బ్లాగింగ్ ఏ భాషలో చేస్తే బాగుంటుంది? ఇంగ్లీష్ ? తెలుగు? (Which Language is best for Blogging)
బ్లాగింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి వచ్చే డౌట్స్ లో ఒకటి, ఏ భాషలో స్టార్ట్ చేయాలి. మీ బ్లాగ్ ఇంగ్లీష్ లో ఉండాలా? తెలుగులో ఉండాలా? ఈ బ్లాగ్ పోస్ట్ లో తెలుగు బ్లాగింగ్ కి, ఇంగ్లీష్ బ్లాగింగ్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఈ బ్లాగ్ పోస్ట్ పూర్తిగా చదివితే మీరు ఏ లాంగ్వేజ్ లో బ్లాగింగ్ చేయాలి అని అనుకుంటున్నారో మీరే నిర్ణయించుకోవచ్చు.
1) కాంపిటీషన్
ఇంగ్లీష్: కాంపిటీషన్ పరంగా చూసినపుడు ఇంగ్లీష్ బ్లాగ్స్ కి ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటె మీరు ఏ నిష్ లో ఉన్నా మీరు వరల్డ్ వైడ్ గా ఉన్న బ్లాగర్స్ తో పోటి పడాలి.
తెలుగు: కాంపిటీషన్ పరంగా చూసినపుడు ఇంగ్లీష్ బ్లాగ్స్ కి తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఇంగ్లీష్ తో పోల్చుకుంటే తెలుగు బ్లాగర్స్ తక్కువగా ఉంటారు. అందులోను మీ నిష్ ఒక్క లాంగ్వేజ్ కే పరిమితం అవుతుంది కాబట్టి మీ బ్లాగ్ పాపులర్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. అంతే కాకుండా సెర్చ్ ఇంజిన్స్ లో త్వరగా రాంక్ అవ్వటానికి అవకాశం ఉంటుంది.
2) యాడ్ కాస్ట్
ఇంగ్లీష్: ఇంగ్లీష్ బ్లాగ్స్ లో డిస్ప్లే అయ్యే యాడ్స్ యొక్క కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంటే గూగుల్ ఇచ్చే CPC ఎక్కువ. కానీ అంత కాంపిటీషన్ లో మీకు ఎంత ట్రాఫిక్ వస్తుంది. అలా చూసినా మీకు తక్కువ ట్రాఫిక్ వచ్చే అవకాశం ఉంటుంది. తక్కువ ట్రాఫిక్ తో మీరు ఎక్కువ CPC ఉన్న పెద్దగ ఏమి ఎర్న్ చేయలేరు.
తెలుగు: తెలుగు బ్లాగ్స్ లో డిస్ప్లే అయ్యే యాడ్స్ యొక్క కాస్ట్ ఇంగ్లీష్ బ్లాగ్స్ తో పోలిస్తే కొంచెం తక్కువగానే ఉంటుంది. కానీ మీకు ఉన్న కాంపిటీషన్ పరంగా ఎక్కువ ట్రాఫిక్ రావటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ ట్రాఫిక్ తో తక్కువ CPC ఉన్నా మీరు ఎక్కువగా మనీ ఎర్న్ చేయటానికి అవకాశం ఉంటుంది.
3) గ్రమేటికల్ మిస్టేక్స్
ఇంగ్లీష్: ఒకవేళ మీరు యాడ్ కాస్ట్ ఎక్కువ, ట్రాఫిక్ కూడా ఎక్కువగా వస్తుంది అని మీకు పెద్దగా పట్టు లేకపోయినా ఇంగ్లీష్ లో బ్లాగ్ స్టార్ట్ చేసినా మీ బ్లాగ్ పోస్ట్స్ లో మిస్టేక్స్ కనుక ఉన్నట్లు అయితే సెర్చ్ ఇంజిన్స్ లో ర్యాంకింగ్స్ పడిపోతాయి. దీని ద్వారా మీకు వచ్చే ట్రాఫిక్ పడిపోతుంది. మిస్టేక్స్ లేకుండా బ్లాగ్ పోస్ట్స్ వ్రాయాలి. ఒకవేళ మీకు పట్టు లేకపోతే కష్టం అవుతుంది.
తెలుగు: అదే ఇంగ్లీష్ తో పోల్చుకుంటే తెలుగు లో ఆర్టికల్స్ వ్రాయటంలో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఎటువంటి తప్పులు లేకుండా కంటెంట్ క్రియేట్ చేయవచ్చు. దీనివల్ల మీ ర్యాంకింగ్స్ ఇంప్రూవ్ అవుతాయి. ర్యాంకింగ్స్ బాగుంటే మంచి ట్రాఫిక్ మీ బ్లాగ్ కి వస్తుంది.
