Always VJ

How to Grow Your Blog in Telugu

Spread the love

How To Grow Blog in Telugu in 2021

మీరు బ్లాగింగ్ బేసిక్స్ గురించి, ఒక బ్లాగ్ క్రియేట్ చేయటానికి ఏం కావాలి, డొమైన్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టం ని ద్వారా ఒక బ్లాగ్ ని ఎలా సెటప్ చేయాలి అని తెలుసుకున్నాం. ఇప్పుడు అత్యంత ముఖ్యమైనది, మీ బ్లాగ్ ని గ్రో చేయటానికి ట్రాఫిక్ ని ఎలా ఇంక్రీస్ చేయాలి అని తెలుసుకుందాం.

ఒక బ్లాగ్ ని సెటప్ చేయటం చాలా ఈజీ. కంటెంట్ బ్యాంకు ని క్రియేట్ చేయటం అనేది చాలా కష్టమైనా పని. ఇది ఒక్కరోజులో అయ్యేది కాదు, కదా!

ఈ గైడ్ లో మనం కంటెంట్ క్రియేట్ చేయటాన్ని, దాన్ని  మరింత మందికి రీచ్ అవ్వటానికి సోషల్ మీడియా మార్కెటింగ్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ లాంటివి చేయటం ద్వారానే మనం మన బ్లాగ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకు వెళ్ళగలం.

ఒక బ్లాగ్ ని సెటప్ చేయటం ఈజీ, కానీ దాన్ని గ్రో చేయటం కష్టం. ఒక బ్లాగ్ పోస్ట్ రాసి, దాన్ని పబ్లిష్ చేసి కూర్చుంటే మీ బ్లాగ్ కి రీడర్స్ రారు. అది ఒక్కపుడు వర్కౌట్ అవుతుంది కానీ ఇప్పుడు కాదు.

అలా కాకుండా మీరు ఒక సిస్టమాటిక్ అప్రోచ్ ని మార్కెటింగ్ ఎఫర్ట్స్ తో కలపాలి. అలా మీరు కరెక్ట్ గా దీనిని ఎగ్జిక్యుట్ చేయగలిగితే, మీరు మీ బ్లాగ్ కి ట్రాఫిక్ రెగ్యులర్ గా పెరగటానికి హెల్ప్ అవుతుంది.  ఇలా చేయగలిగితేనే మీ బ్లాగ్ ద్వారా మనీ ఎర్న్ చేయవచ్చు.

మీ బ్లాగ్ ని కంటెంట్ తో గ్రో చేయటం

how to grow blog in telugu

కంటెంట్ మార్కెటింగ్ మీ బ్లాగ్ గ్రో అవ్వటానికి, ట్రాఫిక్ పెరగటానికి, మీ బ్లాగ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళటానికి ముఖ్యమైన మార్గాలలో ముఖ్యమైనది. కంటెంట్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ ప్రకారం కంటెంట్ మార్కెటింగ్ రిలేటెడ్ టాపిక్స్ గురించి కంటెంట్ మార్కెటింగ్ గురించి

“కంటెంట్ క్రియేట్ చేయటం, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయటం, రెగ్యులర్ గా, రిలవెంట్ కంటెంట్ క్రియేట్ చేయటం ద్వారా మీ టార్గెటెడ్ ఆడియన్స్ ని ఆకర్షించడానికి, దాని ద్వారా ప్రాఫిటబుల్ కస్టమర్ ని పొందే మార్కెటింగ్ టెక్నిక్”.

కంటెంట్ మార్కెటింగ్ అనే మాట డిజిటల్ రంగంలో మనం ఎక్కువగా వింటూ ఉంటాం. ఈ సెక్షన్ లో మనం బ్లాగ్ పోస్ట్స్ ద్వారా, పేజెస్ ద్వారా మీ బ్లాగ్ ని గ్రో చేయటం గురించి మనం తెలుసుకుందాం.

కంటెంట్ ద్వారా మీ బ్లాగ్ ని గ్రో చేయాలి అని సింపుల్ గా చెప్పాలి అంటే…

“కంటెంట్ ద్వారా మీ బ్లాగ్ ని గ్రో చేయటానికి చాలా టైం, ఎంతో శ్రమని పెట్టుబడి గా పెట్టాలి, కానీ ఒక్కసారి మీ కంటెంట్ ర్యాంక్ అయితే చాలా కాలం మనం రిజల్ట్స్ పొందగలం.”

