Always VJ

How to Write Blog Posts in Telugu in 2021

How to Write Blog posts in Telugu _Thumbnail
Spread the love

How to write blog posts in Telugu | బ్లాగ్ పోస్ట్స్ రాయటం ఎలా?

How to ట్యుటోరియల్స్, డీటెయిల్ గైడ్స్ కలిగిన టెక్నికల్ ట్యుటోరియల్స్ నుండి ఒక బ్లాగ్ పోస్ట్ ఎలా వ్రాయాలి అనే పోస్ట్స్ తో ఇంటర్నెట్ నిండిపోయినప్పుడు, మనం రెగ్యులర్ గా, కన్సిస్టెంట్ గా కంటెంట్ పబ్లిష్ చేస్తూ రీడర్స్ కి మంచి వేల్యూ కలిగిన కంటెంట్ ప్రోవైడ్ చేయగలిగినప్పుడే మనం మంచి రిజల్ట్స్ పొందగలం.

అయితే మనం ఇక్కడ సక్సెస్ఫుల్ బ్లాగర్స్ నుండి ఆ స్ట్రాటజీ కాపీ చేసుకుని మనం కూడా సక్సెస్ అవ్వవచ్చు. నిజానికి ట్రాఫిక్ పెంచుకోవడానికి ఎటువంటి సీక్రెట్ కంటెంట్ స్ట్రాటజీ ఉండదు. అయితే మంచి బ్లాగ్ పోస్ట్స్ లో కొన్ని ఎలెమెంట్స్ కామన్ గా ఉంటాయి, వాటివల్లే అవి ఎక్కువగా లైక్ చేయబడతాయి, షేర్ చేయబడతాయి.

ఈ బ్లాగ్ పోస్ట్ లో నేను మీకు ఒక మంచి బ్లాగ్ పోస్ట్ ఎలా వ్రాయాలి  అని టిప్స్ ని కూడా చెప్తాను.

నోట్: మీ యొక్క సోషల్, సెర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్స్ ఇన్క్రీస్ చేయటానికి మంచి బ్లాగ్ పోస్ట్ ఎలా వ్రాయాలి అని తెలుసుకునే ముందు మీకు ఒక విషయం చెప్తాను.

ఈ మధ్య మనం వింటూ ఉన్నాం, ఎక్కువ వర్డ్స్ తో ఉన్న బ్లాగ్ పోస్ట్స్ త్వరగా రాంక్ అవుతాయి అని. అలాంటి బ్లాగ్ పోస్ట్ మీరు కూడా వ్రాయాలి అనికుంటే ఒకేసారి 2000 వర్డ్స్ వ్రాయాలి అని అనుకోకండి. మొదట క్వాలిటీ పైన ఫోకస్ చేయండి.

మీ దగ్గర ఇన్సైట్స్ (insights) ఉంటె వాటిని వివరించండి. అలా చేయలేకపోతే మీ బ్లాగ్ పోస్ట్ మీ రీడర్స్ కి వేల్యూ ప్రోవైడ్ చేయకుండా, లెంగ్త్ కోసం అనవసరంగా వర్డ్స్ ఫిల్ చేసినట్లు ఉంటుంది.

మీ రీడర్స్ మీ కంటెంట్ వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు మీ పోస్ట్స్ ని షేర్ చేయరు. మీ బ్లాగ్ పోస్ట్స్ కి కామెంట్స్ రావు, బ్యాక్ లింక్స్ కూడా రావు. మీ రీడర్స్ కి ఇంటరెస్టింగ్ గా ఉండే టాపిక్ తీసుకుని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రోవైడ్ చేయండి.

How to write blog posts in Telugu |బ్లాగ్ పోస్ట్ రైటింగ్ టిప్స్

ఇప్పుడు మనం హై క్వాలిటీ ఇన్-డెప్త్ కంటెంట్ మన రీడర్స్ ని విసిగించకుండా ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం.

మీ బ్లాగ్ పోస్ట్ టైటిల్ క్రియేట్ చేయటం కోసం టైం స్పెండ్ చేయండి.

మీ బ్లాగ్ లింక్ పైన క్లిక్ చేసి మీ బ్లాగ్ ని విజిట్ చేయాలి అంటే ఇంటరెస్టింగ్ టైటిల్ ని ఉపయోగించాలి. ఇందుకోసం మీరు మీ టైటిల్స్ లో నంబర్స్ యూస్ చేయండి. ఉదాహరణకి  ఒక సక్సెస్ఫుల్ బ్లాగర్ కి ఉండే 5 లక్షణాలు, ఒక బ్లాగ్ సక్సెస్ కి 9 రీసన్స్  ఒక బ్లాగ్ సక్సెస్ కి 9 రీసన్స్

రిజల్ట్స్ ప్రామిస్ చేయటం అంటే  Instant Traffic Tips to Bloggers in Telugu, How to Write Blog posts in Telugu లాంటివి, మైండ్ పోయే స్టాటిస్టిక్స్ గురించి, లేదా పాపులర్ టాపిక్ గురించి వ్రాయండి.

ఇలాంటి వాటి వల్ల మీ బ్లాగ్ పోస్ట్ చదవాలి అనే క్యురియాసిటి కలుగుతుంది.

ఒక్కసారి మీ బ్లాగ్ పోస్ట్ ని పబ్లిష్ చేసే ముందు ఒక్కసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, ఈ టైటిల్ తో బ్లాగ్ పోస్ట్ కనిపిస్తే మీరు ఓపెన్ చేస్తారా అని?

మీ రీడర్స్ ని అదిరిపోయే ఇంట్రడక్షన్ తో కట్టిపడేయండి

మీ హెడ్ లైన్ ద్వార రీడర్స్ మీ బ్లాగ్ లింక్ పైన క్లిక్ చేస్తారు, కానీ ఇప్పుడు మీరు వచ్చిన రీడర్ బ్లాగ్ పోస్ట్ చదవటం కంటిన్యూ అయ్యేలా చేయాలి. అందుకు మీరు మంచి ఇంట్రడక్షన్ తో మీరు రీడర్స్ పూర్తిగా చదివితే ఏం జరుగుతుందో చెప్పగలగాలి.

రీడర్స్ ని ఒక కామన్ క్వశ్చన్ అడగండి, వాళ్ళ పర్సనల్ లేదా బిజినెస్ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వగలం అని ప్రామిస్ చేయండి, లేదా వాళ్ళకి రిలేటెడ్ గా ఉండే స్టేట్మెంట్ వ్రాయండి. దీనిద్వారా రీడర్స్ వాటికోసం పూర్తిగా చదవాలి అని అనుకుంటారు.

ఇక చివరగా, ఎవరూ కూడా వాళ్ళ టైం వేస్ట్ చేసుకోవాలి అని అనుకోరు, మీ బ్లాగ్ పోస్ట్ పూర్తిగా చదవటం వలన వాళ్ళకి ఉపయోగం ఉందా లేదా అని చూస్తారు, కాబట్టి మంచి ఇంట్రడక్షన్ రాయండి.

స్ట్రెయిట్ గా పాయింట్ కి రండి

ఒక సక్సెస్ఫుల్ బ్లాగ్ ని క్రియేట్ చేయటం అంటే వర్డ్ కౌంట్స్ రికార్డు బ్రేక్ చేయటం కాదు, వేల్యూని అందించే కంటెంట్ పబ్లిష్ చేయటం. కాబట్టి మసాలా లాంటివి ఏమి యాడ్ చేయకుండా స్ట్రెయిట్ గా మేటర్ కి రండి.

మీరు ఎంత త్వరగా హెడ్ లైన్, ఇంట్రడక్షన్ లో చేసిన ప్రామిస్ డెలివర్ చేయగలరో, అప్పుడే రీడర్స్ కూడా అంతే మీతో ఎంగేజ్ అవ్వగలరు.

అంతే కాకుండా మీరు చెప్పాలి అనుకున్న విషయాన్నీ చిన్న చిన్న పేరాగ్రాఫ్స్ గా వ్రాయండి. ఆన్లైన్ రీడర్స్ చాలా తక్కువ టైం లో అటేన్షన్ కోల్పోతారు. మీరు పెద్ద పెద్ద పేరాగ్రాఫ్స్ రాస్తే వాళ్ళు ఆ కంటెంట్ ని స్కిప్ చేస్తారు. ఇంకా ఈజీగా ఉండటం కోసం సబ్ హెడ్డింగ్స్ యూస్ చేసుకోండి.

మీ రీడర్స్ మీ బ్లాగ్ పోస్ట్ లో మీరు కష్టపడి రాసిన కంటెంట్ స్కిప్ చేయకుండా చదవటానికి ఈజీగా చేయండి. ఇందుకోసం మీరు బోల్డ్, ఇటాలిక్ టెక్స్ట్ యూస్ చేయండి, సబ్ హెడ్డింగ్స్ కూడా యూస్ చేయండి.

మీరు మాట్లాడుతున్నట్లు వ్రాయండి

మీరు వ్రాసే స్టైల్ ఎలా ఉండాలి అంటే చాలా ఇన్ఫార్మల్ గా, అంటే మీరు డైరెక్ట్ గా రీడర్స్ తో మాట్లాడుతున్నట్లు. మీరు మీ విజ్ఞానాన్ని ప్రదర్శించాలి అనుకోకండి, చాలా సింపుల్ పదాలు యూస్ చేయండి.

వీలైతే నువ్వు, నేను, మీరు, మేము (I, You, We, Us) లాంటి పదాలు ఉపయోగించండి. మీరు ఎప్పుడనా నవలలు చదివారా? అందులో ఏం జరిగింది అనే దానికన్నా ఎవరు ఎవరితో ఎలా మాట్లాడారు అని ఉంటుంది. కాబట్టి మీరు కూడా అదే విధంగా మీ బ్లాగ్ పోస్ట్స్ వ్రాయటానికి ప్రయత్నించండి.

హ్యూమన్ ఎమోషన్స్ అప్లై చేయండి

ఎమోషన్స్ ని టచ్ చేసే కంటెంట్ ఎక్కువగా షేర్ చేయబడుతుంది అని అనేక రీసెర్చ్స్ చెప్తున్నాయి. కామెడీ, సింపతీ, మోటివేషన్, నమ్మకం ఇలాంటి ఎమోషన్స్ బాగా స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ అవుతాయి.

మీ బ్లాగ్ పోస్ట్స్ ద్వారా వాళ్ళు ఇన్స్పైర్ అయ్యేలా ప్రయత్నించండి. ఎలా అంటే నేను నా బ్లాగ్ పోస్ట్స్ ద్వారా మీరు బ్లాగింగ్ చేసేలా ప్రోత్సహించినట్టు, ఇంకా బెటర్ గా బ్లాగింగ్ చేయగలిగేలా.  రీడర్స్ / కస్టమర్స్ వాళ్ళు రిలాక్స్ అవ్వటానికి ఇంటర్నెట్ లో బ్రౌసింగ్ చేస్తారు. అందుకే బ్రాండ్స్ కూడా వాళ్ళ కంటెంట్ సింపుల్ గా ఉండే విధంగా రీడర్స్ ఎంజాయ్ చేసేలా ప్లాన్ చేస్తుంటాయి.

ఇప్పుడు ఒక్కసారి మీరు ఆలోచించండి మీరు సోషల్ మీడియా లో కామెడీ, సింపతీ, మోటివేషన్, నమ్మకం ఇలాంటి పోస్ట్స్ షేర్ చేస్తున్నారా? అంటే మీరు కూడా ఆ ఎమోషన్స్ కి కనెక్ట్ అయినట్లే.

ఇప్పటికైనా అర్థం అయ్యిందా ఎమోషన్స్ పవర్!

మీ రీడర్స్ తో పర్సనల్ గా కనెక్ట్ అవ్వండి

అంటే మీరు ఒక బ్లాగర్ గా నంబర్స్ గురించి, ఫాక్ట్స్ గురించి, రీసెర్చ్ ల గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. ఒక స్టొరీ టెల్లర్ గా మీ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్లు మీ పర్సనల్ స్టోరీస్ షేర్ చేస్తూ ఉంటారు.

మీరు మీ డే-టూ-డే లైఫ్ లో జరిగే వాటిని కూడా షేర్ చేస్తుంటే మీ రీడర్స్ మీతో పర్సనల్ గా ఇంటరాక్ట్ అవుతారు. మీ రీడర్స్ తో స్ట్రాంగ్ బాండింగ్ ఉండటం వలన వాళ్ళు మిమ్మల్ని రెగ్యులర్ గా ఫాలో అవుతారు, అంతే కాకుండా సోషల్ షేరింగ్స్ కూడా పెరుగుతాయి.

అయితే మీరు ఈ ప్రాసెస్ లో చాలా ఓపెన్ గా, నిజాయితీగా ఉండాలి, అదే సమయం లో మీ రీడర్స్ తో మర్యాదపూర్వకంగా కూడా ఉండాలి.

మీరు కనుక How to guide లాంటి పోస్ట్ రాస్తుంటే, ఒక్కసారి ఊహించుకోండి, మీ రీడర్ కున్న నాలెడ్జ్ ఏంటి అని మాట్లాడకండి, ఏదైనా ఒక టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి అని అనుకోకండి.

ఇమేజ్స్, వీడియోస్ లాంటివి యూస్ చేయండి

మీ బ్లాగ్ పోస్ట్ ని ఒక ఇమేజ్ తో కనుక మొదలుపెడితే మీ CTR (క్లిక్ త్రు రేట్) , లింక్స్, షేర్స్ కూడా పెరగటానికి అవకాశం ఉంది.

కస్టమర్స్ టెక్స్ట్ కన్నా విజువల్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కాబట్టి మీ రీడర్స్ ని ఎంగేజ్ అవ్వటానికి మీ బ్లాగ్ పోస్ట్స్ లో ఇమేజ్స్, వీడియోస్ యూస్ చేయండి. వీడియోస్ ఎంబెడ్ చేయటం, ట్విట్స్, స్క్రీన్ షాట్స్, చార్ట్స్, గ్రాఫ్స్, మీమ్స్, ఫొటోస్ ఇలాంటివి అన్ని మీ రీడర్స్ అటేన్షన్ గ్రాబ్ చేస్తాయి.

టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కన్నా విజువల్ ఇన్ఫర్మేషన్ ని బ్రెయిన్ త్వరగా ప్రాసెస్ చేస్తుంది. కాబట్టి ఈసారి వీటికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి.

కంక్లూషన్ స్ట్రాంగ్ గా వ్రాయండి

కాంక్లుషన్ లేదా క్లోజింగ్ పేరాగ్రాఫ్ మొత్తం బ్లాగ్ పోస్ట్ యొక్క పర్పస్ ఏంటి అని చెప్పండి. ఈ బ్లాగ్ పోస్ట్ ద్వారా ఏం నేర్చుకున్నారు అని వాళ్ళకి తెలియచేయండి. వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అని కూడా తెలియచేయండి.

ప్రూఫ్ రీడ్, ఎడిటింగ్ చేయండి

మనం పైన నమ్మకం కలిగించడం లేదా ఆ నమ్మకాన్ని మైంటైన్ చేయటం కోసం మీరు మీ కంటెంట్ ని ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చూడాలి. దీని అర్థం బ్లాగ్ పోస్ట్స్ లో ఎటువంటి గ్రామర్ మిస్టేక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ అంతే కాకుండా అర్థం పర్థం లేని స్టేట్మెంట్స్ లేకుండా చూసుకోవాలి, ఇటువంటి వాటి వల్ల మన బ్లాగ్ పైన ఉన్న మంచి ఇంప్రెషన్ పోతుంది.

