Always VJ

చిన్న చిన్న బిజినెస్లకి సోషల్ మీడియా బ్రాండింగ్ స్ట్రాటజీస్

Spread the love

Social Media Branding Strategies in Telugu

ఒక్కపుడు సోషల్ మీడియా నెట్వర్క్ బిల్డ్ చేసుకోవటానికి యూస్ చేసేవారు. గత కొన్నేళ్ళుగా చాలా బిజినెస్ లకి వాళ్ళ బిజినెస్లని వాళ్ళ కస్టమర్స్ కి చేరువ చేయటం లో, వాళ్ళ బిజినెస్లు కూడా గ్రో అవ్వటానికి ఉపయోగపడ్డాయి. ఈరోజుల్లో బ్రాండింగ్ అంటే కేవలం ట్రాఫిక్ ఇంక్రీస్ చేయడం, లీడ్స్, సేల్స్ పెంచడం వంటి వాటి గురించి మాత్రమే కాదు.

Social Media Branding Strategies in Telugu
Social Media Branding Strategies for Small Businesses
చాలా బిజినెస్లు సోషల్ మీడియా ఇంపార్టెన్స్ గురించి తెలుసుకున్నాయి. రాను రాను కాంపిటీషన్ పెరిగిపోతుంది. మీ కంపెటేటర్స్ తో ఉన్న గట్టి పోటీని తట్టుకుని నిలబడాలి. అంటే సోషల్ మీడియా కేవలం సేల్స్ కోసం మాత్రమే కాకుండా, పూర్తిగా సోషల్ మీడియా బ్రాండింగ్ పై ఫోకస్ చేయగలిగితే లాంగ్ రన్ లో మంచి రిజల్ట్స్ పొందవచ్చు. ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రం కావచ్చు, tiktok కావచ్చు. మీరు రైట్ స్ట్రాటజీస్ యూస్ చేస్తే మీ బ్రాండ్ కాంపిటీషన్ లో ముందు ఉంటుంది. అటువంటి కొన్ని సోషల్ మీడియా స్ట్రాటజీస్ గురించి ఈ బ్లాగ్ పోస్ట్ లో మనం తెలుసుకుందాం.

#1 Social Media Branding Strategies in Telugu | మీ బిజినెస్ గోల్స్ కి రిలేటెడ్ గా ఉండే సోషల్ మీడియా ప్లాట్ఫారంని సెలెక్ట్ చేసుకోవడం

మీ బిజినెస్ కి రిలేటెడ్ గా ఉండే సోషల్ మీడియా ప్లాట్ఫారంస్ ఎందుకు చూస్ చేసుకోవాలి అంటే ప్రతి ప్లాట్ఫారం లో యునిక్ యూసర్స్ ఉంటారు. మీ బిజినెస్ కి ఎలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫారం యూస్ అవుతుందో మీరు ముందుగా తెలుసుకోవాలి.
ఉదాహరణకి మీరు ఒక ఫోటోగ్రాఫర్ అయితే మీరు పింట్రెస్ట్ యూస్ చేయవచ్చు. పింట్రెస్ట్ ద్వారా మీ వర్క్ ని షేర్ చేయవచ్చు. అదే విధంగా మీరు టెక్ కంపెనీ ఓనర్ అయితే మీకు ట్విట్టర్, linkedin, యూస్ అవుతాయి. మీరు ఒక సెలూన్ రన్ చేస్తుంటే మీరు ఇన్స్టగ్రామ్ యూస్ చేయవచ్చు. మీరు వంటలు బాగా చేస్తారా? అయితే మీరు యూట్యూబ్ యూస్ చేయవచ్చు. ఇలా ఒక్కో టైపు బిజినెస్ కి ఒక్కో ప్లాట్ఫారం యూస్ అవుతుంది. అన్ని బిజినెస్ లకి ఫేస్బుక్ చక్కగా యూస్ అవుతుంది.

#2 Social Media Branding Strategies in Telugu | రెగ్యులర్ గా రైట్ కంటెంట్ పోస్ట్ చేయటం

ఇక్కడ నేను రెగ్యులర్, రైట్ కంటెంట్ అని రెండు మాటలు యూస్ చేశాను. రెగ్యులర్ గా అంటే మీ పోస్ట్స్ లో కన్సిస్టెన్సి ఉండాలి. మీరు కన్సిస్టెన్సి గా కంటెంట్ పబ్లిష్ చేస్తూ ఉంటె మీ కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. తరువాత రైట్ కంటెంట్ పోస్ట్ చేయాలి. రైట్ కంటెంట్ అంటే కేవలం వైరల్ అవ్వటం కోసమే కాకుండా మీ యూసర్స్ కి ఉపయోగపడే, మీ బిజినెస్ కి రిలేటెడ్ గా ఉండే కంటెంట్ పోస్ట్ చేయాలి. ఇలా చేయడం వలన మీకు ట్రస్టెడ్ యూసర్స్ ఉంటారు.

