Always VJ

Blogging Basics in Telugu

blogging basics in telugu
Spread the love

Blogging అనే మాట విన్నపుడు మీకు, బ్లాగ్ అంటే ఏంటి? లేదా నేను ఒక బ్లాగ్ స్టార్ట్ చేయవచ్చా అని అనిపించి ఉండవచ్చు. ఒకవేళ మీకు అలా అనిపిస్తే ఈ బ్లాగింగ్ డీటెయిల్ గైడ్ మీకోసమే.

మీరు ఒక బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు, బ్లాగింగ్ కి సంబంధించిన బేసిక్స్ అన్ని మీరు తెలుసుకుంటే బాగుంటుంది. దీనివల్ల మీరు బ్లాగ్ స్టార్ట్ చేయటానికి పూర్తిగా సన్నధం అవ్వటానికి అవకాశం ఉంటుంది.

కాబట్టి బ్లాగింగ్ బేసిక్స్ గురించి, బ్లాగింగ్ ఎలా పని చేస్తుంది అని అన్నింటిని తెలుసుకుందాం.

మీరు ఈ పేజి చదువుతున్నారు అంటే మీరు, బ్లాగింగ్ ప్రపంచంలో అడుగుపెట్టటానికి సిద్ధంగా ఉన్నారు అనే అనుకుంటున్నాను. బ్లాగింగ్ ద్వారా మీరు షేర్ చేయాలి అనుకుంటే ముందు మీకు ఆ విషయం గురించి పూర్తిగా అవగాహనా ఉండాలి. ఒక బ్లాగర్ కి ఉండాల్సిన ముఖ్య లక్షణం.

కానీ మీకు ఎలా స్టార్ట్ చేయాలి అని మీకు ఐడియా లేదా? ఎక్కువగా ఆలోచించకండి. ఎందుకంటె ఈరోజు సక్సెస్ అయిన బ్లాగర్స్ లో ఎక్కువ మంది మీలాగే ఉన్నారు. వాళ్ళు కూడా మీలాగే వాళ్ళ ఐడియాస్, వాళ్ళ నాలెడ్జ్ షేర్ చేయాలి అనుకుంటారు.

కానీ ఇంటర్నెట్ ని యూస్ చేసుకుని ఒక ప్లాట్ఫారం క్రియేట్ చేయటం ఈరోజుల్లో అంత్యంత సులభం. కానీ ఒకప్పుడు చాలా కష్టం అలాగే ఖర్చుతో కూడుకున్నది.

ఈ రోజు మీరు మీ ఆన్లైన్ ప్రేసెన్స్ క్రియేట్ చేయటానికి కావాల్సిన మార్గాన్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి అని తెలుసుకుందాం. జీరో నుండి 60% (కనీసం 30% ) బ్లాగింగ్ గురించి ఒక వారంలో తెలుసుకోవచ్చు. కాబట్టి కింద నేను చెప్పే స్టెప్స్ ఫాలో అవ్వండి.

What is Blog? Blog Definition

బ్లాగ్ అంటే ఏంటి? బ్లాగ్ డెఫినిషన్

dictionary.com అనే వెబ్సైట్ ప్రకారం

“a website containing a writer’s or group of writers’ own experiences, observations, opinions, etc., and often having images and links to other websites.”

“ఒక రైటర్ లేదా కొంత మంది రైటర్స్ యొక్క సొంత అనుభవాలు, వారి పరిశీలనలు, వారి అభిప్రాయాలూ మొదలైనవి వాటితో పాటుగా కొన్ని ఇమేజ్స కొన్ని వెబ్సైట్స్ లింక్స్ కలిగి ఉన్న వెబ్ సైట్ ని బ్లాగ్ అంటారు.”

దీనిని నేను కొంచెం సులభంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. “బ్లాగింగ్ అంటే మీకున్న అభిప్రాయాలను, అనుభవాలని, మీకు నచ్చిన బాషలో ఒక ప్లాట్ఫారం ద్వారా ఇంటర్నెట్ లో రీడర్స్ తో షేర్ చేసుకోవటమే”.