ఎవర్గ్రీన్ కంటెంట్ వ్రాయండి

ఎప్పుడు ఓపెన్ చేసి చదివినా ఉపయోగపడే కంటెంట్ ని ఎవర్గ్రీన్ కంటెంట్ అంటారు. ట్రేండింగ్ టాపిక్స్ లేదా బ్రేకింగ్ న్యూస్ లాంటి వాటి వాళ్ళ బ్లాగ్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎందుకంటె ట్రేండింగ్ టాపిక్స్ వల్ల ఆటోమేటిక్ గా సోషల్ షేరింగ్స్ పెరుగుతాయి.

రీడర్స్ పాపులర్ టాపిక్స్, లేటెస్ట్ టాపిక్స్ ని షేర్ చేయటానికి సహజంగానే మొగ్గ చూపిస్తారు. అయితే ఈ టైపు కంటెంట్ వాళ్ళ మనకి షార్ట్ టైం లో ట్రాఫిక్ అనేది వస్తుంది. కానీ మనకి లాంగ్ రన్ లో ట్రాఫిక్ కావాలి, గ్రోత్ కావాలి. బ్లాగర్స్ గా మీరు ఎవర్గ్రీన్ కంటెంట్ ప్రతి నెల రెగ్యులర్ సెర్చ్ ట్రాఫిక్ ఉన్న కీవర్డ్స్ ని టార్గెట్ చేసుకుని క్రియేట్ చేయాలి.

ఎవర్గ్రీన్ కంటెంట్ ఎప్పుడూ హెల్ప్ అవుతుంది, రెగ్యులర్ గా ట్రాఫిక్ వస్తూనే ఉంటుంది. ఉదాహరణకి ఒక బ్లాగ్ పోస్ట్స్ ఎలా వ్రాయాలి అని సెర్చ్ చేస్తే కొన్ని సంవత్సరాల తరువాత కూడా మీరు సెర్చ్ రిజల్ట్స్ లో రావచ్చు, ఎందుకంటె ఈ బ్లాగ్ పోస్ట్ లో ఉన్న కంటెంట్ ఎవర్గ్రీన్ కంటెంట్.

కన్సిస్టెంట్ గా పబ్లిష్ చేయండి

అయితే మీరు ప్రతి రోజు పబ్లిష్ చేయవలసిన అవసరం లేదు, కానీ ఒక పాటర్న్ ప్రకారం పబ్లిష్ చేస్తూ ఉండాలి. (న్యూ బ్లాగర్ కి ఇది వర్తించదు) అంటే 2 రోజులకొకసారి లేదా 3 రోజులకొకసారి లేదా వారానికి ఒకసారి ఇలా అన్నమాట. కుదిరితే మీ బ్లాగ్ పోస్ట్స్ ఉదయం పూట పబ్లిష్ చేయటానికి షెడ్యూల్ చేసుకోండి.

సోషల్ షేరింగ్ బటన్స్ యూస్ చేయండి

మీకు సోషల్ షేరింగ్స్ కావాలి అనుకుంటే, మీ రీడర్స్ కి ఈజీగా షేర్ చేయటానికి వీలుగా  మీరు సోషల్ షేరింగ్ బటన్స్ బ్లాగ్ లో ఉంచండి. బ్లాగ్ పోస్ట్ మొదట్లో, చివర్లో కుదిరితే బ్లాగ్ కి ఒక సైడ్ లో ఇలా మీకు, మీ రీడర్స్ కి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చూసుకోండి.

అదే విధంగా మీరు కూడా మీ ఆడియన్స్ తో టచ్ లో ఉండటానికి మీ ఇండస్ట్రీ రిలేటెడ్ సోషల్ మీడియా ప్లాట్ఫారంస్ యూస్ చేయండి. బ్లాగ్స్ లో కనుక మీరు విజువల్స్ యూస్ చేస్తుంటే వాటిని రీడర్స్ సోషల్ మీడియాలో షేర్ చేయటానికి ఇంటరెస్ట్ చూపిస్తారు.

సెర్చ్ ఇంజిన్స్ లో రాంక్ అయ్యేవిధంగా బ్లాగ్ పోస్ట్స్ ఎలా వ్రాయాలి?

నూటికి 90% మంది బ్లాగర్స్ అందరి కోసం కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అలా అందరి కోసం కంటెంట్ క్రియేట్ చేస్తే ఏమవుతుందో తెలుసా?

మీ కంటెంట్ ఎవరికీ రీచ్ అవ్వదు.

నమ్మాలని అనిపించటం లేదు కదా! అవును నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. అలా కాకుండా మీరు ఎవరిని అయిన చేస్తూ రాస్తే మీ కంటెంట్ మరింత స్ట్రాంగ్ గా ఉంటుంది.

ఇలా చేయటం వలన మీ కంటెంట్ క్వాలిటీ పెరగటమే కాకుండా, మీరు టార్గెట్ చేసిన రీడర్స్ కి మీ కంటెంట్ ని బెస్ట్ కంటెంట్ లేదా బెస్ట్ సొల్యూషన్ అని రిఫర్ చేయబడుతుంది,

ఒకవేళ మీరు అందరి కోసం కంటెంట్ క్రియేట్ చేస్తుంటే ఈసారి అలా కాకుండా, కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు మీరు ఒక్కరిని టార్గెట్ చేయండి, ఆ ఒక్కరి కోసమే కంటెంట్ క్రియేట్ చేయండి. (ఇక్కడ ఒక్కరు అంటే ఒక్క పర్సన్ కావచ్చు, లేదా అటువంటి పర్సన్స్ గ్రూప్ కావచ్చు, ఒకే ఆలోచన విధానం ఉన్నవాళ్లు కావచ్చు.)

“కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు మీరు ఎవరికోసం అయితే కంటెంట్ క్రియేట్ చేస్తున్నారో అతను మీ ఎదురుగా కూర్చొని మాట్లాడితే ఎలా మాట్లాడతారో అలా వ్రాయండి.”

అంతే కాకుండా పెద్ద పెద్ద పదాలు వాడకుండా చాలా సింపుల్ వర్డ్స్ యూస్ చేసి అతనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి అతనికి అవేర్నెస్ కలిగించి మీరు ప్రోమోట్ చేయాలనుకున్న దాన్ని ప్రోమోట్ చేయవచ్చు.

మీ రీడర్ కి ఉండే క్వశ్చన్స్ అన్నింటిని లిస్టు అవుట్ చేయండి

ఒక్కసారి మీరు మీ రీడర్ ని టార్గెట్ చేశాక, అతను ఫేస్ చేస్తున్న ప్రాబ్లంస్ లిస్టు అవుట్ చేయండి. ఈ ప్రాబ్లంస్ అన్నింటిని క్వశ్చన్స్ గా మార్చండి, ఇప్పుడు ఈ క్వశ్చన్స్ బ్లాగ్ పోస్ట్ ఐడియాస్ గా మారతాయి.

ఉదాహరణకి మీకు బ్లాగ్ పోస్ట్ ఎలా వ్రాయాలో తెలియదు, మీరు బ్లాగింగ్ చేయాలి అని అనుకున్నారు. మరి బ్లాగ్ పోస్ట్ వ్రాయకుండా బ్లాగింగ్ చేయలేం కదా!

ఇప్పుడు నేను మిమ్మల్ని టార్గెట్ చేసి ఒక్క బ్లాగ్ పోస్ట్ వ్రాయాలి అనుకున్నాను. క్రొత్తగా బ్లాగింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకి కామన్ గా ఉండే ప్రాబ్లం బ్లాగ్ పోస్ట్ ఎలా వ్రాయాలో తెలియకపోవటం, దీన్ని క్వశ్చన్ గా మారిస్తే ఒక బ్లాగ్ పోస్ట్ వ్రాయటం ఎలా? ఇప్పుడు నా దగ్గర ఒక బ్లాగ్ పోస్ట్ ఐడియా ఉంది. అర్థం అయిందా!

ఇదే విధంగా మీ రీడర్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లంస్ కి సోలుషన్స్ మీరు ప్రోవైడ్ చేయగలగాలి. అదే విధంగా మీరు ఎక్కువ సెర్చ్ ట్రాఫిక్ ఉన్న సేల్స్ రిలేటెడ్ లాంగ్ టైల్ కీవర్డ్స్ కూడా యూస్ చేయాలి.

కాబట్టి మీరు మీ రీడర్ కి మీ బ్లాగ్ పోస్ట్స్ తో ఏ విధంగా హెల్ప్ చేయగలరు.

కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు మీరు ఎప్పుడు కూడా మీరు రీడర్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, గూగుల్ సెర్చ్ ఇంజిన్ కి కాదు. మీరు మీ రీడర్స్ కి మీ కంటెంట్ తో హెల్ప్ చేయగలిగితే మీకు ఎక్కువ సోషల్ షేర్స్, కామెంట్స్ ( సేల్స్) కూడా జరుగుతాయి.

గూగుల్ క్రాలర్స్ కనుక యూసర్ ఎంగేజ్మెంట్ గమనిస్తే (అదేనండి సోషల్ మీడియా షేర్స్, కామెంట్స్), మీకు ఆటోమేటిక్ గా మంచి సెర్చ్ ర్యాంకింగ్స్ మీరు టార్గెట్ చేసిన కీవర్డ్స్ కి లభిస్తాయి.

2000 వర్డ్స్ బ్లాగ్స్ ఎలా వ్రాయాలి?

SerpIQ అనే సంస్థ చేసిన ఒక సర్వే ప్రకారం, టాప్ 10 సెర్చ్ రిజల్ట్స్ లో యావరేజ్ కంటెంట్ లెంగ్త్ 2000 పదాల దాక ఉంది.

Blog source : bloggingtips.com

అంటే గూగుల్ ఎక్కువ వర్డ్స్ ఉన్న వెబ్ పేజెస్ కి ఇంపార్టెన్స్ ఇస్తుంది అనే కదా! ఒకవేళ మీరు కనుక 2000 వర్డ్స్ తో బ్లాగ్స్ రాస్తే మీకు కూడా తేడా తెలుస్తుంది.

రీసెంట్ గా నేను కొన్ని బ్లాగ్ పోస్ట్స్ సాధారణంగా నేను రాసే వర్డ్ కౌంట్ కన్నా ఎక్కువ ఉండే విధంగా డిటైల్డ్ గా వ్రాస్తే నాకు వాటి ట్రాఫిక్ లో డిఫరెన్స్ కనిపించింది. (అలా అని నేను అన్ని బ్లాగ్స్ అవసరం ఉన్నా లేకపోయినా 2000 వర్డ్స్ తో వ్రాయాలి చెప్పట్లేదు.)

