always vj logo
what is the best blogging platform

What is the Best blogging Platform in Telugu

Spread the love

What is the Best blogging Platform?

మీరు ఒక బ్లాగ్ క్రియేట్ చేయాలి అనుకున్నపుడు మీరు ఒక మంచి వెబ్ హోస్టింగ్ గురించి ఆలోచించాలి. హోస్టింగ్ ప్లాట్ఫారం లేదా కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టం (CMS) మీ బ్లాగ్ యొక్క కంటెంట్, అందుకు సంబంధించిన ఇమేజ్స్, వీడియోస్ ఇలాంటి వాటిని హేండిల్ చేస్తుంది.

ఒక మంచి ప్లాట్ఫారం కనుక లేకపోతే మీ బ్లాగ్ లో మీరు ఎంత కంటెంట్ వ్రాసిన ఉపయోగం లేదు. మీరు సెలెక్ట్ చేసుకునే బ్లాగింగ్ ప్లాట్ఫారం కూడా మీ సక్సెస్ లో ముఖ్యపాత్ర వహిస్తుంది. ప్రతి బ్లాగ్ ప్లాట్ఫారం ఇంకో దానితో డిఫరెంట్ గా ఉంటుంది.

what is the best blogging platform

అయితే కొత్త బ్లాగర్స్ కి వాళ్ళు సెలెక్ట్ చేసుకునే బ్లాగ్ పోస్టింగ్ ప్లాట్ఫారం ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనేది కష్టంగా ఉంటుంది. కావాలి అనుకుంటే తరువాత అయిన మర్చుకోవహ్చు, కానీ మొదట మొదలుపెట్టేదే రైట్ ప్లాట్ఫారం సెలెక్ట్ చేసుకుంటే ఎటువంటి టెక్నికల్ ప్రొబ్లెంస్(బ్లాగ్ మైగ్రేషన్) రాకుండా ఉంటాయి.

ఒక బ్లాగింగ్ హోస్టింగ్ ప్లాట్ఫారం ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏయే కారణాలు ఆలోచించాలి అని తెలుసుకుందాం.

మీకు ఇంకా డీటెయిల్ గా అర్థం కావటం కోసం బ్లాగ్ హోస్టింగ్ ప్లాట్ఫారం అంటే ఏంటో తెలుసుకుందాం.

“బ్లాగ్ హోస్టింగ్ ప్లాట్ఫారం, బ్లాగ్ ప్లాట్ఫారం రెండూ వేరువేరు.”

బ్లాగ్ ప్లాట్ఫారం అంటే ఏంటి?

బ్లాగ్ ప్లాట్ఫారం అంటే మీరు ఒక వెబ్సైటు లో ఒక ఎకౌంటు క్రియేట్ చేసుకుని అందులో మీరు మీ బ్లాగ్ సెట్ అప్ చేయటం.

ఉదాహరణకి మనకి Blogger, WordPress.com, Medium, Tumblr లాంటి బ్లాగింగ్ ప్లాట్ఫారంస్ అన్ని కూడా బ్లాగింగ్ ప్లాట్ఫారంస్. అంతే కాకుండా Weebly, Wix లాంటి ఎన్నో వెబ్సైటు బిల్డర్స్ ఈజీగా డ్రాగ్ & డ్రాప్ పద్ధతిలో ఎవరైనా వాళ్ళకి కావాల్సిన వెబ్సైటుస్ ఎటువంటి కోడింగ్ లేకుండా తయారు చేసుకోవచ్చు.

అయితే వీటిల్లో ఫ్రీగా ఎకౌంటు తీసుకుని యూస్ చేసుకోవచ్చు, కానీ ప్రీమియం ఫీచర్స్ యూస్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఎకౌంటు అప్గ్రేడ్ చేసుకోవాలి.

