Always VJ

How to earn money with Blogging in Telugu

Spread the love

How to earn Money with Blogging in Telugu

మీ బ్లాగ్ ద్వారా త్వరగా 100$ ఎర్న్ చేయడం ఎలా?

ప్రతి బ్లాగర్ కి తన బ్లాగ్ ద్వారా త్వరగా మనీ ఎర్న్ చేయాలి అని కలలు కంటుంటారు. మనీ ఎర్న్ చేయటమే ప్రధాన ఉద్దేశ్యం కాదు బ్లాగింగ్ లో, అది ఒక్క కారణం మాత్రమే.

How to earn money with Blogging in Telugu

ఎందుకు 100$ మాత్రమే అని మీరు అడగవచ్చు?

మీరు మీ మొదటి 100$ ఎర్న్ చేయటానికి బెస్ట్ వే మీ బ్లాగింగ్ జర్నీ స్టార్ట్ చేయటమే. ఒక్కసారి మీరు మీ బ్లాగింగ్ ఎఫర్ట్స్ ద్వారా కొంత డబ్బు సంపాదించారు అనుకోండి, ఇక అదే మిమ్మల్ని ఒక ప్రాఫిటబుల్ బ్లాగ్ బిల్డ్ చేసేలా మోటివేట్ చేస్తుంది. అది కూడా ఒకటి లేదా 2 సంవత్సరాలలో.

మరి మీరు మీ మొదటి $100 మీ బ్లాగ్ ద్వారా ఎలా ఎర్న్ చేయవచ్చు?

నేను $100 అని ఎందుకు అంటున్నాను అంటే అది యాడ్సెన్స్ ద్వారా మనీ ఎర్న్ విత్ డ్రాచేయాలి అనుకున్న మినిమం ఆ అమౌంట్ మీరు ఎర్న్ చేయాలి.

ఈ బ్లాగ్ పోస్ట్ లో నేను మీకు గూగుల్ యాడ్సెన్స్ పైన ఆధారపడకుండా ఇతర మార్గాల ద్వారా మనీ ఎలా ఎర్న్ చేయాలి అని చెప్తాను.

ఎందుకంటె గూగుల్ యాడ్సెన్స్ ద్వారా మీరు ఫస్ట్ చెక్ తీసుకోవాలి అనుకుంటే మీరు కనీసం కొన్ని నెలలు వెయిట్ చేయాలి అని తెలుసా? కొంత మందికి అయితే కొన్ని సంవత్సరాలు ఆగల్సివస్తుంది అని తెలుసా?

ఇది కాదు కదా మీరు అనుకున్నది, అవునా? నాకు తెలుసు చాలా మందికి గూగుల్ యాడ్సెన్స్ ద్వారా రెవిన్యూ జెనరేట్ చేయాలి అనుకుంటారు. అయితే వీలైనంత వరకు మీరు ఆ ఆలోచనని మీ మైండ్ నుండి తీసివేయండి.

ఒకవేళ మీరు మీ బ్లాగ్ స్టార్ట్ చేసిన తరువాత త్వరగా మనీ ఎర్న్ చేయగలిగితే? భలే ఉంటుంది కదా! అయితే మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి,  మీ కల నిజం చేసుకోవటానికి!

Suggested Post : How to Start Blogging in Telugu

మీ బ్లాగ్ ద్వారా మీ మొదటి $100 ఎలా ఎర్న్ చేయాలి?

ఇందుకోసం మనం కొంత సమయం వెచ్చించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటే, మీ బ్లాగ్ ద్వారా రియల్ మనీ ఎర్న్ చేయటానికి అవకాశం ఉంది.

అయితే ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి. ఈ బ్లాగ్ పోస్ట్స్ లో చెప్పిన మెథడ్స్ మీరు బ్లాగింగ్ పైన ఫోకస్ చేసి, సీరియస్ గా ఇంప్లిమెంట్ చేస్తేనే సాధ్యపడుతుంది.