ఇందుకోసం మీరు ఒక వెబ్ సైట్ ద్వారా లేదా ఈరోజుల్లో సోషల్ మీడియా ద్వారా కూడా బ్లాగింగ్ చేయవచ్చు.

Evolution of Blogging | బ్లాగింగ్ పరిమాణం

ఈరోజుల్లో బ్లాగింగ్ ఒక కెరీర్, ఒక ప్రొఫెషన్. ఒక బ్లాగ్ ని ఒక వ్యక్తీ లేదా ఇద్దరు కలిసి రన్ చేయవచ్చు. మీలో చాలామంది వినే ఉంటారు, జాబు మానేసి బ్లాగింగ్ స్టార్ట్ చేసిన కొంతమంది గురించి. మన తెలుగులో కూడా అలంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వారిలో Smart Telugu Ravi Kiran గారు ఒకరు.

కానీ మీకు తెలుసా ఈరోజు ఉన్నని బ్లాగ్స్ ఒకప్పుడు లేవు అంటే మీరు నమ్మగలరా?

1990లలో ఇంటర్నెట్ డెవలప్ అవ్వటం స్టార్ట్ అయ్యింది. అప్పుడే dotcom బూమ్ బాగా పెరిగింది. అదే టైం లో టెక్నాలజీ లో వచ్చిన అనేక సాంకేతిక విప్లవాలు, ఇంటర్నెట్లో ముఖచిత్రాన్ని మార్చివేసింది. కంప్యూటర్ల ప్రైస్ కూడా బాగా తగ్గింది.

ఈ టైం లో బ్లాగింగ్ కి మంచి అవకాశం వచ్చింది. అదే టైం లో Blogger, Tumblr లు పాపులర్ అవ్వటం మొదలైంది. వీటి ద్వారా బ్లాగ్స్ క్రియేట్ చేయటం ఇంకా సులభం అయ్యింది. ఈ ప్లాట్ఫారంస ద్వారా బ్లాగర్స్ వారి ఆలోచనలు, అభిప్రాయాలూ షేర్ చేయటం మరింత సులభం అయ్యింది.

2003 లో గూగుల్ ఎప్పుడైతే blogger ని ఓన్ చేసుకుందో, ఆ  తరువాత బ్లాగింగ్ ఇంకా ఈజీ అయ్యింది. ఈరోజు బ్లాగింగ్ లో టాప్ లో ఉన్న ఎంతో మంది బ్లాగర్స్ ఎంతో మంది blogger ద్వారానే వాళ్ళ కెరీర్ ని స్టార్ట్ చేశారు అని మీకు తెలుసా?

ఆ తరువాత వచ్చిన WordPress పూర్తిగా ఇప్పుడు బ్లాగింగ్ గేమ్ నే మార్చివేసింది. ఈరోజు ఇంటర్నెట్ లో ఉన్న బ్లాగ్స్/ వెబ్ సైట్స్ లో దాదాపు 30% ఈ వర్డుప్రెస్సు లోనే ఉన్నాయి అంటే నమ్మగలరా!  అలాగే పర్సనల్ బ్లాగ్స్ ఈజీగా ఆపరేట్ చేసే అవకాశం కలిగింది. దానితో పాటుగా న్యూస్పేపర్స్ కూడా ఈ డిజిటల్ పుబ్లిషింగ్ లోకి అడుగుపెట్టాయి.

ప్రింటింగ్, బిజినెస్ ప్రపంచంలో ఎన్నో మార్పులు ఈ బ్లాగింగ్ ద్వారా జరిగాయి. అంతే కాకుండా అప్పుడప్పుడు మనం పేపర్స్, టీవీ న్యూస్ లో కూడా చూస్తూ ఉంటాం బ్లాగింగ్ ద్వారా ఇంటి నుండి డబ్బు సంపాదిస్తున్నారు అని, మరికొంత మందికి ఉపాధి కల్పిస్తున్నారు అని.  కాబట్టి ఇప్పుడు చెప్పండి బ్లాగింగ్ కి ఏం తక్కువ!