బ్లాగింగ్ ప్లాట్ఫారంస్ ఉపయోగిస్తుంటే మీరు కంటెంట్ క్రియేట్ చేయడం పైన ఫోకస్ చేస్తే సరిపోతుంది. మీరు ఎకౌంటు క్రియేట్ చేసుకుని అందులో మీ బ్లాగ్ యొక్క లుక్ ని కావలసినట్టు చేంజ్ చేసుకుని, మీ బ్లాగ్ కంటెంట్ పబ్లిష్ చేయవచ్చు.  మీరు ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా ఎటువంటి ఇబ్బంది ఉండదు. అందుకే ఎక్కువ మంది బ్లాగర్ ప్లాట్ఫారం యూస్ చేస్తారు. ఎంతో మంది బ్లాగర్స్ కూడా ఇదే మాట చెప్తారు, మీరు మొదలుపెట్టాలి అంటే బ్లాగింగ్ ప్లాట్ఫారంస్ తో మొదలు పెట్టండి అని.

అయితే ఈ ప్లాట్ఫారంస్ లో ఉన్న ఇబ్బందులు ఏంటి అంటే చాలా లిమిటేషన్స్ ఉంటాయి. ఇందులో మీరు మీ బ్లాగ్ కస్టమైజ్ చేసుకోవాలి అంటే అందులో ఉన్న వాటిని మాత్రమే ఉపయోగించగలం. అయితే మొదట్లో ఇది ఇబ్బంది అనిపించదు కానీ, మీ బ్లాగ్ గ్రో అయి మీ రీడర్స్ కి మరింత మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అనుకుంటే అంత అవకాశం ఉండదు.

అందుకే ఎంతో మంది బ్లాగర్ లో వాళ్ళ బ్లాగింగ్ జర్నీ స్టార్ట్ చేసిన తరువాత వర్డుప్రెస్ కి మారుతున్నారు.

Pros:

1) ఫ్రీగా ఉపయోగించవచ్చు.

2) కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉంటె చాలు, మొదలుపెట్టేయవచ్చు

3) మనీ ఎర్నింగ్ కోసం కాకుండా హాబీ గా బ్లాగింగ్ చేసేవారికి సూపర్ గా ఉంటుంది.

Cons:

1) కస్టమైజేషన్, ఫంక్షన్స్ లో లిమిటేషన్స్ ఉంటాయి.

2) బ్లాగింగ్ ప్లాట్ఫారం మీ డొమైన్, యుఆర్ఎల్ (url) ని కంట్రోల్ చేస్తాయి.

Blog Hosting Platforms are Different, Too

బ్లాగ్ హోస్టింగ్ ప్లాట్ఫారం అంటే ఏంటి?

బ్లాగ్ హోస్టింగ్ ప్లాట్ఫారం అంటే మీకు కావాల్సిన బ్లాగ్ ప్లాట్ఫారం ని వెబ్ హోస్టింగ్ సర్వీసెస్  లో ఇన్స్టాల్ చేసే సెటప్ చేయగలిగేవి.

బ్లాగింగ్ ప్లాట్ఫారంస్ లో వెబ్ హోస్టింగ్ లో బ్లాగ్ ఇన్స్టలేషన్, సెటప్ లాంటివి చేయవలసిన అవసరం లేదు. వెబ్ హోస్టింగ్ ప్రొవైడర్స్ తో బెస్ట్ బ్లాగ్ ప్లాట్ఫారంస్ WordPress.org, Joomla, Drupal వంటివి.

బ్లాగ్ కోసం వెబ్ హోస్టింగ్ లో అనేక రకాలు ఉన్నాయి. బ్లాగింగ్ కోసం బిగినర్స్ కి షేర్డ్ హోస్టింగ్ బెస్ట్ ఛాయస్ ఎందుకంటె తను ఎఫర్ట్ చేయగలడు. ఈ హోస్టింగ్ లో మనం మన బ్లాగ్ ని ఇదే సర్వర్ లో వేరే వెబ్సైటుస్ తో పాటుగా సెటప్ చేస్తాము. అందువల్లే మనకి ప్రైస్ అనేది బాగా తగ్గి ఎఫర్ట్ చేయగలరు. అంతే కాకుండా అదే సర్వర్ లో ఒక వెబ్సైటు / బ్లాగ్ కి ఎక్కువ ట్రాఫిక్ వస్తుంటే అందులో ఉన్న రిసోర్సెస్ దాని కోసమే వినియోగం అవుతాయి. అప్పుడు మీ బ్లాగ్ పెర్ఫార్మన్స్ కొంచెం స్లో అవుతుంది. మరి ఏం చేయాలి, మీకు ఇప్పుడు తక్కువ ట్రాఫిక్ వస్తుంటే పర్లేదు, లేదు అనుకుంటే మీ అవసరాలకి అనుగుణంగా మీరు మీ హోస్టింగ్ ప్లాన్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు.