ఈ బ్లాగ్ పోస్ట్ చదివినంత మాత్రాన మీరు మనీ ఎర్న్ చేయలేరు. చదివిన దానిని ఇంప్లిమెంట్ చేస్తేనే సక్సెస్ అవ్వగలరు.

మీ బ్లాగ్ ని మీరు రెగ్యులర్ గా బ్లాగ్ పోస్ట్స్ పబ్లిష్ చేయాలి. ప్రతి రోజు 3 నుండి 4 గంటలు ప్రతిరోజూ పనిచేస్తేనే మీరు మంచి రిజల్ట్స్ చూడగలరు.

ఇక మీ మొదటి $100 ఎలా సంపాదించాలో తెలుసుకుందాం !

నిష్ సైట్ స్టార్ట్ చేయటానికి లాంగ్ టైల్ కీవర్డ్స్ యూస్ చేయండి.

అసలు ఇంతవరకు ఎటువంటి బ్లాగ్ పోస్ట్స్ వ్రాయకుండా మీరు పెద్ద పెద్ద బ్లాగర్స్ కి పోటిగా మీ బ్లాగ్ పోస్ట్ ని గూగుల్ ఫస్ట్ పేజిలో రాంక్ చేయాలి అనుకుంటే అని కష్టమైనా విషయమే.

దానికి బదులుగా మీరు లాంగ్ టైల్ కీవర్డ్స్ ని ట్రై చేయండి, వీటికి కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది రాంక్ అవ్వటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఉదాహరణకి “weight loss” అని మీరు సెర్చ్ చేస్తే దానికి ఓవరాల్ సెర్చ్స్ ఒక 5900 ఉంటుంది అనుకుందాం. అదే కనిక మీరు “weight loss for men” అని సెర్చ్ చేస్తే కాంపిటీషన్ 2000 ఉంటుంది. ఇది మీడియం కాంపిటీషన్.

Weight loss అనేది షార్ట్ టైల్ కీవర్డ్. Weight loss for men అనేది మీడియం టైల్ కీవర్డ్. అదే కనుక మీరు “weight loss for men above 35 years” యూస్ చేస్తే ఇది లాంగ్ టైల్ కీవర్డ్.

ఈ కీవర్డ్ కి కాంపిటీషన్ తక్కువగా ఉన్నా, రాంక్ అవ్వటానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

అదే విధంగా మీరు టాప్ 10 మొబైల్ ఫోన్స్ ఫర్ స్టూడెంట్స్ అని లేదా బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ 15k అని యూస్ చేస్తే వీటికి రాంక్ అవ్వటానికి అవకశాలు ఎక్కువగా ఉంటాయి.

Suggested Post : What are Keywords in Telugu

మీ ఫస్ట్ $100 ఎర్న్ చేయటం

మీ ఫస్ట్ $100 ఎర్న్ చేయటానికి సులభమైన మార్గం, మీ దగ్గర ఉన్న ఈమెయిలు లిస్టు. మీ దగ్గర 100 నుండి 500 లోపు ఉన్న ఈమెయిలు లిస్టులో ఉన్న మీ సబ్స్క్రయిబర్స్ లో మీ $50 అఫిలియేట్ ప్రోడక్ట్ 2 తీసుకున్న మీరు మీ ఫస్ట్ $100 ఎర్న్ చేయగలరు.

ఏంత టైం పడుతుంది?

1 లేదా 2 గంటల్లో మీరు మీ ఈమెయిలు న్యూస్లెటర్ రాసి దాని ద్వారా మీ అఫిలియేట్ ప్రొడక్ట్స్ ప్రోమోట్ చేయవచ్చు. ఖచ్చితంగా వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ లేదా బోనస్లు ఆఫర్ చేయాలి. ఒకవేళ వాళ్ళు ఆ ప్రొడక్ట్స్ ఉపయోగపడతాయి అనుకుంటే అవి మీ బ్లాగ్ కి రిలేటెడ్ గా ఉంటె ఖచ్చితంగా తీసుకుంటారు.

మరి ఇంకేం ఆలోచిస్తున్నారు?

