Always VJ

2021 Top Female Bloggers in Telugu

Spread the love

Top Female Bloggers in Telugu

“మహిళలే నిజమైన సమాజ నిర్మాతలు” – Harriet Beecher Stowe

మీకు తెలుసా అతి తక్కువ మంది బ్లాగర్స్ మాత్రమే ప్రతి నెల కొన్ని వేల డాలర్స్ సంపాదిస్తున్నారు అని. ఆన్లైన్ లో డబ్బు సంపాదించడం పెద్ద కష్టం ఏమి కాదు, దేనినా ఎలా సేల్ చేయాలో తెలిస్తే! ఎంతో మంది సక్సెస్ఫుల్ బ్లాగర్స్ కి ఈ విషయం బాగా తెలుసు.

అయితే బ్లాగింగ్ ఇండస్ట్రీలో ఈ సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ, నూటికి 95 మంది ఒక్క పైసా కూడా సంపాదించలేరు, ఇది నమ్మలేని నిజం. మరి మీరు టాప్ ఫిమేల్ బ్లాగర్స్ గురించి తెలుసుకుందాం అనుకుంటే మీకు ఈ పోస్ట్ హెల్ప్ అవుతుంది.

ఒకవేళ మీరు బ్లాగింగ్ నేర్చుకోవాలి అనుకుంటే ముందుగా బ్లాగింగ్ బేసిక్స్,  తరువాత ఒక బ్లాగ్ ఎలా స్టార్ట్ చేయాలి అని తెలుసుకోవాలి. బ్లాగ్ ని ఎలా గ్రో చేయాలి, తరువాత బ్లాగ్ మానటైజ్ చేయాలి (మనీ ఎలా ఎర్న్ చేయాలి) అని తెల్సుకోవాలి.

ఈ విషయాల పై ఎంతో ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్ లో ఉంది, అంతే కాకుండా మన బ్లాగ్ లో తెలుగులో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ముందు వాటి గురించి తెలుసుకోండి. అప్పుడు మీకు ఇందులో చెప్పే విషయాలు పూర్తిగా అర్థం అవుతాయి.

ఏ ఇండస్ట్రీ లో అయిన ఇన్ఫ్లుయన్సర్స్ గురించి తెలుసుకోవడ, వాళ్ళ నుండి నేర్చుకోవట ద్వారా మనం అత్యంత గొప్ప ఫలితాలు పొందగలం. ఒకవేళ మీరు కూడా బ్లాగింగ్ చేయాలి, బ్లాగింగ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలి అని అనుకుంటే ఈ బ్లాగ్ పోస్ట్ లో నేను టాప్ ఫిమేల్ బ్లాగర్స్ ని పరిచయం చేస్తాను, మీకు కూడా నమ్మకంగా ఉంటుంది. మరి అసలు ఆలస్యం చేయకుండా డీటెయిల్స్ తెలుసుకుందాం.

గమనిక: ఈ బ్లాగ్ పోస్ట్ లో చెప్పుకున్న మహిళా బ్లాగర్స్ ఎవరూ వాళ్ళ ఇన్కమ్ రిపోర్ట్స్ పబ్లిక్ గా షేర్ చేయలేదు. నేను వాళ్ళ గురించి చేసిన రీసెర్చ్ లో నేను అర్థం చేసుకుని చెప్తున్నది. ఇవి వాళ్ళ రియల్ ఇన్కమ్ కి దాదాపుగా దగ్గరగా ఉంటాయి అని అర్థం చేసుకోగలరు.

Top female bloggers in Telugu | మీరు ఖచ్చితంగా తెలుసుకుని, 2021లో ఫాలో అవ్వవలసిన వాళ్ళు.

Top Female Bloggers in Telugu

Ana Hoffman

Ana Hoffman ట్రాఫిక్ జెనరేషన్ కేఫ్ ఫౌండర్. ఈ బ్లాగ్ లో ట్రాఫిక్ జెనరేషన్ స్ట్రాటజీస్ గురించి, మీ బ్లాగ్స్ ద్వారా సేల్స్ ఎలా చేసుకోవాలి అనే విషయాల గురించి ఎక్కువగా డిస్కస్ చేయటం జరుగుతుంది.