వెబ్ హోస్టింగ్ కి మనం సైన్అప్ అయ్యేటప్పుడు మనం మంత్లీ ప్లాన్ తీసుకోవాలా, ఇయర్లీ ప్లాన్ తీసుకోవాలి అని డిసైడ్ అవ్వాలి. అయితే ఈ వెబ్ హోస్టింగ్ యొక్క ప్రైసింగ్ మీరు అందించే ఫీచర్స్ ని బట్టి ఉంటుంది. ఒక్కసారి మీరు వెబ్ హోస్టింగ్ తీసుకున్నాక, ఇంకా మీరు మీ బ్లాగ్ ని ఇన్స్టాల్ చేసి, బ్లాగ్ సెటప్ మీరే చేసుకోవాలి.

Pros:

1) కష్టమైజేషన్, ఫంక్షన్స్ హై లెవెల్ లో ఉంటాయి.

2) ఆల్రెడీ డిజైన్ చేసిన థీమ్స్, ప్లగిన్స్ మీ బ్లాగ్ ని ఇంకా బాగా డిజైన్ చేసుకోవతనికి, మరిన్ని ఫీచర్స్ యాడ్ చేసుకోవటానికి హెల్ప్ అవుతాయి.

3) మీ బ్లాగ్ ని ఎక్స్పాండ్ చేయటం ఈజీ. ప్రపంచంలోని ఎన్నో పెద్ద పెద్ద వెబ్ సైట్స్ ఈ ప్లాట్ఫారంస్ లోనే రన్ అవుతున్నాయి.

Cons:

1) ఈ ప్లాట్ఫారంస్ యూస్ చేయటానికి మనం డబ్బు ఖర్చు పెట్టాలి.

2) ఈ టైపు బ్లాగ్ రన్ చేయాలి అంటే మీకు కొంత టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి (అది నేర్చుకోవడం పెద్ద కష్టం)

సెల్ఫ్ హోస్ట్ బ్లాగ్స్ కన్నా బ్లాగింగ్ ప్లాట్ఫారంస్ మంచివా?

ఒక బ్లాగ్ హోస్టింగ్ ప్లాట్ఫారం సెలెక్ట్ చేసుకునేటప్పుడు అనేక విషయాలు పరిగణలోకి తీసుకోవాలి. మీరే మీ బ్లాగ్ కి సంబంధించిన టెక్నికల్ విషయాలు మేనేజ్ చేసుకోవాలి. బ్లాగ్స్ వ్రాయటానికి, ప్రమోట్ చేయటానికి మీరు టైం ఉండదు. బిగినర్స్ కి ఈ ప్రాసెస్ కష్టం, అందుకే బ్లాగర్ లాంటి సైట్స్ లో మనం చాలా ఈజీగా బ్లాగ్ సెటప్ చేసుకుని బ్లాగ్స్ వ్రాయటం స్టార్ట్ చేయవచ్చు.

అయితే వెబ్ హోస్టింగ్ ప్లాట్ఫారంస్ లో ఉన్న గొప్ప అడ్వాంటేజ్ కష్టమైజేషన్. వీటిలో మీరు ఎంతో చేయవచ్చు. మీరు మీ బ్లాగ్ కోసం ప్లగిన్స్ / యాడ్ ఆన్స్ యూస్ చేయటం ద్వారా మీ బ్లాగ్ కోసం మరిన్ని ఫీచర్స్ అందించవచ్చు. మీ బ్లాగ్ పోస్ట్స్ ని సోషల్ షేరింగ్ చేయటానికి, ఈమెయిలు సబ్స్క్రయిబర్స్ ని  పెంచుకోవటానికి ఇలాంటివి మనకి వెబ్ సైట్ బిల్డర్స్ లేదా బ్లాగింగ్ ప్లాట్ఫారంస్ లో ఉపయోగించే అవకాశం లేదు.