మీ ఈమెయిలు లిస్టు బిల్డ్ చేయండి. ఇందుకోసం మీరు Convertkit యూస్ చేసుకోవచ్చు. Convertkit ఫ్రీ గా 1000 సబ్స్క్రయిబర్స్ కి మనం ఈమెయిల్స్  సెండ్ చేయవచ్చు.

ఫ్రీ గా ఏమైనా ఆఫర్ చేయండి, ఫ్రీ ట్రయిల్, ఫ్రీ ఈబూక్, ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ కోర్స్ ఇలా మీరు ఇవ్వగాలిగినవి ఇస్తే మీరు త్వరగా ఈమెయిలు లిస్టు డబల్ చేసుకోవచ్చు.

పెయిడ్ ఆర్టికల్స్ వ్రాయండి

మీకు కనుక మంచి రైటింగ్ స్కిల్స్ ఉంటె మీరు ఫ్రీలన్స్ రైటింగ్ చేయవచ్చు. అంతే కాకుండా మీకు పెద్దగా డబ్బులు కూడా అవసరం లేదు ఫ్రీలాన్స్ రైటింగ్ ద్వారా మనీ ఎర్న్ చేయటానికి.

అయితే మీకు కావాల్సిందల్లా ఒక లాండింగ్ పేజి. మీ రైటింగ్ సర్వీసెస్ కోసం మిమ్మల్ని హైర్ చేసుకోవడం కోసం. అంతే కాకుండా మీరు మీ బ్లాగ్ లో రెగ్యులర్ గా బ్లాగ్ పోస్ట్స్ పబ్లిష్ చేస్తూ ఉండాలి.

ఒక వేళ మీ  బ్లాగ్ పోస్ట్స్ చదివేవాళ్ళకి మీ పోస్ట్స్ నచ్చితే (వాళ్ళకి అవసరం కూడా ఉంటె) మీ రైటింగ్ సర్వీసెస్ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు.

అప్పుడు మీరు ఒక్కో ఆర్టికల్ కి $100 ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కో ఆర్టికల్ కి $10 తీసుకున్న ఒక్క 10 ఆర్టికల్స్ రాస్తే సరిపోతుంది.  అంతే కాకుండా మీరు బల్క గా 10 పోస్ట్స్ కి ప్యాకేజ్ లాగా $80 లేదా $90 ఆఫర్ ఇస్తే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండొచ్చు.

మీకు కొంత మంది రెగ్యులర్ క్లైంట్స్ కనుక ఉంటె అప్పుడు మీరు కొంచెం ఎక్కువ ఛార్జ్ చేయవచ్చు.

అయితే ఇందుకు మీరు మంచి రైటింగ్ స్కిల్ల్స్ అవసరం అని మర్చిపోకండి. అందుకోసం మీరు రెగ్యులర్ గా బ్లాగింగ్ చేయాలి అని మర్చిపోకండి.

ఎండార్స్మెంట్ పొందటం

ఎండార్స్మెంట్ అంటే ఒక రకంగా పబ్లిసిటీ అనుకోవచ్చు. మీ ఇండస్ట్రీ లోనే పెద్ద బ్లాగర్స్ నుండి ఎండార్స్మెంట్ తెచ్చుకోగలిగితే మీ పైన మీ రీడర్స్ కి ఇంకా నమ్మకం కలుగుతుంది. మరి ఆ బ్లాగర్స్ నుండి ఎండార్స్మెంట్ తెచ్చుకోవటం ఎలా?

Fiverr ద్వారా మీ ఫస్ట్ $100 ఎర్న్ చేయవచ్చు

ఆన్లైన్ ద్వారా మనీ ఎర్న్ చేయటానికి ఇంకొక మార్గం Fiverr.  ఇదొక ఆన్లైన్ మార్కెట్ లాంటిది. ఇక్కడ మనకి కావాల్సిన సర్వీసెస్ ని మనం $5 నుండి పొందవచ్చు.