Why People Blog

బ్లాగింగ్ ద్వారా సామాన్యులు సైతం పెద్ద పెద్ద కంపెనీలకి పోటి ఇవ్వగలిగిన అవకాశం కలిగింది. ఇంటర్నెట్ ని లైట్ తీసుకున్న ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు, న్యూస్పేపర్స్ వాళ్ళు డిజిటల్ గ అప్డేట్ కాలేక డిజిటల్ ఆదాయాన్ని కోల్పోయాయి.

బ్లాగింగ్ ద్వరా కేవలం అభిప్రాయాలూ, ఆలోచనలు షేర్ చేయటమే కాకుండా, బ్లాగింగ్ ద్వారా ఆదాయాన్ని కూడా పొందవచ్చు. మన ఇండియాలో బ్లాగింగ్ మాత్రం ఫేమస్ అయ్యింది మాత్రమే మనీ ఎర్నింగ్ వల్లనే.

ఈరోజు మనం గమనిస్తే పుట్టగొడుగులలాగా బ్లాగ్స్ పుట్టుకొచ్చాయి. ప్రతి న్యూస్ ఛానల్, న్యూస్ పేపర్ కి బ్లాగ్స్ ఉన్నాయి. అంతే కాకుండా వంటల బ్లాగ్స్, ఫోటోగ్రఫీ బ్లాగ్స్ ఇలా ఎన్నో ఉన్నాయి.

అలాగని బ్లాగింగ్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు అని నేను చెప్పను. ఎందుకంటె అది వాళ్ళు తీసుకునే నిష్, వాళ్ళ హార్డ్ వర్క్ ఇలా అనేక కారణాలు ఉంటాయి. ఎంతో మంది సరదాగా స్టార్ట్ చేసిన బ్లాగింగ్ ఈరోజు ఒక బిజినెస్ గా కూడా అడిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.

అదే విధంగా చిన్న చిన్న వ్యాపారాలకి కూడా బ్లాగ్స్ బాగా హెల్ప్ అవుతాయి. వాళ్ళ ప్రొడక్ట్స్, సర్వీసెస్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ బ్లాగ్స్ ద్వారా అందించవచ్చు. అంతే కాకుండా సెర్చ్ ఇంజిన్ లో కూడా బిజినెస్ త్వరగా ర్యాంక్ అవుతుంది.

4 reasons to Blog | బ్లాగింగ్ చేయటానికి 4 కారణాలు

1) మీ కస్టమర్స్ లేదా రీడర్స్ తో మంచి రిలేషన్షిప్స్ బిల్డ్ చేయటానికి, దాన్ని మైంటైన్ చేయటానికి బ్లాగ్స్ హెల్ప్ అవుతాయి.

2) మీ బిజినెస్ వెబ్సైటు సెర్చ్ ఇంజిన్స్ లో మంచి ర్యాంకింగ్స్ పొందటం ద్వారా మీ బిజినెస్ మరింత మంది కస్టమర్స్ కి రీచ్ అవుతుంది. బాగా డిజైన్ చేసిన ఒక వెబ్సైటు మీకు బిజినెస్ ని కూడా ఇస్తుంది.

3) బ్లాగ్ ఉండటం వలన కలిగే బెనిఫిట్స్ ద్వారా మీరు బెస్ట్ కంపెనీ, మీ ప్రొడక్ట్స్/సర్వీసెస్ బాగుంటాయి అని కస్టమర్స్ ఒక అభిప్రాయానికి వస్తారు,

4) మీ గురించి, మీ ప్రొడక్ట్స్/ సర్వీసెస్ గురించి బాగా ప్రమోట్ చేసుకోవటానికి బ్లాగ్ బాగా హెల్ప్ అవుతుంది.