చివరగా, బ్లాగ్ ప్లాట్ఫారంస్ యూస్ చేయటానికి ఈజీగా ఉంటాయి, కానీ మీ బ్లాగ్ ద్వారా మీరు గ్రో చేయటానికి అనేక లిమిటేషన్స్ ఉన్నాయి. సెల్ఫ్ హోస్ట్ బ్లాగ్స్ మేనేజ్ చేయటం కొంచెం కష్టం  కానీ మీరు ఏం కావాలన్నా చేయవచ్చు, ఇందుకు మనకి పరిమితులు లేవు.

బ్లాగ్ హోస్టింగ్ ప్లాట్ఫారం లో బెస్ట్ ప్లాట్ఫారం ఏది?

క్రొత్తగా బ్లాగింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే నేను సెల్ఫ్ హోస్ట్ బ్లాగ్ స్టార్ట్ చేయమనే చెప్తాను.

ఇక్కడ వెబ్సైటు బిల్డర్స్ తో మనం బ్లాగ్స్ ని పోల్చలేం. మీరు మీ వెబ్ హోస్టింగ్ లో కంట్రోల్ ప్యానెల్ నుండి ఒక బ్లాగింగ్ ప్లాట్ఫారం ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, బ్లాగ్ ఎలా సెటప్ చేయాలి అని నేర్చుకోవాలి.

దాదాపు అన్ని వెబ్ హోస్టింగ్ ప్లాట్ఫారంస్ ఒక బ్లాగ్ ని వాళ్ళ సర్వర్స్ లో ఎలా ఇన్స్టాల్ చేయాలి అని ఎంతో ఇన్ఫర్మేషన్ వీడియోస్, బ్లాగ్ పోస్ట్స్ రూపంలో అందిస్తున్నాయి. మనం కూడా స్టెప్-బై-స్టెప్ ఒక బ్లాగ్ ని ఎలా స్టార్ట్ చేయాలి అని కంప్లీట్ ప్రాసెస్ తెలుసుకుందాం.

ఒక సెల్ఫ్ హోస్ట్ బ్లాగ్ సెటప్ చేయటం, రన్ చేయటం ఈరోజుల్లో పెద్ద కష్టం కాదు, ఇప్పటికే మన బ్లాగ్ లో, యూట్యూబ్ ఛానల్ లో డీటెయిల్ ట్యుటోరియల్స్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు దిగిలు పడాల్సిన అవసరం లేదు.

మీ సెల్ఫ్ హోస్ట్ బ్లాగ్ కోసం అనేక ప్లాట్ఫారంస్ ఉన్నాయి, కానీ నేను పర్సనల్ గా (నేను కాదు ప్రొఫెషనల్ బ్లాగర్స్ ఎంతో మంది) వర్డుప్రెస్ సజెస్ట్ చేస్తాను. Bloggervj.com కూడా వర్డుప్రెస్ లోనే రన్ చేస్తున్నాను, చాలా ఈజీగా ఉంటుంది.

76 మిలియన్ల వెబ్ సైట్స్ వర్డుప్రెస్ లో రన్ అవుతున్నాయి అంటే మీరు అర్థం చేసుకోవచ్చు వర్డుప్రెస్ ఎంత ఈజీనో. వర్డుప్రెస్ ఈజీగా ఉంటుంది, ఎన్నో టూల్స్ ఉన్నాయి. వర్డుప్రెస్ బ్లాగ్స్ SEO ఫ్రెండ్లీగా కూడా ఉంటాయి.

మీరు ఒక బ్లాగ్ హోస్టింగ్ సెలెక్ట్ చేసే ముందు మీరు కొంత రీసెర్చ్ చేయవచ్చు. మార్కెట్ లో ఎంతో మంది వెబ్ హోస్టింగ్ ప్రొవైడర్స్ ఉన్నారు. Top Webhosting Providers in Telugu అనే బ్లాగ్ పోస్ట్ మీకు మరింత హెల్ప్ అవుతుంది, ఒకసారి చదవండి.

మీరు మొదట తక్కువ డబ్బుతో బ్లాగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు Vapuorhost హోస్టింగ్ ఉపయోగించవచ్చు. మీకు మరింత హెల్ప్ అవుతుంది.

2 thoughts on “What is the Best blogging Platform in Telugu”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *