Always VJ

చిన్న చిన్న బిజినెస్లకి సోషల్ మీడియా బ్రాండింగ్

Spread the love

చిన్న చిన్న బిజినెస్లకి సోషల్ మీడియా బ్రాండింగ్ | Social Media Branding in Telugu

మార్కెట్ లో మీ బిజినెస్ గుంపులో గోవిందం లా కాకుండా ఒక బ్రాండ్ గా మారాలి అంటే సోషల్ మీడియా టూల్స్ ద్వారా సోషల్ మీడియా లో బ్రాండ్ గా మారాలి. సోషల్ మీడియా బ్రాండింగ్ సరిగ్గా చేయగలిగితే మీ టార్గెటెడ్ ఆడియన్స్ కి, ఎక్కువ మందికి మీ బిజినెస్ రీచ్ అవుతుంది.

సోషల్ మీడియా బ్రాండింగ్ కోసం మనం డిఫరెంట్ ప్లాట్ఫారంస్ యూస్ చేస్తూ ఉంటాం. ఫేస్బుక్,
యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, tiktok, hello, sharechat, trell ఇలా ఎన్నో ఉన్నాయి.

Social Media Branding in Telugu

సోషల్ మీడియా బ్రాండింగ్ అంటే రెగులర్ గా సోషల్ మీడియా ప్లాట్ఫారంస్ లో, కరెక్ట్ మెథడ్స్ యూస్ చేసుకొని మన టార్గెట్ ఆడియన్స్ తో ఎంగేజ్ అవ్వటం. ఇక్కడ మన లక్ష్యం వచ్చి మన  బ్రాండ్ ని బూస్ట్ చేస్తే అవేర్నెస్ ని కల్పించుకోవాలి. సోషల్ మీడియా బ్రాండింగ్ పవర్ ని కరెక్ట్ గా యూస్ చేసుకుంటే మీ బ్రాండ్ ఫాన్స్ ఎవరైతే ఉంటారో, సబ్స్క్రిబెర్స్, ఫాలోయర్స్, మీ బ్రాండ్ ప్రొడక్ట్స్ / సర్వీసెస్ పర్చేస్ చేయటానికి విల్లింగ్ గా ఉంటారు.
సోషల్ ఫ్రెష్ అనే ఒక సోషల్ మీడియా ఏజెన్సీ చేసిన ఒక సర్వే ప్రకారం అవేర్నెస్ చాలా బిజినెస్లని ఫస్ట్ అండ్ టాప్ ప్రయారిటీ అని తెలిపింది. దీనిని బట్టి సోషల్ మీడియా బ్రాండింగ్ కి బిజినెస్లు ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. బిజినెస్లు సోషల్ మీడియా లో ఏఏ గోల్స్ కి క్రింది విధంగా ప్రాధాన్యతని ఇస్తున్నాయి అని సోషల్ ఫ్రెష్ సర్వే చెప్తుంది.
  • అవేర్నెస్ – 76 %
  • లీడ్ జనరేషన్ – 47%
  • కస్టమర్ లాయల్టీ – 34%
  • సేల్స్ – 28%
  • కస్టమర్ సర్వీస్ – 17%
బ్రాండింగ్ అనేది ఏ బిజినెస్ కి అయిన ఇంపార్టెంట్ స్టేజి, దాని ద్వారా లాంగ్ రన్ లో బిజినెస్ ని పొందాలని అనుకుంటుంది. అంటే మీరు బ్రాండింగ్ బిల్డ్ చేస్తూనే, అదే టైం లో మీ కస్టమర్స్ ని కూడా ఎట్రాక్ట్ చేయవచ్చు. బ్రాండింగ్ బిల్డ్ చేసే టైం లో మీకు లభించే ప్రతి లీడ్ ఇంపార్టెంట్. ఆ లీడ్స్ ని కరెక్ట్ గా యూస్ చేసుకుంటే మీ బిజినెస్ ని గ్రో చేసుకోవచ్చు.
సోషల్ మీడియా బ్రాండింగ్ ద్వారా రిలవెంట్ పీపుల్ ని మన సేల్స్ ఫన్నెల్ కి యాడ్ చేసుకోవచ్చు. సోషల్ మీడియా బ్రాండింగ్ ని సరిగ్గా చేయగలిగితే మిగిలిన సేల్స్ ప్రాసెస్ ని మీరు ఎఫ్ఫిషియంట్ గా చేయవచ్చు. సోషల్ మీడియా బ్రాండింగ్ గేమ్ లో మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవటానికి 4 విషయాల పై ఫోకస్ చేయాలి. అవి ఏంటో చూద్దాం:

#1 Social Media Branding in Telugu | మీ ఐడెంటిటీ

సోషల్ మీడియా బ్రాండింగ్ లో మీరు సక్సెస్ కావాలి అంటే మీ ప్రొడక్ట్స్ / సర్వీసెస్ గురించి బాగా తెలుసుకోవాలి. మీకు మార్కెట్లో మీ కంపెటేటర్స్ కి తేడ ఏంటి? మీ ప్రొడక్ట్స్ / సర్వీసెస్ వాళ్ళ కస్టమర్స్/ క్లైంట్స్ కి కలిగే రిలీఫ్ ఏంటి? ఎవరిని, ఎలా ఇంప్రెస్స్ చేయాలి? వీటన్నింటి గురించి మీరు క్లియర్ గా ఉంటె మీ బ్రాండ్ ఐడెంటిటీ ఈజీ గా స్ప్రెడ్ చేయగలరు.

#2 Social Media Branding in Telugu | మీ ఆడియన్స్

సోషల్ మీడియా బ్రాండింగ్ లో మనం అర్థం చేసుకోవలసింది మనం టార్గెట్ చేయవలసిన ఆడియన్స్ ఎవరు అని. దీని వాళ్ళ మనం ఎలాంటి మార్కెటింగ్ స్ట్రాటజీస్ యూస్ చేయాలి అని ప్లాన్ చేసుకోవచ్చు. ఉదాహరణకి మీర్ ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నారు అనుకుందాం. మీ దగ్గర 3 మెయిన్ కోర్సెస్ ఉన్నాయి అనుకుందాం. మీరు వాటిని ఆన్లైన్ ద్వారా సేల్ చేయాలి అనుకున్నారు. కానీ మీకు మీ ఆడియన్స్ తెలియదు అనుకుందాం.
మరి ఎలా టార్గెట్ చేస్తారు? మీరు 3 కోర్సెస్ కోసం 3 డిఫరెంట్ యాడ్ కాంపెయిన్స్ రన్ చేయాలి. మీ యాడ్స్ తో ఎవరు ఎంగేజ్ అవుతున్నారు, ఎవరు మిమ్మల్ని ఫాలో అవుతున్నారో వాళ్ళు మీ టార్గెటెడ్ ఆడియన్స్.  మీరు యాడ్ కాంపెయిన్స్ లో ఉండే అనలిటిక్స్ ని బేస్ చేసుకుని మీరు నెక్స్ట్ కాంపెయిన్స్ రన్ చేయవచ్చు. ఇలా మనం మన ఆడియన్స్ ని తెలుసుకోవచ్చు.

#3 Social Media Branding in Telugu | మీ కంటెంట్

మీరు సోషల్ మీడియా లో షేర్ చేసే కంటెంట్ ఏ టైప్ లో ఉంది అనే దాన్ని బట్టి మీ బ్రాండ్ గురించి ఒక ఐడియా వస్తుంది. మీరు షేర్ చేసే కంటెంట్. మీరు క్రియేట్ చేసే సోషల్ మీడియా మార్కెటింగ్ కాంపెయిన్స్ కి బలమివ్వవచ్చు లేదా బలహీన పరచవచ్చు. కాబట్టి ప్రతి ప్లాట్ఫారంకి దానికి సూట్ అయ్యే కంటెంట్ షేర్ చేయాలి.

#4 Social Media Branding in Telugu | మీ డిజైన్స్ 

మీ పోస్ట్ చేసే డిజైన్స్ కూడా మీ సోషల్ మీడియా బ్రాండింగ్ లో కీరోల్ ప్లే చేస్తాయి. సాధారణంగా మానవ మేధస్సు (హ్యూమన్ బ్రెయిన్) రెగ్యులర్ టెక్స్ట్ కన్నా visual కంటెంట్ 60,000 రెట్లు ఫాస్ట్ గా ప్రాసెస్ చేస్తుంది. మీ బ్రాండింగ్ లో డిజైనింగ్ ని మాత్రం ఇగ్నోర్ చేయకూడదు. మంచి మంచి కలర్స్ యూస్ చేయడం ద్వారా మంచి మంచి పోస్ట్స్ యూసర్స్ ఇంటరాక్ట్ అయ్యే విధంగా
చేయవచ్చు.
Exit mobile version