Ana Hoffman ఇన్కమ్ సోర్సెస్ ఏంటి?

Ana Hoffman ప్రధానంగా అఫిలియేట్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తుంటారు. తన రీడర్స్ ఎంత బాగా తనతో కనెక్ట్ అవుతారు అంటే తను ఏం కొనమని చెప్తే వాటిని కొంటారు. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, Ana తనకి డబ్బులు వస్తాయి కదా అని ఏది పడితే అది ప్రోమోట్ చేయరు.

తన సక్సెస్ కి ఇది ప్రధాన కారణం అని నేను అనుకుంటున్నాను. Ana 5000 డాలర్స్ నుండి 10000 డాలర్స్ వరకూ బ్లాగింగ్ సోర్సెస్ ద్వారా ఎర్న్ చేస్తుంటారు.

Amy Porterfield

Amy Porterfield ఒక సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్. ఫేస్బుక్ మార్కెటింగ్ కి సంబంధించిన స్ట్రాటజీస్, సీక్రెట్స్ ఆన్లైన్ బిజినెస్ లు ఎలా ఫేస్బుక్ యూస్ చేసుకొని గ్రో చేసుకోవాలి అని చెప్పటంలో స్పెషలిస్ట్. ఫేస్బుక్ మార్కెటింగ్ అల్-ఇన్-వన్ ఫర్ డమ్మీస్ అనే పుస్తకానికి ఒక రచయిత్రి కూడా.

Amy Porterfield తన బ్లాగ్ లో వివిధ రకాల ఇండస్ట్రీస్ ఉపయోగించవలసిన స్ట్రాటజీస్ గురించి, సోషల్ మీడియా పవర్ ఉపయోగించుకుని, ఆన్లైన్ సక్సెస్ ని ఎలా పెంచుకోవాలి అని ఎంటర్ప్రేన్యుర్స్ కి హెల్ప్ చేస్తుంది.మీరు కూడా సక్సెస్ కావాలనుకుంటే తన బ్లాగ్ చెక్ చేయవచ్చు.

Amy Porterfield ఎలా మనీ ఎర్న్ చేస్తుంది?

Amy 3 రకాలుగా మనీ ఎర్న్ చేస్తుంది. అఫిలియేట్ మార్కెటింగ్, కన్సల్టింగ్ ఇంకా ఆన్లైన్ కోర్సెస్ సేల్ చేస్తుంది. ఆన్లైన్ ద్వారా మనీ ఎర్న్ చేయాలి అనుకునేవాళ్ళకి ఈ మూడు మార్గాల గొప్ప ఇన్కమ్ సోర్సెస్ అని నాకు తెలుసు.

Amy కూడా అంతే, తన బ్లాగింగ్ ఎఫర్ట్స్ తో తను నెక్స్ట్ లెవెల్ కి తన ఎర్నింగ్స్ తీసుకువెళ్ళింది. Amy సుమారుగా 10 నుండి 20 వేల డాలర్స్ ప్రతి నెల జెనరేట్ చేస్తుంది.

Mari Smith

Mari Smith “ఫేస్బుక్ క్వీన్” గా బాగా పరిచయం ఉన్న బ్లాగర్. Mari ఫేస్బుక్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ అంతే కాకుండా “Facebook Marketing”, “Marketing with Social Media”, “Ready, Aim, Soar” వంటి బుక్స్ కూడా వ్రాసారు.

Mari తన బ్లాగ్స్ లో బ్లాగ్స్ ఎలా గ్రో చేయాలి, ఆన్లైన్ బిజినెస్లు సోషల్ మీడియా మార్కెటింగ్ ద్వారా ఎలా గ్రో చేయాలి అని చెప్తుంటారు. Mari ఎక్కువగా సోషల్ మీడియా యాడ్స్, ఎఫర్ట్స్ వాటి ROI గురించి మాట్లాడుతుంటారు. మీరు కూడా మీ బ్లాగ్ ని సోషల్ మీడియా సైట్స్ ద్వారా గ్రో చేయాలి అనుకుంటే మీరు Mari Smith ని ఫాలో అవ్వవచ్చు.

