Google Analytics in Telugu
నువ్వు రీసెంట్ గా ఒక ప్రమోషన్ చేసావు అనుకుందాం. ఆ ప్రొమోషన్ ద్వారా ని నీకు ఎన్ని సేల్స్ జరిగాయి అని ఎలా తెలుస్తుంది?
ఆ మార్కెటింగ్ ప్లాట్ఫారం వాళ్ళ ఇన్సైట్స్ ఇస్తారుగా అంటావా? అవి యక్యురేట్ అంటావా?
మరి క్రాస్ చెక్ చేసుకోవటం ఎలా? గూగుల్ అనలిటిక్స్ (Google Analytics).
గూగుల్ అనలిటిక్సా! అని అనుకోవద్దు.
గూగుల్ అనలిటిక్స్ తో బ్లాగ్ / వెబ్ సైట్ ట్రాఫిక్ తెలుసుకోవచ్చు అని తెలుసు కదా!
ఆ అలాగే గూగుల్ అనలిటిక్స్ తో ఎన్నో చేయవచ్చు.
అలాంటి గూగుల్ అనలిటిక్స్ ని ప్రతి బ్లాగర్ / డిజిటల్ మార్కేటర్ ఖచ్చితంగా యూస్ చేయాలి / చేస్తారు.
మరి నీ సంగతి ఏంటి?
గూగుల్ అనలిటిక్స్ ని ని బ్లాగ్ కి లింక్ చేసుకోవటం వలన కలిగే బెనిఫిట్స్ ఏంటో తెలుసా?
గూగుల్ అనలిటిక్స్ ద్వారా ని బ్లాగ్ కి ఎంత మంది విజిటర్స్ వస్తున్నారు అని తెలుస్తుంది.
గూగుల్ అనలిటిక్స్ ద్వారా ని బ్లాగ్ కి వచ్చిన విజిటర్ ఎంత సేపు ని బ్లాగ్ / వెబ్ సైట్ లో టైం స్పెండ్ చేస్తున్నారో తెలుస్తుంది.
ఎన్ని పేజెస్ / పోస్ట్లు ఓపెన్ చేసారో తెలుసుకోవచ్చు.
అంతే కాకుండా ఏయే ప్లాట్ఫారంస్ ద్వారా వచ్చారు అని తెలుసుకోవచ్చు.
అంటే ఈమెయిల్స్ ద్వారా నీ బ్లాగ్ లేదా వెబ్ సైట్ కి వస్తున్నారా?
సోషల్ మీడియా నుండి వస్తున్నారా?
సెర్చ్ ఇంజిన్స్ నుండి వస్తున్నారా?
లేక డైరెక్ట్ గా వస్తున్నారా ? ఇవన్ని తెలుసుకోవచ్చు.
అందుకే ఈ బ్లాగ్ పోస్టులో Google Analytics in Telugu లో తెలుసుకుందాం.
అంతే కాకుండా నువ్వు ఏదైనా మార్కెటింగ్ కాంపెయిన్ రన్ చేస్తే ఆ కాంపెయిన్ ద్వారా ఎంత మంది వచ్చారు?
ఆ కాంపెయిన్ ద్వారా మీకు ఎన్ని లీడ్స్ వచ్చాయి లేదా ఎన్ని సేల్స్ జరిగాయి అని కూడా తెలుసుకోవచ్చు.
దీని ద్వారా ఏ మార్కెటింగ్ ప్లాట్ఫారం వర్కౌట్ అవుతుందో తెలుసుకోవచ్చు.
ఇన్ని బెనిఫిట్స్ గూగుల్ అనలిటిక్స్ వలన ఉన్నాయి. అందుకే ప్రతి బ్లాగర్ / డిజిటల్ మార్కేటర్ గూగుల్ అనలిటిక్స్ ఖచ్చితంగా ఉపయోగిస్తారు.
మరి ఈ గూగుల్ అనలిటిక్స్ ని బ్లాగ్ / వెబ్ సైట్ కి ఎలా లింక్ చేయాలో చూద్దాం.
Configure Google Analytics in Telugu
ముందుగా గూగుల్ లో Google Analytics అని సెర్చ్ చేయండి.
ఇప్పుడు మీకు ఈ విధంగా కొన్ని రిజల్ట్స్ కనిపిస్తాయి.