ఇప్పుడు సెర్చ్ రిజల్ట్స్ లో రాంక్ అయ్యే విధంగా 2000+ వర్డ్స్ తో బ్లాగ్స్ ఎలా రాయాలి అని తెలుసుకుందాం.

5 Simple Tips to How to Write Blog posts in Telugu

  1. బాగా రీసెర్చ్ చేయండి. సాధారణంగా 500-600 వర్డ్స్ రాసేవాళ్ళు పెద్దగా రీసెర్చ్ చేయరు. మీ కంటెంట్ క్వాలిటీ, క్వాంటిటీ మీరు చేసిన లేదా చేసే రీసెర్చ్ పైన ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్కువ టాపిక్స్ కనుక రీసెర్చ్ ద్వారా తెలుసుకుంటే లాంగ్ ఫార్మ్ కంటెంట్ క్రియేట్ చేయటానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.
  2. మీ దగ్గర ఉన్న బ్లాగ్ పోస్ట్ ఐడియా గురించి ఇంకా ఎక్కువగా ఆలోచించండి. మీకు ఒక బ్లాగ్ పోస్ట్ఐడియా రాగానే కూర్చొని రాయటం మొదలు పెట్టకండి. ఆ బ్లాగ్ పోస్ట్ ఐడియాని ఇంకా డిటైల్డ్ గా ఎలా వ్రాయాలి, ఇంకా డెప్త్ గా ఎలా వ్రాయాలి అని ఆలోచించండి. ఇలా చేయటం వలన మీ టార్గెటెడ్ రీడర్స్ కి ఇంకా మంచి కంటెంట్ అందించే అవకాశం ఉంటుంది.
  3. మీ కంటెంట్ అవుట్లైన్ ప్రిపేర్ చేసుకోండి. మీ బ్లాగ్ పోస్ట్ స్టార్టింగ్, మెయిన్ కంటెంట్, చివర్లో సారాంశం నీట్ గా ప్లాన్ చేసుకోండి. ఈ మూడు విషయాలు మనం జాగ్రతగా కవర్ చేయగలిగితే, ఈజీగా లాంగ్ ఫార్మ్ కంటెంట్, ఏ నిష్ పైన అయినా క్రియేట్ చేయవచ్చు.
  4. స్టోరీస్ చెప్పండి. లాంగ్ ఫారం కంటెంట్ లో రీడర్స్ ఎంగేజ్ అవ్వటానికి ఇదొక మంచి ఆప్షన్. ఇలా రిలేటెడ్ స్టోరీస్ చెప్పటం వలన మీ రీడర్స్ మీ కంటెంట్ తో కనెక్ట్ అవుతారు. మీ ప్రొడక్ట్స్ గురించి, సర్వీసెస్ గురించి వివిధ రకాల కథలు ఎలా చెప్పవచ్చు అని ఆలోచించండి.
  5. టాప్ బ్లాగ్స్ లో పబ్లిష్ అయిన రీసెంట్ బ్లాగ్ పోస్ట్స్ ఒకసారి గమనించండి. వాటి అన్నింటిలో ఒక కామన్ కంటెంట్ క్రియేటింగ్ ఫ్రేమ్ వర్క్ మీకు కనిపిస్తుంది (మీరు గమనిస్తే) ! వాళ్ళు రీడర్స్ ని ఎలా స్టిక్ చేయగలుగుతున్నారు అని ఒక్కసారి తెలుసుకోండి.

వాళ్ళ కంటెంట్ లో వాళ్ళు ఎటువంటి ఎమోషన్స్ యూస్ చేస్తున్నారో గమనించండి. మీరు కూడా బ్లాగ్ పోస్ట్స్ క్రియేట్ చేసేటప్పుడు, అదే కంటెంట్ క్రియేషన్ ఫ్రేమ్ వర్క్ ఫాలో అవ్వండి.

మీ బ్లాగ్ పోస్ట్స్ కి బెటర్ సెర్చ్ ర్యాంకింగ్స్ ఎలా తెచ్చుకోవాలి?

లాంగ్ ఫార్మాట్ బ్లాగ్ పోస్ట్ వ్రాయటం ఒక ఎత్తు అయితే దానిని ర్యాంక్ చేయటం ఒక ఎత్తు. ఒకవేళ మీరు మంచి సెర్చ్ రిజల్ట్స్ మీ లాంగ్ ఫార్మాట్, డిటైల్డ్ బ్లాగ్ పోస్ట్స్ కోసం కావాలి అనుకుంటే,  ఇందుకోసం మీరు కొన్ని మొఖ్యమైన విషయాల పైన ఫోకస్ చేయాలి.

Long Tail Keywords యూస్ చేయటం స్టార్ట్ చేయండి

లాంగ్ టైల్ కీవర్డ్ సాధారణంగా 4 కన్నా ఎక్కువ పదాలని కలిగి ఉంటాయి. ఉదాహరణకి How to start blog in Telugu in 2021.

మీ బ్లాగ్ ట్రాఫిక్ పెంచుకోవాలి అంటే కరెక్ట్ లాంగ్ టైల్ కీవర్డ్స్ ఐడెంటిఫై చేయాలి. లాంగ్ టైల్ కీవర్డ్స్ యూస్ చేయమనటం మీకు ఆశ్చర్యపరిస్తే మీరు ఈ 3 కారణాలు తెలుసుకోవాలి.

  1. ఇవి త్వరగా రాంక్ అవ్వటానికి అవకాశం ఉన్నందున మీ బ్లాగ్ కి వచ్చే ట్రాఫిక్ పెరుగుతుంది.
  2. లాంగ్ టైల్ కీవర్డ్స్ ద్వారా సేల్స్ కూడా పెరుగుతాయి (అఫిలియేట్ / డిజిటల్ ప్రొడక్ట్స్ ఉంటె), ఎందుకంటె యూసర్స్ సెర్చ్ చేసే విధంగా మనం వీటిని రాంక్ చేయటానికి అవకాశం ఉంది కాబట్టి.
  3. మీరు ప్రోమోట్ చేసే ప్రొడక్ట్స్/ సర్వీసెస్ గురించి మంచి అవగాహనా ఏర్పరచటంలో లాంగ్ టైల్ కీవర్డ్స్ మీకు హెల్ప్ చేస్తాయి.

మీరు లాంగ్ టైల్ కీవర్డ్స్ ఐడెంటిఫై చేయటానికి SEMRush, Ubbersuggest, Ahrefs వంటి అనేకరకాల టూల్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. 100 నుండి 2000 వరకూ కాంపిటీషన్ ఉన్న లాంగ్ టైల్ కీవర్డ్స్ సెలెక్ట్ చేసుకోండి.

దీనివల్ల తక్కువ కాంపిటీషన్ ఉన్న లాంగ్ టైల్ కీవర్డ్స్ గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ లో త్వరగా రాంక్ అవుతాయి. మీరు లాంగ్ టైల్ కీవర్డ్స్ పైన కొంచెం టైం స్పెండ్ చేయగలిగితే, అందుకు బదులుగా గూగుల్ నుండి సెర్చ్ ట్రాఫిక్ పొందగలరు.  లాంగ్ టైల్ కీవర్డ్స్ నుండి ట్రాఫిక్ పొందటం అంత కష్టం ఏమి కాదు.

On-Page SEO చేయటం మర్చిపోవద్దు

మీరు చేసే ఆన్-పేజి SEO మీయొక్క సెర్చ్ ర్యాంకింగ్స్ ని డైరెక్ట్ గా ఇన్ఫ్లుయన్స్ చేస్తుందని మీకు తెలుసా? కీవర్డ్ స్టఫింగ్ చేయకుండా కరెక్ట్ కాంబినేషన్ తో లాంగ్ టైల్ కీవర్డ్స్ కరెక్ట్ గా యూస్ చేస్తే గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ లో టాప్ ర్యాంకింగ్స్ వస్తాయి.

మీరు ఒప్పుకున్నా, లేకున్నా ఆన్-పేజి SEO కరెక్ట్ గా చేయగలిగితే గూగుల్ సెర్చ్ ర్యాంకింగ్స్ త్వరగా వస్తాయి చేయవచ్చు.

ఆన్-పేజి SEO ఎలా చేయాలి అని ఇప్పటికే మన యుట్యూబ్ ఛానల్ లో బ్లాగర్, వర్డ్ప్రెస్ల పై వీడియో ట్యుటోరియల్స్ చేయడం జరిగింది. ఒక్కసారి ఆ వీడియోస్ చూడండి, మీకు మరింత అవగాహనా కలుగుతుంది.

ఇప్పుడు సెర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్స్ ద్వారా ట్రాఫిక్ రావాలి అనుకుంటే,  మెయిన్ కీవర్డ్ బ్లాగ్ పోస్ట్ లో ఎక్కడెక్కడ ఉండాలో కొన్ని ప్లేసెస్ చూద్దాం.

Image alt Tags 

మీ ప్రైమరీ లేదా ఫోకస్ కీవర్డ్ మీ బ్లాగ్ పోస్ట్ ఇమేజ్ ఆల్ట్ ట్యాగ్స్ లో కూడా ఉంచాలి. ఇలా చేయటం వలన ఆ ఇమేజ్ గూగుల్ ఇమేజ్ సెర్చ్ రిజల్ట్స్ లో రాంక్ అవుతుంది.

అదే విధంగా ఇమేజ్ కి ఏదో ఒక రాండమ్ నేమ్ యూస్ చేయకుండా మీ మెయిన్ కీవర్డ్ ని ఫైల్ నేమ్ గా ఉంచుకోండి. దీనివల్ల మీ ఇమేజ్ సెర్చ్ రిజల్ట్స్ లో రాంక్ అవుతుంది. కాబట్టి ఇమేజ్స్ ని జాగ్రతగా ఆప్టిమైజ్ చేయండి.

Headline

అవకాశం ఉన్నంతవరకూ మీ హెడ్ లైన్ లో మెయిన్ కీవర్డ్ (ప్రైమరీ / ఫోకస్ కీవర్డ్), సెకండరి కీవర్డ్ యూస్ చేయటానికి ప్రయత్నించండి. (దయచేసి కావాలని మాత్రం టైటిల్ లో ఇరికించవద్దు.) ఇలా చేయటం వలన బ్లాగ్ పోస్ట్స్ సెర్చ్ రిజల్ట్స్ లో త్వరగా రాంక్ అవుతాయి.

Sub Headings

మీ ప్రైమరీ కీవర్డ్ ని హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3 లో సబ్ హెడ్డింగ్స్ గా కూడా యూస్ చేయండి. ఇలా చేయటం వలన మీ బ్లాగ్ పోస్ట్ సెర్చ్ ర్యాంకింగ్స్ ఇంప్రూవ్ అవుతాయి.

టెక్స్ట్ స్టార్టింగ్ లో 

మీ టార్గెటెడ్ కీవర్డ్స్ ని మొదటి 100 వర్డ్స్ లేదా మొదటి పేరాగ్రాఫ్ లో కనుక యూస్ చేస్తే, మీ పోస్ట్ త్వరగా రాంక్ అవుతుంది, ఎందుకంటె సెర్చ్ ఇంజిన్ క్రాలర్స్ కి బాగా కనిపిస్తుంది కాబట్టి.

బ్లాగ్ పోస్ట్ urlలో

వీలైనంత చిన్న url యూస్ చేయటానికి ట్రై చేయండి, url లో కూడా మీ మెయిన్ కీవర్డ్ ని యూస్ చేయండి.

బ్లాగ్ పోస్ట్ మెటా డిస్క్రిప్షన్

మీ బ్లాగ్ పోస్ట్ మెటా డిస్క్రిప్షన్ లో మీ ఫోకస్ కీవర్డ్ ని మాత్రం యూస్ చేయటం మర్చిపోవద్దు. ఎందుకంటె సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ లో డిస్క్రిప్షన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి.

ప్రతి బ్లాగ్ పోస్ట్ ని ఒక మెయిన్ కీవర్డ్ తో అప్టిమైజ్ చేయండి. అప్పుడు మీ బ్లాగ్ పేజెస్ సెర్చ్ ఇంజిన్స్ లో ఎక్కువగా రాంక్ అవ్వటానికి అవకాశం ఉంటుంది.

ఆన్-పేజి SEO కరెక్ట్ గా చేయగలిగితే సెర్చ్ ఇంజిన్స్ లో త్వరగా రాంక్ అవ్వటమే కాకుండా మీరు SEO ఫ్రెండ్లీ కంటెంట్ ఈజీగా క్రియేట్ చేయటానికి అవకాశం ఉంటుంది.

మంచి హెడ్ లైన్స్ యూస్ చేయండి

ఆల్రెడీ హెడ్ లైన్స్ గురించి ఇంతకూ ముందు చెప్పుకున్నాం. అయితే మంచి హెడ్ లైన్స్ కోసం టైం స్పెండ్ చేయండి. ఎందుకంటె పవర్ఫుల్ హెడ్ లైన్స్ తో రీడర్స్ ని అట్రాక్ట్ చేయవచ్చు.

ఎప్పుడూ 60-70 కన్నా ఎక్కువ లెటర్స్ (క్యారెక్టర్స్) తో హెడ్డింగ్స్ రాయవద్దు. ఎందుకంటె సెర్చ్ ఇంజిన్స్ అంతకు మించి హెడ్డింగ్ ని సెర్చ్ రిజల్ట్స్ ని డిస్ప్లే చేయవు.

ముగింపు

లాంగ్ బ్లాగ్ పోస్ట్ వ్రాయటం, అందులోను మంచి క్వాలిటీ అందించటం అంటే చాలా టైం పడుతుంది. ఒక బ్లాగ్ పోస్ట్ ఫినిష్ చేయటానికి 7-10 గంటలు కూడా పట్టొచ్చు.  ఒకవేళ మీరు మాంచి బ్లాగ్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఆ మాత్రం టైం స్పెండ్ చేయటం లో తప్పు లేదు. ఒకవేళ మీరు డైలీ బ్లాగ్ పోస్ట్స్ రాయలేకపోతుంటే మీ యొక్క పోస్టింగ్ ఫ్రీక్వెన్సీ ని తగ్గించండి. దీనివల్ల మీరు మీ బ్లాగ్ రీడర్స్ కి తక్కువ కంటెంట్ అందించినా క్వాలిటీ కంటెంట్ అందిస్తారు కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు.

లాంగ్ బ్లాగ్ పోస్ట్ వ్రాయటం ఎంత ముఖ్యమో దాన్ని ఎడిట్ చేయటం కూడా అంతే ముఖ్యం. అలా చేయగలిగితేనే సోషల్ మీడియా లో వైరల్ అయ్యి సెర్చ్ ఇంజిన్స్ లో రాంక్ అయ్యి ట్రాఫిక్ వస్తుంది. ఎప్పుడూ కూడా ప్రూఫ్ చూడకుండా బ్లాగ్ పోస్ట్ ని పబ్లిష్ చేయకండి.

ఒక బ్లాగ్ పోస్ట్ ని ఎలా వ్రాయాలి అని ఈ పోస్ట్ మీకు ఎలా అనిపించింది? మీరు కూడా 2000 కన్నా ఎక్కువ వర్డ్స్ తో బ్లాగ్ పోస్ట్స్ వ్రాద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ బ్లాగ్ పోస్ట్ మీకు ఎలా హెల్ప్ అవుతుంది అని కామెంట్ చేయండి. మీరు చెప్తేనే ఈ బ్లాగ్ పోస్ట్ మీకు యెంత వరకూ హెల్ప్ అయ్యింది అని అర్థం అవుతుంది.

Exit mobile version