4) SEO
ఇంగ్లీష్: ఇంతకు ముందు చెప్పుకున్నట్లు ఇంగ్లీష్ బ్లాగ్స్ లో కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. ఈ కాంపిటీషన్ వలన మీకు సెర్చ్ ఇంజిన్ లో ర్యాంకింగ్ అవ్వటం కష్టం. అంతే కాకుండా ఎప్పటి నుండో ఉన్న బ్లాగర్స్ బ్లాగ్స్ సెర్చ్ ఇంజిన్స్ లో రాంక్ అయ్యి ఉంటాయి. వాటితో పోటి పడటం కష్టం.
తెలుగు: తెలుగులో మీ బ్లాగ్ సెర్చ్ ఇంజిన్స్ లో రాంక్ అవ్వటం ఈజీ. తెలుగులో బ్లాగ్స్ తక్కువ కాబట్టి కాంపిటీషన్ తక్కువ. అందులోను తెలుగులో కంటెంట్ తక్కువగా ఉంటుంది కాబట్టి మీకు మంచి ట్రాఫిక్ వస్తుంది. మంచి ట్రాఫిక్ వస్తే మంచి ఎర్నింగ్స్ కి అవకాశం ఉంటుంది.
5) వాయిస్ సెర్చ్
ఇంగ్లీష్: 2019 నుండి వాయిస్ సెర్చ్ కి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. దీని కోసం అమెజాన్, గూగుల్, ఆపిల్ వంటి టెక్ దిగ్గజాలు స్పెషల్ గా గాడ్జెట్స్ క్రియేట్ చేస్తున్నాయి. అలా చూసినప్పుడు ఇంగ్లీష్ బ్లాగ్స్ కి మనం వాయిస్ సెర్చ్ చేయటం కష్టం. ఇక్కడ కూడా కాంపిటీషన్ అలాగే ఉంటుంది.
తెలుగు: తెలుగులో మనకి గ్రామాలలో కూడా స్మార్ట్ ఫోన్స్ యూస్ చేస్తున్నారు. కానీ వాళ్ళు మనం సెర్చ్ చేసినట్టు వాళ్ళు టైపు చేసి సెర్చ్ చేయరు. వాళ్ళు వాయిస్ సెర్చ్ యూస్ చేస్తున్నారు. ఇలా వాళ్ళు వాయిస్ సెర్చ్ చేసినప్పుడు ఉదాహరణకి ఒక బ్లాగ్ ని ఎలా క్రియేట్ చేయాలి అని చేస్తారు. కానీ how to create a blog అని సెర్చ్ చేయరు. ఇలా చూసినప్పుడు వాయిస్ సెర్చ్ లో త్వరగా రాంక్ అవ్వటానికి అవకాశం ఉంటుంది.
6) కంటెంట్
ఈ కంటెంట్ విషయానికి వచ్చేటప్పటికి ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజ్స్ కి రెండింటికి ఒకే ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటె కంటెంట్ ఇస్ కింగ్ కదా! కాబట్టి కంటెంట్ పరంగా చూసినప్పుడు మీరు SEO చేయాలన్న కంటెంట్ కావాలి, మీరు బ్లాగ్ క్రియేట్ చేయాలి అన్నా కంటెంట్ కావాలి, ఇలా మీరు ఏం చేయాలి అన్నా కంటెంట్ కావాలి.
ఇప్పుడు మీరు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేసుకోండి
- మీరు ఏ లాంగ్వేజ్ లో కంఫర్ట్ గా ఫీల్ అవుతారు?
- మీరు ఏ లాంగ్వేజ్ లో బ్లాగ్ పోస్ట్స్ ఈజీగా వ్రాయగలరు?
- మీరు ఏ లాంగ్వేజ్ లో మీకు ఉన్న నాలెడ్జ్ ని షేర్ చేయగలరు?
ఈ ప్రశ్నలకి పైన చెప్పిన అంశాలతో పోల్చి చుడండి.
ఇప్పుడిప్పుడే రీజినల్ కంటెంట్ కి డిమాండ్ పెరుగుతుంది. కానీ డిమాండ్ కి తగ్గటుగా రీజినల్ కంటెంట్ లేదు. అందుకోసం ఉన్న కొద్ది కంటెంట్ నే గూగుల్ పుష్ చేస్తుంది. అంతే కాకుండా ఇప్పుడు మీరు బ్లాగింగ్ స్టార్ట్ చేస్తే తప్పకుండ ఒక్క సంవత్సరం కష్టపడితే మీ ఇండస్ట్రీలో మీరు టాప్ పోసిషన్ లో ఉండే అవకాశం ఉంది.
