Always VJ

Keywords in Telugu | Blogging in Telugu

Spread the love

Keywords in Telugu | కీవర్డ్స్ తెలుగులో

బ్లాగింగ్ లో, డిజిటల్ మార్కెటింగ్ లో తరచుగా వినేమాట కీవర్డ్స్. కీవర్డ్స్ రీసెర్చ్ అంటారు, లాంగ్ టైల్ కీవర్డ్స్ అంటారు, కీవర్డ్స్ డెన్సిటీ అంటారు, కీవర్డ్స్ డిఫికల్టి అంటారు. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ లో కీవర్డ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అంటారు, కీవర్డ్స్ బేస్ చేసుకుని బ్లాగ్స్ రాయమంటారు.

అసలు ఈ కీవర్డ్స్ అంటే ఏంటి?

కీవర్డ్స్ ఎందుకు అంత ఇంపార్టెంట్?

కీవర్డ్స్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

కీవర్డ్స్ అంటే ఏంటి? What are Keywords?

మనకి ఏదైనా కావాలి అంటే ఏం చేస్తాం, సెర్చ్ ఇంజిన్స్ లో సెర్చ్ చేస్తాం. ఎలా సెర్చ్ చేస్తాం? మనకి ఏం కావాలో వాటిని అక్కడ టైపు చేసి సెర్చ్ చేస్తాం, కదా!

అలా సెర్చ్ చేసేటప్పుడు సెర్చ్ బాక్స్ లో మనం టైపు చేసేవే కీవర్డ్స్. దానిని బేస్ చేసుకునే సెర్చ్ ఇంజిన్స్ మనకి కావాల్సిన రిజల్ట్స్ మనకి అందిస్తాయి.

ఉదాహరణకి మనం గూగుల్ లో watches అని సెర్చ్ చేసాం అనుకుందాం, ఈ watches అనే పదం ఒక కీవర్డ్. ఈ watches అనే పదం ఏయే పేజెస్ ర్యాంక్ అయ్యయో వాటిని మనకి గూగుల్ చూపిస్తుంది.

Keywords in Telugu | blogging tips in telugu
Keywords in Telugu | Watches in Google Search

అదే విధంగా Samsung Smart Phone అని సెర్చ్ చేస్తే మనకి samsung లో ఉన్న స్మార్ట్ ఫోన్స్ గురించిన వెబ్ పేజెస్ ని గూగుల్ చూపిస్తుంది.

Keywords in Telugu | Samsung mobile search in google

How to Cook Biryani అని సెర్చ్ చేస్తే బిర్యానీ ఎలా వండాలి అని ర్యాంక్ అయి ఉన్న రిజల్ట్స్ చూపిస్తాయి. How to start a blog in Telugu అని సెర్చ్ చేస్తే అందుకు సంబంధించిన రిజల్ట్స్ కూడా చూపిస్తాయి.

Keywords in Telugu | how to start a blog in telugu seach in google

ఇవన్ని కూడా కీవర్డ్స్ యే.

ఒక బ్లాగ్ పోస్ట్ రాసేటప్పుడు కీవర్డ్స్ ఇంపార్టెంట్ అంటారు కదా! ఎందుకు? ఆ విషయం తెలుసుకోవాలి అంటే ముందుగా మీరు కీవర్డ్స్ ఎన్ని రకాలు, అవి ఏంటి అని తెలుసుకోవాలి?

కీవర్డ్స్ ఎన్ని రకాలు? How many types of keywords?

కీవర్డ్స్ ముఖ్యంగా 3 రకాలు. అవి:

1) షార్ట్ టైల్ కీవర్డ్స్ (Short Tail Keywords)

2) మిడిల్ టైల్ కీవర్డ్స్ (Middle Tail Keywords)

3) లాంగ్ టైల్ కీవర్డ్స్ (Long Tail Keywords)

కీవర్డ్స్ గురించి తెలుసుకునే ముందు ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి.

అవి, సెర్చ్ వాల్యుం, కీవర్డ్ డిఫికల్టి, కాంపిటీషన్, SEO డిఫికలల్టి, కీవర్డ్ డెన్సిటీ, పెయిడ్ డిఫికల్టి.

కీవర్డ్స్ టెర్మినాలజీ | Keywords Terminology

Search Volume :

సెర్చ్ వాల్యుం అంటే ఒక కీవర్డ్ గురించి ఎంత మంది సెర్చ్ ఇంజిన్స్ లో సెర్చ్ చేస్తున్నారు అనే యావరేజ్ కౌంట్. ఇది మనకి గడచిన 12 నెలల డేటా ఆధారంగా తెలుసుకుంటాం.

Keywords Difficulty:

ఒక కీవర్డ్ ని మనం ర్యాంక్ చేయటానికి ఎంత వరకు అవకాశం ఉంది అని తెలుసుకోవచ్చు. ఇందులో high, medium, low అని 3 రకాలు ఉంటాయి. వీటి ఆధారంగా కూడా మనం కీవర్డ్స్ ని సెలెక్ట్ చేసుకుంటాం.

Competition:

ఈ కాంపిటీషన్ ఆ కీవర్డ్ ని ర్యాంక్ చేయటానికి ఉన్న అవకాశాలు గురించి తెలియచేస్తుంది. ఇందులో మనకి low, medium, high కాంపిటీషన్ అని 3 రకాలు ఉంటాయి. వీటి సెర్చ్ వాల్యుం పైన ఈ కాంపిటీషన్ అనేది ఆధారపడి ఉంటుంది.

SEO Difficulty:

మనం సెలెక్ట్ చేసుకునే కీవర్డ్స్ సెర్చ్ ఇంజిన్స్ లో ర్యాంక్ అవ్వటానికి అంతకు ముందు ఉన్న కాంపిటీషన్ ని బట్టి ఎంత పర్సెంట్ అవకాశం ఉంది అని తెలుసుకోవచ్చు.

Paid Difficulty:

ఒక వేల మనం పెయిడ్ ప్రమోషన్స్ చేయాలి అనుకుంటే ఆ కీవర్డ్ ని మనం టాప్ లో మనం వెబ్ పేజి రావటానికి ఉన్న కాంపిటీషన్ ని ఈ పెయిడ్ డిఫికల్టి తెలియచేస్తుంది.

ఇప్పుడు కీవర్డ్స్ గురించి కొంచెం డీటెయిల్ గా తెలుసుకుందాం.

Keywords in Telugu | Short Tail Keywords – షార్ట్ టైల్ కీవర్డ్స్

ఈ షార్ట్ టైల్ కీవర్డ్స్ వచ్చి ఒకటి లేదా రెండు పదాలతో ఉంటాయి. ఉదహరణకి smart phone, blogging, digital marketing, online money, weight loss, dieting ఇలాంటివి. సాదారణంగా వీటికి సెర్చ్ వాల్యుం ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా కాంపిటీషన్ కూడా అంతే స్థాయిలో ఉంటుంది.

ఈ కీవర్డ్స్ ని ర్యాంక్ చేయటం కష్టం. చాలా చాలా వర్కౌట్స్ చేయాలి. అయిన అవుతాయి అనే నమ్మకం లేదు. అంత కాంపిటీషన్ ఉంటుంది. అంతే కాకుండా ఎప్పటి నుండో ఉన్న బ్లాగ్స్, వెబ్ సైట్స్ ఇప్పటికే ర్యాంక్ అయ్యి ఉంటాయి. అందుకే కొత్త బ్లాగ్స్ లేదా వెబ్ సైట్స్ కి షార్ట్ టైల్ కీవర్డ్స్ వర్కౌట్ అవ్వవు.

Keywords in Telugu | Medium tail Keywords – మీడియం టైల్ కీవర్డ్స్

ఇవి సాదారణంగా 2-4 పదాలతో ఉండే కీవర్డ్స్. ఉదాహరణకి 16mp camera phone, weight loss tips, cooking veg biryani, how to knot tie ఇలాంటివి. షార్ట్ టైల్ కీవర్డ్స్ తో పోల్చుకుంటే వీటికి సెర్చ్ వాల్యుం కొంచెం తక్కువగా ఉంటుంది. సెర్చ్ వాల్యుం తక్కువగా ఉంటె కాంపిటీషన్ కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది. అయితే కష్టపడితే వీటిని ర్యాంక్ చేయవచ్చు. అయితే మీరు సెలెక్ట్ చేసుకునే నిష్ని బట్టి, కీవర్డ్స్ ని బట్టి వీటి ర్యాంకింగ్స్ అనేవి ఆధారపడి ఉంటాయి.

Keywords in Telugu | Long Tail Keywords – లాంగ్ టైల్ కీవర్డ్స్

లాంగ్ టైల్ కీవర్డ్స్ అనేవి మరింత డీటెయిల్ గా సెర్చ్ చేసే కీవర్డ్స్. ఇవి 4 లేదా అంతకంటే ఎక్కువ పదాలతో ఉంటాయి. ఉదాహరణకి how to create wordpress blog in telugu, how to lose weight men above 40, how to cook chicken biryani like restaurant, how to get visa to Canada ఇలాంటివి.

వీటికి సెర్చ్ వాల్యుం అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి కాంపిటీషన్ కూడా తక్కువగానే ఉంటుంది. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, సెర్చ్ వాల్యుం తక్కువగా ఉంటె మనకి ట్రాఫిక్ ఎలా వస్తుంది అని.

వస్తున్నా, అక్కడికే వస్తున్నా. సెర్చ్ వాల్యూం ఎక్కువగా ఉంటె కాంపిటీషన్ కూడా ఎక్కువగానే ఉంటుంది అని మనం తెలుసుకున్నాం. కాంపిటీషన్ ఎక్కువగా ఉంటె వెబ్ పేజెస్ ర్యాంక్ అవ్వటం కష్టం. ఫస్ట్ పేజిలో ర్యాంక్ అయితేనే మీకు సెర్చ్ ఇంజిన్స్ నుండి వచ్చే ట్రాఫిక్ వస్తుంది, లేకపోతే లేదు.

అదే సెర్చ్  వాల్యూం తక్కువగా ఉంటె కాంపిటీషన్ కూడా తక్కువగా ఉంటుంది, కాంపిటీషన్ తక్కువగా ఉంటె త్వరగా సెర్చ్ ఇంజిన్స్ ఫస్ట్ పేజి లో ర్యాంక్ అవుతుంది. అప్పుడు ఖచ్చితంగా మీకు సెర్చ్ ఇంజిన్స్ నుండి ట్రాఫిక్ వస్తుంది.

కాబట్టి మీరు లాంగ్ టైల్ కీవర్డ్స్ పైన ఫోకస్ చేయండి, త్వరగా ర్యాంక్ అవ్వటానికి అవకాశాలు ఉంటాయి. అంతే కాకుండా మీకు క్వాలిటీ రీడర్స్ దొరుకుతారు, ఎప్పటికి అప్పుడు మీకు న్యూ రీడర్స్ కూడా దొరుకుతారు.

అంతా బాగానే ఉంది, మరి ఈ సెర్చ్ వాల్యూం, కాంపిటీషన్, SEO డిఫికల్టి, పెయిడ్ డిఫికల్టి ఇలాంటివి మనకి ఎలా తెలుస్తాయి? అని మీకు డౌట్ వచ్చిందా? రావాలి అప్పుడే మీరు పర్ఫెక్ట్ గా నేర్చ్చుకున్తున్నట్లు!

ఇందుకోసం మనం కొన్ని కీవర్డ్ రీసెర్చ్ (keywords research) టూల్స్ ఉపయోగిస్తాం. వాటిల్లో కొన్ని ఫ్రీ టూల్స్ ఉన్నాయి, ఎఫర్ట్ చేయగలిగితే పెయిడ్ టూల్స్ కూడా ఉన్నాయి.

Ahrefs, SEMRush, Ubersuggest, Google Keyword Planner, Keywords Everywhere ఇలా ఎన్నో టూల్స్ ఉన్నాయి.

Ahrefs, SEMRush టూల్స్ పెయిడ్ టూల్స్. వీటిని బిగినర్స్ ఎఫర్ట్ చేయలేరు, హైలీ ఎక్స్పెన్సివ్.

మీరు ఫ్రీగా కీవర్డ్స్ రీసెర్చ్ చేయాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ లో Ubersuggest తో కీవర్డ్స్ రీసెర్చ్ ఎలా చేయాలి అని ఒక వీడియో స్టెప్-బై-స్టెప్ చెప్పటం జరిగింది. ఆ వీడియో చుడండి, మీకు కీవర్డ్స్ రీసెర్చ్ గురించి ఒక ఐడియా వస్తుంది.

Click Here to Know Keywords Research In Telugu

ఇవి కాకుండా నేను ఇంకా ఏమైనా పాయింట్స్ మిస్ అయ్యాను అనుకుంటున్నారా? అయితే కామెంట్స్ లో చెప్పండి. వాటిని నెక్స్ట్ టైం అప్డేట్ చేస్తాను. మీరు కీవర్డ్స్ రీసెర్చ్ కోసం ఏ టూల్స్ యూస్ చేస్తున్నారు? కామెంట్స్ లో చెప్పండి.

ఈ బ్లాగ్ పోస్ట్ ని ఫేస్బుక్, WhatsApp లో షేర్ చేయండి. ఎందుకంటె Sharing is Caring కదా!

Exit mobile version