Always VJ

Best Digital Marketing Tools in Telugu in 2020

Spread the love

Digital Marketing Tools in Telugu

Digital Marketing ఇప్పుడు ఒక మంచి కెరీర్. ఈ కరోనా వచ్చిన తరువాత డిజిటల్ మార్కెటింగ్ కి మంచి డిమాండ్ ఉంటుంది. ఎందుకంటె అన్ని బిజినెస్ లు ఆన్లైన్ బాట పడుతున్నాయి.  అలాంటప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కంపెనీలు, ఏజెన్సీలు, డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీలన్సర్స్ కి మంచి మంచి అవకాశాలు ఉంటాయి.

నువ్వు కూడా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్తున్నావా? నేర్చుకోవాలి అనుకుంటున్నావా? లేదా నీ బిజినెస్ కోసం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నావా? అయితే ఈ బ్లాగ్ పోస్ట్ పూర్తిగా చదువు, ఇందులో నీకు ఉపయోగపడే టూల్స్ గురించి చెప్తాను.

మరి నువ్వు రెడీనా? ఆ డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం!

ఆ బ్లాగ్ పోస్ట్ లో ఇప్పటికి 16 డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ గురించి చెప్తాను, ముందు ముందు ఇంకొన్ని టూల్స్ గురించి చెప్తాను. కాబట్టి నా బ్లాగ్ లో రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండు, తెలుగులో డిజిటల్ మార్కెటింగ్ గురించి, చిన్న చిన్న బిజినెస్ లా గురించి చెప్పే బ్లాగ్ Blogger VJ.

ముందుగా ఆ 16 టూల్స్ ఏంటో చూద్దాం.

1) వర్డుప్రెస్

2) గూగుల్ అనలిటిక్స్

3) Elementar ప్లగిన్

4) Rank Math SEO ప్లగిన్

5) Keywords EveryWhere

6) UberSuggest

7) Mailchimp

8) MailerLite

9) Buffer

10) HootSuite

11) FreePik

12) Grammerly

13) Canva

14) Inshot App

15) Facebook Ads

16) Google Ads

ఈ 16 టూల్స్ ఎలా యూస్ అవుతాయి అని ఇప్పుడు తెలుసుకుందాం.

వర్డుప్రెస్ | Digital Marketing Tools in Telugu

#1 digital marketing tools in telugu

ఒక బ్లాగ్ / వెబ్ సైట్ ని క్రియేట్ చేయటానికి ఈ వర్డుప్రెస్ అనే టూల్ ని యూస్ చేస్తారు. వర్డుప్రెస్ బాగా పాపులర్ అయిన ఒక CMS ప్లాట్ఫారం. CMS అంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టం. వర్డుప్రెస్ ని పూర్తిగా ఫ్రీ గా యూస్ చేసుకోవచ్చు. వర్డుప్రెస్ ద్వారా నువ్వు ఒక బ్లాగ్ క్రియేట్ చేయాలి అంటే నీకు ఒక డొమైన్, వెబ్ హోస్టింగ్ కావాలి. ఈ రెండింటి కోసం సుమారుగా ఒక నీకు ఒక 2 వేల రూపాయలు వరకు ఖర్చు అవుతుంది.

నువ్వు వర్డుప్రెస్ నేర్చుకుంటే నీ బిజినెస్ లేదా క్లైంట్ల కోసం నువ్వే ఈజీగా వెబ్ సైట్స్ చేసి ఇవ్వవచ్చు. ఇదే వెబ్ సైట్ నువ్వు బయట చేయించాలి అంటే కనీసం 5 నుండి 10 వేల వరకూ ఖర్చు అవుతుంది.

అంతే కాకుండా వర్డుప్రెస్ ద్వారా వెబ్ సైట్ క్రియేట్ చేయటం చాలా చాలా ఈజీ.  ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా, జస్ట్ వర్డుప్రెస్ ని అర్థం చేసుకుని మంచి మంచి బ్లాగ్స్ / వెబ్ సైట్స్ డిజైన్ చేయవచ్చు.

నేను ఎందుకు ఇంతగా వర్డుప్రెస్ గురించి చెప్తున్నాను అంటే నాకు కూడా ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేదు, అయిన నా బ్లాగ్ ని నేనే క్రియేట్ చేసుకున్నాను. నువ్వు నా బ్లాగ్ చూస్తున్నావు కదా.

ఒక వర్డుప్రెస్ బ్లాగ్ ని ఎలా క్రియేట్ చేయాలి?

గూగుల్ అనలిటిక్స్| Digital Marketing Tools in Telugu

నీ బిజినెస్ వెబ్ సైట్ కి ఎంత మంది వస్తున్నారు అని నీకు తెలియకపోతే నువ్వు చేసిన మార్కెటింగ్ ఎఫర్ట్స్ అన్ని వేస్ట్. మరి నీ వెబ్ సైట్ కి ఎంత మంది విజిటర్స్ వస్తున్నారు అని నీకు తెలియాలి. అలా ఎలా తెలుస్తుంది?

నీకు ని బిజినెస్ వెబ్ సైట్ కి ఎంత మంది వస్తున్నారు అని తెలియాలి అంటే ని బిజినెస్ వెబ్ సైట్ ని గూగుల్ అనలిటిక్స్ కి లింక్ చేయాలి. గూగుల్ అనలిటిక్స్ కి ని బిజినెస్ వెబ్ సైట్ ని లింక్ చేయటం చాలా చాలా ఈజీ.

ఈ గూగుల్ అనలిటిక్స్ ద్వారా ని బ్లాగ్/ వెబ్ సైట్  కి ఎంత మంది విజిటర్స్ వస్తున్నారు, ఎంత సేపు ని వెబ్ సైట్ లో ఉంటున్నారు, ఏయే పేజిలు చూస్తున్నారు, ఏమన్నా సేల్స్ చేసారా ఇలాంటి ఎన్నో వివరాలు తెలుసుకోవచ్చు.

నువ్వు ఆన్లైన్ లో ఒక మార్కెటింగ్ కాంపెయిన్ రన్ చేసారు అనుకుందాం, నీకు అందులో చూపించే అనలిటిక్స్ ని గూగుల్ అనలిటిక్స్ తో వెరిఫై చేసి చూసుకోవచ్చు. కాబట్టి నీ బ్లాగ్ లేదా బిజినెస్ వెబ్ సైట్ కి ఇప్పుడే గూగుల్ అనలిటిక్స్ కి లింక్ చేసుకో.

Google Analytics గురించి పూర్తిగా తెలుసుకోవటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Elementar Plugin | Digital Marketing Tools in Telugu

వర్డుప్రెస్ ద్వారా వెబ్ సైట్ క్రియేట్ చేసే వాళ్ళకి ఈ Elementar ప్లగిన్ చాలా చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పాలి. ఈ Elementar ప్లగిన్ యూస్ చేసుకుని అద్భుతమైన వెబ్ పేజెస్ ని నీ బ్లాగ్ / వెబ్ సైట్ కోసం క్రియేట్ చేసుకోవచ్చు. ఉదాహరణకి మీరు నా బ్లాగ్ home పేజి పై క్లిక్ చేసి చుడండి, ఆ home పేజిని ఈ Elementar ప్లగిన్ తోనే క్రియేట్ చేశాను.

ఈ Elementar ప్లగిన్ తో ఈజీగా డ్రాగ్ అండ్ డ్రాప్ మెథడ్ లో మంచి మంచి వెబ్ పేజెస్ డిజైన్ చేసుకోవచ్చు.

Elementar Plugin ని ఎలా యూస్ చేయాలి అని తెలుసుకోవటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Rank Math SEO ప్లగిన్ | Digital Marketing Tools in Telugu

ఇది కూడా వర్డుప్రెస్ యూస్ చేసే వాళ్ళకి వాళ్ళ బ్లాగ్ లేదా వెబ్ సైట్ సెర్చ్ ఇంజిన్స్ లో రాంక్ అవ్వటానికి హెల్ప్ అవుతుంది. నీ బ్లాగ్ లేదా వెబ్ సైట్ కి గూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్స్ నుండి ట్రాఫిక్ వస్తే త్వరగా కన్వర్ట్ అవ్వటానికి అవకాశం ఉంటుంది.

ఈ ప్లగిన్ నీకు నీ బ్లాగ్ పోస్ట్స్ లేదా బిజినెస్ వెబ్ పేజెస్ SEO ఫ్రెండ్లీ గా ఉండే విధంగా క్రియేట్ చేయటం లో హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఈ ప్లగిన్ బాగా హెల్ప్ అవుతుంది.

Rank Math SEO ప్లగిన్ ని ఎలా యూస్ చేయాలి అని తెలుసుకోవటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Keywords Everywhere | Digital Marketing Tools in Telugu

ఇది ఒక కీవర్డ్స్ రీసెర్చ్ టూల్. నువ్వు ఒక మార్కెటింగ్ కాంపెయిన్ రన్ చేయాలి అన్నా, లేదా నీ ప్రోడక్ట్ గురించి ఒక బ్లాగ్ పోస్ట్ రాయాలి అన్నా ముందుగా నువ్వు కీవర్డ్స్ రీసెర్చ్ చేయాలి. అలా కీవర్డ్స్ ని రీసెర్చ్ చేయటానికి చాలా టూల్స్ ఉన్నాయి. కానీ వాటిల్లో ఈ కీవర్డ్స్ ఎవరీవేర్ టూల్ చాలా చాలా పాపులర్. ఇంతకూ ముందు ఈ టూల్ ని ఫ్రీగా యూస్ చేసుకునే వెసులుబాటు ఉండేది, కానీ ఇప్పుడు దీన్ని కూడా పైడ్ టూల్ గా మార్చారు, ఫ్రీ వెర్షన్ కూడా ఉంది, కానీ లిమిట్స్ ఉన్నాయి.

Keywords Everywhere tool ని ఎలా యూస్ చేయాలి అని తెలుసుకోవటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

UberSuggest | Digital Marketing Tools in Telugu

ఆన్లైన్ మార్కెటింగ్ లో Neil Patel అనే పేరు వినని వాళ్ళు దాదాపుగా ఉండరు. నీల్ పటేల్ రూపొందించిన ఈ టూల్ కూడా చాలా కాలం ఫ్రీగా యూస్ చేసుకున్నాం. ఇప్పటికి చాలా ఫీచర్స్ ఫ్రీ వెర్షన్ లో అందుబాటులో ఉన్నాయి.

ఇందులో కీవర్డ్స్ రీసెర్చ్, టాపిక్ రీసెర్చ్, వెబ్ సైట్ ఎనాలిసిస్ ఇంకా ఎన్నో టూల్స్ ఉన్నాయి. మరింత ఎక్కువగా (ఫ్రీగా) ఈ టూల్ ని యూస్ చేసుకోవాలి అంటే నువ్వు గూగుల్ ఎకౌంటుతో లాగిన్ అయితే ఫ్రీ వెర్షన్ కన్నా ఎక్కువ బెనిఫిట్ పొందవచ్చు.

MailChimp | Digital Marketing Tools in Telugu

ఈమెయిలు మార్కెటింగ్ గురించి ఐడియా ఉన్న ప్రతి ఒక్కరికి, లేదా ఈమెయిలు మార్కెటింగ్ మొదలు పెట్టాలి అనుకునేవారికి ముందుగా అక్కరకు వచ్చేది ఈ MailChimp.

ఈ మెయిల్ చిమ్ప్ ఒక ఫ్రీ ఈమెయిలు మార్కెటింగ్ టూల్. 2000 మంది సబ్స్క్రయిబర్స్ కి నెలకి 12,000 ఈమెయిలుస్ ఈజీగా ఫ్రీగా పంపుకోవచ్చు.

చిన్న చిన్న బిజినెస్లకి అదే విధంగా క్రోతగా ఈమెయిలు మార్కెటింగ్ మొదలు పెట్టాలి అనుకునేవారికి ఈ Mailchimp బాగా హెల్ప్ అవుతుంది.

MailerLite | Digital Marketing Tools in Telugu

MailChimp తరువాత బిగినర్స్ కి బాగా యూస్ అయ్యే ఫ్రీ ఈమెయిలు మార్కెటింగ్ టూల్ MailerLite. ఈ మెయిలర్ లైట్ కూడా ఫ్రీగా  1000 మంది సబ్స్క్రయిబర్స్ కి అన్లిమిటెడ్ ఈమెయిలు పంపించుకోవచ్చు. ఇందులో ఫ్రీ ఎకౌంటు కి ఆటోమేషన్ కూడా చేయవచ్చు. కాబట్టి మెయిల్ చిమ్ప్ తో పాటుగా ఈ మెయిలర్ లైట్ కూడా యూస్ చేసుకోవచ్చు.

Buffer | Digital Marketing Tools in Telugu

డిజిటల్ మార్కెటింగ్ లో సోషల్ మీడియా చాలా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. నీ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ లో సోషల్ మీడియా ని కూడా యాడ్ చేసుకుంటే నీకు మరిన్ని బెటర్ రిజల్ట్స్ వస్తాయి.

సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉండటం కూడా ఆ స్ట్రాటజీలో భాగమే. కాబట్టి రోజు ఆక్టివ్ పోస్టులు పెట్టాలి అంటే కొంచెం కష్టం. కాబట్టి నువ్వు నీ సోషల్ మీడియా పోస్టులను షెడ్యూల్ చేసుకుంటే బాగుంటుంది కదా!

అలాంటి సోషల్ మీడియా షెడ్యూలింగ్ టూల్ ఈ బఫర్. ఈ బఫర్ 14 డేస్ ట్రయిల్ ఆఫర్ తో వర్క్ చేస్తుంది. ఆ తరువాత ఫ్రీ ఎకౌంటు గా మారుతుంది, నెలకి 10 పోస్టులు షెడ్యూల్ చేసుకోవచ్చు.

ఈ బఫర్ ఫ్రీ ఎకౌంటు లో 3 సోషల్ మీడియా అకౌంట్స్ లింక్ చేసుకుని వాటిల్లో పోస్ట్ చేయవచ్చు. అంతే కాకుండా మీకు వెబ్ తో పాటుగా మొబైల్ లో యూస్ చేసుకోవటానికి యప్స్ కూడా ఉన్నాయి.

HootSuite | Digital Marketing Tools in Telugu

బఫర్ లాగే HootSuite కూడా ఒక సోషల్ మీడియా షెడ్యూలింగ్ టూల్. అయితే బఫర్ తో పోల్చుకుంటే ఈ టూల్  చాలా చాలా అద్భుతంగా వర్క్ అవుతుంది. ఇందులో ఫ్రీ ఎకౌంటు ద్వారా 3 సోషల్ మీడియా ప్రొఫైల్స్ లింక్ చేసుకుని వాటిల్లో పోస్టులు షెడ్యూల్ చేసుకోవచ్చు.

అంతే కాకుండా ఫ్రీ ఎకౌంటు తో నెలకి మొత్తం ౩౦ పోస్టులు షెడ్యూల్ చేసుకోవచ్చు. ఈ టూల్ కూడా వెబ్, మొబైల్ వెర్షన్ యప్స్ అవైలబుల్ లో ఉన్నాయి. ఖచ్చితంగా ఈ టూల్ ని నువ్వు యూస్ చేసి చూడాలి.

FreePik | Digital Marketing Tools in Telugu

నువ్వు ఎప్పుడైనా నా బ్లాగ్ పోస్ట్స్ లేదా యూట్యూబ్ లో థంబ్నెయిల్స్ చూసావా? నేను ఈ ఫ్రీపిక్ నుండే నాకు కావాల్సిన గ్రాఫిక్స్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని యూస్ చేసుకుంటాను. ఇందులో కొన్ని లక్షల గ్రాఫిక్స్ ఫ్రీ ఇంకా ప్రీమియం వెర్షన్ లో అందుబాటులో ఉన్నాయి. ప్రతి డిజైనర్ ఈ ఫ్రీపిక్ నుండి గ్రాఫిక్స్ డౌన్లోడ్ చేసుకుంటారు.

