Always VJ

How I Earn with My Blog | 2nd Anniversary Special Post

Spread the love

How I Earn With My Blog

బ్లాగింగ్ గురించి చెప్పే వాళ్ళు బ్లాగింగ్ ద్వారా మనీ ఎలా ఎర్న్ చేస్తారు. వాళ్ళకి రెవిన్యూ ఎలా వస్తుంది. ఇలాంటి ఎన్నో డౌట్స్ నా బ్లాగ్ లేదా ఇలాంటి బ్లాగింగ్ రిలేటెడ్ బ్లాగ్స్ చదివేవాళ్ళకి వస్తాయి. Blogger VJ స్టార్ట్ చేసి ఈరోజు కి (అక్టోబర్ 18) సరిగ్గా 2 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ రోజుల్లో ఒక బ్లాగ్ ని 2 సంవత్సరాలు రన్ చేయటం కష్టమైన విషయం.

అందుకు నాకు తోడుగా ఉన్న Blogger VJ బ్లాగ్ రీడర్స్, ఫాలోయర్స్, సబ్స్క్రయిబర్స్, ఇంకా కస్టమర్స్, క్లైంట్స్ కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సందర్భంగా ఈ రోజు నేను నా బ్లాగింగ్ ఎర్నింగ్ సోర్సెస్ గురించి, నా వర్కింగ్ స్టైల్ గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను.

బ్లాగింగ్ ద్వారా మనీ ఎర్న్ చేయాలి అంటే ఖచ్చితంగా యాడ్సెన్స్ ఉండాలి అని చాలామంది పొరబడుతుంటారు. నిజానికి యాడ్సెన్స్ ద్వారా మనీ ఎర్న్ చేయటం కష్టం. ఎందుకంటే యాడ్సెన్స్ రెవిన్యూ రావాలి అంటే మీ బ్లాగ్ కి బాగా ట్రాఫిక్ రావాలి.

చాలా మంది ఈ విషయం అర్థం చేసుకోరు. మన యూట్యూబర్స్ వాళ్ళ యూట్యూబ్ యాడ్సెన్స్ చూపించి బ్లాగింగ్ ద్వారా రెవిన్యూ వచ్చింది అని కలరింగ్ ఇస్తారు. (అందరూ కాదు, కానీ చాలా చాలాఎక్కువ మంది). అది అర్థం చేసుకోకుండా అందరూ బ్లాగ్ కి ట్రాఫిక్ జెనరేట్ చేయకుండా కేవలం యాడ్సెన్స్ గురించి మాత్రమే ఆలోచిస్తారు.

యాడ్సెన్స్ అప్రూవల్ వస్తుంది, కానీ రెవిన్యూ మాత్రం రాదు. కారణం యాడ్సెన్స్ రెవిన్యూ మీ బ్లాగ్ ట్రాఫిక్ పైన ఆధారపడింది. మీ బ్లాగ్ కి ట్రాఫిక్ రావాలి అంటే ముందు మీరు బ్లాగింగ్ నేర్చుకోవాలి. బ్లాగింగ్ అంటే కేవలం ఒక బ్లాగ్ సెటప్ చేసి, అందులో పోస్టులు క్రియేట్ చేయటం మాత్రమే కాదు.

బ్లాగింగ్ అంటే ఏంటి? మీ నాలెడ్జ్ లేదా ఎక్స్పీరియన్స్ ని మీ రీడర్స్ తో షేర్ చేసుకోవడం, కదా! మరి నిజంగా మీరు అది చేస్తున్నారా? మీ రీడర్స్ కోసం కంటెంట్ క్రియేట్ చేయాలి, క్వాలిటీ కంటెంట్ క్రియేట్ చేయాలి, మీలాగే ఆలోచించే ఒక కమ్యూనిటీని బిల్డ్ చేసుకోవాలి.

ఇవన్ని చేస్తున్నారా? లేదు కేవలం యాడ్సెన్స్ అని పరుగులు తీస్తున్నారు. ఒక్క విషయం చెప్తాను వినండి. Neil Patel ఒక మాట చెప్తారు. “మీరు ధనవంతులు కావాలి అని ఎవరూ మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ / సర్వీసెస్ కొనరు, వాళ్ళ ప్రాబ్లం కి సొల్యూషన్ గా మీ ప్రోడక్ట్ / సర్వీస్ ని తీసుకుంటారు అని”. ఈ ఒక్క మాట అర్థం అయితే మీరు బ్లాగింగ్ ని చూసే కోణమే మారిపోతుంది.