బ్లాగింగ్ పైన నమ్మకం కలగట్లేదా?

బ్లాగింగ్ లో కూడా కొన్ని మైనస్ లు కూడా ఉన్నాయి. అయితే చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, ఈ రోజుల్లో బ్లాగ్స్ ఎవరు చదువుతున్నారు, ఎక్కువ మంది వీడియోస్ చూస్తున్నారు అని. నేను ఒకటి అడుగుతాను చెప్పండి, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీరు ఏం చేస్తారు. గూగుల్ లో సెర్చ్ చేస్తారు. మీరు సెర్చ్ చేసిన ప్రతి దాని గురించి మీకు ఎక్కువ శాతం వెబ్సైటు లేదా బ్లాగ్ పోస్ట్స్ మాత్రమే కదా మీరు ఓపెన్ చేసేది.

మీ ప్రశ్న కి సమాధానం దిరికింది అనుకుంటా! నేను అంటాను ఒక బ్లాగ్ ని కరెక్ట్ గా ప్లాన్ చేస్తే ఖచ్చితంగా ఉన్న తేడాని అన్ని రకాల బిజినెస్ లకి చూపిస్తుంది.

ఉదాహరణకి మీరు ఒక సాఫ్ట్వేర్ తయారు చేశారు అనుకుందాం. దాని గురించి మీరు ప్రతి అంశం గురించి వివరంగా బ్లాగ్స్ రాసి వాటిని షేర్ చేస్తే ఆ సాఫ్ట్వేర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీ బ్లాగ్ లోనే ఉంది. ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ మీ బ్లాగ్ లో ఉంటె ఖచ్చితంగా సేల్స్ పైన కూడా దాని ప్రభావం ఉంటుంది. ఇది పూర్తిగా మీకు ఫ్రీ పబ్లిసిటీ గా కూడా పని చేస్తుంది.

Do you want to Blogging Success? Are you ready to invest yourself?

మీరు బ్లాగింగ్ లో సక్సెస్ కావాలనుకుంటున్నారా? మీరు పెట్టుబడి పెట్టటానికి సిధంగా ఉన్నారా?

అవును అనేది మీ సమాధానం అయితే పూర్తిగా చదవండి.

ఈరోజుల్ల్లో మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్, టెక్నాలజీ ద్వారా ఒక బ్లాగ్ ని క్రియేట్ చేయటం పెద్ద కష్టం కాదు. ఈ బ్లాగ్ లో మీకు బ్లాగింగ్ గురించిన ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా వస్తూనే ఉంటాయి.

మొట్టమొదట మీరు బ్లాగింగ్ బేసిక్స్ నేర్చుకోవాలి. తరువాత ఒక బ్లాగ్ ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకోవాలి. ఒక బ్లాగ్ క్రియేట్ చేసిన తరువాత దాన్ని ఎలా గ్రో చేయాలి? అని తెలుసుకోవాలి. ఎందుకంటె బ్లాగింగ్ లాంగ్ రన్ గేమ్. బ్లాగింగ్ ద్వారా ఎలా సంపాదించాలి అని తెలుసుకోవాలి. ఇవన్ని నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి.

ఇన్ని నేర్చుకోవాలా అని భయపడకండి. మీకు హెల్ప్ చేయటానికి నేను ఉన్నాను.

“ఈ బ్లాగ్ ని మీలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలి అనే ఉద్దేశ్యంతోనే స్టార్ట్ చేశాను. ఒక్కసారి మీరు బ్లాగింగ్ చేయాలి అని కమిట్ అయితే సక్సెస్ అయ్యే వరకూ ఎవరి మాట వినొద్దు, మీ మాట అసల్లు వినొద్దు. ”

