Always VJ

2020 లో SEO లేకుండా మీ బ్లాగ్ కి ట్రాఫిక్ ఎలా తీసుకురావాలి?

Spread the love

How to get traffic without SEO in Telugu

ఒక బ్లాగ్ పోస్ట్ గూగుల్ లో రాంక్ అవ్వాలి అంటే 200 రకాల కారణాలు ఉంటాయి. అంతే కాకుండా మీ SEO ఎఫర్ట్స్ రిజల్ట్స్ ఇవ్వాలి అంటే కనీసం 3 నుండి 6 నెలల సమయం పడుతుంది.

మరి క్రొత్త బ్లాగర్స్ అంత టైం వెయిట్ చేయలేరు కదా! మరి ఎలా?

అందుకే ఈ బ్లాగ్ పోస్ట్ లో కొత్త‌గా స్టార్ట్ చేసిన బ్లాగ్స్ కి  SEO చేయ‌కుండా బ్లాగ్ ట్రాఫిక్ ఎలా పొందాలో తెలుసుకుందాం.

how to get traffic without SEO in telugu

How to get traffic without SEO in Telugu

ఏ బ్లాగర్ కి అయినా గూగుల్ నుండి ట్రాఫిక్ వస్తే ఆ సంతోషమే వేరు. అంతే కదా! మీకు కూడా గూగుల్ నుండి ట్రాఫిక్ వస్తే ఆ మజానే వేరు. ఎందుకంటె సెర్చ్ ఇంజిన్స్ నుండి వచ్చే ట్రాఫిక్ క్వాలిటీగా ఉంటుంది. అంతే కాకుండా ఎక్కువ టైం మన బ్లాగ్ లో టైం స్పెండ్ చేసే అవకాశం కూడా ఉంది.

అందుకే ప్రతీ బ్లాగర్ సెర్చ్ ఇంజిన్స్ లో తమతమ బ్లాగ్ పోస్ట్స్ రాంక్ అవ్వాలి అని కష్టపడుతుంటారు. Onpage SEO, Offpage SEO, Link building ఇలా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొత్తగా బ్లాగింగ్ స్టార్ట్ చేసిన వారికీ సెర్చ్ ఇంజిన్స్ నుండి ట్రాఫిక్ ఎలా వస్తుంది? రాదు. మరి అటువంటి కొత్త బ్లాగర్స్ కోసం ఈ బ్లాగ్ పోస్ట్ లో నేను SEO చేయకుండానే 5 రకాలుగా బ్లాగ్ కి ట్రాఫిక్ ఎలా తీసుకురావచ్చు అని చెప్తాను.

  1. సోషల్ మీడియా
  2. గెస్ట్ బ్లాగ్ పోస్టింగ్
  3. ఆన్లైన్ ప్రమోషన్ (Advertising)
  4. ఈమెయిల్ మార్కెటింగ్
  5. కమ్యూనిటీ / గ్రూప్స్

1) సోషల్ మీడియా

SEO చేయ‌కుండా మ‌నం మ‌న బ్లాగ్ కి ట్రాఫిక్ రావాలంటే సోష‌ల్ మీడియాను యూజ్ చేయాలి. సోష‌ల్ మీడియా నెట్ వ‌ర్క్ ల‌లో మ‌నం రాసిన బ్లాగ్ పోస్ట్ ను షేర్ చేయ‌డం వ‌ల్ల మ‌న బ్లాగ్ కు ట్రాఫిక్ వ‌స్తుంది.

సోష‌ల్ మీడియా నెట్ వ‌ర్క్ ల‌లో వాట్సాప్,  ఫేస్ బుక్, యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ ఇలా చాలా ర‌కాల సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ సైట్స్ ఉన్నాయి. వాటి ద్వారా మ‌నం ట్రాఫిక్ పొంద‌వ‌చ్చు. మీరు సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటే అంత ట్రాఫిక్ వ‌స్తుంది.
సోష‌ల్ మీడియాలోకి రిలాక్స్ కోసం వ‌చ్చే యూజ‌ర్స్ ను మీరు గ్రాబ్ చేయ‌గ‌లిగితే ట్రాఫిక్ ఈజీగా పొంద‌వ‌చ్చు. దీంతో పాటు మీరు సోష‌ల్ మీడియాలో ఏ విధంగా ప్ర‌మోట్ చేస్తున్నార‌నేది కూడా చాలా ఇంపార్టెంట్.

