బ్లాగింగ్ మిస్టేక్స్ – Blogging Mistakes
క్రొత్తగా బ్లాగింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు బ్లాగ్ స్టార్ట్ చేసిన కొత్తలో కొన్ని మిస్టేక్స్ చేసే అవకాశం ఉంది. తెలిసీ కావచ్చు, తెలియక కావచ్చు ఇలా చేసే మిస్టేక్స్ వలన మీ బ్లాగ్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.
మరి మీకు మీరు ఏ మిస్టేక్స్ చేస్తున్నారో తెలుసా? తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ బ్లాగ్ మీకోసమే. ఈ బ్లాగ్ పోస్ట్ లో బ్లాగింగ్ స్టార్ట్ చేసిన క్రొత్తలో చేసే 6 బ్లాగింగ్ మిస్టేక్స్ ఏంటి అని తెలుసుకుందాం.
1) రెగ్యులర్ గా బ్లాగ్స్ పబ్లిష్ చేయకపోవడం
సాధారణంగా బ్లాగింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో కనీసం రోజుకి ఒక్క పోస్ట్ అయిన పబ్లిష్ చేస్తాం. ఇలా కొన్ని రోజులు అయ్యాక మీకు ఉన్న పనుల వల్ల కావచ్చు, లేక పోస్ట్స్ వ్రాయటానికి కుదరకో, బ్లాగ్ పోస్ట్స్ వ్రాయలేకో ఇలా కారణం ఏదైనా కావచ్చు.
ఇలా జరగడం వలన మీకు బ్లాగింగ్ పై ఇంటరెస్ట్ పోయే అవకాశం ఉంది. దీని వల్ల మీరు 3 రోజులకి ఒక బ్లాగ్ పోస్ట్, వారానికి ఒక్క బ్లాగ్ పోస్ట్, పదిహేను రోజులకి ఒకసారి లేదా నెలకి ఒక్కసారి బ్లాగ్ పోస్ట్స్ రాయటం చేస్తారు. నిదానంగా బ్లాగ్స్ రాయటం మానేస్తారు.
ఇలా చేయడం వలన మీ సెర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్స్ పడిపోతాయి. మీ ట్రాఫిక్ పడిపోతుంది. ఇలా అవ్వకుండా ఉండాలి అంటే కనీసం వారానికి ఒక్క బ్లాగ్ పోస్ట్ రాయాలి. ఇలా చేయటం వలన సెర్చ్ ఇంజిన్స్ కి సంబంధించిన క్రాలర్స్ వారానికి ఒకసారి మన బ్లాగ్ ని చెక్ చేస్తాయి. అప్డేట్ కంటెంట్ ని ఇండెక్స్ చేసుకుంటాయి. అందుకని బ్లాగింగ్ రెగ్యులర్ గా చేయాలి.
10 Tips for Success in Blogging in Telugu ఈ బ్లాగ్ పోస్ట్ చదివి చూడండి.
2) కాపీ రైట్ కంటెంట్ పబ్లిష్ చేయడం
బ్లాగింగ్ స్టార్ట్ చేసిన క్రొత్తలో కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలో తెలియదు. అందుకే వాళ్ళకి కావాల్సిన టాపిక్స్ గురించి వివిధ వెబ్ సైట్స్ నుండి కంటెంట్ తీసుకుని ఎటువంటి చేంజెస్ లేకుండా వాళ్ళ బ్లాగ్స్ లో పబ్లిష్ చేస్తుంటారు.
కానీ అప్పటికే ఆ కంటెంట్ ఆ వెబ్ సైట్ పేరు పై వెబ్ లో రిజిస్టర్ అయ్యి ఉంటుంది. అందుకే ఓన్ కంటెంట్ క్రియేట్ చేయాలి అని అంటూ ఉంటారు. దీని వల్ల మీ బ్లాగ్ ని సెర్చ్ ఇంజిన్స్ స్పాంగా ట్రీట్ చేసే అవకాశం ఉంది.
ఒక్కసారి మీ బ్లాగ్ స్పాం అయితే మీకు ఎటువంటి సెర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్స్, ఆర్గానిక్ ట్రాఫిక్ రాదు. కావాలంటే మీరు అదే అర్థం వచ్చే విధంగా ఆ కంటెంట్ ని మాడిఫై చేయవచ్చు. ఇలా చేయటం వలన మనకి ఇబ్బంది ఉండదు.