ఒకప్పుడు నేను కూడా మీలాగే ఉండేవాడిని. నేను కొన్ని సంవత్సరాలుగా బ్లాగింగ్ ఇండస్ట్రీ లో ఉన్నాను. ఎన్నో రోజులు అర్ధరత్రుల వరకు కూర్చుని బ్లాగింగ్ గురించిన ప్రతి బ్లాగ్ పోస్ట్ చదివేవాడిని, ప్రతి వీడియో చూసేవాడిని. అల నేను నేర్చుకున్న ఎన్నింటినో నేను నా బ్లాగ్స్ పైన ఇంప్లిమెంట్ చేసి కొంత నాలెడ్జ్ (ఎందుకంటె ఎంత నేర్చుకున్న ఇంకా ఉంటూనే ఉంటుంది, అందుకే కొంత అన్నాను) నేర్చుకున్నాను.

ఒక బ్లాగ్ ని ఎలా క్రియేట్ చేయాలి, ఒక బ్లాగ్ ని ఎలా రన్ చేయాలి, ఇలాంటి విషయాలు అన్ని ఆ బ్లాగ్ లో ఉన్నాయి, నా ఈబూక్స్, కోర్సెస్ లో ఉన్నాయి.  త్వరలోనే వర్క్ షాప్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. మీరు వీటి ద్వారా కూడా నేర్చుకోవచ్చు.  స్టెప్-బై-స్టెప్ ఒక బ్లాగ్ ని ఎలా క్రియేట్ చేయాలి, గ్రో చేయాలి, మనీ ఎలా ఎర్న్ చేయాలి వంటివి ఈ బ్లాగ్ ద్వారా తెలుగులో నేర్చుకోవచ్చు. కాబట్టి మీ బ్లాగ్ ని స్టార్ట్ చేయండి, నేర్చుకోండి, మీ బ్లాగ్ ని డెవలప్ చేసుకోండి, బ్లాగ్ ద్వారా మనీ ఎర్న్ చేయండి.

Four Steps to Getting started Blogging

1) మీ ఇన్వెస్ట్మెంట్ (పెట్టుబడి)

10 నుండి 40 గంటలు మీ బ్లాగ్ కోసం, బ్లాగ్ బ్రాండింగ్ కోసం స్పెండ్ చేయండి.  మీరు యూస్ చేసే బ్లాగింగ్ సాఫ్ట్వేర్ గురించి నేర్చుకోండి. లేదా ఒక ఎక్స్పర్ట్ ని హైర్ చేసుకోండి. 3-5 వేలల్లో మీ బ్లాగ్ ని సెటప్ చేయించుకోవచ్చు. అప్పుడు మీరు కంటెంట్ క్రియేషన్ పైన ఫోకస్ చేయవచ్చు.

2) రైటింగ్ స్టార్ట్ చేయాలి

మీరు మీ బ్లాగ్ కోసం బ్లాగ్ పోస్ట్స్ వ్రాయండి. అందుకోసం కావాల్సిన ఐడియాస్ సెర్చ్ చేయండి, బ్లాగ్ టాపిక్స్ సెలెక్ట్ చేసుకోండి, మంచి కంటెంట్ వ్రాయండి. ఒక్కసారి మీరు వ్రాయడం స్టార్ట్ చేసిన తరువాత ఒక్కోసారి ఆ టాపిక్ నుండి డైవెర్ట్ అయ్యే మీకు సంబంధం లేని టాపిక్స్ వ్రాసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫోకస్ చేసి మీ బ్లాగ్ కోసం కంటెంట్ వ్రాయండి.

3) ఒక్క మాట చెప్పండి

మీ బ్లాగ్ గురించి మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చెప్పమని చెప్పండి. సోషల్ మీడియాలో మీ బ్లాగ్ ని షేర్ చేయండి. ఇలా చేయటం ద్వారా మీ బ్లాగ్ గురించి ఎక్కువ మందికి తెలిసే అవకాశం ఉంటుంది.