ఇందులో ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకుండా 3 గ్రాఫిక్స్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే సైన్ అప్ అయితే రోజు 10 గ్రాఫిక్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని కావాలంటే రెండు మూడు ఈమెయిల్స్ తో లాగిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోండి.  ఒక్కసారి నువ్వు కూడా ట్రై చెయ్.

Grammarly | Digital Marketing Tools in Telugu

ఇది ఒక స్పెల్లింగ్ చెక్కర్, గ్రామర్ చెక్కర్ టూల్. చాలా మంది తమ తమ ప్రొడక్ట్స్ గురించి ఇంగ్లీష్ లో వాళ్ళ బ్లాగ్స్ లో లేదా వెబ్ సైట్స్ లో కంటెంట్ రాయటానికి కంటెంట్ రైటర్స్ ని హైర్ చేసుకుంటారు. కారణం వాళ్ళకి పెద్దగా ఇంగ్లీష్ పై అవగాహనా లేకపోవటం లేదా వాళ్ళ ఇంగ్లీష్ పైన నమ్మకం లేకపోవటం.

అలాంటివాళ్ళ కోసమే ఈ Grammerly టూల్ ని కనిపెట్టి ఉంటారు. నిజంగా నీకు ఇంగ్లీష్ బేసిక్స్ తెలిసిన చాలు, నీ కంటెంట్ నువ్వే క్రియేట్ చేసుకోవచ్చు. స్పెల్లింగ్స్, అలాగే గ్రామర్ మిస్టేక్స్ ఉంటె ఈ టూల్ సరి చేస్తుంది. ఈ టూల్ ఫ్రీ గా అలాగే ప్రీమియం వెర్షన్స్ లో  అవైలబుల్ గా ఉంది.

నాకు తెలిసినంత వరకు మీకు ఫ్రీ వెర్షన్ సరిపోతుంది. ఎవరికైన ప్రీమియం వెర్షన్ కావాలి అంటే వాళ్ళు ప్రీమియం వెర్షన్ తీసుకోవచ్చు.

Canva | Digital Marketing Tools in Telugu

ప్రతి డిజిటల్ మార్కేటర్ యూస్ చేసే టూల్స్ లో ఇది కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఈ టూల్ ఇంత పాపులర్ అయ్యిందో నేను ఈ టూల్ ని యూస్  చేసే వరకు నాకు అర్థం కాలేదు.

ఈ టూల్ ఎటువంటి డిజైనింగ్ లేనివాళ్ళు అయిన చాలా అంటే చాలా ఈజీగా వాళ్ళ బ్లాగ్స్ కోసం, లేదా వాళ్ళ వెబ్ సైట్స్ కోసం లేదా సోషల్ మీడియా కోసం వాళ్ళకి కావాల్సిన డిజైన్స్ డిజైన్ చేసుకోవచ్చు.

ఈ టూల్ కూడా ఫ్రీ & ప్రీమియం వెర్షన్స్ అవైలబుల్ లో ఉంది. అంతే కాకుండా ఈ టూల్ కూడా వెబ్ ఇంకా మొబైల్స్ కోసం యాప్స్ ద్వారా కూడా సర్వీస్ చేస్తుంది. మీరు మొబైల్ లోనే మీకు కావాల్సిన గ్రాఫిక్స్ డిజైన్ చేసుకోవచ్చు.

Inshot App | Digital Marketing Tools in Telugu

ఇది ఒక వీడియో ఎడిటర్. చాలా మంది Kine master లేదా Power Director రెఫెర్ చేస్తారు. అయితే వాటిల్లో ఫ్రీ వెర్షన్ లో మీకు వాటర్ మార్క్ వస్తుంది. అంతే కాకుండా ఫీచర్స్ కూడా లిమిటేషన్స్ ఉంటాయి.