Mari Smith ఎలా మనీ ఎర్న్ చేస్తుంది?

Mari Smith అఫిలియేట్ ప్రొడక్ట్స్ సేల్ చేయటం, కన్సల్టేషన్ చేయటం, ఆన్లైన్ కోర్సెస్ సేల్ చేయటం ద్వారా రెవిన్యూ జెనరేట్ చేస్తుంది. పబ్లిక్ ఈవెంట్స్ లో మాట్లాడినందుకు కూడా ఛార్జ్ చేస్తుంది. Mari రెవిన్యూ 20 వేల డాలర్స్ కన్నా ఎక్కువే.

Marie Forleo

Marie Forleo ఒక ఎంటర్ప్రేనుర్, అమెరికన్ లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్, రచయిత్రి, ఇంకా ఎన్నో. Marie తన బ్లాగ్ ద్వారా ఒక ఆన్లైన్ బిజినెస్ ని ఎలా సక్సెస్ఫుల్ గా రన్ చేసుకోవాలో ప్రాక్టికల్ స్ట్రాటజీస్ తో చెప్తుంది . Marie Forleo నెక్స్ట్ జెనరేషన్ లీడర్ అని చెప్పుకోవచ్చు.

Marie Forleo ఎలా మనీ ఎర్న్ చేస్తుంది?

Marie ప్రధానంగా పబ్లిక్ స్పీకింగ్ ఈవెంట్స్ ద్వారా, ఖరీదైన ఆన్లైన్ మెంబెర్ షిప్ ప్రోగ్రామ్స్, కన్సల్టింగ్ ద్వార మనీ ఎర్న్ చేస్తారు. Marie ప్రతి నెల సుమారుగా 30వేల డాలర్స్ సంపాదిస్తూ ఉంటారు. తన ఆన్లైన్ కోర్సెస్ హై లెవెల్, గ్రేట్ వేల్యూ ని తన కమ్యూనిటీ కి ప్రోవైడ్ చేస్తుంటాయి.

Lisa Irby

Darren Rowse ఏ విధంగా ప్రో బ్లాగరో, అదే విధంగా Lisa Irby ఫెమల్ ప్రో బ్లాగర్. Lisa కొన్ని సంవత్సరాల నుండి బ్లాగింగ్ చేస్తున్నారు. 1998 నుండి తన బ్లాగ్ నుండి మనీ ఎర్న్ చేస్తున్నారు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు Lisa ఎప్పటినుండి  బ్లాగింగ్ చేస్తుందో.

Lisa తన బ్లాగ్ ద్వారా ప్రాక్టికల్ బ్లాగింగ్ టిప్స్ వంటివి షేర్ చేస్తుంటారు. అంతే కాకుండా Lisa ఫుల్ టైం అఫిలియేట్ మార్కేటర్. పోడ్కేస్ట్, వీడియో మార్కెటింగ్ లో కూడా బాగా ఆక్టివ్ గా ఉంటుంది. మీరు సింపుల్ స్ట్రాటజీస్ కావాలి మీ బ్లాగ్ ని గ్రో చేయటనికి అనుకుంటే Lisa కరెక్ట్ ఛాయస్.

Lisa Irby ఎలా మనీ ఎర్న్ చేస్తుంది?

యాడ్సెన్స్, అఫిలియేట్ మార్కెటింగ్, కన్సల్టింగ్ ల ద్వారా మేజర్ రెవిన్యూ Lisa Irby జెనరేట్ చేస్తుంది. రీసెంట్ గా Udemyలో ప్రీమియం కోర్సెస్ కూడా టీచ్ చేయటం స్టార్ట్ చేశారు. Lisa ప్రతి నెల 15 నుండి 20 వేల డాలర్స్ వరకూ ఎర్న్ చేస్తుంది..