యాడ్సెన్స్ రెవిన్యూ ఎర్న్ చేయలేకపోవటానికి ఇదే ప్రధాన కారణం. మరి బ్లాగింగ్ ద్వారా మనీ ఎర్న్ చేయటం ఎలా? బ్లాగింగ్ ద్వారా మనీ ఎర్న్ చేయటానికి యాడ్సెన్స్ ఒక మార్గం మాత్రమే, ఒకే ఒక్క మార్గం కాదు.

బ్లాగింగ్ ద్వారా ఈ క్రింది వాటి ద్వారా కూడా మనీ ఎర్న్ చేయవచ్చు.

1) అఫిలియేట్ మార్కెటింగ్

2) ఓన్ ప్రొడక్ట్స్ / సర్వీసెస్ సేల్ చేయటం,

3) కన్సల్టేషన్ అందించటం,

ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి.

వీటిల్లో దేని ద్వారా మనీ ఎర్న్ చేయాలి అన్నా ముందు మీరు బ్లాగింగ్ నేర్చుకోవాలి. మీ బ్లాగ్ కి వచ్చే విజిటర్స్ ని రీడర్స్ గా మార్చుకోవాలి, ఆ రీడర్స్  ని సబ్స్క్రయిబర్స్ గా మార్చుకోవాలి. ఆ సబ్స్క్రయిబర్స్ ని కస్టమర్స్ గా మార్చుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు బ్లాగింగ్ ద్వారా మనీ ఎర్న్ చేయవచ్చు.

నేను నా బ్లాగ్ ద్వారా మనీ ఎలా ఎర్న్ చేస్తాను?

నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, అన్నామీ బ్లాగ్ లో యాడ్సెన్స్ యాడ్స్ లేవు కదా, మరి మీరు ఎలా రెవిన్యూ జెనరేట్ చేస్తారు అని. అవును నేను యాడ్సెన్స్ యాడ్స్ రన్ చెయ్యట్లేదు. కానీ నేను అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తాను. నా ఓన్ ప్రొడక్ట్స్ క్రియేట్ చేస్తున్నాను. ఎబూక్స్ రాసి సేల్ చేస్తాను.

బ్లాగ్గింగ్, డిజిటల్ మార్కెటింగ్ One-to-One ట్రైనింగ్ ఇస్తాను. మీలాంటి బ్లాగర్స్ కోసం బ్లాగ్ సెటప్ చేసి ఛార్జ్ చేస్తాను. వెబ్ సైట్స్ డిజైన్ చేసి ఇస్తాను. కన్సల్టేషన్స్ ఛార్జ్ చేస్తాను.

నేను మీకు కొన్ని ప్రూఫ్స్ చూపిస్తాను.

How I earn with my blog | Blogger VJ

Instamojo Payments

RazorPay Payments

Ebook & Courses Sales

Web Designing & Blog Setup Charges

 

One of the Affiliate Marketing

ఇలా నేను రకరకాలుగా ఎర్న్ చేస్తున్నాను. ఇప్పుడు చెప్పండి. యాడ్సెన్స్ ఒక్కటేనా బ్లాగింగ్ ద్వారా మనీ ఎర్న్ చేయటానికి ఉన్న అవకాశం. అయితే ఇక్కడ నేను నా బ్లాగ్ బ్రాండింగ్ పైన ఫోకస్ చేశాను. నా రీడర్స్ కి హెల్ప్ చేస్తున్నాను. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్, సపోర్ట్ ఇస్తున్నాను.

ఇదంతా ఒక్క రోజులో జరగలేదు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. దీని కోసం నేను రెండు సంవత్సరాలు కష్టపడ్డాను. అంత వరకూ నాకు ఈ Blogger VJ బ్లాగ్ నుండి ఒక్క రూపాయి కూడా రెవిన్యూ లేదు. కానీ నేను బ్రాండింగ్ బిల్డ్ చేసి, దాని ద్వారా నిదానంగా రెవిన్యూ క్రియేట్ చేస్తున్నాను.