అంటే మీకు లోగో డిజైనింగ్ల్ ఎడిటింగ్ లేదా ఆర్టికల్ రైటింగ్ లాంటివి వస్తే మీరు $5 కి మీ స్కిల్స్ సెల్ చేయవచ్చు. రిక్వైర్మెంట్ ని బట్టి మీ ప్రైస్ కూడా ఇంక్రీస్ చేయవచ్చు. ఎందుకంటె ఇక్కడ ఎప్పుడు క్లైంట్స్ వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ గురించి సెర్చ్ చేస్తుంటారు.

వాళ్ళకి మీ వర్క్ కనుక నచ్చితే మీరు ఎన్ని వర్క్స్ చేసుకుంటే అంత మనీ ఎర్న్ చేయవచ్చు.

అందుకు మీరు ముందు మీకు ఏది బాగా వచ్చో తెలుసుకోవాలి. ఒకవేళ మీరు రైటింగ్ స్కిల్ల్స్ బాగా నేర్చుకుంటే మీరు మీ సర్వీసెస్ ని మొదట $5 కి సెల్ చేసి ఎక్కువ క్లైంట్స్ ని పొందవచ్చు.  ఆ తరువాతా వాళ్ళని మీ క్లైంట్స్ గా మార్చుకోవచ్చు.

వాళ్ళకి మీరు మీ ప్రీమియం సర్వీసెస్ ని కూడా మీరు ప్రమోట్ చేసి ఇంకా ఎక్కువ మనీ ఎర్న్ చేయవచ్చు.

అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేయండి.

మీ బ్లాగ్ కి గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ తెచ్చుకోవటం కోసం మీరు అంత ఆత్రపడవద్దు. ఎందుకంటె యాడ్సెన్స్ ద్వారా వచ్చే రెవిన్యూ చాలా చాలా తక్కువ.

ఒకవేళ మీరు యాడ్సెన్స్ ద్వారా ఎర్న్ చేయాలి అనుకుంటే అప్పుడు మీరు హై CPC ఉనన్ కీవర్డ్స్ యూస్ చేయాలి. లాంగ్ టైల్ కీవర్డ్స్ యూస్ చేయాలి. ఇదంతా చేసే టైంలో మీరు అఫిలియేట్ ప్రొడక్ట్స్ ప్రోమోట్ చేయవచ్చు. మీ నిష్ లో కూడా అఫిలియేట్ ప్రొడక్ట్స్ ఉంటాయి.

కాబట్టి మీరు మీ నిష్ కి సంబంధించిన అఫిలియేట్ ప్రోగ్రామ్స్ లో జాయిన్ అవ్వండి.

అదే మీరు బ్లాగింగ్ లేదా డిజిటల్ మార్కెటింగ్ బ్లాగర్ అయితే డొమైన్, వెబ్ హోస్టింగ్ లాంటివి ప్రమోట్ చేయవచ్చ్చు. ఒకవేళ మీరు ఫుడ్ బ్లాగింగ్ చేస్తుంటే కొన్ని వస్తువులు అన్ని చోట్ల అందరికి అందుబాటులో ఉండవు. అలంటి వాటిని మీరు అఫిలియేట్ చేయవచ్చ్చు. ఇలా దాదాపుగా ప్రతి ఇండస్ట్రీలోను అఫిలియేట్ ప్రొడక్ట్స్ ఉంటాయి.

మీ అఫిలియేట్ లింక్స్ ద్వారా పర్చేస్ చేస్తాను అంటే మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తేను అని ప్రామిస్ చేయవచ్చు. ఈ విధంగా మీరు 3-6 నెలల్లో మీ ఫస్ట్ $100 ఎర్న్ చేయవచ్చు.

Suggested Post : Blog Monetization Sources in Telugu

ప్రోడక్ట్ రివ్యూస్

మీరు మీ బ్లాగ్ లో ప్రోడక్ట్ రివ్యూస్ ఆఫర్ చేయవచ్చు. ఒక్కసారి మీరు ప్రోడక్ట్ రివ్యూ రాసే ముందు మీరు బాగా రీసెర్చ్ చేయాలి. ఆ ప్రోడక్ట్ బాగుందా? లేదా? అని జెన్యూన్ గా మీరు బ్లాగ్ పోస్ట్స్ రాస్తే మీ రీడర్స్ ఆ ప్రొడక్ట్స్ పర్చేస్ చేస్తారు.