Top Indian Female Bloggers

అదే విధంగా ఇండియా నుండి కూడా ఎంతో మంది సక్సెస్ఫుల్ ఫిమేల్ బ్లాగర్స్ ఉన్నారు. వాళ్ళ గురించి కూడా మనం తెలుసుకుందాం.

Jane Sheeba

Jane Sheeba ఒక గొప్ప ఇండియన్ మహిళా బ్లాగర్ అని చెప్పుకోవచ్చు. తన పేరుమీదే Jane Sheeba.com అనే ఒక బ్లాగ్ ని రన్ చేస్తున్నారు. ఇందులో మార్కెటింగ్ గురించి డిస్కస్ చేస్తుంటారు. చాలా కాలం నుండి బ్లాగింగ్ ద్వారా మనీ ఎర్న్ చేసే వాళ్ళలో Jane కూడా ఒకరు.

బ్లాగింగ్ కమ్యూనిటీలోబాగా ఆక్టివ్ గా ఉండే అతి కొద్ది మంది గెస్ట్ బ్లాగర్స్ లో Jane కూడా ఒకరు. తన బ్లాగ్ లో SEO గురించి, మార్కెటింగ్ స్ట్రాటజీస్ ద్వారా రెవిన్యూ జెనరేట్ చేస్తున్నారు. మీరు ఖచ్చితంగా ఒకసారి తన బ్లాగ్ ని చెక్ చేయాలి.

Harleena Singh

ప్రో బ్లాగర్స్ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే మొదట Harleena Singh తోనే మొదలుపెట్టాలి. ప్రో బ్లాగర్ కన్నా ముందు Harleena ఒక ఫ్రీలాన్స్ రైటర్. బ్లాగింగ్, హెల్త్, మోటివేషన్, రైటింగ్ లాంటి అనేక నిష్లతో ఒక బ్లాగ్ ను రన్ చేస్తున్నారు. దాని పేరే Aha!NOW.

Harleena Singh ని బ్లాగ్ కామెంటింగ్ క్వీన్ ని చెప్పుకుంటారు. అంత బాగా తన ఒపీనియన్ తెలియచేస్తారు. అనుకోకుండా బ్లాగింగ్ రంగంలోకి వచ్చిన Harleena, బ్లాగింగ్ లో తనదైన ముద్ర వేసారు.

అంతే కాకుండా ABC అనే బ్లాగింగ్ కమ్యూనిటీని స్టార్ట్ చేశారు.

Nirmala Santhakumar

Nirmala Santhakumar గారు చెన్నై కి చెందినవారు. Mymagicfundas.com అనే బ్లాగ్ రన్ చేస్తున్నారు. ఇందులో బ్లాగింగ్ టిప్స్ తో పాటుగా సోషల్ మీడియా టిప్స్ షేర్ చేస్తుంటారు. మొదట ఫ్రీలన్స్ రైటర్ గా స్టార్ట్ చేసినప్పటికీ, తనలోని రైటింగ్ స్కిల్ల్స్ తెలుసుకుని బ్లాగ్ ద్వారా ఎంతో మందికి హెల్ప్ చేయాలి అని బ్లాగ్ ని స్టార్ట్ చేయటం జరిగింది.

తన బ్లాగ్ ద్వారా ఫ్రీలాన్సింగ్ కన్నా ఎక్కువగా ఎర్న్ చేస్తున్నారు. అంతే కాకుండా మంచి నేమ్ కూడా బ్లాగింగ్ ద్వారా వచ్చింది.

Shraddha Sharma

Shraddha Sharma చాలా మందికి తెలిసిన ఎంటర్ప్రేన్యుర్ బ్లాగ్ yourstory.com రన్ చేస్తున్నారు. ఇందులో ఎక్కువగా బిజినెస్ రిలేటెడ్, ఎంటర్ప్రేన్యుర్ షిప్ గురించి బ్లాగ్స్ రాస్తూ ఉంటారు.