ఇప్పుడు మీరు ఏ లాంగ్వేజ్ లో బ్లాగింగ్ చేయాలి అనేది మీరు డిసైడ్ అవ్వండి. మీ బ్లాగ్ సక్సెస్ లో ఈ అంశం కూడా ముఖ్యమైనది. ఈ టాపిక్ పై మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఈ పోస్ట్ మీకు నచ్చితే షేర్ చేయండి.
ఒక్క నిమిషం … ఇంకొక్క నిమిషం చదవండి
✅ బ్లాగ్స్ ఎవరైనా క్రియేట్ చేస్తారు. కానీ ఒక సక్సెస్ ఫుల్ బ్లాగ్ ని కొంత మంది 👨💼 మాత్రమే క్రియేట్ చేయగలరు.
✅ అటువంటి వారిలో హర్ష్ అగర్వాల్, దీపక్ కనకరాజు, సౌరవ్ జైన్, తెలుగులో స్మార్ట్ తెలుగు రవి కిరణ్ గారు….ఇలా ఎంతో మంది బ్లాగింగ్ ద్వారా మంచి పోసిషన్స్ లో ఉన్నారు.
💥 మరి మీ సంగతి ఏంటి 🤔 ?
💥 మీకు తెలుసా? ఒక సక్సెస్ ఫుల్ బ్లాగ్ వలన కలిగే బెనిఫిట్స్ ఏంటో తెలుసా?
➡️ బ్లాగింగ్ ద్వారా మీకు నచిన టైంలో పని చేయవచ్చు.
➡️ బ్లాగింగ్ ద్వారా మీకు ఆర్థిక స్వతంత్రం లభిస్తుంది.
➡️ బ్లాగింగ్ ద్వారా మీరు ఒక మంచి కెరీర్ లో సెటిల్ అవ్వవచ్చు
➡️ బ్లాగింగ్ కి ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు.
➡️ ఇలా ఇంకా ఎన్నో…
💻 మరి ఒక సక్సెస్ ఫుల్ బ్లాగ్ ని క్రియేట్ చేయటం ఎలా 🧐?
💥 నేను VJ. నేను 2014 నుండి బ్లాగింగ్ ఇండస్ట్రీ లో ఉన్నాను. స్పోర్ట్స్ బ్లాగ్, విషెస్ బ్లాగ్, వాల్ పేపర్స్ బ్లాగ్, ఈవెంట్ బ్లాగింగ్, టెక్నికల్ బ్లాగ్ ఇలా ఎన్నో బ్లాగ్స్ ని రన్ చేశాను.
🔥 నా కెరీర్ స్టార్టింగ్ లో సరైన గైడెన్స్ లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మన దగ్గర ఇప్పుడిప్పుడే బ్లాగింగ్ గురించి అవగాహన్ వస్తుంది.
⭐ అటువంటి వారికీ హెల్ప్ చేయాలి అనే ఉదేశ్యంతో నేను ఒక ఈబూక్ వ్రాసాను. ఆ ఈబూక్ ఒక సక్సెస్ ఫుల్ బ్లాగ్ ని క్రియేట్ చేయటం ఎలా?
⚡⚡ ఈ ఈబూక్ లో మీరు ఒక సక్సెస్ ఫుల్ బ్లాగ్ ని క్రియేట్ చేయటానికి 7 స్టెప్స్ చెప్పటం జరిగింది. ఈ సెవెన్ స్టెప్స్ తో మీరు కూడా ఒక సక్సెస్ ఫుల్ బ్లాగ్ ని క్రియేట్ చేసి సక్సెస్ అవ్వవచ్చు. ఈ ఈబూక్ బిగినర్ ఫ్రెండ్లీగా ఉంటుంది.
🔥🔥 ఈ లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది ఆర్థిక పరిస్థితి బాగా దిగజారింది. అందుకోసం 999/- విలువ కలిగిన ఈ ఈబూక్ ని 90% ఆఫర్ కి ఇస్తున్నాను. ఇప్పుడే మీ ఈబూక్ ని డౌన్లోడ్ చేసుకోండి.
ఇప్పుడే మీ ఈబూక్ తీసుకోండి
- Website Design Formula for Small Businesses - October 27, 2021
- Digital Marketers Meetup in Hyderabad in 2021 - September 1, 2021
- How to Write Viral Blog Posts in Telugu - August 12, 2021