2) గెస్ట్ పోస్టింగ్

గెస్ట్ పోస్టింగ్ అంటే ఏమిటీ..?

గెస్ట్ పోస్టింగ్ ద్వారా ఎలా ట్రాఫిక్ పొంద‌వ‌చ్చో తెలుసుకుందాం. గెస్ట్ పోస్టింగ్ అంటే మీరు ర‌న్ చేస్తున్న బ్లాగ్ కు సంబంధించిన కంటెంట్ ను మీకు తెలిసిన ఎక్స్ ప‌ర్ట్స్ ర‌న్ చేస్తుంటే వారి బ్లాగ్ కు మీరు బ్లాగ్ పోస్ట్ లు రాయండి. దాన్నే గెస్ట్ పోస్టింగ్ అంటారు.

అలా గెస్ట్ పోస్టింగ్ రాయ‌డం వ‌ల్ల మీ బ్లాగ్ కి ట్రాఫిక్ వ‌స్తుంది. మీరు రాసిన గెస్ట్ పోస్టింగ్ కి మీ డీటెయిల్స్ ఇస్తారు. మీరు రాసిన గెస్ట్ పోస్ట్ కి ఆడియ‌న్స్ ఇంప్రెస్ అయితే మీ డీటెయిల్స్ క్లిక్ చేయ‌డం వ‌ల్ల ఆటోమేటిగ్గా మీ బ్లాగ్ కి బ్యాక్ లింక్ వ‌స్తుంది.

దీంతో పాటు ట్రాఫిక్ వ‌స్తుంది. అంతేకాదు ఆడియ‌న్స్ మిమ్మ‌ల్ని ఫాలో అవుతారు. గెస్ట్ పోస్టింగ్ గురించి మీకు రాబోయే రోజుల్లో మ‌రింత డీటెయిల్ గా గెస్ట్ పోస్టింగ్ గురించి చెబుతాను

3)ఆన్లైన్ ప్రమోషన్(Advertising)

ఆన్ లైన్ అడ్వ‌టైజ్ మెంట్ అంటే పెయిడ్ ప్ర‌మోష‌న్. మ‌న ద‌గ్గ‌రున్న అతిత‌క్కువ బ‌డ్జెట్ తో  సోష‌ల్ మీడియాలో లేదంటే పీపీసీ ద్వారా పెయిడ్ క్యాంపెయిన్ చేయ‌వ‌చ్చు.

దీనివ‌ల్ల మ‌నం రాసిన బ్లాగ్ పోస్ట్  మ‌న టార్గెట్ ఆడియ‌న్స్ కు రీచ్ అవుతుంది. నార్మ‌ల్ గా మీరు రాసిన బ్లాగ్ పోస్ట్ కి 50, 100 వ్యూస్ వ‌స్తుంటే పెయిడ్ ప్ర‌మోష‌న్ చేస్తే అంత‌కంటే ఎక్కువ ట్రాఫిక్ వ‌స్తుంది.

మీరు రాసిన ఆర్టిక‌ల్స్ క్వాలిటీగా ఉంటాయి. డైలీ 100 రూపీస్ బ‌డ్జెట్ తో పెయిడ్ ప్ర‌మోష‌న్ చేసుకోవ‌చ్చు.

4) ఈమెయిల్ మార్కెటింగ్

మ‌న బ్లాగ్ కి ట్రాఫిక్ రావాలంటే ఈమెల్ మార్కెటింగ్ చాలా యూజ్ అవుతుంది. మీ బ్లాగ్ ని  వెయ్యి మంది విజిట్ చేస్తుంటే మీ డేటా బేస్ లో ఉన్న యూజ‌ర్స్ కు మీరు రాసిన  బ్లాగ్ పోస్ట్ ను  షేర్ చేయ‌డం ద్వారా ట్రాఫిక్ పెంచుకోవ‌చ్చు.

