Always VJ

How to Create A Blog in blogger in Telugu

Spread the love

బ్లాగర్ లో ఒక బ్లాగ్ ని ఎలా క్రియేట్ చేయాలి

How to create a blog in blogger in telugu in 2022 బ్లాగింగ్ స్టార్ట్ చేయాలి అనుకునేవారిలో చాలా మంది ఫ్రీగా బ్లాగింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. అటువంటి వాళ్ళకి Blogger (బ్లాగర్) ద్వారా ఈజీగా బ్లాగింగ్ స్టార్ట్ చేయవచ్చు. ఇంతకుముందు మన బ్లాగ్ లో బ్లాగర్ ద్వారా బ్లాగింగ్ ఎలా స్టార్ట్ చేయాలి అని స్టెప్ బై స్టెప్ బ్లాగ్స్, వీడియో ట్యుటోరియల్స్ ని కూడా అందించడం జరిగింది.

అయితే 2020 జూన్ లో బ్లాగర్ తన ఇంటర్ ఫేస్ ని చేంజ్ చేసింది. కొత్తగా బ్లాగింగ్ స్టార్ట్ చేసేవారికి హెల్ప్ అవుతుంది అని బ్లాగర్ లేటెస్ట్ ఇంటర్ ఫేస్ పైన స్టెప్ బై స్టెప్ ట్యుటోరియల్ బ్లాగ్ పోస్ట్స్ అందించాలి అనుకుంటున్నాం. అదే విధంగా వీడియో ట్యుటోరియల్స్ కూడా అందిస్తున్నాం. వీడియోస్ మా యూట్యూబ్ ఛానల్ లో ఒక ప్లేలిస్టు లో ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కావాలి అనుకుంటే సబ్స్క్రయిబ్ చేసుకోండి.

How to create a blog in blogger in telugu in 2022

ఇప్పుడు ఒక బ్లాగ్ ని బ్లాగర్ లో ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం.

ముందుగా గూగుల్ ఓపెన్ చేసి blogger అని సెర్చ్ చేయండి. మీకు కొన్ని రిజల్ట్స్ ఈ విధంగా వస్తాయి.

How to Start Blogger Blog in Telugu
How to create a blog in blogger in telugu in 2022

ఇందులో మీరు మొదట కనిపించే లింక్ పైన క్లిక్ చేస్తే బ్లాగర్ వెబ్సైటు లోకి వెళ్తారు.

ఇది బ్లాగర్ అఫీషియల్ వెబ్సైటు. ఇక్కడ Create Your Blog అని ఒక బటన్ కనిపిస్తుంది కదా! దాని పైన క్లిక్ చేయండి. అప్పుడు మిమ్మల్ని గూగుల్ లాగిన్ పేజిలోకి తీసుకు వెళ్తుంది.

మీకు బ్లాగర్ ఏ కాదు, గూగుల్ ప్రొడక్ట్స్ ఏవి మనం యూస్ చేసుకోవాలి అనుకున్న మనకి గూగుల్ ఎకౌంటు ఉండాలి. ఒక జిమెయిల్ ఎకౌంటు క్రియేట్ చేయటం చాలా చాలా ఈజీ.

మీ జిమెయిల్ ఎకౌంటు తో మీరు లాగిన్ అవ్వండి.

మీరు లాగిన్ అయ్యాక మీకు ఈ విధంగా ఒక స్క్రీన్ కనిపిస్తుంది.

ఇక్కడ మీరు మీ బ్లాగ్ కి కావాల్సిన నేమ్ ఇవ్వవలసి ఉంటుంది. నేను  VJ Digital Marketing Services అని ఇస్తున్నాను.

ఇప్పుడు నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా స్క్రీన్ వస్తుంది.

ఇక్కడ మీరు మీ బ్లాగ్ కోసం ఒక url ని తీసుకోవలసి ఉంటుంది. దీనిని మనం సబ్ డోమైన్ అంటాము. అంటే blogspot.com లో మీకు ఒక ఎకౌంటు ఇస్తున్నారు. ఒకవేళ మీరు కస్టమ్ డొమైన్ కావాలి అనుకుంటే దానిని లింక్ చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి సబ్ డొమైన్ తీసుకోవాలి.

సాధారణంగా మనం ఈ డొమైన్ నేమ్ అనేది బ్లాగ్ నేమ్ వచ్చేట్లు గా తీసుకుంటాము. అందుకే నేను కూడా vjdigiservices. blogspot.com అని తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు అడిగిన నేమ్ ఇంతకుముందే ఎవరైనా తీసుకుని ఉంటె వేరే నేమ్ తీసుకోవలసి ఉంటుంది.

బ్లాగ్ url నేమ్ టైపు చేసి, నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది.

ఇది బ్లాగ్ పోస్ట్స్ రాసేటప్పుడు మీ నేమ్ అంటే ఆథర్ నేమ్ ఎలా డిస్ప్లే అవ్వాలి అనే దాని కోసం అడుగుతుంది. ఇక్కడ మీరు ఏ నేమ్ ఇస్తారో ఆ నేమ్ మీకు బ్లాగ్ పోస్ట్స్ ఆథర్ నేమ్ లాగా కనిపిస్తుంది.

నేను నా నేమ్ ఇస్తున్నాను.

మీకు డిస్ప్లే కావాల్సిన నేమ్ ఇచిన తరువాత మీరు ఫినిష్ పైన క్లిక్ చేస్తే మీ బ్లాగ్ క్రియేట్ అయి, బ్లాగర్ డాష్ బోర్డు లోకి రీడైరెక్ట్ చేస్తుంది.

ఇక్కడ మీకు పైన కనిపించే నోటీసు ని క్లోజ్ చేయండి. అవి మనకి అవసరం లేదు. మీకు లెఫ్ట్ సైడ్ కనిపించేది బ్లాగర్ మెనూ.

మీ బ్లాగ్ ని మీరు మ్యానేజ్ చేయటానికి ఇవి మీకు హెల్ప్ అవుతాయి.

మీరు మీ బ్లాగ్ ఎలా ఉందొ చూడాలి అనుకుంటే ఆ మెనూ లో లాస్ట్ లో మీకు VIEW BLOG అని ఒక లింక్ కనిపిస్తుంది.

దాని పైన క్లిక్ చేస్తే మీకు న్యూ ట్యాబు లో మీ బ్లాగర్ బ్లాగ్ ఓపెన్ అవుతుంది.

ఈ విధంగా మీరు మీ బ్లాగ్ ని చాలా ఈజీగా క్రియేట్ చేయవచ్చు. ఈ కంప్లీట్ సిరీస్ లో మీరు ఒక ప్రొఫెషనల్ బ్లాగ్ ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకోవచ్చు.

Suggest to Read How to Create WordPress Blog in Telugu

ఇలాంటి బ్లాగ్ పోస్ట్స్ కోసం మమల్ని ఫాలో అవ్వండి. Instagram లో ఫాలో అవ్వండి. ఎప్పటికి అప్పుడు నేను న్యూ కంటెంట్ ని పోస్ట్ చేస్తూ ఉంటాను.

ఈ బ్లాగ్ పోస్ట్ హెల్ప్ అవుతుంది అనుకుంటే ఫేస్బుక్, వాట్సప్ గ్రూప్స్ లో షేర్ చేయండి. ఎందుకంటె షేరింగ్ ఇస్ కేరింగ్ కదా!

Exit mobile version