వ్రాసే ముందు రీసెర్చ్ చేయాలి

కీవర్డ్స్ రీసెర్చ్ మీ బ్లాగ్ ట్రాఫిక్ ఇంక్రీస్ అవ్వటానికి ఒక ముఖ్యమైన మార్గాలలో ఒకటి. మీ రీడర్స్ ఇది చదువుతారు అని కంటెంట్ పబ్లిష్ చేయకండి, దానికి బదులుగా వాళ్ళు ఏం సెర్చ్ చేస్తున్నారో దాన్ని పబ్లిష్ చేయండి. అదే కీవర్డ్స్ రీసెర్చ్ యొక్క మేజిక్.

ఇది ఖచ్చితంగా వర్క్ అవుతుంది, నన్ను నమ్మండి. నేను రీసెంట్ గా నా బ్లాగ్ లో కొన్ని బ్లాగ్ పోస్ట్స్ కీవర్డ్స్ రీసెర్చ్ చేసి పబ్లిష్ చేశాను, కొన్ని కీవర్డ్స్ రీసెర్చ్ చేయకుండా చేశాను. కీవర్డ్స్ రీసెర్చ్ చేసిన పోస్ట్స్, కీవర్డ్స్ రీసెర్చ్ చేయకుండా పబ్లిష్ చేసిన పోస్ట్స్ బాగా పర్ఫాం చేస్తున్నాయి, అందుకే చెప్తున్నాను.

మీ కంటెంట్ స్ట్రాటజీ ని మీ టార్గెటెడ్ ఆడియన్స్ కోసం క్రియేట్ చేయండి.

కంటెంట్ క్రియేట్ చేసే ముందు మీరు ఆ కంటెంట్ ఎవరి కోసం క్రియేట్ చేస్తున్నారో తెలియాలి.  మన ఇండియాలో ఎన్నో బ్లాగ్స్ బ్లాగింగ్ ద్వారా మనీ ఎర్న్ చేయటానికి ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నాయి. బ్లాగింగ్ లో వచ్చే పెయిన్ పాయింట్స్, వాటి సోలుషన్స్ ఇలాంటివి, బ్లాగ్ పోస్ట్ టాపిక్స్ ఇలాంటివి ఎన్నింటి గురించో గైడేన్స్ ఇస్తున్నాయి. (తెలుగులో ఉన్న టాప్ 5 బ్లాగ్స్ లో మన బ్లాగ్ కూడా ఒకటి అని చెప్పటానికి నాకు సంతోషంగా ఉంది )

మీ కంటెంట్ స్ట్రాటజీ  డెవలప్ చేసే ముందు ఈ విషయాలు దృష్టిలో ఉంచుకోండి

మీ టార్గెట్ ఆడియన్స్ కి కావాల్సిన కంటెంట్ ఏంటో తెలుసుకోండి. అటువంటి కంటెంట్ క్రియేట్ చేస్తే మీ టార్గెటెడ్ ఆడియన్స్ కి రీచ్ అవ్వటానికి హెల్ప్ అవుతుంది.

మీ రైటింగ్ స్టైల్, మీ నిష్ రిలేటెడ్ టెర్మినాలజీ వాళ్ళకి ఎంత వరకూ రీచ్ అవుతుంది అని ఆలోచించండి. ఉదాహరణకి మనది బ్లాగ్ నే తీసుకుంటే, తెలుగు బ్లాగ్ అయినా కూడా చాల వరకూ టెర్మినాలజీ అలాగే తెలుగులో టైప్ చేస్తాను. ఎందుకంటె టెక్నికల్ వర్డ్స్ అన్ని తెలుగులోకి మార్చలేము, అర్థం కూడా కాకపోవచ్చు .

ఇంకా సింపుల్ అర్థం అయ్యేట్లుగా చెప్తాను. టపా అంటే ఏంటో తెలుసా? బ్లాగ్ పోస్ట్ ! ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అందుకే నేను రెగ్యులర్ గా ఉపయోగించే మాటలు అలాగే ఉపయోగిస్తాను, వాటిని తెలుగులోకి మార్చటం వలన పెద్దగా ప్రయోజనం ఉండదు అనుకుంటున్నా.

ఒక్కసారి కంటెంట్ స్ట్రాటజీ రెడీ అయితే మీరు కాంన్సీస్టెన్సి (రేగులారిటి) ఉండాలి. మీ రీడర్స్ మీ రైటింగ్ స్టైల్ నచ్చితే వాళ్ళు మీ బ్లాగ్ లో కంటెంట్ ని కోరుకుంటారు, వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు కదా!

ఒక బ్లాగ్ పోస్ట్ ని ఎలా వ్రాయాలి?

సెర్చ్ ఇంజిన్స్ నుండి కొన్ని బ్లాగ్స్ కి మాత్రమే ట్రాఫిక్ ఎందుకు వస్తుందో తెలుసా?

సోషల్ మీడియా? ఈమెయిలు మార్కెటింగ్? పెయిడ్ ప్రమోషన్స్ ?….కాదు కంటెంట్.

మిలియన్ డాలర్స్ ఆన్లైన్ బిజినెస్ క్రియేట్ చేయాలి అంటే ఖచ్చితంగా కంటెంట్ ద్వారానే అది సాధ్యం.

500 వర్డ్స్ ఆర్టికల్స్ వ్రాయటం వల్ల ట్రాఫిక్ వచ్చే రోజులు పోయాయి. రీడర్స్ కి ఇచ్చే వేల్యూ ని బట్టి ఉంటుంది. సెర్చ్ ఇంజిన్ క్రాలర్స్  కి కూడా ఎవరు రీడర్స్ కోసం వ్రాస్తున్నారో తెలుస్తుంది.

మీరు లాయల్ రీడర్స్ ని బిల్డ్ చేయటానికి లాంగ్ ఫార్మటు కంటెంట్ హెల్ప్ అవుతుంది. అంతే కాకుండా లాంగ్ ఫార్మటు కంటెంట్ సెర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్స్ ఇంక్రీస్ అవ్వటం లో హెల్ప్ అవుతాయి. (అవసరం లేకపోతే లాంగ్ ఫార్మటు కంటెంట్ క్రియేట్ చేయవలసిన అవసరం లేదు.)

కంటెంట్ వ్రాయటం అంటే కేవలం వ్రాయటం కాదు. వ్రాయటం, టెక్నికల్ ఇష్యూస్ ని కలిపి మీరు కంటెంట్ ప్రొడ్యూస్ చేయగలిగితేనే మీ కంటెంట్ ర్యాంక్ అవుతుంది, దాని ద్వారా రిజల్ట్స్ పొందవచ్చు.

లింక్ బిల్డింగ్ స్ట్రాటజీ బిల్డ్ చేయాలి

సెర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్స్ లో మీరు బ్లాగ్ పోస్ట్ ర్యాంక్ అవ్వాలి అంటే మీకు మంచి ప్రొఫైల్ ఉన్న సైట్ నుండి మీకు ఒక లింక్ ఉండాలి. దీనినే బ్యాక్ లింక్స్ అంటారు. ఒక్కపుడు అనేక రకాల లింక్ బిల్డింగ్ స్ట్రాటజీస్ పని చేసేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. బ్లాగ్ కామెంటింగ్, డైరెక్టరీ లిస్టింగ్స్ లో మీ బ్లాగ్ పోస్ట్ ని సబ్మిట్ చేయటం, లింక్స్ ఎక్స్చేంజి చేసుకోవటం లాంటివి ఇప్పుడు అంతగా ప్రభావం చూపకపోవచ్చు.

మీరు హై క్వాలిటీ లింక్స్  పైన ఫోకస్ చేయండి. గెస్ట్ బ్లాగింగ్ ద్వారా మీ ఇండస్ట్రీ లోనే క్రొత్త బ్లాగర్స్ లేదా ఇతర బ్లాగర్స్ వాళ్ళ బ్లాగ్ పోస్ట్స్ లో మీ బ్లాగ్ పోస్ట్స్ లింక్, కూడా హెల్ప్ అవుతుంది.  ఇలా చేయటం ద్వారా మీకు మంచి రిజల్ట్స్ కూడా పొందే అవకాశం ఉంది.

మీ బ్లాగ్ గ్రోత్ ని పర్యవేక్షించాలి

సక్సెస్ ఫుల్ బ్లాగ్స్ రాత్రికి రాత్రి పాపులర్ అవ్వలేదు లేదా పెట్టినవెంటనే పాపులర్ అవ్వలేదు. వాళ్ళు కూడా మీలాగా మొదలుపెట్టి, ఎన్నో ప్రయత్నాలు చేసి, ఎన్నో ఎదురుదెబ్బలు తిని, వాటినుండి ఎన్నో విషయాలు నేర్చుకుని, కాలానుగుణంగా వచ్చే ఎన్నో మార్పులకి తగ్గట్లుగా మార్చుకుంటూ ఈరోజు మంచి స్థాయిలో ఉన్నారు. మీ బ్లాగ్ మీకు మనీ మేకింగ్ మెషిన్ లా అవ్వగలదు.

మీ బ్లాగ్ ని మానిటర్ చేయటానికి మనకి గూగుల్ ఎనలిటిక్స్ ఉపయోగించవచ్చు. దీనిద్వారా మనం వీటిని కూడా తెలుసుకోవచ్చు.

ఎలాంటి ఆర్టికల్స్ కి ట్రాఫిక్ వస్తుంది అని తెలుసుకోవచ్చు.

ఏ హెడ్డింగ్స్ మీ బ్లాగ్ కి మరింత ట్రాఫిక్ తిసుకువస్తుందో తెలుసుకోవచ్చు

మీ బ్లాగ్ యొక్క బౌన్సు రేట్ ఎంత ఉంది? మీ బ్లాగ్ లో ఒక రీడర్ ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు అనేవి తెలుసుకోవచ్చు

మీ బ్లాగ్ యొక్క యాడ్స్, ఎలా కన్వర్షన్స్ ఎలా అవుతున్నాయి అనేవి కూడా మనం తెలుసుకోవచ్చు.

మీ బ్లాగ్ ని చిన్న చిన్న చెంజ్స్ ద్వారా, ప్రయోగాత్మకంగా గ్రో చేసుకోవచ్చు. కాబట్టి మీరు చేసే చేంజెస్ ఎలా వర్క్ అవుతున్నాయి అని ఈ ఎనలిటిక్స్ బాగా ఉపయోగపడుతుంది.

మీరు సాధించిన విజయాల్ని మరింత పెంచుకోవాలి

ఒక సక్సెస్ఫుల్ బ్లాగ్ ని బిల్డ్ చేయటం అంత సులభం కాదు. అందుకు మీరు స్ట్రాటజీ ప్రకారం పని చేయవలసి ఉంటుంది. ఎప్పుడైతే మీ బ్లాగ్ మనీ ఎర్న్ చేయటం స్టార్ట్ అవుతుందో అప్పటి నుండి మీ సక్సెస్ ని స్కేల్ చేయగలం.

బ్లాగ్ ని సక్సెస్ చేయటానికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి. గూగుల్ లో మీ బ్లాగ్ పేజెస్ ఏయే కీవర్డ్స్ ర్యాంక్ అయి ఉన్నాయో, వాటిని మరిన్ని కీవర్డ్స్ కి ర్యాంక్ అయ్యే విధంగా చేయాలి. అంతే కాకుండా అఫిలియేట్ సేల్స్ కూడా మీ సక్సెస్ రేట్ పెరుగుతుంది. అంతే కాకుండా మీరు ఇన్ఫర్మేషనల్ ప్రొడక్ట్స్ లేదా కోర్సెస్ కూడా సేల్ చేయవచ్చు.

బ్లాగ్ కోసం SEO ఎందుకు చేయాలి?

ప్రతి బ్లాగ్ కి గూగుల్ నుండి ఆర్గానిక్ సెర్చ్ ట్రాఫిక్ రావాలి అనుకుంటారు. అలా జరగాలి అంటే మీ బ్లాగ్ సెర్చ్ ఇంజిన్స్ కి ఆప్టిమైజేషన్ చేయాలి. అయితే ఈ SEO అనేది ఎప్పటికి అప్పుడు అప్డేటెడ్ గా ఉండాలి. SEO ద్వారా మీరు రిజల్ట్స్ పొందగలిగితే దాని ద్వారా మీరు మీ యాడ్సెన్స్ రెవిన్యూ పెంచుకోవచ్చు, లేదా అఫిలియేట్ సేల్స్ కూడా పెంచుకోవచ్చు.

కాబట్టి SEO అనేది చాలా చాలా ఇంపార్టెంట్. SEO లో క్వాలిటీ బ్యాక్ లింక్స్ కూడా కీలకం. మీ బ్లాగ్ ని గ్రో చేయటానికి మీకంటూ ఒక స్ట్రాటజీ ఉండాలి. స్ట్రాటజీ ప్రకారం కష్టపడితేనే మీరు సక్సెస్ అవ్వగలరు.

మీకు టైం ఉంటె ఈ బ్లాగ్స్ కూడా చదవండి. ఇవి మీకు ఇంకా హెల్ప్ అవుతాయి 👇👇

Exit mobile version