నేను నా స్కిల్స్ ని నా బ్లాగ్ ద్వారా ప్రోమోట్ చేస్తున్నాను. 6 సంవత్సరాలుగా బ్లాగింగ్ చేస్తున్నాను, డిఫరెంట్ బ్లాగ్స్ కోసం వర్క్ చేశాను. ఎంతో మంది న్యూ బ్లాగర్స్ తో ఇంటరాక్ట్ అయ్యాను. ఆ ఎక్స్పీరియన్స్ తో నేను నా స్కిల్స్ ఇంప్రూవ్ చేస్కుంటున్నాను.

మీరు కూడా మీ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోండి. తరువాత వాటిని ఒక ప్లాట్ఫారం ద్వారా ప్రమోట్ చేసుకోండి. అప్పుడు మీరు కూడా ఎర్న్ చేయవచ్చు.

నేను ఎలా వర్క్ చేస్తాను?

చాలా మంది ఈ విషయం అడుగుతూ ఉంటారు. అన్న ఇంత వర్క్ మీరు ఒక్కరే ఎలా చేస్తారు? అని, అందుకు నా సమాధానం “ప్లానింగ్”. ఒక్కప్పుడు నేను కూడా ఎలా పడితే అలా వర్క్ చేసేవాడిని. వర్క్స్ అయ్యేవి కావు. కానీ ఒకరోజు నేను ఒక కొటేషన్ చదివాను.

“ప్లానింగ్ చేసుకోవడంలో ఫెయిల్ అయితే,

ఫెయిల్ అవ్వడానికి ప్లాన్ చేసుకున్నట్లే” అని.

ఇది చదివిన తరువాత నా మైండ్సెట్ మారిపోయింది. ఎప్పుడూ ఏం చేయాలి అని నేను ఒక పేపర్ లో రాసిపెట్టుకుంటాను. ఆ వర్క్ ఆ రోజు అయిపోవాలి. ఈ రోజు మనకి అందుబాటులో ఉన్న టెక్నాలజీ, 10 రోజుల పనిని కూడా ఒక్క రోజులో చేయగలిగే సౌలభ్యాన్ని అందిస్తుంది.

ఉదాహరణకి నేను ముందుగా ఈ రోజు చేయాల్సిన పనులు రాసిపెట్టుకుంటాను. సోషల్ మీడియా పోస్ట్స్ షెడ్యూల్ చేసుకోవాలి, యూట్యూబ్ వీడియోస్ కోసం థంబ్నెయిల్స్ క్రియేట్ చేయాలి, మైక్రో వీడియోస్ ఎడిట్ చేయాలి ఇలా రాసుకుంటాను.

మొదట నేను సోషల్ మీడియా పోస్ట్స్ షెడ్యూల్ చేయాలి అనుకుంటే అందుకు కావాల్సిన వీడియోస్ / ఇమేజెస్ ఒక ఆర్డర్ లో పెట్టుకుంటాను. అందుబాటులో ఉన్న కంటెంట్ ఆధారంగా ఎన్ని రోజులకి షెడ్యూల్ చేసుకోవాలి అని ఒక ఐడియా వస్తుంది.

ఇప్పుడు అందుకు కావాల్సిన టెక్స్ట్ కంటెంట్ కూడా ముందే టైప్ చేసి పెట్టుకుంటాను. ఈ రెండు పనులు చేసిన తరువాత టైం ఉంటె షెడ్యూల్ స్టార్ట్ చేస్తాను. లేకపోతే భోజనం చేసి మళ్ళి స్టార్ట్ చేస్తాను. నా దగ్గర షెడ్యూల్ చేయాల్సిన కంటెంట్ ఉంది, అందుకు కావాల్సిన టెక్స్ట్ కంటెంట్ కూడా రెడీగా ఉంది కాబట్టి వాటిని అప్లోడ్ చేసుకోవడం, టైం షెడ్యూల్ చేసుకోవటం, ఒక గంట లేదా 2 గంటల్లో అయిపోతుంది. అంతే సోషల్ మీడియా పోస్ట్స్ షెడ్యూల్ అయిపోతుంది. ఒక పది రోజులకి సరిపడా షెడ్యూల్ చేసేస్తాను.