#3 Social Media Branding Strategies in Telugu | వీలైనంత ఎక్కువ సార్లు పోస్ట్ చేయటం

సోషల్ మీడియా లో మీరు ప్రతి రోజు వీలైనన్ని ఎక్కువ సారు పోస్ట్ చేయాలి. ఇది ఒక్కో ప్లాట్ఫారం ని బట్టి ఉంటుంది. ఇలా చేయడం వలన మన కంటెంట్ ని ఎక్కువ మందికి సోషల్ మీడియా అల్గోరిథంస్ రీచ్ అయ్యేలా చేస్తాయి.
ఫేస్బుక్, ఇన్స్టగ్రామ్ లో అయితే మీరు రోజుకి 2 సార్లు పోస్ట్ చేయవచ్చు. ట్విట్టర్ లో అయితే రోజుకి 5 సార్లు ట్వీట్ చేయాలి. యూట్యూబ్ లో 2 వీడియోస్, tiktok లో అయితే రోజూ 3 వీడియోస్ పోస్ట్ చేయోచ్చు. linkedin లో అయితే ఒక్కసారి పోస్ట్ చేస్తే సరిపోతుంది.
ఈ విధంగా చేయడం ద్వారా మన కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అదే విధంగా మన పోస్ట్స్ లో ఏదో ఒకటి వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.

#4 Social Media Branding Strategies in Telugu | మీ ఓన్ స్టైల్ ని ఫైండ్ అవుట్ చేయడం

సోషల్ మీడియా బ్రాండింగ్ లో మీకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేయటానికి మీరు మీ ఓన్ స్టైల్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకు అంటే మీ ఇండస్ట్రీలో లేదా మీ నిచ్ లో ఉండే మీ కంపేటిటర్స్, మీరు ఒకే టైపు కంటెంట్ ప్రొడ్యూస్ చేయటం వలన ఎటువంటి ఉపయోగం ఉండదు. కొంత మంది స్టొరీ టెల్లింగ్ ప్రాసెస్ లో చెప్తారు. కొంతమంది ఎంటర్టైన్మెంట్ తో చెప్తారు, కొంతమంది ఫన్నీ గా చెప్తారు. కొంత మంది ప్రొఫెషనల్ గా చెప్తారు. ఈ విధంగా మీరు మీ కంటెంట్ ని డిఫరెంట్ గా
ప్రెసెంట్ చేయాలి. అలా డిఫరెంట్ గా ప్రెసెంట్ చేయాలి అంటే మీరు మీ ఓన్ స్టైల్ ని ఫైండ్ అవుట్ చేయాలి.

#5 Social Media Branding Strategies in Telugu | మీ ప్రొఫైల్ బయోస్ ని అప్టిమైజ్ చేయటం

మీ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ని అప్టిమైజ్ చేయాలి. ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫారం లో ప్రొఫైల్ బయోస్ ఉంటాయి. వీటిల్లో మీరు ఏం చేయగలరు, ఏం చేస్తుంటారు, మీ స్కిల్ల్స్ ఏంటి ఇలాంటి ఎన్నో డీటెయిల్స్ అందులో ఇవ్వవచ్చు. చాలా మంది బయోస్ ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు.
ఉదాహరణకి ఇన్స్టగ్రామ్ లో bloggervjofficial అని సెర్చ్ చేయండి. మీకు మా ప్రొఫైల్ కనిపిస్తుంది. దాని పై క్లిక్ చేసి ఓపెన్ చేయండి. మీకు అందులో మా bio క్రింద ఉన్న ఇమాజ్ లో చూపించినట్టు ఉంటుంది.
ఇందులో మీకు bloggervj గురించి ఉంది. బ్లాగ్గింగ్, డిజిటల్ మార్కెటింగ్ గురించి ఆర్టికల్స్ రాస్తారు అని, తెలుగులో రాస్తారు అని ఉంది. అదే విధంగా బెగినర్స్ కి హెల్ప్ చేయటానికి ఆనందిస్తాము అని ఉంది. దిని వాళ్ళ ఒక పాజిటివ్ symptoms వెళ్తాయి. అదే విధంగా బ్లాగ్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవ్వమన్నాం. కొన్నిఎమోజిస్ కూడా యూస్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ విధంగా మీరు కూడా క్రియేటివ్ గా బయోస్ ఆప్టిమైజ్ చేయవచ్చు.
ఈ స్ట్రాటజీస్ కనుక యూస్ చేస్తే మీరు సోషల్ మీడియా బ్రాండింగ్ గేమ్ లో ముందుంటారు. ఈ స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయి? మీరు వీటిని యూస్ చేసి వీటిల్లో మీకు ఏది బాగా వర్కౌట్ అయ్యిందో కామెంట్ చేయండి.
Exit mobile version