ఒకవేళ మీ దగ్గర ఆ ప్రోడక్ట్ అఫిలియెట్ లింక్ ఉంటె ఇంకా ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేయవచ్చు.

అంతే కాకుండా మీరు పెయిడ్ రివ్యూస్ కూడా రాయవచ్చ్చు. అంటే ఒక ప్రోడక్ట్ గురించి రాయటం ద్వారా మీకు కొంత అమౌంట్ అనేది వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది. మీరు SponseredReview, PayperPost, LinkfromBlog వంటి వాటి నుండి ప్రోడక్ట్ రివ్యూస్ పొందవచ్చు.

ఒక ఈబూక్ క్రియేట్ చేసే సేల్ చేయటం.

ఒక ఈబూక్ ని క్రియేట్ చేయటం ఏమి రాకెట్ సైన్సు కాదు. మీకు మీ బ్లాగ్ టాపిక్స్ గురించి మంచి నాలెడ్జ్ ఉంటె మీరు ఒక పెయిడ్ ఈబూక్ క్రియేట్ చేయటం పెద్ద మేటర్ కాదు.

ఇందుకోసం మీరు కొన్ని కొత్త విషయాలు ఇందులో చెప్పాలి. మీరు మీ కాంపిటీషన్ ని అర్థం చేసుకుని, టాప్ బ్లాగర్స్ ఎలాంటి ప్రొడక్ట్స్ సెల్ చేస్తున్నారు అని గమనించండి. అప్పుడు మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఎలాంటి ఈబూక్ క్రియేట్ చేయాలి అని.

మీ నిష్ లో ఎవరూ ఈబూక్స్ సెల్ చేయకపోతే మీరే మొదలుపెట్టండి. ఏమో మీ ఈబూక్ మీ బ్లాగ్ రీడర్స్ అటేన్షన్ పొందగలిగితే మీకు వేల డాలర్స్ సంపదిన్చగలదేమో.

ఆ ఈబూక్ కి మీరు $10 పెట్టినా, వారానికి ఒక్క ఈబూక్ అమ్ముడుపోయినా మీరు మీ ఫస్ట్ $100, 3 నెలల్లో ఎర్న్ చేయగలరు కదా! అదే విధంగా మీరు కోడింగ్ వస్తే థీమ్స్, ప్లగిన్స్ లాంటివి కూడా క్రియేట్ చేసి సెల్ చేయవచ్చు. వీటిని సెల్ చేయటానికి మీ బ్లాగ్ మంచి ప్లాట్ఫారం.

ముగింపు

ఇంతవరకు చెప్పినవి మీరు ఇంప్లిమెంట్ చేస్తే,  మీరు మీ బ్లాగ్ ద్వారా $100 ఎర్న్ చేయటం చాలా ఈజీ.  మీరు మీ $100 ఎర్న్ చేశాక కూడా రెగ్యులర్ గా ఇవి చేస్తూ ఉంటె రెవిన్యూ ఇంక్రీస్ అవుతుంది. అలాగని కేవలం గూగుల్ యాడ్సెన్స్ పైన మాత్రమే ఆధారపడకండి.

ఈ పోస్ట్ చదివి మీరు మీ ఫస్ట్ $100 ఎర్న్ చేసి ఈ బ్లాగ్ పోస్ట్ లో కామెంట్ చేయండి. మాకు కూడా హ్యాపీగా ఉంటుంది, అదేవిధంగా కొత్తగా ఆన్లైన్ ఎర్నింగ్స్ చేయాలి అనుకునే వాళ్ళకి కూడా హెల్ప్ ఫుల్ గా ఉంటుంది.

ఈ పోస్ట్ బాగుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ కి, మీ అక్కలకి, చెల్లెళ్లకి, అన్నలకి, తమ్ముళ్ళకి, బావలకి, బామ్మర్దులకి, మరదల్లకి షేర్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటె కామెంట్ చేయండి. ఈ పోస్ట్ షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి.

Exit mobile version