4) మీ బ్లాగ్ గురించి అడగండి

మీ బ్లాగ్ లో కంటెంట్ ఎలా ఉంది అని అడగండి. ఎందుకంటె మనం అందరికి నచ్చే కంటెంట్ క్రియేట్ చేయటం కష్టం, కాబట్టి మనం ఎవరికి ఎలాంటి కంటెంట్ కావాలో అడగండి. మీరు క్రియేట్ చేసిన కంటెంట్ ఎలా ఉందొ వాళ్ళని అడగండి. మనం దీనిని సింపుల్ గా ఫీడ్ బ్యాక్ అంటారు. మీకు లభించిన ఫీడ్ బ్యాక్ ని బట్టి మీ బ్లాగ్ కంటెంట్ స్ట్రాటజీ ని ప్లాన్ చేసుకోండి.

Final Inspiration to Get Blogging or Stick with it

బ్లాగింగ్ గేమ్ లో మనం ఎంటర్ అయితే సరిపోదు. ఏ గేమ్ లో అయినా మనం గెలవాలి అంటే మనం ఆ గేమ్ ఆడాలి. అదే విధంగా బ్లాగింగ్ గేమ్ లో కూడా మనం ఆడకపోతే గెలవటం అసాధ్యం. ఈరోజు ఎంతో మంది బ్లాగర్స్ మన చుట్టూ ఉన్నారు. ఇంకా ఎంతో మంది బ్లాగర్స్ కావాలి. కాబట్టి బ్లాగింగ్ ప్రపంచంలోకి రండి.

ఒక నిష్ సెలెక్ట్ చేసుకోండి, వ్రాయటం స్టార్ట్ చేయండి మీ బ్లాగ్స్ గురించి జనాలకి తెలిసేలా చేయండి. ఇప్పుడు బ్లాగింగ్ కి మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు మీరు బ్లాగ్ స్టార్ట్ చేస్తే మీ బిజినెస్ పెరగవచ్చు, ఏమో మీరు ఏ లాభాలో పొందుతారో ఎవరికి తెలుసు!

Blogging Income

How do Bloggers Make Money?

ఫుల్ టైం బ్లాగర్ గా ఉండటం కష్టం, చాలా పని ఉంటుంది. కానీ ఒక్కసారి మీ బ్లాగ్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళని కనుక మీరు సంపాదించుకోగాలిగితే వాళ్ళు మల్లి మల్లి మీ బ్లాగ్ చదవటానికి వస్తారు. అలా రెగ్యులర్ గా వచ్చే ట్రాఫిక్ ని మీరు మానటైజ్ చేయవచ్చు.

మనీ ఎర్న్ చేయటానికి బ్లాగర్స్ కి అనేక మార్గాలు ఉన్నాయి. మీరు మీ బ్లాగ్ లో ఉన్న యాడ్ స్పేస్ సెల్ చేయవచ్చు. (బ్లాగింగ్ కొత్తలో ఎక్కువమంది యాడ్సెన్స్ నే యూస్ చేస్తారు). మీ బ్లాగ్ లో ఫిజికల్ ప్రొడక్ట్స్ లేదా డిజిటల్ ప్రొడక్ట్స్ అమ్మవచ్చు, మీరు కన్సల్టింగ్ సర్వీసెస్ ప్రమోట్ చేయవచ్చు.

అంతే కాకుండా కొన్ని కంపెనీలు వలల్ ప్రొడక్ట్స్ / సర్వీసెస్ మీ బ్లాగ్ రీడర్స్ కి ప్రమోట్ చేస్తే ప్రతి సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ కి కొంత కమిషన్ ఇవ్వటం జరుగుతుంది. ఇలా చేయటాన్ని అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. వీటి ద్వారానే ఎక్కువ మంది బ్లాగర్స్ ఎక్కువ మనీ ఎర్న్ చేస్తున్నారు.

1) పెయిడ్ యాడ్స్

2) అఫిలియేట్ మార్కెటింగ్

3) ఫిజికల్ ప్రొడక్ట్స్

4) డిజిటల్ ప్రొడక్ట్స్

5) సర్వీసెస్

ఇంకా అనేక మార్గాల ద్వారా ఎంతో మంది బ్లాగర్స్ మనీ ఎర్న్ చేస్తున్నారు. కానీ ఇవి ముఖ్యమైన ఆదాయ మార్గాలు.