అంతే కాకుండా Shraddha Sharma టైమ్స్ అఫ్ ఇండియా న్యూస్ పేపర్ తో కూడా వర్క్ చేస్తున్నారు. అతి తక్కువ సమయంలోనే త్వరగా ఎన్ని మైల్ స్టోన్స్ అచివ్ చేశారు.

Malini Agarwal

Malini Agarwal ఎంటర్టైన్మెంట్ రంగంలో పరిచయం అవసరం లేని పేరు. Malini Agarwal తన బ్లాగ్ తోనే సెలబ్రిటీ అయ్యారు. తన బ్లాగ్ MaliniAgarwal.com బ్లాగ్ కి ఇండియాలోనే కాకుండా ఫారిన్ కంట్రీస్ లో కూడా మాంచి ఫాన్స్ ఉన్నారు అంటే అర్థం చేసుకోవచ్చు.

Malini Agarwal పేరు చెప్పకుండా టాప్ ఫిమేల్ బ్లాగర్స్ లిస్టు కంప్లీట్ కాదు. అంతే కాకుండా Malini MTV లో వర్క్ చేస్తున్నారు.

Shalu Sharma

Shalu Sharma ఆన్లైన్ ఇండియా కి ట్రావెల్ గైడ్ లాంటి వారు. ఎందుకు అంటే Shalu Sharma లాగా ఇండియన్ ప్లేసెస్ ని ఎవరూ వివరించలేరు అంటే మిరే అర్థం చేసుకోవచ్చు. Shalu Sharma shalushama.com బ్లాగ్ ద్వారా ట్రావెల్ బ్లాగింగ్ చేస్తుంటారు.

ఇప్పటికే Shalu Sharma ఎన్నో కంట్రీస్ ట్రావెల్ చేసివచ్చారు. Shalu Sharma 10 ఏళ్ళ నుండి బ్లాగింగ్ చేస్తున్నారు.

ముగింపు

మీరు గమనిస్తే దాదాపు అందరు బ్లాగర్స్ 5 నుండి 30 వేల వరకూ ప్రతి నెల ఎర్న్ చేస్తున్నారు. ఇందుకోసం వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ళ బ్లాగ్స్ రీడర్షిప్ పెంచటం కోసం హై క్వాలిటీ కంటెంట్ నిరంతరం పబ్లిష్ చేస్తూ ఉంటారు.

అందరిలో మనం గమనిస్తే డెడికేషన్, కన్సిస్టెన్సి అంతే కాకుండా కష్టపడగలిగే క్వాలిటీస్ ఉన్నాయి. వీటి ద్వారానే జీరో నుండి ఈ స్థాయికి తీసుకువచ్చాయి అని మనం అర్థం చేసుకోవాలి. మరి మీరు ఈ బ్లాగ్ పోస్ట్ గురించి ఏం అనుకుంటున్నారు? ఒకవేళ నేను ఎవరిని అయినా మర్చిపోతే కామెంట్స్ లో చెప్పండి. వీళ్ళు మాత్రమే  టాప్ బ్లాగర్స్ అని నేను చెప్పను, నాకు తెలిసిన వాళ్ళలో వీళ్ళు బెస్ట్.

మరి మీరు కూడా బ్లాగింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే మొదట మీరు బ్లాగింగ్ బేసిక్స్ తెలుసుకోవాలి, ఆ తరువాత  ఒక బ్లాగ్ ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకోవాలి? ఆ తరువాత బ్లాగ్ ని ఎలా డెవలప్ చేయాలి అని తెలుసుకోవాలి? ఇంకా చివరగా బ్లాగింగ్ ద్వారా మనీ ఎలా ఎర్న్ చేయాలి అని తెలుసుకుంటే మీరు కూడా బ్లాగింగ్ ద్వారా సక్సెస్ అవ్వవచ్చు.

మరి మీ ఫేవరెట్ ఫిమేల్ బ్లాగర్ ఎవరు? కామెంట్ చేయండి.

Exit mobile version