ఇప్పుడు ఇంకా వర్క్ సిస్టం లో వర్క్ చేసే మూడ్ ఉంటె యూట్యూబ్ థంబ్నెయిల్స్ క్రియేట్ చేస్తాను. ఇది కూడా అంతే. ఏయే వీడియోస్ కి థంబ్నెయిల్స్ కావాలో చూసుకుని, వాటికీ కావాల్సిన ఇమేజెస్ రెడీ చేసుకుని ఒక గంటలో వాటిని కూడా ఫినిష్ చేస్తాను.

ఇంకా ఇప్పుడు సిస్టం ఆపేసి కొంచెం సేపు రిలాక్స్ అయ్యి ఇప్పుడు మైక్రో వీడియోస్ ఎడిట్ చేయాలి కదా ! లిస్టులో రాసిపెట్టాను కదా, మర్చిపోయారా? వాటిని నా మొబైల్ లో ఎడిట్ చేసుకుంటాను. ఇలా నేను ఏం వర్క్ చేయాలో ముందుగ ప్లాన్ చేసుకుంటాను. దాని ప్రకారం చేసుకుంటాను.

ఒకవేళ వర్క్ కంప్లీట్ అవ్వకపోతే ఈ డౌట్ మీలో చాలా మందికి రావచ్చు. ఏముంది నెక్స్ట్ డే ఏ వర్క్ అయితే ఆగిపోయిందో అది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. ఏదో ఒకటి చేయాలి అనుకునేవాడికి ఏం చేయాలో అర్థం కాదు, కానీ ఏం చేయాలో తెలిసినవాడికి అన్ని పనులు వాడు అనుకున్న టైం కి జరిగిపోతాయి.

ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఒక ఉదాహరణగా చెప్తున్నాను తప్ప నేను ఎదో పొడిచేస్తున్నాను అని కాదు. కాబట్టి మీరు కూడా ప్లాన్ చేసుకుని వర్క్ చేయండి. బ్లాగింగ్ స్టార్ట్ చేసేవాళ్ళలో ఎక్కువ మంది స్టూడెంట్స్, ఎంప్లాయ్స్ ఉంటారు. మీరు కూడా ఈ క్యాటగిరికి చెందితే ప్లానింగ్ చేసుకోవటం అనే కాన్సెప్ట్ మీకు బాగా హెల్ప్ అవుతుంది.

ఎంతో మంది బ్లాగర్స్ ఆర్గనైజ్డ్ గా వర్క్ చేయలేకపోవటం వల్లే ఫెయిల్ అవుతున్నారు. అందుకు యాడ్సెన్స్ కూడా ఒక కారణం. దాని గురించి కాకుండా మీ బ్లాగ్ గురించి ఆలోచించండి.

చివరగా ఒక్క విషయం చెప్తాను. నిండుగా ఉన్న బావి నుండి మీరు ఎంత నీరు తోడుకోగలిగితే అంత నీరు మీకు లభిస్తుంది. అలాగే బ్లాగింగ్ కూడా నిండుగా డబ్బు అనే నీరు నిండిన బావి లాంటిది. మీరు ఎంత తోడుకోగలిగితే అంత డబ్బును తోడుకోవచ్చు. అయితే మీరు ఎలాంటి దానితో మీరు తోడుతున్నారు అనేది ఇక్కడ ఆలోచించవలసిన విషయం.

ఒక చిన్న గ్లాస్ తో తోడితే చిన్న గ్లాస్ నీళ్ళే వస్తాయి, ఒక చెంబుతో తోడితే చెంబు నీళ్ళే వస్తాయి. అదే ఒక బిందెతో తోడితే బిందె నీళ్ళు వస్తాయి. ఈ ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి.

మీకు ఏదైనా టెక్నికల్ హెల్ప్ లేదా గైడెన్స్ కావాలి అంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. కన్సల్టేషన్ ఛార్జ్ చేస్తాను, ఎక్కువేం చేయనులెండి 😀.

మీకు బ్లాగింగ్ గురించిన మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అంటే నా బ్లాగ్ ని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. Instagram లో ఫాలో అవ్వండి. వీడియోస్ కావాలి అంటే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేసుకోండి.

మీకు ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. షేర్ చేయండి. ఎందుకంటే Sharing is Caring కదా!

Exit mobile version