మీకు మొదట కనిపించే గూగుల్ అనలిటిక్స్ వెబ్ సైట్ పై క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తరువాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు sign up బటన్ పై క్లిక్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది.
ఈ విధంగా మీకు ఒక స్క్రీన్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం మన బ్లాగ్ ని అనలిటిక్స్ తో లింక్ చేయటానికి ఒక ఫారం లాంటిది ఫిల్ చేయవచ్చు. మొదట మీకు వెబ్ సైట్ కోసం అనలిటిక్స్ లింక్ చేస్తున్నారా, లేదా మొబైల్ అప్ కోసం చేస్తున్నారా అని మొదటి ఆప్షన్.
మనది బ్లాగ్ కాబట్టి మనం వెబ్ సైట్ సెలెక్ట్ చేసుకుంటాం. ఆల్రెడీ డిఫాల్ట్ గా వెబ్ సైట్ సెలెక్ట్ అయ్యి ఉంది కాబట్టి, తరువాత మనకి Setting up your account అని కనిపిస్తుంది.
ఆ ఫామ్స్ కూడా ఫిల్ చేయాలి. మొదట Account name ఇవ్వాలి. తరువాత మన బ్లాగ్ నేమ్, వెబ్ సైట్ యుఆర్ఎల్, ఇవ్వవలసి ఉంటుంది.
తరువాత industry category అని ఉంటుంది కదా, మీ బ్లాగ్ ఏ category కి సంబంధించినదో సెలెక్ట్ చేయాలి. దాని తరువాత reporting time సెలెక్ట్ చేసుకోవాలి. Industry లొ మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి.
వాటిల్లో మీ బ్లాగ్ ఏ ఇండస్ట్రీ కి చెందినదో దానిని సెలెక్ట్ చేసుకోండి. తరువాత టైం జోన్, మన టైం జోన్ దగ్గర కంట్రీ(దేశం) సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది.
తరువాత మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. అవి అన్ని కూడా టిక్ చేసి ఉంటాయి. తరువాత మీరు Get Tracking ID అని కనిపించే బటన్ పై క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తరువాత మీకు ఒక పాప్ విండో ఇలా ఓపెన్ అవుతుంది.
మీకు కనిపించే స్క్రోల్ బార్ ని కిందకి స్క్రోల్ చేస్తే రెండు చెక్ బాక్స్ లు కనిపిస్తాయి. వాటిని టిక్ చేస్తే మీకు క్రింద ఉన్న i accept అనే బటన్ ఆక్టివేట్ అవుతుంది. అప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
ఇప్పుడు బ్లాగర్ లో సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. అందులో other పై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
మీకు ఈ పేజిలో చివరన గూగుల్ అనలిటిక్స్ అని కనిపిస్తుంది. మీకు అక్కడ ఒక టెక్స్ట్ బాక్స్ కనిపిస్తుంది. అందులో మీరు కాపీ చేసిన id ని పేస్ట్ చేయండి.
ఇప్పుడు పైన కనిపించే save settings పై క్లిక్ చేస్తే గూగుల్ అనలిటిక్స్ తో మీ బ్లాగ్ లింక్ అవుతుంది.
చూసారుగా గూగుల్ అనలిటిక్స్ ఎలా లింక్ చేయాలి అని స్టెప్-బై-స్టెప్ చెప్పాను.
ఒకవేళ మీరు గూగుల్ అనలిటిక్స్ యూస్ చేయకపోతే ఇప్పుడే స్టార్ట్ చేయండి.
గూగుల్ అనలిటిక్స్ డాష్ బోర్డు లోనే మీకు చాలా డీటెయిల్స్ కనిపిస్తూ ఉంటాయి. మీరు గూగుల్ అనలిటిక్స్ ని లింక్ చేసిన 24 గంటల నుండి మీ ట్రాఫిక్ ని ట్రాక్ చేస్తుంది.
ఈ ఆర్టికల్ పై మీకు ఏమన్నా డౌట్స్ ఉంటె కామెంట్ చేయండి.
Click Here to Know How to Create a Blogger Blog in Telugu
Click Here to Know How to Create a WordPress Blog in Telugu
- Website Design Formula for Small Businesses - October 27, 2021
- Digital Marketers Meetup in Hyderabad in 2021 - September 1, 2021
- How to Write Viral Blog Posts in Telugu - August 12, 2021