిజిస్టర్ చేసుకోవాలి. (కొన్ని కంపెనీలు ఇంకా తక్కువ టైం కూడా ఆఫర్ చేస్తున్నాయి.) తరువాత వీటిని కూడా ఖచ్చితంగా రెన్యువల్ చేసుకోవాలి. ఈ విషయం మర్చిపోకూడదు. ఎందుకంటె ఎవరైనా ఖచ్చితంగా డొమైన్ అదే విధంగా వెబ్ హోస్టింగ్ లని రెన్యువల్ చేసుకోవాలి.

వెబ్ హోస్టింగ్ ప్యాకేజ్స్ :

వెబ్ హోస్టింగ్ కంపెనీస్ మనకి అనేక రకాల ప్యాకేజ్స్ అందిస్తుంటాయి. వీటిల్లో మనం మన అవసరాన్ని బట్టి స్పేస్, బ్యాండ్ విడ్త్, అదే విధంగా సపోర్ట్ ఇలా ప్యాకేజ్స్ తీసుకోవచ్చు.  ఒక్కో కంపెనీ ఒక్కో రకంగా ఈ ప్యాకేజ్స్ ప్రోవైడ్ చేస్తుంటాయి. ఇందులో మన హోస్టింగ్ సర్వర్ స్పీడ్ కూడా ముఖ్యమే. ఎందుకంటె మీ బ్లాగ్ సర్వర్ స్పీడ్ కూడా SEO లో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది.

టాప్ హోస్టింగ్ ప్రొవైడర్స్

Vapourhost

Vapourhost అనేది ఒక చిన్న వెబ్ హోస్టింగ్ కంపెనీయే అయిన మంచి సర్వీస్ ని ప్రోవైడ్ చేస్తుంది. నేను పర్సనల్ గా ఈ బ్లాగ్ కోసం దీనిని యూస్ చేస్తున్నాను. నేను ఒక సంవత్సరంన్నర నుండి ఉపయోగిస్తున్నాను.

Top Hosting Providers in Telugu

ఈ సర్వీస్ నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ఎవరైతే డబ్బులు వెబ్ హోస్టింగ్ కోసం ఖర్చు చేయలేరో అటువంటి వారికీ అత్యంత తక్కువ ప్రైస్ కి వెబ్ హోస్టింగ్ సర్వీస్ ప్రోవైడ్ చేస్తున్నారు.

అంతే కాకుండా బిల్లింగ్ కూడా మినిమం ఒక నెల నుండి స్టార్ట్ అవుతుంది, అందువల్ల ఎటువంటి అదనపు ఛార్జ్లు కూడా ఏమి లేవు. అంతే కాకుండా మంచి స్పీడ్ గా కూడా ఉంటుంది. నాకు తెలిసి బిగినర్స్ కి ఇది పర్ఫెక్ట్ గా సరిపోతుంది.

అందుకే నేను ఈ Vapourhost వెబ్ సర్వీస్ ని ఫస్ట్ చెప్తున్నాను.

Vapourhost వెబ్ హోస్టింగ్ రిజిస్టర్ చేసుకోవటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Namecheap

Namecheap డొమైన్ రిజిస్ట్రేషన్ కి బాగా ఫేమస్. కానీ వీళ్ళు వెబ్ హోస్టింగ్ సర్వీసెస్ ని కూడా ప్రోవైడ్ చేస్తున్నారు. Namecheap డొమైన్స్ ఎంత బాగుంటాయి అదే విధంగా వెబ్ హోస్టింగ్ కూడా బాగుంటుంది.

ఇందులో మనకి అనేక రకాల ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. స్తర్తింగ్ ప్లాన్ లో మనం 3 వెబ్ సైట్స్ హోస్ట్ చేయవచ్చు. 20 gb స్పేస్ మనకి లభిస్తుంది. ఇయర్లీ ప్లాన్ తీసుకుంటే కొన్ని రకాల డొమైన్ ఎక్స్టెన్షన్లు ఫ్రీగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

Namecheap ఫస్ట్ ఇయర్ 50% ఆఫర్ కూడా ప్రోవైడ్ చేస్తున్నారు.  అంతే కాకుండా అన్లిమిటెడ్ బ్యాండ్విడ్త్, ఫ్రీ ssl సర్టిఫికేట్ ఫ్రీ వెబ్ సైట్ బిల్డర్ ఇలా ఎన్నో ఆప్షన్స్ అందిస్తున్నారు.

కస్టమర్ సపోర్ట్ కూడా బాగుంటుంది.

