Always VJ

Blogging Success Story in Business Sector | Blogger VJ

Spread the love
Blogging Success Story in Business Sector | Blogger VJ
Blogging Success Story in Business Sector | Blogger VJ

 

కళ్యాణ్ చాలా కాలం సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేసి, సొంతగా ఓక్ కంపెనీ స్టార్ట్ చేసచు. తన కంపెనీకి కావాల్సిన స్టాఫ్ ని రిక్రూట్ చేసుకున్నాడు. ప్రొమోషన్ కోసం అన్ని రకాల అడ్వర్టైజింగ్ మెటీరియల్ (బోర్డ్స్, విసిటింగ్ కార్డ్స్, పంప్లేట్స్, బ్రోచర్లు) సిద్దం చేసుకున్నాడు. తనకున్న పరిచయాల ద్వారా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేస్తూ కంపెనీని నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో తను ఒక సాఫ్ట్వేర్ తయారు చేశాడు. దాని ప్రమోట్ చేయడం కోసం ఒక వెబ్ సైట్ స్టార్ట్ చేశాడు. అందులో ఆ ప్రోడక్ట్ / సాఫ్ట్వేర్ ఫీచర్స్, ప్రైసింగ్ వంటివి ఉంచి ఆ వెబ్ సైట్ ని సోషల్ మీడియా ద్వారా ప్రోమోట్ చేయడం మొదలుపెట్టాడు. అయితే కళ్యాణ్ కి తను అనుకున్న దానికన్నా రెస్పాన్స్ చాలా తక్కువగా వస్తుంది. తను వేరే ఏ పని పై దృష్టి కేంద్రికరించ లేకపోయెవాడు.
తన సాఫ్ట్వేర్ ఆ రంగంలో ఖచ్చితంగా నెంబర్ 1 అని తెలుసు, కానీ తను కనీసం నార్మల్ సేల్స్ కూడా చేయలేకపోతున్నాడు. ఒక రోజు డిజిటల్ మర్కేటర్ అయిన తన ఫ్రెండ్ వినయ్ ని కలిసి విషయం చెప్పాడు. అప్పుడు వినయ్ “ఇప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నాను. ఒక వారంలో ప్రాబ్లం ఏంటో కనుకొని చెప్తాను” అని అన్నాడు. వినయ్ తరువాత తన ఫ్రీ టైంలో కళ్యాణ్ ప్రాబ్లం ఏంటి? అని చూడటం మొదలుపెట్టాడు. వినయ్ కి కళ్యాణ్ చేసిన మిస్టేక్ ఏంటో తెలిసింది. కళ్యాణ్ ని కలువటానికి వినయ్, కళ్యాణ్ ఆఫీసుకి వెళ్ళాడు. అక్కడ వినయ్ ని చూడగానే కళ్యాణ్ తన ప్రాబ్లం సాల్వ్ అవ్వబోతుంది అని (ఆశపడ్డాడు) అనుకున్నాడు.
వినయ్ కళ్యాణ్ ఫాల్లో అవుతున్న మార్కెటింగ్ స్ట్రాటజీస్ అన్ని చాలా బాగున్నాయని, అవి తను కూడా తన క్లైంట్స్ కి అప్లై చేస్తా అని అన్నాడు. అప్పుడు కళ్యాణ్, వినయ్ తన ప్రాబ్లం ని సొల్యూషన్ ఏంటి అని అడిగాడు. అప్పుడు వినయ్ ని ప్రొడక్ట్ దాని వెబ్ సైట్, సోషల్ మీడియా ప్రమోషన్ అంతా బాగానే ఉంది. కానీ నీ వెబ్ సైట్ లో ఒక లోటు ఉంది అని అన్నాడు. కళ్యాణ్ కి అర్థం కాలేదు, ఎందుకంటె తన వెబ్ సైట్ తనకి కావలసినట్టు డిజైన్ చేసుకున్నాడు. ఏంటి అది? అని అడిగాడు కళ్యాణ్. “తన బిజినెస్ వెబ్ సైట్ బాగుంది కదా అందులో బ్లాగ్ సెక్షన్ లేదు” అని చెప్పాడు.
కానీ బ్లాగ్గింగ్ కి, నా సాఫ్ట్వేర్ సేల్స్ కి సంబంధం ఏంటి అని అడిగాడు కళ్యాణ్. అయితే ని ప్రోడక్ట్ నిజానికి చాలా మంచి ప్రోడక్ట్. అది ఎన్నో ప్రాబ్లెమ్స్ కి సొల్యూషన్. అయితే ఆ విషయం, ఆ ప్రొబ్లెమ్స్ ఫేస్ చేస్తున్నవారికి తెలియాలి. ఉదాహరణకి నువ్వు కార్దియలజిస్ట్ (గుండె సంబంధిత నిపుణులు) అనుకో, నీ గురించి గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి తెలియాలి. పంటి జబ్బులు ఉన్నవాళ్ళకి కాదు. బ్లాగ్గింగ్ ద్వారా నీ ప్రోడక్ట్ ఎవరి కోసం తయారు చేయబడింది, దానిని ఎలా ఉపయోగించికోవచ్చు, నీకు నీ కంపిటీటర్స్ కి తేడా ఏంటి? ఇలాంటి విషయాలను బ్లాగ్ ద్వారా నీ ప్రోడక్ట్ గురించి సోషల్ మీడియా లో తెలుసుకొని నీ వెబ్ సైట్ కి వస్తే దాని ఫీచర్స్, ప్రైసింగ్ మాత్రమే ఉంటె ఆ ప్రోడక్ట్ అవసరం ఉన్నా పర్చేస్ చేయటానికి ఆలోచిస్తారు.
అలా కాకుండా దాని గురించి వివరంగా కొన్ని చక్కటి ఆర్టికల్స్ ద్వారా వ్రాసి వాటిని పోస్ట్ చేస్తే తనకున్న డౌట్స్ చాలా వరకు క్లారిఫై అయ్యి కొనటానికి ముందుకు వస్తారు. ఒక ప్రోడక్ట్ ఎందుకు కొనలో మనమే వారికీ అవగాహనా కల్పించాలి. వాళ్ళలో అవేర్నెస్ కల్పించాలి. ఇది డిజిటల్ మార్కెటింగ్ లో ఒక భాగం. కాబట్టి నువ్వు బ్లాగ్గింగ్ చేయటం మొదలుపెట్టు” అని చెప్పాడు వినయ్.
వినయ్ మాటలు విన్న కళ్యాణ్ సరే అని అప్పటి నుండి తన ప్రోడక్ట్ పై అనేక ఆర్టికల్స్ వ్రాసి తన బ్లాగ్ లో పోస్ట్ చేయటం మొదలు పెట్టాడు. ఈసారి వినయ్ చెప్పినట్టు ఈ ఆర్టికల్స్ ని మార్కెటింగ్ చేయటం మొదలుపెట్టాడు. ఆశ్చర్యంగా 3 నెలలోనే తను 2 సంవత్సరాలలో సేల్స్ చేయాలి అనుకున్న టార్గెట్ ని రీచ్ అయ్యాడు. తనకి హెల్ప్ చేసిన వినయ్ కి తను రుణపడి ఉన్నాడు.
పైన చెప్పిన కథలో బ్లాగ్గింగ్ మనీ ఎర్న్ చేయటానికి మాత్రమే కాకుండా బిజినెస్ డెవలప్ చేయడం కోసం ఉపయోగించబడింది. అవును ఇప్పుడు అన్ని రకాల కార్పొరేట్ కంపెనీలు బ్లాగ్గింగ్ యొక్క ఆవశ్యకతని అర్థం చేసుకున్నాయి. బిజినెస్ బ్లాగులు వ్రాయగలిగే వారికీ రెడ్ కార్పెట్ వస్తాయన్నది అక్షర సత్యం. ఇక్కడ బిజినెస్ కోసం బ్లాగ్గింగ్ చేయటం గురించి చూద్దాం. మన బిజినెస్ లో ప్రోడక్ట్ / సర్వీస్ గురించి క్లైంట్స్ కి పూర్తీ అవగాహన రావటానికి బ్లాగ్స్ చక్కగా తోడ్పడతాయి. అవి క్లైంట్స్ లో మన ప్రొడక్ట్స్ / సర్వీస్ పై నమ్మకాన్ని అవగాహనని కల్పిస్తాయి.
ఒకసారి నమ్మకం కలిగాక ఆటోమేటిక్ గా ప్రోడక్ట్ / సర్వీస్ సేల్ అవ్వడం జరుగుతుంది. సేల్ అయ్యింది కదా అని బ్లాగ్గింగ్ వదిలేయకుడదు. మన ప్రోడక్ట్ / సర్వీస్ కి సంబంధించిన అప్డేట్స్, ఆఫర్స్ ఇలా అన్నింటి గురించి బ్లాగ్ ద్వారా మన ప్రోడక్ట్ / సర్వీస్ ఇంకా పర్చేస్ చేయకుండా ఆలోచించే వారిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా బ్లాగింగ్ ద్వారా సంపాదిస్తున్నాం. కాకపోతే ఇక్కడ డబ్బు కాకుండా బ్రాండ్ వేల్యూ సంపాదించవచ్చు. జై హింద్.

 

TENGLISH

Kalyan chala kalam software engineer ga panichesi, own ga oka company start chesadu. Tana company ki kavalsina staff ni recrute chesukunnadu. Promotion kosam anni rakala advertising material (boards, visiting cards, pamphllets, brouchers) siddam chesukunnadu. Tanakunna parichayala dwara chinna chinna projects chestoo company ni nadipistunnadu. Ee kramamlo tanu oka software tayaru chesadu. Dani promote cheyadam kosam oka website start chesadu. Andulo aa product / software features, pricing vantivi unci aa website ni social media dwara promote cheyadam modalupettadu. Ayithe Kalyan ki tanu anukunana danikanna response chala takkuvaga vastundi. Tanu vere ye pani pai drushti kendrikarincha lekapoyevadu.
Tana sofware aa rangam lo khachitam ga no.1 ani telusu, kani tanu kanisam normal sales koda cheyalekapothunnadu. Oka roju digital marketer ayina tana friend Vina ni kalisi vishayam cheppadu. Appudu Vinay “ Ippudu nenu konchem busy ga unnani. Oka varamlo problem yento kanukoni cheptanu” ani annadu. Vinay taruvata tana free time lo Kalyan problem yenti? ani chudatam modalupettadu. Vinay ki Kalyan chesina mistake yento telisindi. Kalyan ni kaluvataniki Vinay, Kalyan office ki velladu. Akkada Vinay ni Chudagane Kalyan office ki velladu. Akkada Vinay ni chudagane Kalyan tana problem solve avvabotundi ani (ashapaddadu) anukunnadu.
Vinay Kalyan follow avutunna marketing stratagies anni chala bagunnayani, avi tanu kooda tana clients ki appli chesta ani annadu. Appudu Kalyan, Vinay tana problem ki solution yenti ani adigadu. Appudu Vinay ni product dani website, social media promotion antha bagene undi. Kani ni website lo oka lotu undi ani annadu. Kalyani ki artham kaledu, yendukante tana website tanaki kavalasinattu design chesukunnadu. Yenti adi? adni adigadu Kalyan. “Tana business website bagundi kada andulo blog section ledu” ani cheppadu.
Kani blogging ki, na software sales ki sambandham yenti ane adigadu Kalyan. Ayithe ni product nijaniki chala manchi product. Adi yenno problems ki solution. Ayithe aa vishayam, aa problems face chestunna variki teliyali. Example ki nuvvu cordialagist (gunde sambandhita nipunulu) anuko, nii gurinchi gunde jabbulu unna vallaki teliyali. Panti jabbulu unnavallaki kadu. Blogging dwara ni product yevari kosam tayaru cheyabadindi, danini yela upayoginchukovachu, niku ne compitetors ki teda yanti? Ilanti vishayalanu blog dwara ni product gurinchi social media lo telusukuni ni website ki vaste dani  features, pricing matrame unte aa product avasaram unna purchase cheyataniki aalochistaru.
Ala kakunda dani gurinchi konni chakkati articles dwara vrasi vatini post cheste tanakunna doubts chala varaku clarify ayyi konataniki munduku vastaru. Oka product yenduku konalo maname variki avagahana kalpinchali. Valla lo awareness kalpinchali. Idi digital marketing lo oka bhagam. Nuvvu blogging cheyatam modalupett” ani cheppadu Vinay.  
Vinay matalu vinna kalyan sare ani appati nundi tana product pai aneka articles vrasi tana blog lo post cheyatam modalupettadu. Eesari Vinay cheppinattu ee articles ni marketnig cheyatam modalupettadu. Asharyamga 3 nelalone tanu 2 samvatsaralalo sales cheyali anukunna target ni reach ayyadu. Tanaki help chesina Vinay ki tanu runapadi unnadu.
Paina cheppina story lo blogging money earn cheyataniki matrame kakunda business develop cheyadam kosam upayoginchabadindi. Avunu ippudu anni rakala corporate companies blogging importance artham chesukunnayi. Business blogs vrayagalige variki red carpet vastayannadi akshara satyam. Ikakda Business kosam blogging cheyatam gurinchi chuddam. Mana Business lo product / service gurinchi clients ki poorthi avagahana ravataniki blogs chakkaga thodpadatayi. Avi clients lo mana products / service pai nammkanni avagahanani kalpistayi.
Okasari nammakam kaligaka automatic ga product / service sale avvadam jaruguntudi. Sale ayyindi kada ani blogging vadileyakudadu. Mana product / service ki sambandhinchina updates, offers ila anninti gurinchi blog dwara mana product / service inka purchase cheyakunda aalochinche variki prabhavitam chestundi. Kabatti ikakda kooda blogging dwara sampadistuunnam. Kakapothe Ikkada dabbu kakunda brand value sampadinchavachu. Jai Hind.
Exit mobile version