How Much Do Bloggers Make?

మీకు తెలుసా బ్లాగింగ్ ద్వారా నెలకి లక్ష రూపాయలు సంపాదించే బ్లాగర్స్ ఉన్నారు, 5-10 లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. కొంత మంది బ్లాగర్స్ వాళ్ళ ఎర్నింగ్ రిపోర్ట్స్ కూడా వాళ్ళ బ్లాగ్స్ లో పబ్లిష్ చేస్తున్నారు. (కొన్ని సంవత్సరాల కష్టం అని మర్చిపోకండి)

హర్ష్ అగర్వాల్, దీపక్ కనకరాజు, సోరావ్ జైన్, స్మార్ట్ తెలుగు రవి కిరణ్ గారు… ఇలా ఎంతో మంది ఉన్నారు. వీళ్ళు అందరు వారి వారి ఇండస్ట్రీలో ఇప్పుడు టాప్ పొజిషన్స్ లో ఉన్నారు.

Breaking down the different types in the Blogosphere

ఈరోజు ప్రపంచంలో 500 మిలియన్ల బ్లాగ్స్ ఇంటర్నెట్ లో ఉన్నాయి. ప్రతి రోజు కొన్ని లక్షల వెబ్ పేజెస్ పబ్లిష్ అవుతున్నాయి. దిన్ని బట్టి బ్లాగింగ్ ఇండస్ట్రీలో ఈరోజు ఉన్న కాంపిటీషన్ మనకి అర్థం అవుతుంది. అయితే మీరు ఏ టైపు బ్లాగరో తెలుసుకోవాలి. దాన్ని బట్టి మీరు వర్క్ చేస్తే దాన్ని బట్టి మీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది.

  • పార్ట్ టైం ప్రొఫెషనల్ బ్లాగర్
  • హాబీ బ్లాగర్
  • ఫుల్ టైం ప్రొఫెషనల్ బ్లాగర్
  • కార్పొరేట్ బ్లాగర్
  • ఎంటర్ప్రేన్యుర్

ఈ ఇమేజ్ చూస్తె మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది.

Img Source: BloggingTips.com

How much are bloggers earning their blogs?

ఇంతకూ ముందే మనం చెప్పుకున్నాం, ప్రతి బ్లాగ్ మనీ ఎర్న్ చేయలేదు, కేవలం 14-20% బ్లాగ్స్ మాత్రమే మనీ ఎర్న్ చేస్తున్నా. ఇందుకు కారణం లేకపోలేదు, ఇందులో ఎక్కువ నాన్-ప్రాఫిట్, హాబీ బ్లాగ్స్ లేదా ఒక స్ట్రాటజీ లేకుండా బ్లాగింగ్ చేయటం ఇలా అనేక కారణాలు ఉన్నాయి.

బ్లాగింగ్ ద్వారా ఆదాయాన్ని పొందే కొన్ని మార్గాలు:

  • డిస్ప్లే యాడ్స్
  • అఫిలియేట్ మార్కెటింగ్ లింక్స్
  • సెర్చ్ యాడ్స్

మనీ ఎర్న్ చేసే బ్లాగ్స్ అన్ని కూడా  ఆ బ్లాగ్ లో ఉండే కంటెంట్, ట్రాఫిక్ వల్లే సాధ్యపడుతుంది. ఇంకా అనేక మార్గాల ద్వారా బ్లాగ్స్ మనీ ఎర్న్ చేస్తున్నాయి.