3) నిష్ రిలేటెడ్ మిస్టేక్స్
మీ బ్లాగ్ ని ఒక నిష్ కోసం స్టార్ట్ చేసి మరింత ట్రాఫిక్ వస్తుంది కదా అని ఇంకొక నిష్ బ్లాగ్స్ రాయటం లాంటివి. ఉదాహరణకి మీరు ఒక మూవీ రిలేటెడ్ బ్లాగ్ స్టార్ట్ చేశారు అనుకుందాం. మీరు కొంతకాలం తరువాత హెల్త్ రిలేటెడ్ బ్లాగ్స్ రాస్తే ఇంకా ట్రాఫిక్ పెరుగుతుంది కదా అని హెల్త్ రిలేటెడ్ బ్లాగ్స్ రాసారు.
తరువాత మనీ సేవింగ్ టిప్స్ బ్లాగ్స్ రాస్తున్నారు అనుకుందాం. ఇలా చేయడం వలన మీ బ్లాగ్ కి వచ్చే విజిటర్ అయోమయానికి గురి అయ్యే అవకాశం ఉంది. అంతే కాదు మీరు ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి.
మూవీ బ్లాగ్స్ చదివేవాళ్ళకి హెల్త్ బ్లాగ్స్ అవసరం ఉండకపోవచ్చు, అలాగే హెల్త్ బ్లాగ్స్ కావాల్సిన వారికీ మనీ సేవింగ్స్ అవసరం ఉండకపోవచ్చు. నేను చెప్పింది మీకు అర్థం అయ్యే ఉంటుంది. కాబట్టి మీరు ఏ నిష్ కోసం బ్లాగ్ స్టార్ట్ చేసారో ఆ నిష్ కి స్టిక్ అయి ఉండండి.
4) డొమైన్ నేమ్ చేంజ్ చేయడం
చాలా మందికి వల్ల బ్లాగ్ (బ్రాండ్ నేమ్) చేంజెస్ చేస్తూ ఉంటారు. ఇలా చేయటం వలన మీకు ఇంతవరకు ఉన్న ర్యాంకింగ్స్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
అంతే కాకుండా మీ విజిటర్స్ కూడా మిమ్మల్ని గుర్తు పెట్టుకోవడం కష్టం అవుతుంది. ఆల్రెడీ మీరు పబ్లిష్ చేసిన కంటెంట్ డూప్లికేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. దీని వల్ల స్పాం అయ్యే అవకాశం ఉంది.
5) బ్లాగ్ డాట్ బ్యాకప్ తీసుకోకపోవటం
రెగ్యులర్ గా బ్లాగ్ డేటా బ్యాక్అప్ తీసుకోవాలి. ఒకవేళ అలా తీసుకోకపోతే ఏదన్నా ప్రాబ్లం వచ్చిన, ఎవరైనా హక్ చేసిన మన దగ్గర బ్యాక్అప్ లేకపోతే మీ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది.
రీసెంట్ గా ఒక జపనీస్ హక్ జరిగింది. ఈ హక్ లో వాళ్ళు .htaccess అనే ఫైల్ ని మన సర్వర్ లో యాడ్ చేస్తారు. అంతే మన బ్లాగ్ లో ఉన్న కంటెంట్ మొత్తం జపనీస్ లాంగ్వేజ్ లో కి మారిపోతుంది. ఇలాంటి కేసేస్ లో మీ దగ్గర బ్యాక్అప్ ఆంటే మీకు బాగా హెల్ప్ అవుతుంది.
6) థీమ్స్ (టెంప్లేట్స్) చేంజ్ చేయడం
ఒక బ్లాగ్ థీమ్ చేంజ్ చేసేటప్పుడు లాంగ్ రన్లో ఆలోచించాలి. ఊరికే బ్లాగ్ థీమ్స్ చేంజ్ చేస్తూ ఉంటె మీ యూసర్ కి వాళ్ళు విజిట్ చేసేది ఈ బ్లాగ్ ఏనా అని డౌట్ వస్తుంది. దీని వల్ల యూసర్ లో మంచి యూసర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వలేకపోవచ్చు. కాబట్టి అవసరం లేకపోతే అనవసరంగా థీమ్స్ చేంజ్ చేయవద్దు.
ఈ 6 బ్లాగింగ్ మిస్టేక్స్ లో మీరు కనుక ఏమన్నా చేస్తుంటే వాటిని సరి చేసుకోండి. ఎందుకంటే చిన్న చిన్న తప్పులకి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మీరు మీ బ్లాగ్ ద్వారా డబ్బు సంపాదించాలి అనుకుంటున్నారు.
అలాంటప్పుడు ప్రతీ చిన్న విషయాన్నీ తెలుసుకుని, ఒకవేళ మనం తప్పు చేస్తుంటే దాన్ని సరిచేసుకోవాలి. ఇలా చేసుకోవటం వలన మనకి ఎన్నో లాభాలు ఉంటాయి.
మీరు మీ బ్లాగింగ్ కెరీర్ లో ఎలాంటి మిస్టేక్స్ చేశారు వాటిని ఎలా సరి చేసుకున్నారు అని మాకు కామెంట్ లో తెలియచేయండి. ఈ బ్లాగ్ పోస్ట్ మీకు నచ్చితే షేర్ చేయండి.
ఒక్క నిమిషం … ఇంకొక్క నిమిషం చదవండి
✅ బ్లాగ్స్ ఎవరైనా క్రియేట్ చేస్తారు. కానీ ఒక సక్సెస్ ఫుల్ బ్లాగ్ ని కొంత మంది 👨💼 మాత్రమే క్రియేట్ చేయగలరు.
✅ అటువంటి వారిలో హర్ష్ అగర్వాల్, దీపక్ కనకరాజు, సౌరవ్ జైన్, తెలుగులో స్మార్ట్ తెలుగు రవి కిరణ్ గారు….ఇలా ఎంతో మంది బ్లాగింగ్ ద్వారా మంచి పోసిషన్స్ లో ఉన్నారు.
💥 మరి మీ సంగతి ఏంటి 🤔 ?
💥 మీకు తెలుసా? ఒక సక్సెస్ ఫుల్ బ్లాగ్ వలన కలిగే బెనిఫిట్స్ ఏంటో తెలుసా?
➡️ బ్లాగింగ్ ద్వారా మీకు నచిన టైంలో పని చేయవచ్చు.
➡️ బ్లాగింగ్ ద్వారా మీకు ఆర్థిక స్వతంత్రం లభిస్తుంది.
➡️ బ్లాగింగ్ ద్వారా మీరు ఒక మంచి కెరీర్ లో సెటిల్ అవ్వవచ్చు
➡️ బ్లాగింగ్ కి ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు.
➡️ ఇలా ఇంకా ఎన్నో…
💻 మరి ఒక సక్సెస్ ఫుల్ బ్లాగ్ ని క్రియేట్ చేయటం ఎలా 🧐?
💥 నేను VJ. నేను 2014 నుండి బ్లాగింగ్ ఇండస్ట్రీ లో ఉన్నాను. స్పోర్ట్స్ బ్లాగ్, విషెస్ బ్లాగ్, వాల్ పేపర్స్ బ్లాగ్, ఈవెంట్ బ్లాగింగ్, టెక్నికల్ బ్లాగ్ ఇలా ఎన్నో బ్లాగ్స్ ని రన్ చేశాను.
🔥 నా కెరీర్ స్టార్టింగ్ లో సరైన గైడెన్స్ లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మన దగ్గర ఇప్పుడిప్పుడే బ్లాగింగ్ గురించి అవగాహన్ వస్తుంది.
⭐ అటువంటి వారికీ హెల్ప్ చేయాలి అనే ఉదేశ్యంతో నేను ఒక ఈబూక్ వ్రాసాను. ఆ ఈబూక్ ఒక సక్సెస్ ఫుల్ బ్లాగ్ ని క్రియేట్ చేయటం ఎలా?
⚡⚡ ఈ ఈబూక్ లో మీరు ఒక సక్సెస్ ఫుల్ బ్లాగ్ ని క్రియేట్ చేయటానికి 7 స్టెప్స్ చెప్పటం జరిగింది. ఈ సెవెన్ స్టెప్స్ తో మీరు కూడా ఒక సక్సెస్ ఫుల్ బ్లాగ్ ని క్రియేట్ చేసి సక్సెస్ అవ్వవచ్చు. ఈ ఈబూక్ బిగినర్ ఫ్రెండ్లీగా ఉంటుంది.
🔥🔥 ఈ లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది ఆర్థిక పరిస్థితి బాగా దిగజారింది. అందుకోసం 999/- విలువ కలిగిన ఈ ఈబూక్ ని 90% ఆఫర్ కి ఇస్తున్నాను. ఇప్పుడే మీ ఈబూక్ ని డౌన్లోడ్ చేసుకోండి.
ఇప్పుడే మీ ఈబూక్ తీసుకోండి
- Website Design Formula for Small Businesses - October 27, 2021
- Digital Marketers Meetup in Hyderabad in 2021 - September 1, 2021
- How to Write Viral Blog Posts in Telugu - August 12, 2021