Namecheap వెబ్ హోస్టింగ్ రిజిస్టర్ చేసుకోవటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Hostinger

Hostinger కూడా ఒక పాపులర్ వెబ్ హోస్టింగ్ కంపెనీ. Hostinger లో మనం వెబ్ హోస్టింగ్ స్టార్టింగ్ ప్యాకేజ్ లో మనకి 50% ఆఫర్ కే అంటే నెలకి 99 రూపాయలకే ఇస్తున్నారు. ఈ ప్లాన్ లో మనం ఒక వెబ్ సైట్ ని హోస్ట్ చేయగలం. ఒక ఈమెయిలు ఐడి, పదివేల మంది విజిటర్స్, ఉన్నాయి కాకపోతే ఇవి లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి.

కానీ అదే ప్రీమియం వెబ్ హోస్టింగ్ ప్లాన్ ఇంకా బాగుంటుంది. దాదాపుగా 100 వెబ్ సైట్స్, ఇంకా ఎన్నో ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ వెబ్ హోస్టింగ్ టెస్టింగ్ కోసం మేం మా బ్లాగ్స్ ఒక దానికి దీనిని యూస్ చేస్తున్నాం. చాలా మంచి సర్వీస్ ఇది. ఇయర్లీ ప్లాన్ తీసుకుంటే 43% డిస్కౌంట్ లభిస్తుంది.

కొంచెం ఎఫర్ట్ చేయగలిగితే Hostinger వెబ్ హోస్టింగ్ తీసుకోవచ్చు.

Hostgator

Hostgator కూడా ఒక మంచి వెబ్ హోస్టింగ్ కంపెనీ. ఇందులో మనం స్టార్టింగ్ ప్లాన్ తీసుకుంటే 20% డిస్కౌంట్ లభిస్తుంది. అంతే కాకుండా .net డొమైన్ ఫ్రీ గా రిజిస్టర్ చేసుకోవచ్చు.  అయితే ఈ ప్లాన్ లో ఒక వెబ్ సైట్ మాత్రమే మనం హోస్ట్ చేయగలం. కొన్ని లిమిట్స్ ఉన్నాయి.

కానీ ఇందులోనే Baby ప్లాన్ ఉంది. ఇది కొంచెం కాస్ట్లీ నే కాకపోతే అన్లిమిటెడ్ డొమైన్స్, అన్లిమిటెడ్ స్పేస్, ఇలా అన్ని కూడా అన్లిమిటెడ్ గా ఉంటాయి. ఫ్రీ SSL సర్టిఫికేట్ కూడా లభిస్తుంది.

Hostgator వెబ్ హోస్టింగ్ రిజిస్టర్ చేసుకోవటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

GoDaddy

GoDaddy మనకి పరిచయం అక్కరలేని కంపెనీ. ఎందుకంటె మనకి టీవీల్లో కూడా యాడ్స్ వస్తుంటాయి కదా. GoDaddy వెబ్ హోస్టింగ్ అనేది చాలా మంది తెలియక తీసుకుంటారు. GoDaddy స్టార్టింగ్ ప్లాన్ లో మనం ఇయర్లీ ప్లాన్ లో 15% డిస్కౌంట్ లభిస్తుంది. కాకపోతే మనకి వాళ్ళు ఈ ప్యాకేజ్ లో అందించే ర్యాం చాలాచాలా తక్కువ.

 

డీలక్స్ ప్లాన్ లో మనకి అన్లిమిటెడ్ వెబ్ సైట్స్, ఇలా అదనపు ఫీచర్స్ అందిస్తున్నాయి. అయితే ఇది మనం ఇంతకూ ముందు చెప్పుకున్న వాటితో పోల్చుకుంటే కొంచెం ఎక్కువే అని చెప్పాలి.

అంతే కాకుండా రెన్యువల్స్ కూడా ఎక్కువ ప్రైస్ ఉన్నాయి. కానీ GoDaddy అందించే సపోర్ట్  మాత్రం అల్టిమేట్.

Bigrock

Bigrock కూడా ఒక పాపులర్ డొమైన్ రిజిస్ట్రార్. అంతే కాకుండా మనకి హోస్టింగ్ సర్వీసెస్ కూడా అందిస్తున్నారు.  Bigrock అందించే వెబ్ హోస్టింగ్ స్టార్టింగ్ ప్లాన్ లో ఒక వెబ్ సైట్ హోస్ట్ చేయవచ్చు. 20gb స్పేస్, 100 gb బ్యాండ్విడ్త్, ఫ్రీ ssl సర్టిఫికేట్ ఇలా మంచి సర్వీస్ అందిస్తున్నారు.

అలా కాకుండా అన్లిమిటెడ్ ఆప్షన్స్ కావాలి అనుకుంటే Pro ప్లాన్ తీసుకోవాలి. ఇయర్లీ ప్లాన్ తీసుకుంటే మనకి 5% డిస్కౌంట్ మాత్రమే వీళ్ళు అందిస్తున్నారు. అయితే ఇది కూడా కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది.