నేను నా వీడియోస్ ఎడిట్ చేయటానికి ఎన్నో యప్స్ ట్రై చేశాను. అప్పుడు నేను ట్రై చేసిన ఈ యాప్ నాకు చాలా చాలా బాగా నచ్చింది. నేను నా వీడియోస్ అన్ని (దాదాపుగా) ఈ Inshot యాప్ లోనే ఎడిట్ చేశాను. అంతే కాకుండా ఈ Inshot యాప్ రెగ్యులర్ గా అప్డేట్ చేస్తూ ఎప్పటికి అప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ ప్రోవైడ్ చేస్తూ ఉన్నారు. నేను ఈ యాప్ ని రెఫెర్ చేయటానికి కూడా ఇది ఒక రీసన్.

మొదట్లో కొంచెం కష్టంగా ఉంది అని అనిపిస్తుంది. కానీ వాడగా, వాడగా మీరు ఇంకా వేరే ఏ యాప్ యూస్ చేయరు అంతే,  నన్ను నమ్మండి.

Facebook Ads | Digital Marketing Tools in Telugu

ప్రతి డిజిటల్ మార్కేటర్ లేదా చిన్న చిన్న బిజినెస్ ఓనర్స్ ట్రై చేసి బెనిఫిట్ పొందవచ్చు. ఈ ఫేస్బుక్ యాడ్స్ ద్వారా ఖచ్చితంగా మీ బిజినెస్ లేదా క్లైంట్ ల బిజినెస్ బాగా గ్రో అవుతుంది. అంతే కాకుండా బ్రాండింగ్ కూడా అవుతుంది.

ఫేస్బుక్ యాడ్స్ ని నువ్వు 100/- తో కూడా స్టార్ట్ చేయవచ్చు. నీకు ఎప్పుడూ కావాలి అంటే అప్పుడు రన్ చేసుకోవచ్చు, వద్దు అనుకుంటే ఆపుకోవచ్చు.

చాలా చాలా ఈజీగా ఉంటుంది, అంతే కాకుండా బెనిఫిట్ కూడా ఉంటుంది.

Google Ads | Digital Marketing Tools in Telugu

ఫేస్బుక్ యాడ్స్ లాగే గూగుల్ యాడ్స్ కూడా ప్రతి డిజిటల్ మార్కేటర్ అదే విధంగా చిన్న చిన్న బిజినెస్ ఓనర్స్ యూస్ చేయాలి. ఫేస్బుక్ అయితే కేవలం ఫేస్బుక్, ఇంస్తాగ్రం లో మాత్రమే యాడ్స్ వస్తాయి.

అదే నువ్వు గూగుల్ యాడ్స్ కనుక యూస్ చేస్తే గూగుల్ సెర్చ్ ఇంజిన్, యూట్యూబ్, మొబైల్ యాప్స్ ఇంకా చాలా బ్లాగ్స్ లో కూడా నీ యాడ్స్ డిస్ప్లే చేసి ని బిజినెస్ ఇంక్రీస్ చేసుకోవచ్చు.

ఈ టూల్స్ అన్ని నేను యూస్ చేసినవే, చేస్తున్నావే. కాబట్టి మీకు ఈ టూల్స్ హెల్ప్ అవ్వవచ్చు. ఒకవేళ నేను ఏమన్నా టూల్స్ మిస్ అయితే కామెంట్ ద్వారా తెలియచేయండి. నెక్స్ట్ అప్డేట్ లో దాన్ని కూడా యాడ్ చేస్తాను. ఈ టూల్స్ ని నువ్వు యూస్ చేసి, నువ్వు యూస్ చేసిన టూల్స్ ద్వారా నీ ఎక్పీరియన్సు ఏంటో మాతో షేర్ చేసుకోండి. అంతే కాకుండా ఈ ఆర్టికల్ నీకు హెల్ప్ అయితే షేర్ చేయి. షేరింగ్ అంటే కేరింగే కదా!

Exit mobile version