పెయిడ్ ప్ర‌మోష‌న్ లో మీరు రాసిన బ్లాగ్ పోస్ట్ ను రీడర్స్ కు షేర్ చేస్తే ట్రాఫిక్ పెరుగుతుంది. ఇందుకోసం మీరు ఈమెయిల్ లిస్టు బిల్డ్ చేయాల్సి ఉంటుంది.

చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ రిజల్ట్స్ వచ్చేది ఒక్క ఈమెయిల్ మార్కెటింగ్ తోనే. మీరు కావాలి అంటే ఫ్రీ టూల్స్ యూస్ చేయవచ్చు.

5) కమ్యూనిటీ/గ్రూప్స్

మీరు బ్లాగ్ రిలేటెడ్ క‌మ్యూనిటీని బిల్డ్ చేయండి. అలా చేయ‌డం వ‌ల్ల మీరు రాసిన బ్లాగ్ పోస్ట్ ను మీరు బిల్డ్ చేసిన క‌మ్యూనిటీ గ్రూపుల్లో షేర్ చేయ‌డం వ‌ల్ల ట్రాఫిక్ వ‌స్తుంది.

ఉదాహ‌ర‌ణకు ఫేస్ బుక్ గ్రూఫ్స్, టెలిగ్రామ్ ఇలా కమ్యూనిటిని బిల్డ్ చేసుకొని, మీరు రాసిన ఆర్టిక‌ల్ ను ఆ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తే ఆడియ‌న్స్ మీ బ్లాగ్ రీచ్ అవుతుంది. మీకు బ్లాగ్ కు ట్రాఫిక్ పెరుగుతుంది.

గ్రూప్స్ క్రియేట్ చేయమన్నాం కదా అని అదే పనిగా మీ బ్లాగ్ పోస్టులు, వీడియోస్ షేర్ చేయకండి. ఆ గ్రూప్ లో జాయిన్ అయిన వాళ్ళకి వ్యాల్యుబుల్ కంటెంట్ అందించండి.

అలా చేస్తేనే మీ గ్రూప్ గ్రో అవుతుంది. లేదు అంటే వాళ్ళు మీ గ్రూప్స్ నుండి లెఫ్ట్ అవుతారు. ఆ విషయం మన అందరికి తెలుసు కదా!

ఈ విధంగా చేయటం ద్వారా (How to get traffic without SEO in Telugu) మీరు SEO చేయకుండానే మీ బ్లాగ్ కి ట్రాఫిక్ తీసుకురావచ్చు.

నోట్: నేను ఈ బ్లాగ్ లో చెప్పిన మెథడ్స్ కేవలం కొత్త బ్లాగర్స్ కి ట్రాఫిక్ రావటానికి, అలా వస్తే వాళ్ళకి బ్లాగింగ్ పై నమ్మకం కలుగుతుంది అని. అంతే తప్ప SEO లేకుండా బ్లాగ్ కి ట్రాఫిక్ వస్తుంది అని కాదు. ఖచ్చితంగా SEO చేయాలి, ఎందుకంటె సెర్చ్ ఇంజిన్స్ నుండి మనకి లాంగ్ రన్ లో క్వాలిటీ ట్రాఫిక్ వస్తుంది. SEO చేస్తే రిజల్ట్స్ రావటానికి టైం పడుతుంది కాబట్టి ఈ టిప్స్ చెప్తున్నాను. తప్పుగా అర్థం చేసుకోకండి, తర్వాత నన్ను అపార్థం చేసుకోకండి.

మీకు ఈ టిప్స్ ఎలా యూస్ అయాయి అని కామెంట్ చేయండి. ఒకవేళ నేను ఏమన్నా పాయింట్స్ మిస్ అయితే కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ టైం అప్డేట్ లో ఆడ్ చేస్తాను. ఈ బ్లాగ్ పోస్ట్ మీకు నచ్చితే సోషల్ మీడియా లో షేర్ చేయండి. ఎందుకంటె Sharing is Caring 💓 కదా!

Exit mobile version