SiteGround

SiteGround వెబ్ హోస్టింగ్ లో ఒకప్పుడు మకుటం లేని మహారాజుగా వెలుగొందిన కంపెనీ. కాకపోతే ఈ మధ్య వెబ్ హోస్టింగ్ ప్రైస్ బాగా పెంచటం వలన మన రేస్ లో వెనుకపడి పోయింది.

SiteGround స్టార్టింగ్ ప్లాన్ లో ఒక వెబ్ సైట్, 10 gb స్పేస్, నెలకి పదివేల మంది విజిటర్స్, ఇలా కొన్ని లిమిటెడ్ ఫీచర్స్ ఉన్నాయి.

అదే GrowBig ప్లాన్ కనుక చూసుకుంటే ఇందులో మనకి 20gb స్పేస్ ఇచ్చినా అన్లిమిటెడ్ వెబ్ సైట్స్ హోస్ట్ చేయవచ్చు. నెలకి పాతికవేలమంది విజిటర్స్, ఫ్రీ ssl ఇలా ఫీచర్స్ అందిస్తున్నాయి.

ఇప్పుడు SiteGround ప్రైసింగ్ బాగా పెరిగింది కాబట్టి నేను దిన్ని పెద్దగ ఎవరికీ రెఫెర్ చేయటం లేదు. కానీ కాస్ట్ ఎక్కువ అయిన పర్లేదు అనుకుంటే కళ్ళు మూసుకుని SiteGround తీసుకోవచ్చు. ఎందుకంటె అంత బాగుంటుంది కాబట్టి.

Bluehost

Bluehost ఒకప్పుడు ఎవరి నోట విన్న ఇదే పేరు. కానీ వెబ్ హోస్టింగ్ కంపెనీలు, వాటి మధ్య పోటి వాతావరణం పెరిగిపోవటం తో కొంచెం Bluehost వెనుకపడింది. Bluehost కూడా మంచి సర్వీస్ అందించే కంపెనీ.

 

మొట్టమొదట ఫ్రీగా .com డొమైన్ ఇస్తున్నారు అని ప్రోమోట్ చేసిన కంపెనీ Bluehost. ఇక ప్రైసింగ్ విషయానికి వస్తే స్టార్టింగ్ ప్లాన్ లో ఒక వెబ్ సైట్ కి 50gb స్పేస్, అన్లిమిటెడ్ బ్యాండ్విడ్త్, ఫ్రీ ssl సర్టిఫికేట్ ఇలా ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి, పర్లేదు.

అదే మనకి అన్లిమిటెడ్ వెబ్ సైట్స్ హోస్ట్ చేసుకోవాలి అనుకుంటే Plus ప్లాన్ తీసుకోవచ్చు. ఇది కూడా కొంచెం ప్రైస్ ఎక్కువే ఉంటుంది.

Green Geeks

Green Geeks అనేది SiteGround ప్రైసింగ్ బాగా పెంచిన తరువాత బాగా పాపులర్ అయ్యింది. ఇందులో మనకి స్టార్టింగ్ ప్లాన్ లో ఒక వెబ్ సైట్ కి అన్లిమిటెడ్ స్పేస్, బ్యాండ్విడ్త్, ఫ్రీ ssl సర్టిఫికేట్ ఇలా అనేక ఫీచర్స్ అందిస్తుంది. ఫ్రీగా డొమైన్ ఇస్తున్నారు.

అదే మనం ఇంకా మంచి ప్లాన్ తీసుకోవాలి అనుకుంటే Pro ప్లాన్ తీసుకోవచ్చు. ఇందులో అన్లిమిటెడ్ వెబ్ సైట్స్ హోస్ట్ చేసుకోవచ్చు. మిగిలిన ఫీచర్స్ అన్ని స్టార్టర్ ప్లాన్ లో ఉన్నవే ఉంటాయి.

Green Geeks వెబ్ హోస్టింగ్ రిజిస్టర్ చేసుకోవటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవే బెస్ట్ హోస్టింగ్ కంపెనీస్ అని కాదు. మేము, మా ఫాలోయర్స్ యూస్ చేసే వాటిల్లో నుండి బెస్ట్ వి మీకు అందిస్తున్నాం. మీరు ఆల్రెడీ వీటిని యూస్ చేసి ఉంటె మీ ఎక్స్పీరియన్స్ కామెంట్ లో షేర్ చేయండి.

మేము మిస్ అయినవి ఏమైనా ఉంటె వాటిని మాకు కామెంట్స్ లో తెలియచేయండి. నెక్స్ట్ అప్డేట్ లో వాటిని కూడా యాడ్ చేస్తాము.

మీకు ఈ పోస్ట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కి ఫేస్బుక్ గ్రూప్స్ లో, WhatsApp lo షేర్ చేయండి, ఎందుకంటె Sharing is Caring కదా! మీ నుండి మాకు కావాల్సిన ప్రోత్సాహం అదే!

2020 Best & Top Domain Registrars in Telugu

Exit mobile version