బాగా పాపులర్ అయినవి గూగుల్ యాడ్సెన్స్, అఫిలియేట్ మార్కెటింగ్, డైరెక్ట్ బ్యానర్ యాడ్స్. మనం కరెక్ట్ గా ప్లాన్ చేస్తే ప్రతి బ్లాగ్ ని మానటైజ్ చేయవచ్చు. మనకి ఇండియాలో ఎక్కువ మంది కేవలం యాడ్సెన్స్ గురించి మాత్రమే ఆలోచిస్తారు. మిగిలిన వాటి గురించి అతి తక్కువ మంది మాత్రమే మిగిలిన సోర్సెస్ ద్వారా ఎర్న్ చేస్తున్నారు.

మీ బ్లాగ్ కి లాయల్ ఫాలోయర్స్ ని క్రియేట్ చేయగలిగితే, వల్లే మీ బ్లాగ్ కి రెవిన్యూ జెనరేట్ చేస్తారు. అయితే ఇందుకు మీరు అత్యంత విలువైన, క్వాలిటీ టైం ని ఇన్వెస్ట్ చేయాలి.

కానీ బ్లాగింగ్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరు మనీ ఎర్న్ చేయటం కుదరని పని. అయితే ఎవరు అయితే లాంగ్ రన్ గేమ్ ఆడతారో వాళ్ళు మాత్రమే మనీ ఎర్న్ చేయగలరు. ఈ విషయం మర్చిపోకూడదు.

Blogging is All about Content Value… Not Content Creation

బ్లాగింగ్ అంటే కేవలం కంటెంట్ క్రియేట్ చేయటం కాదు, క్రియేట్ చేసిన కంటెంట్ వేల్యూ గురించి. ఎందుకంటె కంటెంట్ ఇస్ కింగ్. ఏం చేయాలి అన్న కంటెంట్ కావాలి. కంటెంట్ అన్నింటి కన్నా ముఖ్యమైనది, పవర్ఫుల్.

ఈ కంటెంట్ మీ బ్లాగ్ రీడర్స్ ని దృష్టిలో పెట్టుకుని క్రియేట్ చేయాలి. ఈరోజు బ్లాగర్స్ కి ఉన్న అతి ముఖ్యమైన ప్రాబ్లం, ప్రతి ఒక్కరు కొత్త కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, అయితే ఆ కంటెంట్ వల్ల రీడర్స్ కి ఎంత వరకూ హెల్ప్ అవుతుంది అని ఎంత మంది ఆలోచిస్తున్నారు?

ఈరోజు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న బ్లాగ్స్ లో ఇంకా కంటెంట్ అవసరం లేదు, కానీ బెటర్ కంటెంట్ కావాలి. బ్లాగింగ్ లో సక్సెస్ కావాలి అంటే మీరు పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుని, మీ కంటెంట్ ని ప్రోమోట్ చేయాలి, ఇలా చేయడం వల్ల బ్లాగింగ్ ఫీల్డ్ లో సక్సెస్ అవగలరు.

బ్లాగర్స్ కి వాళ్ళు క్రియేట్ చేసే కంటెంట్ గురించి పూర్తి అవగాహన ఉండాలి, (చాలా మంది కొత్తగా బ్లాగింగ్ నేర్చుకునేవాళ్ళకి) ఆ కంటెంట్ రీడర్స్ కి ఎంత హెల్ప్ అవుతుంది అని ఆలోచించాలి.

కంటెంట్ రైటింగ్ చేసేటప్పుడు మీ బ్లాగ్ ఆడియన్స్ ఎవరు, వాళ్ళకి ఏం కావాలి, వాటిని మీరు ఎలా వాళ్ళకి అందించగలరు అనే విషయాలు పరిగణలోకి తీసుకోవాలి. ఇలా చేయటం వలన మీ బ్లాగ్ ఆడియన్స్ కి వేల్యూ కంటెంట్ అందించటమే కాకుండా మీ బ్లాగ్ బ్రాండింగ్ కి కూడా హెల్ప్ అవుతుంది.

మీకు టైం ఉంటె ఈ బ్లాగ్స్ కూడా చదవండి. ఇవి మీకు ఇంకా హెల్ప్ అవుతాయి 👇👇

Exit mobile version